-:A:B:C:D:E:F:G:H:I:J:K:L:M:N:O:P:Q:.R:S:T:U:V:W:X:Y:Z:-

Showing posts with label Telugu E Message. Show all posts
Showing posts with label Telugu E Message. Show all posts

30 June 2022

శారా" లో అన్ని తెలుసుకుందాం




 

 👩🏻 *"శారా" లో అన్ని తెలుసుకుందాం*
 

💮 *నవ్వును బహుమతిగా పొందినటువంటి ఒక స్త్రీ "శారా" ఈ శారా గురించినటువంటి విషయాన్ని చాలా చక్కగా వాక్యానుసారంగా ఈ మెసేజ్ లో మనం తెలుసుకుందాం. శార గురించే కాదు శారా ద్వార మన జీవితాల్లో మనకి కూడ నేర్పేటువంటి పాఠాలేంటో కూడ మనం చూద్దాం పూర్తిగా చదవండి.!*

✨️ *"శారా" అనే మాటకు "రాజకుమారి" అని అర్ధం.* చాలా మంచిది చక్కనైనటువంటి (రాజకుమారి) అని అర్ధం. (ఆదికాండము,11:29) ప్రకారమైతే ఆమెకు అంతకుముందు వేరే పేరు ఉంది అది "శారయి" శారయి అంటే కులీనమైన "కలహా ప్రియమైనది" అని అర్ధం. అందుకే ఆ తరువాత శారయి పేరు "శారా" గా మార్చాడు దేవుడు.!

👉 *అబ్రాహాము భార్య "శార" తెరహు గారి కోడలు.* (ఆదికాండము,11:30) ప్రకారం వీరి ప్రస్తావన కుటుంబం గురించి మనకు తెలుస్తుంది.!

✨️ *ఈమె పేరు బైబిల్ గ్రంధంలో 61 సార్లు వ్రాయబడింది.* వివాహమైన తరువాత చాలా కాలం వరకు కూడ ఆమెకు సంతానం లేదు. ఆమె కుటుంబికులు కూడ విగ్రహారాదికులు. విగ్రహారాదికుల కుటుంబంలో నుంచి వచ్చింది. వీరు యూప్రటీస్ నది అవతల ఉన్నటువంటి గట్టున ఉంటారు. *వీరు విగ్రహ దేవతలను పూజించేవారు.* (యెహోషువ గ్రంధం,24:2) వ వాక్యంలో వీరు అన్యదేవతలను కూడ పూజించినట్టు మనకి తెలుస్తుంది. కల్దీయుల ప్రాంతమైనటువంటి ఊరు అనేటువంటి పట్టణంలో వీళ్ళు నివసించారు అని మనకు తెలుస్తుంది.!

👉 *ఈ "శార" గురించినటువంటి విషయాల. ద్వార మనం నేర్చుకోవాల్సిన కొన్ని అంశాలు మనం చూద్దాం.!*

♻️ *1.మొదటిగా శారా దేవున్ని ఆశ్రయించింది*
 
✨️ *"శారా" దేవున్ని ఆశ్రయించింది భయభక్తులు కలిగినటువంటిది.* విగ్రహారాదికుల కుటుంబంలో నుంచి వచ్చి దేవున్ని ఆశ్రయించినటువంటి వ్యక్తిగా శారా కనపడుతుంది. (అపోస్తుల కార్యాలు,2:7) ప్రకారం హారానుకు రాక ముందే అంటే మెసపుటోమియాలో ఉండగానే దేవుడు అబ్రాహామును పిలిచాడు.

✨️ *నీవు లేచి నీ దేశం నుంచి నీ బంధువుల దగ్గర నుండి నీ తండ్రి ఇంటి నుంచి బయలుదేరి నేను నీకు చూపించిన దేశానికి వెళ్ళు నిన్ను గొప్ప జనంగా చేస్తాను నిన్ను దీవించి నీ పేరు గొప్పగా చేస్తాను నీవు దీవెనకరంగా ఉంటావ్ నిన్ను దీవించే వాళ్ళను దీవిస్తాను. నిన్ను దూషించే వాళ్ళను శపిస్తాను భూమి యొక్క సమస్త వంశాలు కూడ నీలో దీవించబడతాయ్ అన్నాడు దేవుడు* (ఆదికాండము,12) వ అధ్యాయంలో..

✨️ అబ్రాహాము తాను విన్నటువంటి ఈ దైవ పిలుపు గురించి శారాకు ఖచ్చితంగా చెప్పే ఉంటారు. వారిద్దరూ కూడ శరతులతో కూడినటువంటి వాగ్దానమైనా గానీ శారా కూడ విశ్వసించింది. అబ్రాహామును దేవుడు ప్రత్యక్షంగా పిలిచాడు. ఐతే అతని భార్యయైన శారా పరోక్షంగా పిలువబడింది. దేవుని పిలుపుకు అబ్రాహాము లోబడినట్లే శారా కూడ లోబడింది. దేవున్ని సేవించాలని తీర్మానించుకుంది. అలా భర్త చేసేదానిలో దేవునికి సహాయం చేసేదానిలో శారా చాలా గొప్పగానే విధేయత చూపించింది.

✨️ *అలాగే మీ భర్తలను మీ ఆత్మీయ జీవితాలు..మీ ఆత్మీయ పోషణలో..కూడ మీరు ప్రోత్సహించాలి.* అబ్రాహాము దేవునికి సంపూర్ణంగా లోబడాలి అంటే శారా సహకారం చాలా అవసరం. లేకుంటే తాను ఆరాధిస్తున్న విగ్రహాలను వదిలి తాను యెరిగిన కొత్త దేవున్ని సేవించడానికి తీర్మానించుకుంది అంటే అది అంత సులభమేం కాదు మనల్ని మనం పరీక్షించుకోవాలి.!

✨️ *"శారా" వలె మనము కూడ మీరు కూడ మీ భర్తల పట్ల విశ్వాస జీవితానికి ప్రోత్సహకరంగా ఉన్నారో లేదో ఆలోచించండి.* వాళ్ళని ప్రోత్సహిస్తున్నారా.? సపోర్ట్ చేస్తున్నారా.? లేదా వెనక్కి లాగుతున్నారా.? ఆలోచించండి.! శారా చూపిన మాదిరి మీకు చాలా అవసరం ఇది మొదటిది.!

♻️ *2.రెండవది భర్తకు విధేయురాలు శారా*
 
✨️ *విధేయత చూపించింది భర్త పట్ల.* తాను తన భర్తకు ఉన్నటువంటి నిర్ణయాల వల్ల శారా జీవితం ఒక మలుపు తిరిగింది. తాను అప్పటి వరకు కూడ సుఖంగా అనుభవిస్తున్నటువంటి ఊరు అనేటువంటి పట్టణాన్ని వదిలి తెలియని దేశానికి బయలుదేరారు. తనకు తెలిసినటువంటి బంధువుల్ని తన సొంత కుటుంబాల్ని తనకు పరిచయమైన వాతావరణాన్ని అన్నీ కూడ వదిలిపెట్టి వెళ్లాలంటే అది చాలా కష్టం *ముఖ్యంగా స్త్రీలకు మాత్రం ఇది చాలా సమస్య చాలా కష్టం.* అయినా సరే శారా తన నిర్ణయానికి కట్టుబడి బయలుదేరింది. అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైయున్నటువంటి ప్రదేశానికి బయలు దేరి వెళ్లారు. మరియు అక్కడ ఎక్కడికి వెళ్ళవలెనో అది తెలియకుండ బయలుదేరి వెళ్ళారు అని (హెబ్రి పత్రిక,11:8) వ వాక్యం చెప్తుంది.!

✨️ *విధేయురాలై శారా అబ్రహామును వెంబడించింది. అబ్రాహాముకు శారా అనుకూలవతియైనటువంటి భార్యగా విధేయత చూపినటువంటి భార్యగా కనపడుతుంది.*

✨️ భర్తతోనూ మామయైనటువంటి తెరహు తోనూ..కొడుకు లాంటి లోతు తోనూ..కలిసి శారా బయలుదేరింది. వాళ్ళు హరాను దాక వచ్చి అక్కడ నివసించారు.!

 ✨️ తన జీవితంలో శారా స్వపురుషునికి లోబడటం నేర్చుకున్నది. సొంత పురుషునికి భర్తకు లోబడటం నేర్చుకున్నది. మనం కూడ అలాంటి స్వభావంతో మనల్ని మనం అలంకరించుకోవాలి. బైబిల్ అదే చెప్తుంది పేతురు భక్తుడు కూడ ఇలాగే వ్రాస్తాడు (మొదటి పేతురు పత్రిక,3:6) లో *అటు వలె పూర్వము దేవున్ని ఆశ్రయించిన పరిశుద్ద స్త్రీలను తమ తమ పురుషులకు లోబడి ఉండటం చేత తమ్మును తాము అలంకరించుకున్నారు* ఆ ప్రకారమే శారా అబ్రాహామును "యజమానుడు" అని పిలచుకుంటూ అతనికి లోబడింది. *అలాగే మీరు కూడ యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయము లేక బెదరక ఉంటే గనుక ఆమెకు మీరు పిల్లలవుతారు అని పేతురు అంటున్నాడు.* అంటే అంత ప్రత్యేకత ఉంటుంది శారా చెప్పినటువంటి పాఠమే మనకిది.!

♻️  3.మూడవ అంశము శోదించబడింది శారా
 
✨️ మనము దేవునికి భయ భక్తులుగా ఉంటూ భర్తకు లోబడుతూ సహకరిస్తూ ఉంటాం. కానీ అపవాది శోదిస్తూనే ఉంటాడు. అలాంటి సమయంలో శారా కూడ *శోధించబడింది. శోదించబడింది శారా.!*

✨️ శధన సమయంలో కూడ శారా ఇలా ఉంది. హరానులో శారా తన మామయైనటువంటి తెరహును కోల్పోతుంది. తెరహు చనిపోతాడు. తెరహు చనిపోయిన తరువాత దేవుని పిలుపును బట్టి శారా అబ్రాహామును లోతును వెంటబెట్టుకొని తమ ఆస్తిని పనివారిని కూడ తీసుకొని బయలుదేరతారు. చివరికి వారు కానాను చేరుకుంటారు. (ఆదికాండము,12) వ అధ్యాయం ప్రకారం.!

✨️ *శారా చాలా అందమైనది* అందమైనదని (ఆదికాండము12:11) వ వాక్యంలో కనిపిస్తుంది. చాలా అద్భుతమైనది అందమైనది మంచి మనసు కలిగింది. ఆమె అందాన్ని బట్టే తాను చంపబడతానేమో చనిపోతానేమో అని అబ్రాహాము భయపడ్డాడు. ఊరు అనేటువంటి ప్రాంతం నుంచి బయలుదేరేటప్పుడు అబ్రాహాము శారాను ఒక హెల్ప్ చేయమంటాడు. అదేంటంటే *తాము వెళ్ళే ప్రతీ స్థలంలో కూడ వీళ్లిద్దరూ కూడ అన్నా చెల్లెల్లం అని చెప్పుకోవడమే.* అంటే చెల్లి అని చెప్పమంటాడు. అందుకు శారా కూడ అంగీకరిస్తది (ఆదికాండము,12:13) వాక్యం చూస్తే...

✨️ ఈ విధంగా అబద్దం చెప్పడానికి శార అంగీకరించినందువల్లె అనేకమైన శోధనలు ఇబ్బందులు ఎదుర్కొనవలసి వచ్చింది. కానాను చేరినటువంటి అబ్రాహాము కరువు వచ్చినందు వల్ల దేవుని యొద్ద విచారణ చేయకుండానే ఐగుప్తు వెళ్ళాడు. ఐతే దేనికైతే భయపడుతున్నారో దేనికైతే భయపడ్డారో భయపడినంత కూడ జరిగింది. *ఆమె అందగత్తె గనుక ఆమె ఫరో ఇంటికి తేబడింది.* అలాంటి పరిస్థితుల్లో శారా ఎంత బాధపడి ఉంటుందో గమనించారా..??

✨️ శరాను అబ్రాహామును దేవుడు చాలా ప్రేమించాడు. అందుకే దేవుడు శారాను కాపాడాడు. దేవుడు ఫరోను అతని ఇంటి వారిని మహా వేదనల చేత బాధించాడు. అందువల్ల ఫరో భయపడి సంగతి తెలుసుకొని శారాను అబ్రాహాముకు అప్పగించాడు.!

✨️ అయినా సరే పొరపాటు మళ్ళీ తిరిగి చేసారు. ఐగుప్తును విడిచి కానాను చేరుకున్న తరువాత దేవున్ని అడగకుండానే దక్షణ దిశలో ఉన్నటువంటి కాదేషుకు షూరుకు మధ్యలో ఉన్నటువంటి "గెరారు" అనేటువంటి ప్రాంతం ఉంటుంది. ఆ గెరారు అనేటువంటి ప్రాంతంలో వాళ్ళు ఉండిపోయారు. ఆ ప్రాంతంలోని ప్రజలకు దైవ భయం అనేది ఏ మాత్రము ఉండదు. అందువల్ల ఈ శారా కొరకు వాళ్ళు తనను చంపుతారేమో అని భయపడి *అబ్రాహాము మరలా శారా తన చెల్లి అని చెప్పమంటాడు.* చెల్లెలని చెప్పమంటాడు. శారా కూడ అలాగే చెప్పింది. గెరారు రాజుయైనటువంటి "అబీమెలెకు" గెరారుకు రాజు అబీమెలెకు ఈ శారాను తన అంతపురానికి రప్పించేసుకుంటాడు. అందగత్తె కదా అయితే దేవుని భయం ఉంది. దేవుని భయం వల్ల శారాను ముట్టలేదు ఆ రాజు.

✨️ దవుడు ఆ రాజుకు స్వప్నంలో దర్శనమిచ్చి *శారా అబ్రాహాము భార్య. ఈమెను తీసుకవెళ్ళి అతనికి అప్పగించమని అజ్ఞాపిస్తాడు.* లేకుంటే చస్తావ్ అని చెప్తాడు దర్శనంలో..అందుచేతే ఆ భయం పుట్టి ఈ అబీమెలెకు అబ్రాహామును పిలిపించి శారాను అప్పగించి అతనికి ధనాన్ని ఇచ్చి..దాసులనిచ్చి దేవుని దీవెన పొందుతాడు.!

✨️ *ఈ సందర్భంలో దేవుడే జోక్యం చేసుకొని ఉండకపోతే వాగ్దాన పుత్రుడ్ని పొందబోయేటువంటి తల్లికి ఎంత ప్రమాదమది.* దేవుడే తమతో నిబంధన చేసాడని తాము విశ్వాసం ద్వార నడిపించబడుతున్నామని అందుచేత ఐగుప్తులకు గానీ..గెరారు దేశ ప్రజలకు గానీ.. భయపడవలసిన అవసరం లేదని *శారా అబ్రాహామును ప్రోత్సహించి ఉంటే ఎంత బాగుండేది..??* శారా వల్ల మనం ఈ హెచ్చరిక కూడ తీసుకోవాలి.!

