-:A:B:C:D:E:F:G:H:I:J:K:L:M:N:O:P:Q:.R:S:T:U:V:W:X:Y:Z:-

Showing posts with label E Message. Show all posts
Showing posts with label E Message. Show all posts

26 August 2021

బండసందులలో జీవజలములు





*✍️ కీర్తనలు 23:3. నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతిమార్గములలో నన్ను నడిపించుచున్నాడు.*

నా ప్రాణానికి సేద తీరుస్తున్నాడు. తన పేరు ప్రతిష్ఠలకోసం నన్ను న్యాయ సమ్మతమైన మార్గాలలో నడిపిస్తూ ఉన్నాడు.



◼️విశ్వాసులగా మనం ఈ లోకంలో ఉన్నంత కాలం అలసట, విషమ పరీక్షలు తప్పవు.
◼️కొన్ని సార్లు  క్రుంగిపోయి నిరాశ చెందాలనే దుష్‌ప్రేరేపణకు కూడా గురి అవుతాము.
◼️అలాంటి సమయాల్లో  కాపరి  దరిచేరి మన ఆత్మలకు సేదదీర్చి ఊరడిస్తాడు.
◼️ఆయన మనలను నీతిన్యాయాల మార్గంలోనే నడిపిస్తాడు.
💥ఎన్నడూ వక్రమార్గాల్లో గానీ మోసకరమైన విశాల వీధుల్లో గానీ భ్రష్టత్వం, పాపం ఉన్న దారుల్లో గానీ నడిపించడు. ఈ మంచి కాపరి నిన్ను అబద్ధాల్లో ఇరికించే చెడ్డ దారుల్లో గానీ మంచి చట్టాన్ని మీరే విధానంలో న్యాయం తప్పి ప్రవర్తించవలసి వచ్చిన మార్గాల్లో గానీ నడిపించాడని ఎన్నడూ నీవు అనకూడదు.  ఆయన ఎన్నడూ అలా చేయడు. ఆయన నామం, ఆయన తండ్రి మహిమ తన గొర్రెలతో ముడిపడి ఉన్నాయి. *ఆయన వారినెప్పుడూ సత్యం, న్యాయం, యథార్థతతో కూడిన దారుల్లోనే నడిపిస్తాడు.*

 కాపరి యొక్క సంధానం 

నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు
He restoreth my soul

కాపరి ఆత్మలను restore చేస్తున్నాడు. Restoration జరుగుచున్నది. రెస్టోరేషన్ అంటే *తెగిపోయిన బంధాన్ని పునరుద్ధరించటం.* సంధానం చేయటం. *కాపరి తప్పిపోయిన గొఱ్ఱెలను వెదుకుచున్నాడు.* పాత నిబంధన మొత్తం దేవుడు చేసింది అదే. ఇశ్రాయేలీయులు బబులోను చెరలోకి వెళ్లిపోయినప్పుడు, దేవుడు యెహేజ్కేలు ప్రవక్త ద్వారా ఏమన్నాడు❓

యెహేజ్కేలు గ్రంధము 34వ అధ్యాయము
ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా ౼ *ఇదిగో నేను నేనే నా గొఱ్ఱెలను వెదికి వాటిని కనుగొందును*  15. నేనే నా గొఱ్ఱెలను మేపి పరుండబెట్టుదును; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. 16. తప్పిపోయిన దానిని నేను వెదకుదును, తోలివేసిన దానిని మరల తోలుకొని వచ్చెదను, గాయపడినదానికి కట్టు కట్టు దును, దుర్బలముగా ఉన్నదానిని బలపరచుదును. గాయపడిన గొఱ్ఱెలను మనం ఇక్కడ చూస్తున్నాము. మనం పాపం చేసినప్పుడు మనకు గాయాలవుతాయి. పాపం యొక్క పర్యవసానాలు మనం తప్పించుకొలేము. అయితే దేవుని ప్రేమ ఎలా ఉందో మీరు చూడండి. తప్పిపోయిన, గాయపడిన గొర్రెల కోసం ఆయన వెదుకుచున్నాడు. ఆ గొఱ్ఱెలు నశించిన స్థితిలో ఆయనకు కనిపించినాయి (మత్తయి సువార్త 10:6)

 యేసుప్రభువు ఏమన్నాడు❓

నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను.
లూకా సువార్త 19:10.
 మన పాపాల్లో నశించిన గొఱ్ఱెలము మనమే. మనలను వెదకి రక్షించటానికి వచ్చిన కాపరి యేసు క్రీస్తు. కాపరి లేని గొఱ్ఱెలముగా తప్పిపోయిన మనలను చూసి ఆయన కనికరబడ్డాడు.

మార