✨️ శరా వల్ల తప్పేమి కాదు..శారా చేసింది తప్పేమి కాదు.. అబ్రాహాము మాట విన్నదే కానీ కొన్ని కొన్ని సార్లు వాళ్ళు పడినా..కొన్ని కొన్ని సార్లు వారు బెదిరినా..ఆత్మీయతకు దూరంగా నడిచినా..అలాంటి నిర్ణయాలు తీసుకున్నా.. సరిచేయవలసింది భార్యే.!

✨️ కబట్టి మీ కుటుంబాలలో కూడ అట్లాంటివి జరిగితే సరి చేయవలసింది భార్యే. ఈ హెచ్చరిక మీరు కూడ తీసుకోవాలి. *విశ్వాస జీవితంలో భార్య,భర్తలు ఒకరినొకరు సరిచేసుకుంటూ సాగిపోవడమే ఆశీర్వాదకరంగా ఉంటుంది దీవెనకరంగా ఉంటుంది.!*

 ♻️ 4.నాలుగవది ఏంటంటే.? వాగ్ధనాన్ని సందేహించడం.!
 
✨️ వగ్దానాన్ని డౌట్ పడ్డారు వీళ్ళు. సందేహించారు. *వాగ్దానాన్ని సందేహించారు శారా.* శారాకు సిరి సంపదలు ఉన్నాయ్. ప్రేమించేటువంటి భర్త ఉన్నాడు. అంతా సంవృద్ధిగా ఉంది. అయితే ఆమె జీవితంలో ఎంతో వేదనకరమైనటువంటి లోటు ఉంది. *ఆమెకు పిల్లలు లేరు. ఆమె గొడ్రాలు.* అదే ఆమె లోటు. దేవుడు అబ్రాహాముకు చేసిన వాగ్దానమేంటి.? *ఆకాశ నక్షత్రాల్లా నీ సంతానం ఉంటుంది అని చెప్పాడు దేవుడు.* (ఆదికాండము,15:15) లో.

✨️ వళ్ళేమో ముసలివారు ఐపోతున్నారు. వృద్ధులైపోవడం వల్ల శారా దేవుని వాగ్దానానికి డౌట్ పడ్డది. సందేహించింది.  అసలు జరుగుతుందా ఈ వయసులో అని.? సందేహం వల్ల ఎంత పొరపాటు చేసిందో చూడండి.. *ఐగుప్తురాలైనటువంటి "హగరు" ను అబ్రాహాముకు భార్యగా ఇవ్వడానికి,అతని దగ్గర ఉండటానికి,అతని దగ్గర పడుకోబెట్టడానికి సిద్ధపడింది.* ఆమె వల్ల నాకు సంతానం కలగవచ్చు అని అనుకున్నది (ఆదికాండము16:2) లో..

✨️ శరా ఎంత ఎత్తుగా మాట్లాడుతుంది. హవ్వతో సాతానుడు మాట్లాడిన విధానాన్ని జ్ఞాపకం చేయటం లేదిమే. అందుకు అబ్రాహాము మొదట అంగీకరించలేదు గానీ..అంగీకరించిపోయి ఉండవచ్చు గానీ,ఐతే తన మాటల్లో తన వల్ల శారా వల్ల ఒప్పుకున్నాడు.

✨️ నను పిల్లలు కనకుండ దేవుడే చేసాడేమో..యెహోవా చేసాడేమో..నా దాసియైన "హగరు" వలన నాకు సంతానం కలగవచ్చేమో అంటుంది. (ఆదికాండము 16:1) వాక్యంలో ఇంతలా అంటే అంతలా బ్రతిమాలితే "హగరు" భార్యగా వెళ్ళింది. అలాగే అబ్రాహాము కూడ హగరును స్వీకరించాడు. భార్యగా ఇచ్చినటువంటి శారా ఆ తరువాత చాలా బాధపడింది.

✨️ తను చేసిన పనికి ఎంత బాదపడి ఉంటుందో హగరు వల్ల *ఈ అబ్రాహాము హగరు వల్ల వారు కలిసినందు వల్ల "ఇష్మాయేలు" అనేవాడు పుడతాడు.* హగరుకు జన్మనిచ్చినటువంటి ఈ ఇష్మాయేలు వల్ల కూడ ఈ శారా ఎంతో బాధపడింది.

✨️ *దేవుని వాగ్దానాన్ని సందేహించకుండ ఉంటే ఇన్ని అనర్ధాలు వచ్చేవి కాదు.* కానీ సందేహించడం వల్లే ఇలాంటి అనర్ధాలు వచ్చాయ్. అబ్రాహాము విశ్వాసాన్ని కోల్పోలేదు గానీ..శారా విశ్వాసాన్ని కోల్పోయింది. అందువల్ల ఎంతో నష్టపోయింది.

✨️ మ కుటుంబాలలో కూడ అంతేనేమో ఇలాంటివి ఉన్నాయేమో సరిచేసుకోండి. *ప్రేమించే నీ భర్త ప్రేమను నీవు ఎలాంటి కార్యకలాపాలకు కూడ వినియోగించకూడదు.* నీవు అవిశ్వాసివై అతడ్ని కూడ నీవు భ్రష్టుడ్ని చేయకూడదు. *దేవుడిచ్చిన వాగ్దానాలను సందేహించకూడదు.* ఆయన వాగ్దానం చేసి మర్చిపోయే దేవుడు కాదు. నిబంధనను రద్దు చేసేవాడు అసలు కాదు. ఆయన మాట తప్పని దేవుడు. కాబట్టి సందేహించకండి అలాగే భర్తలను చెడు పనులకు మాత్రం వాడకండి. అలాగే భార్యలను కూడ చెడు ఉద్దేశాలకు చెడు పనులకు వాడకండి.

♻️  ఐదవది ఏంటంటే.? అతిధ్యమిచ్చింది.
 
✨️ వళ్ళు ప్రేమ చాలా చక్కగా చూపిస్తారు. మంచి ఆతిధ్యాన్నిస్తారు. మమ్రే దగ్గర ఉన్నటువంటి సిందూరవనంలో గుడారపు ద్వారం వద్ద అబ్రాహాము కూర్చుంటాడు. అలా కూర్చొని ఉన్నపుడు దేవుడు అతనికి దర్శనమిస్తాడు. *యెహోవా అతనికి దర్శనమిస్తాడు.* అది భోజనం చేసే సమయము మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం వేళ ఐతే అతిధులకు అతిధ్యం ఇవ్వాలి అని అబ్రాహాము చెప్తాడు. చెప్పిన వెంటనే శారా ఆహారాన్ని సిద్దపరుస్తుంది.

✨️ ఈ విషయంలో శారా మనకు మాదిరికరం. వేళ గానీ వేళ వచ్చిన అతిధుల కోసం మనం శ్రమపడటానికి ఇష్టపడుతున్నామా.? లేదా.? వచ్చిన అతిధులకు గానీ, చేయవలసిన పనులకు గానీ, లేదా ఇతరులకు సేవ చేయడానికి గానీ, లేదా వారికి అతిధ్యమివ్వడానికి గానీ, సందేహిస్తున్నారా.? చిరాకు పడుతున్నారా.? ఇబ్బంది పడుతున్నారా.? ఇష్టం లేకుండ ఉంటున్నారా.? బైబిల్ చెప్తుంది. అతిధ్యమివ్వడం మరువకుడి. మన పితరులు తెలియకయే దేవదూతలకు అతిధ్యమిచ్చిరి. ఇప్పుడు మనము మనకు తెలిసింది కదా..అతిధ్యమివ్వడం. అసలు మరువకూడదు అని ఆ వాక్య సందర్భం. (హెబ్రి పత్రిక,13 :1) వాక్యంలో *అతిధ్యం ఇవ్వడం మరవద్దు అంటారు.* సణుగుకోకుండా అతిధ్యమిచ్చేవారిగా మనం ఉండాలని దేవుని కోరిక.

✨️ ఆయన పేరిట నువ్వు ఇచ్చేది ఏదైనా గానీ, ఆఖరికి ఒక గిన్నె..నీళ్ళు.. లేదా గ్లాస్ నీళ్ళిచ్చినా గానీ..ప్రతి ఫలం అనేది ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నాడు దేవుడు. (మత్తయి సువార్త,10:42) వ వాక్యం ప్రకారం. *అతిధ్యం ఇవ్వాలి అనేటువంటి గుణాన్ని బట్టి దేవుడు ఎంతో దీవిస్తాడు సంతోషిస్తాడు. అది మర్చిపోకండి.*

♻️  6.ఆరవది ఏంటి అంటే.? శారా క్రమ పరచబడింది.

✨️శరా మెల్ల మెల్లగా క్రమపరచబడింది. నేర్చుకున్నది. *దేవుడు "శారయి" అనేటువంటి పాత పేరును తీసేసి "శారా" గా మార్చాడు.* శారయి కాస్త "శారా" అయ్యింది. *అబ్రాహాము కూడ అంతే అబ్రాము పేరును తీసి "అబ్రహాముగా" మార్చాడు.*

 ✨️ *శారా జనములకు తల్లి జననిగా ఉండాలని దేవుని కోరిక.* అందుకే ఆమె పేరును మార్చి వారికి జన్మించబోయేటువంటి కుమారునికి "ఇస్సాకు" అని పేరు పెట్టమన్నాడు. అబ్రాహాముతో దేవుడు చేసిన నిబంధనకు గుర్తుగా దేవుని మాట ప్రకారం అబ్రాహాము తన ఇంటనున్న పురుషులందరికి కూడ "సున్నతి" చేయించాడు. *తాను తన కుమారుడైన ఇష్మాయేలు ఒకే దినాన సున్నతి పొందారు.*

✨️ *అబ్రాహాము తన విశ్వాసాన్ని క్రియల్లో కూడ చూపించాడు.* దేవుడు వారిని దర్శించడానికి వచ్చి వారి అతిధ్యాన్ని స్వీకరించాడు. దేవదూతలకు అతిధ్యమిచ్చినటువంటి వారిగా వారు ఉన్నారు. అలా అతిధ్యమిచ్చినటువంటి శారా గుడారంలో కూడ ఉంది. *అప్పుడు దేవదూత వచ్చే సంవత్సరం ఈ కాలానికి శారాకు ఒక కుమారుడు కలుగుతాడు. అని చెప్పినప్పుడు శారా నవ్వింది.* (ఆదికాండము 18:10) వ వాక్యం దానికి కారణమేంటి.? మేం ముసలి వాళ్ళం ఐపోయాం కదా..మాకేలా కుమారుడు జన్మిస్తాడు.? అనే అనుమానం వాళ్ళకు వచ్చింది *దేవునికి అసాధ్యమైనది లేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు* అందుకే దేవుడు శారాను హెచ్చరించాడు. నీవు ఎందుకు నవ్వావ్.? అని అడుగుతాడు. అప్పుడు శారా భయపడింది. నేను నవ్వలేదు అని మరలా అబద్దం కూడ చెప్తుంది. ఐతే దేవుడు నీవు నవ్వావు. శారా ఎందుకు నవ్వింది.? అవిశ్వాసం వల్ల ఇన్ని సంవత్సరాలు కూడ ఎదురు చూసిన కలగని కొడుకు స్త్రీ ధర్మం నిలిచిపోయిన తరువాత ముసలివాళ్ళైపోయిన తరువాత కలుగుతాడా.? అని శారా సందేహించింది..?? ఆ సందేహం తొలగించడానికి దేవుడు శారాను నీవు ఎందుకు నవ్వావు అని అడుగుతాడు. శారా నిజం ఒప్పుకోకపోయినా గానీ, నీవు నవ్వావు అని తెలియజేస్తాడు. ఇది దేవుని పద్దతి.!

✨️ *మన అవిశ్వాసము, అవిధేయత,అమాయకత్వము, అపనమ్మకత్వము,దేవుని చేత సరి చేయబడాలి.* సరి చేయబడని స్థితిలో ఉంటే మనముంటే ఆశీర్వాదాలు కోల్పోతాం. అందుకే దేవుడు శారాను సరిచేసి ఆమె అవసరాన్ని కొరతను "ఇస్సాకు" ద్వార తీర్చాడు. ఎంత ప్రేమ గల దేవుడు. అందుకే ఆయన పేరు "ప్రేమ" అంటారు (యోహాను సువార్త 3:16) వా వాక్యంలో..

✨️ అందుకనే మిమ్మల్ని సరిచేసి మీ కొరతను తీర్చే దేవుడ్ని ఆశ్రయించాలి. క్రమపరచబడినందు వల్లే శారా వృద్ధాప్యంలో కుమారుడ్ని పొందగలిగే శక్తిని పొందుకుంది. ఆ సమయంలో స్త్రీ ధర్మం నిలిచిపోయింది. ముసలి వయసు వచ్చే సరికి ఆ సమయంలో అసాధ్యమైనటువంటి దాన్ని సరిచేసాడు దేవుడు. శక్తి నిచ్చాడు. *అవిశ్వాసంతో నవ్విన శారకు "నవ్వు" అనే పేరు గల "ఇస్సాకును" దేవుడిచ్చాడు.*

✨️ *వృద్ధాప్యంలో ఆమె పెదవులపై ఎప్పుడు కూడ నవ్వు ఉండేటట్లు చేసాడు చూసాడు దేవుడు.* అందుకే మనం కూడ అవిశ్వాసులం కాకుండ విశ్వాసులుగా ఉండాలి అని తెలియజేస్తున్నాను.!

♻️  7.ఏడవది ఏంటంటే.? ఆశీర్వదించబడింది శారా
 
✨️ శరా ఆశీర్వదించబడింది 90 సంవత్సరాల వయసులో ఇస్సాకును కనింది. *నిజంగా లోకానికి ఇది అసాధ్యమే కానీ ప్రభువులో ఉన్నటువంటి శారాకు మాత్రం ఇది సాధ్యపడింది.* విశ్వాసాన్ని బట్టి శారాకు వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడని యెంచుకున్నారు గనుకనే తాను వయసు గతించిందైనా గర్భము ధరించడానికి శక్తి పొందింది (హెబ్రి పత్రిక,11:11) వ వాక్యం ప్రకారం.

✨️ *వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకు సంతానం మాత్రమే అబ్రాహాము సంతానం అనబడుతుంది* అని దేవుడు ఇచ్చాడు ఆ వాగ్దానాన్ని ఆ దేవుడు స్థిరపరిచాడు (రోమా పత్రిక,9:7) ప్రకారం..

✨️ *శారా ఆతిధ్యం పొందినటువంటి దేవుడు నవ్వును వాళ్ళ కుటుంబంలోకి "ఇస్సాకు" ద్వార తెచ్చాడు.* వాళ్ళ కుటుంబానికి సంతోషాన్ని కలుగజేసాడు. ఇస్సాకు ద్వార జనాన్ని ఇచ్చాడు. జనాంగాన్ని ఇచ్చాడు. ఆస్తిపాస్తుల్ని ఇచ్చాడు. ఆశీర్వాదించాడు. కనాను ప్రదేశమిచ్చాడు అన్నీ ఇచ్చాడు. భూదిగంతముల వరకు కూడ ఇస్సాకు సంతానంలో ప్రతీ వారు కూడ జనములకు తల్లిగా శారా పిలువబడుతుంది.

✨️ *అబ్రాహాము ఈ యొక్క జనములకు విశ్వాసిగా పిలువబడితే ఆ జనములకు తల్లిగా శారా పిలువబడుతుంది* అంతలా ఆశీర్వదించాడు. శారా వలె ఆశీర్వదించబడాలి అని ఆశీర్వాదం పొందాలి అని మీకు కూడ ఉందా.? అందుకే ఈ విధంగా ఈ పాఠాలు మీరు కూడ నేర్చుకోండి..!!

♻️  8.ఎనిమిదవ అంశం ఏంటంటే.? యోగ్యురాలు అని పిలుపించుకుంది
 
✨️ యగ్యురాలు అని పిలిపించుకుంది అని నిరూపించుకుంది కూడ శారా (మొదటి పేతురు పత్రిక,3:6) వ వాక్యంలో కనిపిస్తుంది ఈ వాక్యమంతా..

✨️ *ఆ ప్రకారం శారా అబ్రాహామును "యజమానుడని" పిలుస్తూ అతనికి లోబడింది.* మీరును యోగ్యముగా యెంచుకొనుచు ఏ భయముకు బెదరక ఉన్న యెడల ఆమెకు పిల్లలవుతారు అని. అంటే ఇక్కడ యోగ్యముగా నడుచుకున్నది యోగ్యముగా అంటే మేలుకరంగా అని అర్ధం.

✨️ *శారా తన జీవితంలో అబ్రాహాముకు మేలుకరంగా జీవించింది.మేలుకరంగా..ఉపయోగకరంగా..సంతోషకరంగా.. జీవించడం అంటాం దీన్ని.*

✨️ *దేవుడు కోరిన విధంగా శారా తన జీవితాన్ని గడిపింది.* శారాలోని "సుగుణం" "విధేయత" అబ్రాహామును (యజమానుడు) అని పిలుస్తూ అతనికి లోబడుతూనే ఉంది ప్రతీసారి..!

✨️ సలహాలు ఇచ్చి తన వంతు సహకారాన్ని అందించి ఉండవచ్చు అలాగే అతిధ్యమిచ్చి ఇంటి పరిచర్య ప్రతీ దానిలో కూడ ముందుండి ఏ లోటు లేకుండా చూసుకుంది. ఐతే నిర్ణయాలు అబ్రాహాముకే వదిలేసింది శారా.

✨️ *నీవు కూడ నీ జీవితంలో యోగ్యంగా ఉంటే శారాకు నిజమైన కుమార్తెగా అనిపించుకుంటావ్.* శారా అబ్రాహాముకు చూపిన విధేయత ద్వార అబ్రాహాము దేవునికి విధేయుడయ్యాడు. అలా జీవించడానికి శారా ఎంతో తోడ్పడింది.!

✨️ నవు కూడ శారా వలె ఉంటే ఆయన హృదయాన్ని ఆనందంతోను నీ నోటిలో నవ్వుతోనూ నింపుతాడు దేవుడు.

♻️  ఇక ఆఖరిగా ముదిమి వచ్చు వరకు కూడ నమ్మకంగా జీవించింది శారా
 
✨️ *ముదిమివచ్చు వరకు కూడ నమ్మకంగా జీవించింది శారా* మధ్యలో విడిచిపెట్టలేదు. అవసరం తీరింది జనాంగంలో ఆశీర్వదించబడ్డారు అని,పిల్లలు కాలిగారు అని,ఎక్కడ కూడ విడిచిపెట్టలేదు. *శారా 127 సంవత్సరాలు జీవించింది.* 127 సంవత్సరాలు జీవించి "హెబ్రోను" లో మరణించింది అని (ఆదికాండము,23:2) లో తెలుస్తుంది.!

✨️ వగ్దాన జనాంగానానికి జనని శారా. దేవుడిచ్చిన వాగ్దాన నెరవేర్పును కన్నులారా చూడగలిగినటువంటి ధన్య జీవి శారా.

👉 *బైబిల్ లో మరణ వయసు చెప్పబడిన ఏకైక స్త్రీ శారానే.* ఎందుకు అంటే మగవాళ్ళ గురించి వ్రాయొచ్చు గానీ..ఆడ వాళ్ళ గురించి వాళ్ళ యొక్క ఎప్పుడు చనిపోయారు ఎన్ని సంవత్సరాల తరువాత చనిపోయారు అని ఇంక ఎవ్వరికి కూడ వ్రాయబడలేదు ఆ ధన్యత శారాకు వచ్చించి.

👉 *మరణ వయసు చెప్పబడినటువంటి ఏకైక స్త్రీగా ఉంది శారా*

✨️ న హృదయాన్ని దేవునికిచ్చి నా ఆజ్ఞలకు లోబడుతూ.. కుటుంబాన్ని రక్షించుకుంటూ..యజమానికి లోబడితే ఆయనకు ఇష్టంగా నీవు జీవిస్తే..నిజంగానే శారాకు కామార్తె అనబడతావ్ అనబడే ధన్యత మీరు పొందుకోగలుగుతారు.!

👉 *ఇవి శారాలో ఉన్నటువంటి ప్రత్యేకతలు శారా వల్ల వచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి పాఠాలు.!*

✨️ *ఇవన్నీ కూడ శారా జీవితాన్ని తెలియజేస్తాయ్. మన జీవితంలో కావాల్సినటువంటి విధి విధానాలను కూడ తెలియజేస్తాయ్.*

✨️ చక్కగా ఇవ్వన్నీ కూడ అర్ధం చేసుకున్నారు అని నేను అనుకుంటున్నాను. మన జీవితంలో కూడ ఇవన్నీ ఉండాలి అని కోరుకుంటున్నాను ప్రతీ ఒక్కరూ అవి గమనించండి..!!

👉 *దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికి తోడైయుండి బలపరచును గాక...!!!*
 
                                 🖊  𝓛𝓸𝓿𝓲𝓷𝓰 𝓼𝓪𝓶  

 

10 March 2019

✳ దేవుడిచ్చిన ఆజ్ఞను పాటించుట, ఆయనను ప్రేమించుటకు నిదర్శనం.




తండ్రి, కుమారా, పరిశుద్ధాత్మ అయిన త్రియేక దేవుడు తన శక్తిగల మాటతో ఈ సర్వ సృష్టిని సృష్ఠించి, ఏకరీతిగా పరిపాలిస్తూ, మానవాళికి అవసరమైన సర్వ సంపదలను సృష్ఠించి వారిని పోషిస్తూ ఆదరిస్తున్న దేవునికి మానవుడు ఏ విధంగా కృతజ్ఞతను కనపర్చుకోవాలో వివరిస్తూ...

 నిర్గమకాండం 23:16 లో “నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయ తొలిపంట యొక్క కోతపండుగను, పొలములోనుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొనిన తరువాత సంవత్సరాంతమందు ఫలసంగ్రహపు పండుగను ఆచరింపవలెను.”

👉 ఈ పండుగలో పాల్గొనే ప్రతీ విశ్వాసికి దేవుని పట్ల తనకుగల విధేయతను, విశ్వాసాన్ని, ప్రేమను మరియు సమర్పణను ప్రదర్శించుకొనే గొప్ప భాగ్యాన్ని దేవుడు కలుగజేస్తాడు. అందుకు దేవునికి స్తోత్రములు.

దేవుడిచ్చిన ఆజ్ఞను పాటించుట, ఆయనను ప్రేమించుటకు నిదర్శనం.

♻ ఇచ్చుట అనేది దైవ లక్షణం.

👉 సర్వమానవాళి రక్షణార్ధం దేవుడు తన ఏకైక కుమారుడగు క్రీస్తు యేసును పాప పరిహారార్ధబలిగా ఇచ్చి వేసియున్నాడు..

 దేవుడు లోకమును ఏంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను  (యెహో 3:16).

🔺 దేవునికి గల ఈ లక్షణములను మనము కలిగియుండాలనేది ఆయన సంకల్పం.

👉 దేవుని చేత సృష్ఠింపబడిన ఈ సృష్ఠిని నిశితంగా పరిశీలిస్తే దేవుడు ఎంత ఆశ్చర్యకరుడో అద్భుతమైన దేవుడో మనకు అర్ధం అవుతుంది.

♻ ఈ ప్రకృతిలో ప్రతిదీ మన కిచ్చుటకే సృష్ఠింపబడినదనేది మనకు తెలియుచున్నది. దేవుని నడిపింపు వలన ప్రకృతి ద్వారా పుచ్చుకుంటున్న మనం “ఇచ్చుట” అనే భాధ్యతగల వారముగా జీవించాలనేది దైవ సంకల్పం.

👉 దేవుని దయ లేనిదే మనం ఎంత కష్టపడినా ఫలితాన్ని సాధించలేము. రైతు పొలాన్ని దున్ని, నీరు పెట్టి, ఎరువు వేసి పంటను పండించినా ఒక్కోసారి పకృతి వైపరిత్యాల వలన పంట సర్వనాశనం అయిపోతూ ఉంటుంది. కారణం దేవుని దయ కాపుదల లేకపోవుటయే. కావున దేవుని దయ మీదే సర్వం ఆధారపడి ఉందని విస్వసిస్తున్నాం.

సర్వకాల సర్వావస్థలయందు సమృద్ధియైన పంటనిస్తున్న దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతార్పణలను అర్పించుకోవాలి.

కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చెదము కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము
 (కీర్తన 95:2).

అంతేకాకుండా కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి (కీర్తన 100:4) అని దేవుని వాక్యముచేత హెచ్చరించబడుచున్నాము.

👉 కృతజ్ఞత లేని వారు బ్రదికి యుండియు చచ్చిన వారితో సమానము.

👉 మానవ జాతి భ్రష్టమై పోవడానికిని, ప్రతి విషయంలోను అపజయానికి గురియై పోవడానికి గల ముఖ్యకారణం మానవునికి దేవుని పట్ల కృతజ్ఞత లేకపోవుటయే.

🔹 అందుకే “వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచ లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు గాని తమ వాదములయందు వ్యర్థులైరి” రోమా 1:21.

👉 గనుక ప్రతి విశ్వాసి ప్రతి విషయంలోను దేవునికి కృతజ్ఞతార్పణలు అర్పించుకోవాలని దైవ వాక్యం నొక్కివక్కాణిస్తుంది.   

🔹ఈ సందర్భంగా పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండము నాల్గవ అధ్యాయంలో మొదటి ఐదు వచనాలు ధ్యానించినట్లయితే అక్కడొక విశిష్టమైన విషయాన్ని చూస్తాము.

దేవునిని ప్రేమించి ఆయన చిత్తానికి లోబడి సమర్పించిన కృతజ్ఞతార్పణలను దేవుడు అంగీకరించిన విధానమును

మరియు

హృదయశుద్దిలేకుండా ఆచారమును పాటిస్తూ అర్పించిన కృతజ్ఞతార్పణలను దేవుడు తిరస్కరించిన విధమును మనం గమనించవచ్చు.

 ఆది 4:1-5
“ఆదాము తన భార్యయైన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతియై కయీనును కని యెహోవా దయవలన నేనొక మనుష్యుని సంపాదించుకొన్నాననెను. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబెలును కనెను. హేబెలు గొఱ్ఱల కాపరి; కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయీను పొలముపంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబెలు కూడ తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలును అతని యర్పణను లక్ష్య పెట్టెను; కయీనును అతని యర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా”.

👉 సృష్ఠిలో మొదటి సహోదరులు వీరు.
వారు సమర్పించిన కృతజ్ఞతార్పణలలో ఏంతో వ్యత్యాసముంది.

🔺 కయీను భూమిని సేద్యపరచువాడు. అతడు కొంతకాలమైన తరువాత పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను.

🔺 హేబేలు గొఱ్ఱెలకాపరి, తన మందలో తోలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని కృతజ్ఞతార్పణగా తెచ్చెను.

♻ ఇద్దరు సమర్పించినవి కృతజ్ఞతార్పణలే గాని దేవుడు హేబేలు అర్పణను అంగీకరించి కయీను అర్పణను తిరస్కరించాడు.

ఈ తిరస్కారమునకు గల అసలు కారణం ఏమిటంటే

1⃣ కయీను మొదటిగా తన హృదయాన్ని దేవునికి సమర్పించుకోలేదు;
 అందుకే దేవుడు అతని అర్పణను అంగీకరించలేదు.
🔹 హేబేలు మొదటిగా తన హృదయాన్ని దేవునికి సమర్పించుకొన్నాడు గనుకనే దేవుడతని అర్పణను అంగీకరించాడు.

2⃣ కయీను సమరించిన అర్పణ ఆచారమును సూచిస్తూ ఉన్నాడు కనుకనే తిరస్కరించబడినది.

🔹 హేబేలు సమర్పించిన సమర్పణ విశ్వాసముతో కూడు కొన్నది.
ఎందుకనగా అతడు తన మందలో తోలు చూలు పుట్టిన వాటిని దేవునికి సమర్పించాడు. అందుకే అతని అర్పణ అంగీకరించబడింది.

3⃣ కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పించాడే గాని పంటలో శ్రేష్ఠమైన వాటిని అర్పించలేదు అందుకే దేవుడు అతని అర్పణను తిరస్కరించాడు.

🔹 హేబేలు అయితే తోలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని అనగా శ్రేష్ఠమైన వాటిని అర్పించాడు. అందుకే అతని అర్పణను దేవుడు అంగీకరించాడు.

హెబ్రీ 11:6
విశ్వాసము లేకుండ దేవునికి ఇష్టుడై యుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడు అనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా!.

🔺 హేబెలును గూర్చి దేవుడిచ్చిన సాక్ష్యం ఏమనగా

 హెబ్రీ 11:4

“విశ్వాసమునుబట్టి హేబెలు కయీనుకంటె శ్రేష్ఠమైన బలి దేవునికి అర్పించెను. దేవుడతని అర్పణలనుగూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమునుబట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతినొందియు ఆ విశ్వాసముద్వారా మాటలాడుచున్నాడు.”

👉 విశ్వాసముతో అర్పించిన అర్పణలను దేవుడు అంగీకరిస్తాడనియు,
👉 అర్పించిన వారు నీతిమంతులుగా తీర్చబడుతారు అనియు,
👉 అనేక విధములుగా దీవించబడుతూ పరలోక రాజ్యమునకు వారసులవుతారనియు తెలిసికొనుచున్నాము.

అందుకే వాక్యం ఏమని బోధిస్తున్నదంటే, రోమా 12:1 “కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను”

👉 ఈ సందర్భంగా మరొక విశిష్ఠమైన విశ్వాసిని జ్ఞాపకం చేసుకుందాం. ఆమె ఎవరనగా 1 సమూయేలు గ్రంథం మొదటి రెండు అధ్యాయాలలో ఉన్న హన్నా అను స్త్రీ ని చూస్తాము.

👉ఆమె తనకు తొలుచూలున పుట్టిన వాడును ఏకైక కుమారుడగు సమూయేలును, ఆమె దేవునితో చేసుకొన్న ఒడంబడిక ప్రకారము, దేవుని సేవకై షిలోహునందు ఉన్న దేవాలయములో దేవునికి సమర్పించి వేసియున్నది. దేవుడు ఆమెకు తనపట్ల గల ప్రేమను, విశ్వాసాన్ని, సమర్పణను చూచి ముగ్ధుడై ఆమెకు ముగ్గురు కుమాళ్ళను, ఇద్దరు కుమార్తెలను బహుమానముగా యిచ్చి దీవించారు.

సామె 11:24
“వెదజల్లి అభివృద్ధిపొందువారు కలరు తగినదానికన్న తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు.”

🔺 అననీయ సప్పీరాలు, తగిన దానికన్నా దేవునికి తక్కువ యిచ్చి మరణం పాలయ్యారు.
ఇటువంటి భయంకరమైన మరణాన్ని మనం తప్పించుకోవాలన్నా,

🔹 హేబేలు వలె నీతిమంతులుగాను,

🔹హన్నా వలె అధికమైన దేవుని ఆశీర్వాదములు పొందాలంటే దేవునికి కృతజ్ఞతార్పణలను విశ్వాసముతోను, ప్రేమతోను, సమర్పణాభావంతోను హృదయపూర్వకంగా సమర్పించుకోవలసిన వారమై యున్నామని వాక్యము ద్వారా హెచ్చరింపబడుచున్నాము.

కీర్త 103:17,18
“ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడల ననుసరించి నడచుకొను వారిమీద యెహోవాయందు భయభక్తులు గలవారిమీద ఆయన కృప యుగయుగములు నిలుచును ఆయన నీతి వారికి పిల్లపిల్ల తరమున నిలుచును.”

హల్లెలూయ...

మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.

ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!


ఆత్మఫలం


ఆత్మఫలం



అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము.
గలతియులకు 5: 22


1⃣ ప్రేమ

పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండేటప్పుడు కలిగే ఆత్మఫలం లో మొదటిది ప్రేమ.

👉 ఇది ఎంత లోతైనదంటే సాటి మనిషి కోసం ప్రాణమైనా ఇవ్వగలిగినంత లోతైనది.

👉 ఈ "ప్రేమను" దేవుడు ఈ భూమి మీద ఒక మనిషిగా జన్మించి, జీవించి చూపించాడు. యేసు క్రీస్తుగా తాను మనుషులందరి మీద చూపించిన " ప్రేమనే" ఆయనను నమ్ముకున్న వారంతా ఒకరి ఎడల ఒకరు చూపించాలని ఆయన కోరుకుంటున్నాడు.

👉 అలా చెయ్యడానికి మనకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. ఈ ప్రేమ కోసం బైబిల్ లో ఏమి వ్రాసి ఉందంటే

▪ఈ ప్రేమలో దీర్ఘశాంతం ఉంటుంది.
▪ఈ ప్రేమ దయ చూపిస్తుంది.
▪ఈ ప్రేమకు అసూయ అనేదే ఉండదు.
▪ఈ ప్రేమ డంబాలు చెప్పుకోదు, అంటే గొప్పలు చెప్పుకోదు. అది గర్వంతో ఉప్పొంగి పోదు. అయోగ్యంగా ప్రవర్తించదు. స్వంత ప్రయోజనం చూసుకోదు. తనను ఎవరు రెచ్చగొట్టినా రెచ్చిపోదు. ఎవరైనా తనకు ఏ అపకారం చేసినా దాన్ని పట్టించుకోదు.

👉 ఈ ప్రేమ చెడ్డ విషయాల్లో ఏమాత్రం సంతోషించదు గాని, మంచి విషయంలోనే సంతోషిస్తుంది.

 ఈ ప్రేమ అన్నిటినీ భరించుకుంటుంది, అన్నింటినీ నమ్ముతుంది, అన్నిటి విషయంలో ఆశాభావం కలిగి ఎదురుచూస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది.

బైబిల్ వివరించిన ఈ ప్రేమ ఎప్పటికీ అంతం కాదు. అలాంటి ప్రేమతో పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలను నింపును గాక… ఆమేన్.

2⃣ సంతోషం అంటే ఏమిటి ?

👉సంతోషం అనే మాట ఎంతో ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. కానీ దాన్ని చాలా తక్కువగా కలిగి ఉంటాం.

👉చాలా మంది దీన్ని తమ పేరుగా కలిగి ఉంటారు. కానీ నిజానికి వారిలో చాలామందికి సంతోషంగా ఉండే సమయాలు, పరిస్తితులు చాలా తక్కువగా ఉంటాయి.

👉 నిజంగా నిరంతరాయంగా మీరు సంతోషంగా జీవించాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది.
అదేమిటంటే, మీ సృష్టికర్త అయిన దేవుని మాటలను చదివి, విని వాటి ప్రకారం జీవించడమే.

బైబిల్ గ్రంధంలో మొదటి దినవృత్తాంతములు, 16వ అధ్యాయం, 27వ వచనంలో ఇలా వ్రాసి ఉంది. “ఘనతా ప్రభావములు ఆయన సన్నిధి లో ఉన్నవి. బలమును, సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి”. 16 వ కీర్తన 11 వ వచనంలో  “నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు” అని వ్రాయబడి ఉంది.

👉అవును, దేవుని సన్నిధి నుండి మనకు అనుగ్రహింపబడిన సంతోషమే నిజమైన సంతోషం, శాశ్వతమైన సంతోషం.

👉దేవునితో సంబంధం లేని సంతోషం క్షణ మాత్రమే ఉంటుంది. యోబు గ్రంథం 20వ అధ్యాయం, 4వ వచనం లో
“భక్తిహీనులకు సంతోషము ఒక నిమిష మాత్రం ఉండును” అని వ్రాయబడి ఉంది. అది నిజమే కదా.

 సర్వసృష్టికర్త అయిన దేవునితో ఏ మాత్రం సంబంధం లేని మనుషులు తాము చేసే చెడు పనులు లోనే సంతోషాన్ని వెతుకుతూ ఉంటారు కాబట్టి వారికి కలిగే సంతోషం ఒక్క క్షణమే ఉంటుంది. మళ్లీ ఏదో చెడ్డ పని చేసేంత వరకు వాళ్ళ హృదయాలు, మనసులు తీవ్రమైన అశాంతితో నిండి ఉంటాయి.

ఇలాంటివారు యేసుక్రీస్తు ప్రేమను రుచి చూడాలి. యేసుక్రీస్తు రక్త ధారల క్రింద వారి జీవితాలు తడపబడి శుద్ధి చేయబడాలి. యేసు క్రీస్తు తో సహవాసం కలిగి ఉండడమే సర్వ సృష్టి కర్త అయిన దేవునితో సంబంధం కలిగి ఉండడం. అలాంటి వారికే సంతోషం అనేది నిజంగా, నిరంతరాయంగా కలుగుతూ ఉంటుంది.

👉 మనం చేసే పొరపాట్లు, అపరాధాలు, తప్పులు, దోషాలు, పాపాలు అనేవి దేవుడు మనకిచ్చిన సంతోషాన్ని దోచుకుంటాయి. అలాంటి సమయాల్లో మళ్ళీ మనం యేసుక్రీస్తు పాదాల దగ్గరకు చేరి పాప క్షమాపణ కోసం వేడుకొని, మనం చెడ్డ మార్గాలను విడిచిపెడితే నిజమైన సంతోషం మనలోకి ప్రవేశిస్తుంది. యేసుప్రభువును విడిచి పెట్టకండి. సంతోషం మిమ్మల్ని విడిచి పెట్టదు. ఆమేన్. 
   
3⃣  సమాధానం

సమాధానం అనే మాటను మన వాడుక భాషలో అయితే జవాబు అనే మాటకు మారుగా వాడతాం.

 అయితే బైబిల్ భాషలో సమాధానం అంటే శాంతి అని అర్థం. ఇంకా వివరంగా చెప్పాలంటే తగువు తంటాలు లేకుండా, గొడవలు లేకుండా, వ్యతిరేక భావం లేకుండా, ఎడమొఖం పెడమొఖం పెట్టుకోకుండా, ఒకరియెడల ఒకరు సుహృద్భావంతో మంచిగా ఉండటాన్ని సమాధానంగా ఉండటం అంటారు.

🔺 ఇది మూడు కోణాల్లో ఉండాలి.

🔹మొట్టమొదటిగా ప్రతి మనిషి తనలో తానే సమాధాన స్థితిని కలిగి ఉండాలి. అంటే నీ మనస్సాక్షి నీకు వ్యతిరేకంగా ఉండకూడదు. నువ్వు, నీ మనస్సాక్షి సమాధానం గా ఉండాలి.

🔹 తరువాత ప్రతి ఒక్కరు తమ సాటి మనుషులతో సమాధానం గా ఉండాలి. అలా ఉండేలా ప్రయత్నం చేస్తూనే ఉండాలి.

🔹 ఇక చివరిగానైనా అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఆ సృష్టికర్త అయిన దేవునితో సమాధానం కలిగి ఉండాలి.

👉 ఈ మూడు సమాధాన స్థితులు కలిగినప్పుడు మనిషి జీవితం ప్రశాంతంగా ఉన్నట్టు లెక్క.

నీలో నీకు సమాధానం లేకపోయినా, సాటి మనిషితో నీకు సమాధానం లేకపోయినా, నీ సృష్టికర్తయైన దేవునితో నీకు సమాధానం లేకపోయినా, వెంటనే రక్షకుడైన యేసుక్రీస్తును వేడుకో. అన్ని కోణాల్లో దాన్ని సంపాదించుకో...  ఆమేన్.

4⃣  దీర్ఘశాంతము

దీర్ఘకాలం శాంతంగా ఉండగలగడాన్ని  దీర్ఘశాంతం అని అంటారు.

👉 దీర్ఘం అంటే చాలా ఎక్కువ కాలం అనే కదా అర్థం. కాబట్టి దీర్ఘశాంతం అనే గుణాన్ని కలిగి ఉన్నవారు అంత త్వరగా కదిలిపోరు. వారిలో ఓర్పు, సహనం అనేవి ఎక్కువగా ఉంటాయి.

సాధారణ మనుషులు తమ కోపం చూపించడానికి ఎంత ఓపిక పడతారో, సహనం చూపిస్తారో, దానికి కొన్ని లక్షల రెట్లు దీర్ఘశాంతం అనే గుణాన్ని కలిగిన వారు ఓపిక పడతారు, సహనం చూపిస్తారు. చెప్పాలంటే ఈ "దీర్ఘశాంతం" అనే గుణం ఉన్నవారు అత్యంత మానసిక శక్తి కలిగి ఉన్నవారు అన్నమాట.

♻ సర్వసృష్టికర్త అయిన దేవుడే దీర్ఘశాంతుడై యేసు క్రీస్తు రూపంలో మనిషిగా ఈ  భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి తన దీర్ఘశాంతం అంతా చూపించాడు.

 ముఖ్యంగా దుర్మార్గులైన మనుషులు ఆయనను అతి ఘోరమైన, నీచమైన, సిలువ శిక్షకు అన్యాయంగా అప్పగించినప్పుడు ఆయన చూపించిన దీర్ఘశాంతం మనకిప్పుడు మాదిరిగా ఉంది. మనలో ప్రతి ఒక్కరి విషయంలో ఆ ప్రభువు దీర్ఘశాంతం చూపిస్తూ, మన జీవితాల్లో మంచి మార్పు కోసం రోజు రోజు ఎదురు చూస్తున్నాడు.

దేవుని దీర్ఘశాంతాన్ని ఇంకా మనం పరీక్షించకుండా ఆయన మార్గం లోకి వద్దాం. మనం కూడా ఆయనలా దీర్ఘశాంత గుణాన్నిఅలవాటు చేసుకుందాం.

అందుకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక… ఆమేన్

5⃣ దయాళుత్వము


దయాళుత్వము ఈ పదం పలకడానికే కష్టంగా ఉంది కదూ! దయ కలిగిన మనసునే దయాళుత్వం కలిగి ఉండడం అంటారు.

👉 కొన్ని తర్జుమాలలో దీనినే జెంటిల్ నెస్, అని స్వీట్ నెస్ అని కూడా రాశారు. ఇంగ్లిష్ లో ఈ దయాళుత్వాన్ని  కైండ్ నెస్ అంటారు.

▪ మనం దయ చూపించడానికి ఎదుటి వ్యక్తిలో ఏ అర్హత, యోగ్యత ఉండనక్కరలేదు.

ఎదుటి వ్యక్తి పరిస్థితిని బట్టి అది మంచిదైనా, చెడ్డదైనా వారి మీద దయ చూపించడం అనేది పరిశుద్ధాత్మ వలన మనలో కలిగే ఆత్మ ఫలానికి గుర్తు.

👉 దయ కలిగిన హృదయం కఠినంగా వ్యవహరించాలనుకున్నా అలా చేయలేదు. అయితే ఒక మనిషిలో పరిశుద్ధాత్మ ఫలంగా కలిగిన దయాగుణాన్ని ఎవరైనా దుర్వినియోగపరిస్తే వాళ్ళు దైవ తీర్పునకు గురి అవుతారు.

మనం దయా హృదయంతో ఎదుటి వారికి మేలు చేసినప్పుడు దాన్ని వారు అలుసుగా తీసుకుంటే, లేకపోతే అది మన బలహీనతగా తీసుకుంటే, మనం నష్టపోయేది ఏమీ ఉండదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడే ఆ దయాగుణాన్ని మనలో పుట్టించి మనం ఎదుటి వారి యెడల దయ చూపించేలా చేస్తున్నాడు కాబట్టి ఇక మిగతా విషయాలు కూడా ఆయనే చూసుకుంటాడు.

👉 ఎదుటివారి అపనమ్మకత్వం కారణంగా మనలోని దయాగుణాన్ని పోగొట్టుకో నక్కరలేదు. ఈ విషయం మనకు సరిగ్గా అర్థమయ్యేలా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక… ఆమేన్.


6⃣ ఆశా నిగ్రహం

“సెల్ఫ్ కంట్రోల్” అని అంటారే, అదే ఈ ఆశా నిగ్రహం.

మనో నిగ్రహం అనే మాట అందరికీ అర్థమవుతుంది కాబట్టి ఈ రెండు పదాలు మనం సందర్భాన్ని బట్టి వాడుకోవచ్చు.

ఆశా నిగ్రహం లేదా మనో నిగ్రహం అనేది, ఒక వ్యక్తి యేసు క్రీస్తు ద్వారా పాప క్షమాపణ పొంది, అపరాధ భావన నుండి విడుదల పొంది పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందినప్పుడు, ఆత్మ ఫలంగా ఆ వ్యక్తికి అనుగ్రహించబడుతుంది.

 అప్పటి నుండి  ఆశా నిగ్రహాన్ని అంటే మనో నిగ్రహాన్ని కాపాడుకుంటూ, దాన్ని ప్రాక్టీస్ చేస్తూ, ఆచరణలో పెడుతూ, దానిలో అభివృద్ధి పొందడం అనేది ఆ వ్యక్తి బాధ్యత. అందుకు దాన్ని అనుగ్రహించిన పరిశుద్ధాత్మ దేవుడే నిరంతరం సహాయం చేస్తుంటాడు.

👉 ఈ సెల్ఫ్ కంట్రోల్ అనేది అన్నిటిలో మితంగా ఉండడానికి అంటే లిమిట్ లో ఉండటానికి మనకు సహాయపడుతుంది. మన భావోద్రేకాలను సమతుల్యంగా ఉంచేది అంటే బ్యాలెన్స్ చేసేది ఈ ఆశా నిగ్రహమే /మనోనిగ్రహమే.

మన కోరికలు, ఆశలు, ఇచ్ఛలు, వాంఛలు, ఇలాంటివన్నీ పరిశుద్ధాత్మ శక్తి తో నిగ్రహించుకుంటూ, సమతుల్యత పాటిస్తూ, జీవిస్తేనే ఆ జీవితం అర్థవంతంగా ఉంటుంది. సార్ధకం అవుతుంది. అందుకు దేవుని కృప మనకు సహాయం చేయును గాక… ఆమేన్



4 March 2019

యబ్బేజు చేసిన ప్రార్ధన



యబ్బేజు చేసిన ప్రార్ధన

యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవునిగూర్చి మొఱ్ఱపెట్టినీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాల పరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడురాకుండ దానిలోనుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవిచేసిన దానిని అతనికి దయచేసెను. (1దిన  4:10)

యబ్బేజు అంటే "వేధన పుత్రుడు "
తాను పుట్టిన సమయములో తన తల్లికి వేధన పుట్టించాడు. కాని తన జీవిత కాలంలో దేవునికి ఆనందాన్ని కలిగించాడు.
పరిశుద్ధ గ్రంధములో యబ్బేజును గురించి కేవలం రెండు వచనాలు మాత్రమే వ్రాయబడ్డాయి. అయినప్పటికీ తాను పొందిన ఘనత అద్భుతమైనది.

"యబ్బేజు తన సహోదరులకంటె ఘనము పొందినవాడై యుండెను" (1దిన  4:9)

యబ్బేజు ఎందుకు తన సహోదరులకంటే, ఘనత పొందాడు అంటే? ఒక్కటే కారణం తాను దేవునికి చేసిన ప్రార్దనే. యబ్బేజు ప్రార్ధనలోని నాలుగు అంశములు.

1. నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు:
◽️——————————
ఆశీర్వాదం అంటే?  పూర్వ కాలములో ఎక్కువమంది  పిల్లలు, ఎక్కువ పశుసంపద  వుంటే వాళ్ళు ఆశీర్వదించబడిన వారు. అదే ఆశీర్వాదం. ఈ కాలములో కార్లు, భవనాలు, బ్యాంక్ బ్యాలెన్సు వుంటే? వారు ఆశీర్వధించ బడినవారు  అంటున్నాము

ఇదేనా ఆశీర్వాదం ? అయితే, యాకోబుకి అప్పటికి 11 మంది పిల్లలు వున్నారు. అప్పటికి ఇంకా బెన్యమీను పుట్టలేదు. లెక్కలేనంత పశుసంపద వుంది. కాని, యాకోబు దేవునితో పోరాడుతున్నాడు. దేని కోసం?

"నీవు నన్ను ఆశీర్వ దించితేనే గాని నిన్ను పోనియ్యననెను." (ఆది  32:26) అంటే? యాకోబుకు అవేమి ఆశీర్వాదాలవలే కనిపించలేదు. నిజమే. ఆయనను కలిగి యుండడమే ఆశీర్వాదం. ఆశీర్వాదాలకు కర్తయైన దేవునిని కలిగియుంటే? ఇక ఆశీర్వాధాలతో  పనిలేదు.

క్రీస్తునందు పరలోకవిషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను. (ఎఫెస్సి 1:3) ఆత్మ సంబంధమైన ఆశీర్వాధాల కోసం ప్రార్ధిస్తే? శారీరిక సంబంధమైన ఆశీర్వాధాలు వాటంతటవే వస్తాయి.

2. నా సరిహద్ధులు విశాలపరచు:
▫️——————————
దావీదు ఇట్లా ప్రార్దిస్తున్నాడు.
"నేను ఎక్కలేనంతయెత్తయిన కొండపైకినన్ను ఎక్కిం చుము." (కీర్తనలు  61:2) మన ఆస్థులు, అంతస్తుల యొక్క సరిహద్ధులు విశాలపరచమని కాదు. మన ఆత్మీయ సరిహద్ధులు. ఆ సరిహద్ధులు మనము ఎక్కలేనంత ఎత్తైన ఆనుభవాలుగా వుండాలి.

3. నీ చెయ్యి నాకు తోడుగా వుండనివ్వు
▫️————————————
ఆసాపు ఇట్లా అంటున్నాడు: నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నా కక్కర లేదు. శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై యున్నాడు. (కీర్తనలు 73:25,26) ఈ మాటలు మనము చెప్పగలిగే పరిపూర్ణత లోనికి రావాలి. నిజమే! ఆయన తోడుగా వుంటే? అగ్ని గుండం కూడా ఆహ్లాదకరంగానే వుంటుంది. ఆయన పాపిని ప్రేమిస్తాడు. పాపమును కాదు. ఇప్పటి వరకు మనకు తోడుగానున్న పాపమును విడచి పెడితే? అప్పుడు ఆయన తోడుగా వస్తాడు.

4. నాకు కీడు రాకుండా నన్ను తప్పించు:
▫️————————
కీడు రాకుండా చూడు. వచ్చినా దానిలోనుండి తప్పించు. కీడు రప్పించేవాడు సాతాను. వాడి చేతిలో నుండి తప్పించమని ప్రార్ధించాలి. ఎవరిని మ్రింగుదునా అని వాడు  గర్జించు సింహమువలే  తిరుగుతున్నాడు. మన చూపులు, తలంపులు, క్రియల ద్వారా మన మీదికి కీడు రప్పించాలని వాడు చేసే ప్రయత్నాల నుండి తప్పించమని దేవునిని ప్రార్ధిద్దాం.

యబ్బేజు ప్రార్ధన తనను తన సహోదరులలో ఘనునిగా చేసింది. మన ప్రార్ధన కూడా మనలను అట్టి ఘనతకు పాత్రునిగా చెయ్యాలి. ఘనత అంటే ఐశ్వర్యము, పేరు ప్రఖ్యాతులు కాదుగాని, ఆయనను కలిగి యుండడమే నిజమైన ఘనత. ఆ రీతిగా మన హృదయాలను సిద్ధ పరచుకొని ప్రార్ధిద్దాం! అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!


గర్వము వ్యభిచారము కంటే అపాయకరమైనది - జాక్‌ పూనెన్‌


గర్వము వ్యభిచారము కంటే అపాయకరమైనది

ఎదోముమీద దేవుని తీర్పును గురించి ఓబద్యా మాట్లాడెను. ఎదోము మన శరీరమునకు సాదృశ్యముగా ఉన్నది. గనుక ఈ ప్రవచనము మన శరీరము యొక్క పతనమును గూర్చి సూచించుచున్నది.

ఎదోము యొక్క గర్వము గురించి ఇక్కడ చెప్పబడి యున్నది. ''అత్యున్నతమైన పర్వతములమీద ఆసీనుడవైయుండి కొండ సందులలో నివసించువాడవు''. నన్ను క్రిందకు పడద్రోయ గలవాడెవడని అనుకొనువాడా, నీ హృదయపు గర్వముచేత నీవు మోసపోతివి. పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకొని నక్షత్రములలో నీవు దానిని కట్టినను అచ్చటనుండియు నేను నిన్ను క్రింద పడవేతును (ఓబద్యా 1:3,4).

శరీరము ఎల్లప్పుడు తన్నుతాను హెచ్చించుకొనుటను కోరును. కాని ఆ గర్వమంతటినీ పూర్తిగా నాశనము చేయుటకు దేవుడు నిర్ణయించెను. దొంగలు రాత్రివేళ వచ్చినట్లయితే వారు సమస్తమును దొంగిలించలేరు. కాని ఇక్కడ ''వారి సొమ్ము సోదా చేయబడును, వారు దాచిపెట్టిన ధనమంతయు పట్టబడును''. దీని భావము ఆత్మచేత ''శరీరానుసారమైన'' సమస్తమును, శరీరయిచ్ఛలును పూర్తిగా నాశనము చేయబడును.

యాకోబు సంతతి బంధీలుగా పట్టబడి గొప్ప అవసరములో ఉన్నప్పుడు తమ సొంత బంధువులైన వారిని బలాత్కారము చేసినందున, దేవుడు ఎదోమును శిక్షించెను, పరదేశులు వారి ఆస్తిని పట్టుకొనిపోయిన దినమందు, అన్యులు వారి గుమ్మములలోనికి చొరబడి యెరూషలేము మీద చీట్లు వేసిన దినమందు నీవును వారితో కలసికొంటివిగదా అనెను (ఓబద్యా 1:10,11). ఇశ్రాయేలీయుల శత్రువుల వలె వారు పని చేసిరి. ఇశ్రాయేలుకు సహాయపడుటకు ఎదోము ఏమియు చేయలేదు.

చేయవలసినవి చేయకపోవుట మరియు చెయ్యకూడనివి చేయుట అను పాపములు ఉన్నవి. తరచుగా మనము పాపములను గూర్చి తలంచినప్పుడు, కేవలము చేసిన పాపములను మాత్రమే తలంచెదము. గమనించండి. మంచిసమరయుని కథలో యాజకుడు మరియు లేవీయుడు పాపము చేయలేదు. పడియున్న వ్యక్తిని వారు కొట్టలేదు. అవసరములో ఆ వ్యక్తికి వారి చేతివ్రేలితో కూడా సహాయపడకపోవడమే పాపము. అవసరములో ఉన్న వ్యక్తికి సహాయపడకపోవడము పాపమని మీరు గుర్తించుచున్నారా? అది చేయవలసినది చేయకపోవడమనే పాపము.

 ఎదోము చేయవలసినది చేయలేదు- దానిని ప్రభువు తీవ్రముగా తీసుకొనెను. ఇశ్రాయేలీయుల శ్రమను చూచి సంతోషించుట ఎదోము చేసిన రెండవపాపము (ఓబద్యా 1:12). నీకు ఇష్టములేని వారికి శ్రమ కలిగినప్పుడు, నీవు సంతోషించుచున్నావా? అది పాపము. ఇతరుల శ్రమలను బట్టి మనము సంతోషింపకూడదు. కాని అది మాత్రమే కాదు నిస్సహాయులైన ఇశ్రాయేలీయులను సంహరించుటకు ఎదోమీయులు అడ్డత్రోవలలో నిలిచిరి (ఓబద్యా 1:14). వారు ఇశ్రాయేలీయుల శత్రువులకు సహకరించిరి. చివరకు ఇశ్రాయేలీయులు స్వతంత్రులగుదురని ప్రభువు చెప్పెను. దాదాపు ప్రతి ప్రవక్త మళ్ళీ స్థాపించబడటము గూర్చి చెప్పిరి.

ఒకరోజు ''తప్పించుకొనిన వారు యెరూషలేములో నివసింతురు'' (ఓబద్యా 1:17). అది ప్రతిష్టిత స్థలమగును. యాకోబు సంతతివారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకొందురు. ఆ సమయమున యాకోబు సంతతివారు అగ్నియు, ఏశావు సంతతివారు కొయ్యకాలగుదురు మరియు ఏశావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండమీద రక్షకులు పుట్టుదురు. అప్పుడు రాజ్యము యెహోవాది యగును (ఓబద్యా 1:21). దిగజారిన దేవుని ప్రజలకు ''ఇదిగో మీ రాజు'' అని ప్రకటించి మరియు వారిని వెనుకకు పిలచుటకు రక్షకులుగా ఉండుటకు దేవుడు మనలను పిలచెను.

ఎదోము పతనమగుటకు కారణమేమిటి? ''నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి'' (ఓబద్యా 1:3). గర్వము, సాతాను స్వభావమైయున్నందున మనము గర్వించినప్పుడు ఆత్మీయ మోసమునకు ద్వారము తెరచినట్లగును. నీకున్న అందమును బట్టి, తెలివితేటలను బట్టి, ఆత్మీయతనుబట్టి, బైబిలు జ్ఞానమును బట్టి, మరిదేని గూర్చి యైనను నీవు గర్వించిన వెంటనే సాతాను నీ మీదకువచ్చి ఇప్పుడు ''నీవు మరియు నేను సహవాసము కలిగియున్నామని చెప్పును''. మరొకవైపున యేసు, భూమి మీద మనుష్యులందరిలో దీనుడైయున్నాడు మరియు నిన్ను నీవు తగ్గించుకొనిన వెంటనే ఆయనతో సహవాసము కలిగియుందువు.

వ్యభిచారము బహిరంగపాపము గనుక వ్యభిచారము కంటే గర్వమే అపాయకరమైనది మరియు బహిరంగ పాపములు రహస్య పాపముల కంటె అపాయకరమైనవి కావు. వారి గర్వములో సంతోషించువారు మోసపోయెదరని ఓబద్యా వారిని హెచ్చరించుచున్నాడు. శరీరెచ్ఛల బంధకాలలో మన చుట్టూ ఉన్నవారికి, ప్రభువైన యేసు వారిని పూర్తిగా విడిపించగలడని ప్రకటించుటకు ఈ క్లుప్తమైన హెచ్చరికనుండి మనము నేర్చుకొనెదము గాక.                           - జాక్‌ పూనెన్‌


ప్రార్ధన, నెహెమ్యా చేసిన ప్రార్ధన, గిద్యోను చేసిన ప్రార్ధన


నెహెమ్యా చేసిన ప్రార్ధన

చెరపట్టబడినవారిలో శేషించినవారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు; మరియు యెరూ షలేముయొక్క ప్రాకారము పడద్రోయబడినది; దాని గుమ్మములును అగ్నిచేత కాల్చ బడినవని నాతో చెప్పిరి.

ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి యేడ్చి, కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి, ఆకాశమందలి దేవుని యెదుట విజ్ఞాపన చేసితిని.
నెహెమ్యా 1:3,4

👉 నెహెమ్యా షూషను కోటలో రాజుకు గిన్నె అందించే వాడు. అతడు చేస్తున్న ఉద్యోగమును బట్టియే చెప్పవచ్చు. అతడెంత నమ్మకస్థుడో?

అర్తహషస్త రాజు పాలనలో నెహెమ్యా రాజుకు ద్రాక్షారసము అందించు చుండగా నెహెమ్యా ముఖము బహు దుఃఖముతో నున్నట్లు రాజు గమనించి, నెహెమ్యా ఈ దినము నీకేమయ్యింది? ఎందుకు అట్లా వున్నావు అంటూ క్షేమ సమాచారం అడిగినప్పుడు,

నా పితరుల సమాధులుండు పట్టణము పాడయిపోయింది. దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడ్డాయి అంటూ తన దుఃఖానికి గల కారణాన్ని తెలియజేశాడు.

అయితే, నీ కోసం నేనేమి చెయ్యాలి అని రాజు అడిగినప్పుడు, నేను యూదా దేశము వెళ్లి యెరూషలేము ప్రాకారము కట్టించుటకు అనుమతిని, వాటికి కావలసిన దూలములు మ్రానుల కొరకు రాజును వేడుకొనగా తాను అడిగిన సమస్తమును రాజు అతని కోసం సిద్ధ పరచెను. అంతేకాదు, అతనితో పాటు సేనాధిపతులను, గుర్రపు రౌతులను కూడా పంపించాడు.

👉 అవును!
అసలు దేవుని గురించిన భారమంటూ నీకుంటే?

👉 ఆయన పనిని ఆయనే కొనసాగిస్తాడు.
నెహెమ్యా రాజుతో మనవి చేయకముందే, నెహెమ్యా మనసును రాజు గ్రహించడానికి దేవుడు కృప చూపాడు.

🔺 మన ఆత్మీయ ప్రాకారాలు కూలిపోతున్నాయి, అగ్నితో కాల్చ బడుతున్నాయి. సాతానుడు నేరుగా సంఘాలలో, కుటుంబాలలో ప్రవేశించి విచ్చిన్నం చేస్తున్నాడు. అయితే, మనకు వాటిని గూర్చిన భారం కరువయ్యింది.

🔺 ఆత్మీయ ప్రాకారాలు తిరిగి కట్టబడాలి. దాని కోసం నీవూ నేనూ ఒక ఎజ్రా వలే, నెహెమ్యా వలే అట్లాంటి భారాన్ని కలిగి యుండాలి.

ప్రార్ధిద్దాం! ప్రార్ధనా ఫలాలు అనుభవిద్దాం!

 గిద్యోను చేసిన ప్రార్ధన

ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా యేడేండ్లు వారిని మిద్యానీయుల కప్పగించెను.ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు చేరినప్పుడు వారు యెహోవాకు ప్రార్ధన చేశారు. అట్లాంటి సందర్భములో దేవుడు వారిని విడిపించడానికి గిద్యోనును ఏర్పాటు చేసుకున్నాడు.

🔹 గిద్యోను మనష్షే గోత్రమునకు చెందిన వాడు.
🔹 యోవాషు కుమారుడు

యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమముగల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై యున్నాడని అతనితో అనగా

👉 గిద్యోను చిత్తము నా యేలినవాడా, యెహోవా మాకు తోడైయుండినయెడల ఇదంతయు మాకేల సంభవిం చెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మును రప్పించెనని చెప్పుచు, మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుతకార్యములన్నియు ఏ మాయెను? యెహోవా మమ్మును విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మును అప్పగించెనని అతనితో చెప్పెను.
న్యాయాధి 6:12,13

యెహోవా దూత గిద్యోనును సంభోధించిన విధానము మనకు గొప్ప ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

పరాక్రమము కలిగిన బలాఢ్యుడా! వాస్తవానికి గిద్యోను మిద్యానీయులకు బయపడి పిరికివానిలా గానుగ చాటున గోధుమలు దుళ్ల గొట్టుకొంటున్నాడు.

అవును! పిరికివానికి సహితం దేవుడు తోడైవుంటే అతడు బలాఢ్యుడు గానే మారతాడు.

మనము ప్రశ్నిస్తున్నట్లుగానే గిద్యోను కూడా దేవునిని ప్రశ్నిస్తున్నాడు, ప్రార్ధిస్తున్నాడు. దేవుడు మాకు తోడైవుంటే? ఈ శ్రమలెందుకు? ఈ శోధనలెందుకు? ఆ అపజయాలెందుకు?

గిద్యోను ప్రార్థనకు సమాధానముగా
దేవుడు గిద్యోనుకు ఇచ్చిన వాగ్ధానము
నేను నీకు తోడైయుందును గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతముచేయుదువని సెలవిచ్చెను.
న్యాయాధి 6:16

అట్లా మిడతల దండంత విస్తారమైన మిద్యానీయుల సైన్యాన్ని గిద్యోను కేవలం 300 మంది సైనికులను తీసుకెళ్లి వారిమీద విజయం సాధించాడు.

👉 నీ సమస్య ఎంతయినా కావొచ్చు, దేవుడు నీకు సహాయకుడైతే ఆ సమస్య, సమస్యే కాదు. కానీ, ఆయన సహాయం మనకెట్లా లభిస్తుంది? ప్రార్ధించడం ద్వారానే.

ప్రార్ధిద్దాం! ప్రార్ధనా ఫలాలు అనుభవిద్దాం!

 జెకర్యా చేసిన ప్రార్ధన

అప్పుడా దూత అతనితో జెకర్యా భయ పడకుము; నీ ప్రార్థన వినబడినది, నీ భార్యయైన ఎలీసబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు.
లూకా 1:13

🔹 జెకర్యా యాజకుడు
🔹 అతని భార్య ఎలీసబెతు
🔹 వీరిద్దరు ప్రభువుయొక్క సకల మైన ఆజ్ఞలచొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు.
🔹 వీరికి సంతానము లేక బహుకాలము గడచిన వృద్ధులు.

అయితే, జెకార్యా సంతానము కొరకు దేవుని సన్నిధిలో ప్రార్ధిస్తూనే వున్నాడు. వివాహమయిన సమయం నుండి వృద్ధాప్యము వరకు ప్రార్ధిస్తూనే వున్నాడు. ఎన్ని సంవత్సరాలు అట్లా ప్రార్ధించాడో కూడా తెలియదు. మొత్తానికి అతని ప్రార్ధన పరీక్షకు నిలబడగలిగి దేవుని దగ్గర నుండి స్పష్ట మైన సమాధానాన్ని తీసుకు రాగలిగింది.

దేవుని దూతే ప్రత్యక్షంగా స్పష్టమైన వాగ్ధానాన్ని తీసుకొచ్చాడు. అది ఎంత స్పష్టమైనది అంటే? పుట్టబోయే బిడ్డకు పెట్టవలసిన పేరును కూడా తెలియజేసాడు. అతని పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో? ముందుగానే స్పష్టముగా తెలియజేసాడు.

జెకర్యా ఆత్మీయంగా బలవంతుడైనప్పటికీ అతని శారీరిక స్థితి (వృద్ధాప్యం) దేవుని వాగ్ధానమును నమ్మకుండా అడ్డుపడింది. ఫలితంగా ఆ బిడ్డ పుట్టేవరకు మూగవాడయ్యాడు.

ఏది ఏమయినా, అతని ప్రార్ధనా ఫలితంగా గొప్ప ఆశీర్వాదకరమైన కుమారుడు వారి గర్భాన జన్మించాడు.
అతడెంత గొప్పవాడో యేసు ప్రభువువారే సాక్ష్య మిచ్చారు.

స్త్రీలు కనినవారిలో బాప్తిస్మమిచ్చు యోహానుకంటె గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పు చున్నాను.
మత్తయి 11:11

🔺 అవును!
అనేక సందర్భాలలో మన చుట్టూనున్న పరిస్థితులు చూచి, మన ప్రార్థనకు సమాధానం వస్తుంది అనే నమ్మకాన్ని కోల్పోతాము.

👉 అయితే, మనము సమస్యను కాదు చూడాల్సింది, ఆ సమస్యను పరిష్కరించే దేవునివైపు చూడాలి.

నీవు చేసే ప్రార్ధన వ్యర్థంకాదు. తప్పక ప్రతిఫలాన్ని తీసుకువస్తుంది.

ఒకవేళ దేవుడు ఆలస్యం చేస్తాడేమో గాని, అలక్ష్యం మాత్రం చెయ్యడు. ఆ ఆలస్యంలో కూడా శ్రేష్టమైన మేలును దాచివుంచుతాడు.

ప్రార్ధిద్దాం! ప్రార్ధనా ఫలాలు అనుభవిద్దాం!

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!

హల్లెలూయ...

మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.

ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!


విశ్వాసాన్ని పెంపొందించే అనుదిన ధ్యానములు -చార్లెస్ ఇ. కౌమన్



విశ్వాసాన్ని పెంపొందించే అనుదిన ధ్యానములు     


అప్పుడు అది (అపవిత్రాత్మ) కేకవేసి, వానినెంతో విలవిలలాడించి వదలిపోయెను.
(మార్కు 9:26).

దురాత్మ చివరిదాకా పోరాడకుండా ఎప్పుడూ తన స్థానాన్ని వదిలి వెళ్ళదు. మనం కూడా సరదాగా కాలక్షేపం చెయ్యడం మూలాన ఏలాటి ఆత్మీయమైన మేలును పొందలేము.

కాని యుద్ధరంగంలో నిలిచి పోరాడితేనే మనకు రావలసినదాన్ని దక్కించుకోగలం.

 ఆత్మీయంగా కూడా ఇదే వర్తిస్తుంది. ఆత్మీయ స్వాతంత్ర్యాన్ని ఆశించిన ప్రతి విషయంలోనూ రక్తాన్ని కార్చవలసి ఉంది. నెమ్మదిగా వాదిస్తే సాతాను పారిపోడు. దారికి అడ్డంగా పరుచుకుని నిలబడే ఉంటాడు. మనం కన్నీళ్ళు, రక్తం కార్చి మన దారిని సుగమం చేసుకోవాలి.

👉 ఇది మనం గుర్తుంచుకోలేకపోతే మనకున్న ఇతర భారాలకి ఈ అజ్ఞాన భారాన్ని చేర్చుకున్న వాళ్ళమవుతాము.

మనం తిరిగి పుట్టింది శిశు సంరక్షణా కేంద్రాల్లోన్ని మెత్తని పట్టు పరుపులో పడుకోవడానికి కాదు. ఆరుబయట నిలబడి తుపాను తాకిడిని తట్టుకోవడానికే, దాని బీభత్సంలోనుంచి మన శక్తిని జుర్రుకోవడానికే మనం క్రీస్తులో మళ్ళీ జన్మించాం ఘోరశ్రమలద్వారా దేవుని రాజ్యంలో ప్రవేశించాలి.

చెరసాల, ఖడ్గం, అగ్నిగుండం అన్నిటికీ ఎదురు నిలిచిన మన తండ్రుల విశ్వాసం ఈ మాటలు వింటే మనకెంత గర్వం మన తండ్రుల విశ్వాసం, పరిశుద్ధ విశ్వాసం దానికి వారసులమవుదాం

చీకటి కొట్టుల్లో గొలుసులతో కట్టారు వాళ్లను గానీ వాళ్ళ మనసులు, ఆత్మలు స్వతంత్రాలే వారి సంతానం ఆదే దారిన వెళ్ళగలిగితే ఎంత మేలు! అది వాళ్ళకెంత క్షేమం!

దైవాశ్శీసులు!!!

 ▪ సంకలనం-  చార్లెస్ ఇ. కౌమన్
 ▪ అనువాదం - డా. జోబ్ సుదర్శన్

నీవు అత్యవసరము కాదని గుర్తించుట - జాక్‌ పూనెన్‌


నీవు అత్యవసరము కాదని గుర్తించుట

క్రీస్తు సంఘములో ఎవరు అత్యవసరము కాదు. మనము లేకున్నప్పటికీ దేవుని పని సులభముగా జరుగును. నిజానికి, తాము అత్యవసరమని అనుకొనువారు లేనప్పుడు దేవుని పని చాలా మంచిగా జరుగును. ఈ సంగతిని మనమెల్లప్పుడు గుర్తించవలెను. తాను ''అత్యవసరము'' అని అనుకొనువాడు దీనుడగుటకు ఒక ఆజ్ఞను ఒకసారి చదివితిని. అతడు ఒక బకీటును నీటితో నింపి తన చేతులను మణికట్టు వరకు ముంచి మరియు బయటకు తీయవలెను తరువాత ఆ నీటిలో ఎంత రంధ్రము ఉన్నదో, అంత అతడు లేనప్పుడు కొదువ ఉండును.

మనకున్న వరములు సంఘమునకు ఉపయోగకరమే కాని ఎవరు (ఏ ఒక్కరు) అత్యవసరము కాదు. ఎప్పుడైననూ దేవుడు మనలను వెనుకకు పిలిచినయెడల వెనుదిరుగుటకు ఇష్టపడవలెను. కాని తన కొరకే తాను బ్రతికే క్రైస్తవ పనివాడు దానిని ఎన్నటికీ అంగీకరించడు. తనకున్న పదవి సాధ్యమైనంత ఎక్కువ కాలము ఉండవలెనని దానిని పట్టుకొనును. అటువంటి అనేక ''క్రైస్తవ నాయకులు'' దేవుని పనికి ఆటంకముగా వారి సింహాసనముల మీద ఉంటున్నారు (కంపుకొట్టుచున్నారు). వారి స్థానమును వేరేవారు తీసుకొనునట్లు కనికరముతో వెనుకకు వెళ్ళుట వారికి తెలియదు.

దానిని కొనసాగించు మరియొకడు లేనట్లయితే ఆ జయము కూడా ఓటమేనను సామెత ఉన్నది. యేసు దీనిని ఎరుగును గనుక ఆయన పనిని కొనసాగించుటకు ప్రజలకు తర్ఫీదు నిచ్చెను. తన పరిచర్య మీద నాయకత్వము వహించుటకు ఇతరులకు 3 1/2 సంవత్సరములలో తర్ఫీదు ఇచ్చెను. మనము వెంబడించుటకు ఇది ఎంత గొప్ప మాదిరి?

తన పరిచర్యను కొనసాగించుటకు ఇతరులకు తర్ఫీదు ఇవ్వవలసిన అవసరమును పౌలు గుర్తించెను. 2తిమోతి 2:2లో తిమోతితో ఇట్లనెను: ''నీవు అనేక సాక్షుల యెదుట నా వలన వినిన సంగతులను బోధించుటకు సామర్థ్యముగల నమ్మకమైన మనుష్యులకు (నాలుగవ తరము) అప్పగింపవలెను''. ఇక్కడ పౌలు చెప్పుచున్నదేమిటి అనగా ''ఈ సంపదను ఇతరులకు అప్పగించవలెను. నీ కంటే చిన్న వారి యొక్క అభివృద్ధికి ఎప్పుడైననూ నీవు ఆటంకముగా ఉండవద్దు''.

''దానిని కొనసాగించుటకు మరియొకడు లేనట్లయితే ఆ జయము కూడా ఓటమేనను'' నియమమును వ్యాపారస్తులు కూడా గుర్తించియున్నారు. కాని చాలా మంది క్రైస్తవనాయకులు దీనిని గుర్తించుట లేదు. నిజముగా ''వెలుగు సంబంధులకంటే ఈ లోకసంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులైయున్నారు'' (లూకా 16:8).

ఒక మనుష్యుడు తన కంటే చిన్నవాడు, పనులను తనకంటే బాగుగా చేసినప్పుడు కేవలము అతనిలో సామర్థ్యమును బట్టి అసూయపడును. దేవుడు కయీనును విడిచి హేబెలును అంగీకరించినప్పుడు అతడు అసూయపడెను. హేబెలు తనకంటే పెద్ద వాడైనట్లయితే సహించగలిగి యుండెడివాడేమో. తన తమ్ముడు తన కంటే యోగ్యుడను సత్యము, తన తమ్ముడైన హేబెలును చంపునట్లుగా చేసెను.

యోసేపు మరియు అతని సహోదరుల విషయములో కూడా దీనిని చూచెదము. యోసేపు దేవుని ప్రత్యక్షతలు పొందెను మరియు దానిని బట్టి తన పదిమంది అన్నలు తన మీద అసూయపడి అనగా అతనిని చంపునంతగా అసూయపడిరి.

''సౌలు వేల మందిని చంపెను కాని దావీదు పదివేల మందిని చంపెను'' అని స్త్రీలు పాడినప్పుడు సౌలురాజు తన కంటె చిన్నవాడైన దావీదు మీద అసూయపడెను. ఆ రోజునుండి దావీదును చంపుటకు నిర్ణయించుకొనెను. అయ్యో! మానవ చరిత్ర అంతయు, క్రైస్తవ సంఘ చరిత్రలో కూడా ఈవిధముగా మరల మరల జరిగినట్లు చూచుచున్నాము. అదే విధముగా పెద్దలైన పరిసయ్యులు యవ్వనస్థుడైన నజరేయుడగు యేసును చూచి అసూయపడి మరియు ఏ విధముచేతనైనను ఆయనను చంపవలెనని తీర్మానించుకొనిరి.

మరొక వైపున క్రొత్త నిబంధనలో బర్నబా వంటి వ్యక్తిని చూచుట చాలా ఆహ్లాదముగా ఉన్నది. పౌలును ఎవరు అంగీకరించనప్పుడు, బర్నబా ఒక పెద్ద పరిచారకుడైయుండి క్రొత్తగా మారుమనస్సు పొందిన పౌలును తీసుకొని వెళ్లెను. అతడు పౌలును అంతియొకియ సంఘమునకు తీసుకొని వచ్చి మరియు అతనిని ప్రోత్సహించెను. అపొస్త్తలుల కార్యములు 13వ అధ్యాయములో, బర్నబా మరియు పౌలు కలసి సువార్త పరిచర్య నిమిత్తము వెళ్ళెనని చదివెదము. కాని దేవుడు తనకంటే చిన్నవాడైన పౌలును పెద్ద పరిచర్యకు పిలిచియున్నాడని చూచినప్పుడు తనకు తానుగా వెనుకకు తగ్గి మరియు కనికరముతో కనుమరుగయ్యెను (వెనుకకు వెళ్ళెను). అపొస్త్తలుల కార్యములలో ''బర్నబా మరియు పౌలు'' అను మాట ఇప్పుడు ''పౌలు మరియు బర్నబా''గా మారుట గమనించగలము. ఈవిధముగా వెనుకకు వెళ్ళి మరియు ఇతరులు గౌరవము పొందునట్లు చేయు బర్నబాలు చాలా కొద్దిమంది ఉండుట వలన ఈనాటి క్రైస్తవ సంఘము నష్టపోవుచున్నది.

 ప్రాముఖ్యత లేని విషయములలో మనము వెనుకకు తగ్గుటకు ఇష్టపడెదము. ఉదాహరణకు ఒక ద్వారము గుండా వెళ్ళునప్పుడు, మనము ప్రక్కకు వెళ్ళి వేరే వాళ్ళను పోనిచ్చెదము. కాని క్రైస్తవసంఘములోని పదవి మరియు నాయకత్వము విషయములో, వెనుకకు వెళ్ళుటకు మనము సిద్ధముగా లేము. మన స్వార్థము ఎంతో మోసకరమైనది. విలువలేని విషయములలో మనము నకిలీ దీనత్వమును కలిగియుండవచ్చును. కాని విలువగల విషయములోనే మనమేమైయున్నామనునది చూడగలము.                                                                                - జాక్‌ పూనెన్‌

అలసిన వానికి ఊరడించు మాటలు

🌷సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన🌷
"అలసిన వానికి ఊరడించు మాటలు"

"నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక  నీ పూర్ణ హృదయముతో  యెహోవా యందు నమ్మకముంచుము"
( సామెతలు 3:5)

మనము దేవుని నడిపింపును   నిర్లక్ష్యము చేయుట ద్వారా, ఆయన ఆజ్ఞలకు అవిధేయత చూపించుట  ద్వారా ఆత్మీయముగా గ్రుడ్డివారమగుదుము. ఈ దినములలో అనేకమంది విశ్వాసులు తమ అవిధేయతను బట్టి, పాక్షిక విధేయతను బట్టి దేవుని విషయమైన తమ దర్శనమును కోల్పోవుచున్నారు..  ఉదాహరణకు, రాజైన సౌలు దేవునికి, పాక్షిక విధేయత చూపించుట  చేతనే అతడు దేవునిచేత తృణీకరించబడెను. దావీదు కూడా జనసంఖ్య ఎంతైనది లెక్కించవలెననెడి శోధనలోబడి, తన బలమును బట్టి గర్వించెను ( 2 సమూ. 24:2,3) తాను  పొందిన విజయములన్నియు  దేవుని వలననే కలిగినవనియు, తన సైన్య  బలమును బట్టి ఏ మాత్రమును కాదని, దావీదుకు బాగుగా తెలియును.  తన బలమును బట్టి గాని, తెలివితేటలను  బట్టి గాని తాను గొల్యాతును ఓడించలేదు. అతడు సైన్యములకధిపతియగు యెహోవా నామమున యుద్ధము చేసి గొల్యాతును ఓడించెను ( 1 సమూ. 17: 45,50) అయినప్పటికిని  తన వృద్ధాప్యములో తన సైన్య బలమును లెక్కించవలెనను శోధనకు  గురియయ్యెను . సైన్యాధిపతియగు యోవాబు దావీదును ఈ పొరబాటునుండి తప్పించుటకు ప్రయత్నించెను గాని దావీదు తీర్మానమే నెగ్గెను. దావీదు నేత్రములు అత్యధిక సంఖ్యలోనున్న తన ప్రజలపై నున్నవి గాని, దేవుని మీద లేవు. అందుచేతనే దేవుడు అతనికి కళ్లములో  సాగిలపడి ప్రార్ధించు అనుభవములోనికి తెచ్చెను. ఆ విధముగా దావీదు ప్రభువునందు నమ్మకముంచుటకు నేర్చుకొనెను.

 ఈ విధమైన శోధన మనకందరికిని వచ్చును. శోధనలను జయించుటకు లేక దేవుని సేవచేయుటకు, మన స్వశక్తి పై, సామర్ధ్యముపై, జ్ఞానముపై  ఆధారపడుటకు మనము శోధించబడుదుము. చాలామంది వారి కెమెరాలు, భవనములు, ఆస్తిపాస్తుల మీద ఆధార పడుదురు. వీటన్నిటిని కలిగి యుండుట ద్వారా మంచి ఫలవంతముగా కాగలమని తలంచుదురు. ప్రతి పరిస్థితి లోను మంచి ఫలవంతమైన పరిచర్య కొరకు మనలను మనము ఆయనకు అప్పగించుకొనవలెను. బోధకులు సహితము గతకాలములో తాము పొందిన ఆశీర్వాదములపై, తాముసాధించిన విషయములపై ఆధారపడినయెడల గొప్ప ఫలమును పొందు అవకాశమును కోల్పోవుదురు. ప్రతి దినము మన ప్రభువైన దేవుని, మన నాలుకను , పెదవులను , గొంతును తాకి, తన ప్రజల కొరకైన ఆయన స్వంత వర్తమానము నివ్వవలసినదిగా అడుగవలెను. అప్పుడు మాత్రమే మన పరిచర్య ఆశీర్వదించబడి, జీవ యుక్తముగాను మరియు ఫలవంతముగాను ఉండును.

ప్రతిదినము మనము మోకాళ్లపైకి వెళ్లి ప్రభువును. మనలను   అభిషేకించుమని, నూతన వర్తమానము నిమ్మని  అడుగుట ఎంతో అవసరమై యున్నది. మనము వర్తమానముల కొరకు సిద్ధపడుటకై మన తెలివితేటలపై గాని, సామర్ధ్యము , బలముపై గాని ఆధారపడకూడదు. ఎందుచేతననగా అది మనలను ఉపయోగకరమైన, విజయవంతమైన జీవితమునకు నడిపించదు.  దీనినంతటిని బోధించుటకై, దేవుడు యెహోషువతో ప్రజలకు సున్నతి  చేయించుమని చెప్పెను. తమ స్వంత యుద్ద ఆయుధములపైగాని, గొప్ప సైన్య సమూహముపై గాని వారి స్వంత జ్ఞానము, ప్రణాళికపై గాని ఆధారపడకుండా, ప్రభువు యొక్క బలముపై  ఆధారపడుటవలన మాత్రమే వారు ఆ ఏడు గొప్ప జాతుల వారిని జయించి, కనాను దేశమును స్వాధీన పరచుకొనగలరని వారికి జ్ఞాపకము చేసెను.
Please share

20 October 2018

ఆదాము స్థానములో నువ్వుంటే ...❓


👉 ఆదాము స్థానములో నువ్వుంటే...❓

🔴 ఒక రోజు ఒక యవ్వనస్తుడు పాష్టర్ గారితో ఆదాము గురించి మాట్లాడుతూ...
పాష్టర్ గారు.... ఆదాముకి అసలు బుద్ధి లేదండి"అని అంటే పాస్టర్ గారు అదేమిటయ్యా...!అంత పెద్ద మాట అనేశావు అని ఆచ్చర్యయంగా చూడగా ఆ యవ్వనస్తుడు -లేకపోతే ఏమిటండీ..!

👉 దవుడు అన్ని పండ్లు  ఇచ్చి ఒకే ఒక్క పండు తినవద్దుని అన్నాడు మిగిలిన పండ్లను అన్నిటినీ వదిలేసి ఆ ఒక్క పండే తిన్నాడు వద్దంటే ఎందుకు తినాలి చెప్పండి...

అదే ఆనాడు ఆదాము స్థానంలో నేను ఉన్నట్లయితే అసలు ఆ పండు జోలికే వెళ్ళేవాడిని కాదు అని అంటుంటే అప్పుడు ఆ పాష్టర్ గారు బాగా ఆలోచించి ఆ కుర్రవాడిని తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు..

🔹పష్టర్ గారు రకరకాల వంటలు సిద్ధం చేయించి డైనింగ్ టేబుల్ పై పెట్టించారు.
ఆ యవ్వనస్తుడికి అన్ని డిషెస్ చూపిస్తూ-బాబు ఈ టేబుల్ మీద ఉన్న ఐటమ్స్ అన్నీ నీ కోసమే, అయితే మధ్యలో ఉన్న గిన్నె మాత్రం తెరచే ప్రయత్నం చేయొద్దు... దాని సంగతి తర్వాత చూద్దాం అన్నారు ఇంతలో పోన్ కాల్ వస్తే మాట్లాడడానికి పాష్టర్ గారు హాల్లోకి వెళ్లారంట.

👉 ఆ యవ్వస్తుడికి తన కళ్ల ముందు ఎన్నో రకాల వంటలు ఉన్నపటికీ వాటితో తృప్తి పడలేక పోతున్నాడు కారణం...అసలు పాష్టర్ గారు ఆ మధ్య గిన్నె మూత ఎందుకు తెరవద్ద అన్నారు...
ఎలాగూ పాష్టర్ గారు ఫోన్ మాట్లాడడానికి వెళ్లారు ఈ లోపు చూద్దాం అనీ దాని మూత తెరిచే ప్రయత్నం చేయగా ....

👉 అందులో ఉన్న పక్షి కాస్త పైకి ఎగిరిపోయిందిట అయ్యో..!పాష్టర్ గారు వచ్చేలోపు ఎలాగయినా ఆ పక్షిని పట్టుకొని ఆ గిన్నెలో పెట్టి మూత పెట్టాలని...ఆ పక్షిని పట్టుకునే ప్రయత్నంలో డైనింగ్ టేబుల్ పై పడ్డాడు ఆ శబ్దానికి పాష్టర్ గారు గబ గబా వచ్చి ఆయ్యయ్యో...!ఏమైందయ్యా అని అంటూ వుంటే...ఆ యవ్వనస్తుడు ఇలా ఆన్నాడు -

🔴 *ఆదాము స్థానంలో నేనున్నా ...! నేను కూడా ఆ పండు తినేవాణ్ణి అని ఇప్పుడు అర్థమైంది అన్నాడట*

👉 దయచేసి గమనించండి.....
పాపములో పడిపోయిన వారిని చూసి...లేక బలహినులను చూసి -ఆ స్థానంలో నేనుంటే ఆ విదంగా పాపిష్టి పనులు చేసేవాడిని,చేసేదాన్ని, కాదు అని గొప్పలు చెప్పుకోకుండా - దారితప్పిన- పాపములో పడినవారిపై కనికరపడి ఆదరించి మరలా వారు విశ్వాసంలో కొనసాగులాగున బలపరిచే బాధ్యత మనమీదనే వుంది అన్న సత్యం మరచిపోవద్దు

👉 📖 సహోదరులారా ! ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కిన యెడల ఆత్మసంబంధమైన మనము శోధింప బడుదుమేమో అని తన విషయమై చూచుకొనుచు....సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచిదారికి తీసుకుని రావెలెను (గలతీ 6:1)

👉 తప్పు చేసి పాపములో పడిన వారిని చూసి సులభంగా తీర్పుతీర్చడం ప్రతీ మూర్కుడు చేయగలడు కానీ అదే స్థితిలో నేనున్నా...అదే తప్పు చేసేవాడినేమో,చేసేదాన్నేమో, అని స్వపరిక్షచేసుకుని బహుజాగ్రత్తగా జీవిస్తూ, ఇతరులకు మాదిరికరంగా జీవించమని మనవిచేస్తున్నాను.... *"తాను నిలుచున్నానని తలంచువాడు పడిపోకుండా జాగ్రత్తగా చుచుకొనవలెను* (📖 1 కొరింధీ 10:12)
విశ్వాసమునకు కర్తయు, దానిని కొనసాగించువాడైన యేసునే చూస్తూ ఆయన మీద ఆధారపడి జీవించినట్లైతే ప్రతి పాపముపై జయమును పొందుకుంటాము...

ఆ సర్వేశ్వరుడు శ్రీమంతుడు దేవాధిదేవుడైన యేసు ప్రభువు వారు మిమ్ములను మీ కుటుంబ సభ్యులను మీకు కలిగిన అంతటిని ఆశీర్వదించి దీవించును గాక

*ఆమేన్ ఆమేన్ ఆమేన్*



19 October 2018

ఆత్మతో నింపబడాలి. ప్రార్ధించడంలో ఆనందించాలి E Message


ఆత్మతో నింపబడాలి. ప్రార్ధించడంలో ఆనందించాలి.*

♻️ *ఎక్కువ సమయం ప్రార్ధించడానికి ఆసక్తి కలిగిన కొందరిని మాదిరిగా కలిగివుందాము.*

🙇‍♂ *బాల్యములో సమూయేలు వలె ప్రార్ధించు*
(1సమూ 3:1-10)

🙇‍♂ *యవ్వనంలో తిమోతి వలె ప్రార్ధించు*
(2 తిమో 2:22)

🙇‍♂ *ఉదయకాలమున దావీదు వలె ప్రార్ధించు*
( కీర్తన 63:1)

🙇‍♂ *మధ్యాహ్నమున దానియేలు వలె ప్రార్ధించు*
(దానియేలు 6:10)

🙇‍♂  *శరీరక శ్రమలలో రాత్రివేళ పౌలు, సీలలు వలె ప్రార్ధించు*
(అపో 16:25)

🙇‍♂ *అపాయములో పేతురు వలె ప్రార్ధించు*
(మత్తయి 14:30)

🙇‍♂ *దుఃఖములో హన్నా వలె ప్రార్ధించు*
(1సమూ 1:10)

🙇‍♂ *శ్రమలలో యోబు వలె ప్రార్ధించు*
(యోబు 42:10)

🙇‍♂ *మరణ సమయములో స్థెఫను వలె ప్రార్ధించు*
(అపో 7:60)

🙇‍♂ *ఏ పని ప్రారంభించిన ఎలియేజరు వలె ప్రార్ధించు*
(ఆది 24:12)

🙇‍♂ *పని ముగింపులో సలోమోను వలె ప్రార్ధించు*
(1రాజులు 8:54)

🙇‍♂ *అన్ని సమయములో యేసు వలె ప్రార్ధించు*
(యెహాను 6:38)

🔺 *అనవసరమైన పనులను ప్రక్కనబెట్టి ఎక్కువ సమయం ప్రార్ధించడానికి ఆసక్తి కలిగి యుండాలి.*

లూకా 21: 36:-
*కాబట్టి మీరు జరుగబోవు వీటినెల్లను తప్పించు కొని, మనుష్యకుమారుని యెదుట నిలువబడుటకు శక్తిగలవారగునట్లు ఎల్లప్పుడును ప్రార్థనచేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను.*

*భక్తుడైన జాన్‌ హైడ్‌ ప్రభువు సన్నిధిలో గంటల తరబడి నిద్రాహారాలు మరచి గడిపేవాడు.*

👉పలబుడ్డి ప్రార్ధనలను వీడి పోరాట ప్రార్ధనలకు మనం ఎదగాలి.

👉సతానుకు బెదరక, అదరక, పవిత్ర జీవితం కలిగి, ప్రభువును హత్తుకుని, వానిని ప్రార్ధనాయూధం ద్వారా హతమార్చండి!

👉పరార్ధనలో ఆత్మీయ పోరాటం జయాన్నిస్తుంది.

👉 *మీరు అలా ప్రార్ధించగలరా? ఆలోచించండి'*
 అని వ్రాసాడో భక్తుడు.

👉 *నేటి నుండే మీ ప్రార్ధన జీవితం సరి చేసుకుని, సమర్ధవంతమైన ప్రార్ధన అనుభవంతో ప్రభువు రాక కొరకు కనిపెట్టండి.పరిశుద్ధాత్మ దేవుడు మీకు ప్రార్ధనాత్మను దయ చేయును గాక!*

ఆ రీతిగా మన హృదయాలను సిద్ధ పరచుకొని ప్రార్ధిద్దాం!

*హల్లెలూయ...*

*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*

*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*

👉 *మీకు పంపుతున్నా అను దిన ఆత్మీయ సందేశాలు నేను మరియు కొంతమంది దైవజనులు కొన్ని గంటలు శ్రమించి మీ ముందుకు తెస్తున్నాము.*
గనుక మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మాకు తెలపగలరు.


👉 *మీ మిత్రులకు share చేసి మీ వంతుగా దేవుని పని చేయండి.*

క్రైస్తవ కుటుంబము E Message



క్రైస్తవ కుటుంబము

✳️ *అంశం: భార్య- భర్తలు మధ్య ఉండవలసిన  బంధం* ...✍️

👉 భర్యాభర్తల మధ్య వచ్చే విషయాలు ఏంటి?
తల్లిదండ్రులై ఉండవచ్చును. ఆదికాండము 2 : 24 లో *"కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడచి తన భార్యను హత్తుకొనును. వారు ఏకశరీరమైయుందురు"*
 అని చెప్పుచున్నది.
👉ఇక్కడ నీవు ఒక దానిని విడిచిపెట్టాలి మరియు
👉 మరొక దానిని హత్తుకోవాలి అని ఉంది.

*నీవు విడిచి పెట్టకుండా హత్తుకుంటే, నీవు ఏకమవ్వలేవు.*
👉పపము లోకములోనికి రాకముందు లేఖనములో దేవుడిచ్చిన ఆజ్ఞ ఇది.

*నీ తండ్రిని, నీ తల్లిని విడిచిపెట్టుము.*
👉 వవాహమైన వారిని నేను అడుగుచున్నాను. నీ తండ్రిని, తల్లిని విడిచిపెట్టావా?
🔺అనగా శారీరకముగా కాదు వారు చనిపోవువరకు వారి గురించి జాగ్రత్తవహించుము. మనము అలాగున చేయాలి. మన తల్లిదండ్రులను సన్మానించాలి.
*కాని వారిని నీకు మరియు నీ వివాహజీవితానికి మధ్యకు రానియ్యకుము.*

👉 పరేమతో వారిని విడవాలి. వారు అనేక సం||లు నిన్ను పెంచి మరియు పెద్ద చేశారు. అది మంచిది.
👉కని నీవు పెళ్ళి చేసుకున్నావు కాబట్టి వారిని విడవాలి. చాలామంది భర్తలు వారి తల్లిదండ్రులతో ఉన్న అనురాగాన్ని విడిచిపెట్టరు. కాబట్టి వారి వివాహజీవితములో సమస్యలు ఉంటున్నాయి. అలాగే అనేకమంది భార్యలు కూడా ఉన్నారు. వారి భర్తలతో వారు ఏకమవ్వలేదు.

👉ఇది బాధాకరము. ప్రభువు మొదటగా ఉండకుండా, తల్లిదండ్రులు వారి మధ్యలో ఉంటున్నారు.
👉 కన్నిసార్లు ఉద్యోగము ముఖ్యమైయుండవచ్చు. దేవుడు కాకుండా ధనముగాని లేక పిల్లలుకాని లేక మరేదైనా కాని మధ్యలోనికి రాకూడదు.

 *ఒక మంచి ఉధ్యానవనమును నాటుటకు ఐదు నియమములను, వాటిని మన వివాహ బాంధవ్యములో భార్య మరియు భర్తల మధ్య అన్వయించుకొనవచ్చును.*

💐 *నీ వివాహము ఒక మంచి ఉధ్యానవనమువలె ఉండనిమ్ము* 💐

1⃣ *వ్యాధులను తట్టుకొనే విత్తనములు ఉపయోగించుడి*

వ్యాధులను అదుపుచేయుటకు మంచి పద్ధతి అది రాకుండా చూచుకొనుట.
*మనము మన నాలుకతో విత్తనములు నాటుదుము.*

 🔺మరు ఒకరితో ఒకరు మాటలాడుకొనినప్పుడు మీ మాటల ద్వారా వ్యాధులు వ్యాపించకుండా చూచుకొనుడి.
🔺మరు మాటలాడునప్పుడు వ్యాధులను తట్టుకొనే మాటలనే మాటలాడుడి. కొన్ని వ్యాధులనుండి మొక్కలను కాపాడుటకు తరచు పురుగుల మందులు జల్లుచుండవలెను. మీ ఉధ్యానవనములో కలుపు మొక్కలు లేకుండా ఉండవలెనంటే మీ నాలుక గూర్చి జాగ్రత్త వహించు విషయములో మీరు నిర్దాక్షిణ్యముగా ఉండవలయును.

2⃣ *నేలను ఎరువులతో బలపర్చవలెను.*

👉మకు సంతోషకరమైన వివాహజీవితము ఉండవలెనంటె ఒకరినొకరు ప్రోత్సహించుకొనుడి మరియు మెచ్చుకొనుచుండుడి. నేలలోనికి ఇటువంటి ఎఱువులను వేయుచుండుడి. అప్పుడు మీకు నిజముగా మంచి పంటవచ్చును.

3⃣ *బాగుపడని వ్యాధులుండిన మొక్కలు ఏమైనా ఉండినట్లయితే వాటిని నాశనము చేయుడి*

ఇది అదుపు చేయలేని మరియు వ్యసనముగా మారిన కార్యక్రమములు

*అనగా టి.వీ. కి అతుక్కొని పోవుట వంటి వాటి గూర్చి చెప్పుచున్నది. నాశనము చేయుడి, నేననేది టి.వీ. ని కాదు, కాని దాని ముందు కూర్చుని వ్యర్ధపరచే సమయమును.*

 అటువంటి వాటిని ఈ నియమము అదుపు చేయలేని వ్యాధి గూర్చి చెప్పుచున్నది. నీవు వాటిని అదుపు చేయగల్గినట్లయితే అది మంచిది మరియు ప్రాముఖ్యమైన విషయము. కాని అటువంటి వ్యాపకములను అదుపుచేయుట మంచిది.

4⃣ *వ్యాధి కలిగియున్న ఆకులను నీవు గమనించిన వెంటనే కత్తిరించివేయుము*

దీని అర్ధము నీకు ఎదుటివ్యక్తిని బాధించినట్లు నీవు గ్రహించగానే అది ఒక వ్యాధి కలిగియుండిన ఆకు - దానిని వెంటనే కత్తిరించి వేయుము.

*క్షమాపణ వెంటనే అడుగుము. మరియు వెంటనే క్షమించుము. అప్పుడు ఆ ఆకు కత్తిరించ బడునట్లగును. లేకపోయినట్లయితే ఆ సమస్య తీవ్రమగును*

ఇంకొక విషయము : ఆ వ్యాధి కలిగిన ఆకును పారవేయుము. గతమును జ్ఞాపకముంచుకొనవద్దు.

5⃣  *నీవు సరిగా సంరక్షింపగల వాటికంటె ఎక్కువ నాటవద్దు పూర్తిగా మొక్కలతో నింపివేయవద్దుఎక్కువగా నాటినట్లయితే మంచిగాలి ప్రసరణను ఆటంకపరచును మరియు కావలసిన సూర్యరశ్మి తగులకుండా ఆటంకపరచును.*
👉దని అర్ధము నీవు రోజుకుండిన 24 గంటలలో అనేకమైన పనులు చేయుటకు ప్రయత్నించకూడదు. అట్లు చేసినట్లయితే మీ వివాహ ఉద్యానవనము నిర్లక్ష్యము చేయబడును. మరియు మీ కుటుంబము మీ ప్రాధాన్యతలలో ఆఖరిదగును.

🎯 *ఉధ్యానవనమనబడే ‘మీ కుటుంబము’ మీకు మొదటి ముఖ్యమైన విషయముగా ఉండవలెను.*

 ఎక్కువ మొక్కలు నాటబడి ఉండుట తగినంత సూర్యరశ్మి (దేవుని వెలుగు) తగలకుండా మరియు మంచిగాలి ప్రసరణలేకుండా (మీ ఇరువురి మధ్య మంచి సహవాసము) ఆటంకపరచును.

లోకమంతట ఉన్న ఉధ్యానవనముల కోసం దేవుడే ఏర్పాటు చేసిన చట్టములు ఇవి.
*మీ కుటుంబము మీకు మొదటి ప్రాధాన్యతగా ఉంచుకొనుడి.*

🔺భర్యభర్తల ఆ బంధాన్ని మరణము వరకు నిలబెట్టుకోవాలి.
🔺ఒకరి తప్పులు ఇంకొకరు సరిదిద్దుతూ,
🔺మంచి ఎలా స్వీకరిస్తామో చెడు కూడా అలాగే స్వీకరిస్తూ వివాహబంధాన్ని కొనసాగించాలి.

కాబట్టి ప్రియులారా దేవుని యందు భయ భక్తులు కలిగి మంచి బార్యభర్తలుగా ఉండాలి అని ఆశిస్తున్నాను.
దేవుడు మిమ్ము దీవించును గాక!

*హల్లెలూయ...*

Join Telegram

Join Telegram
Telugu Christian Lyrics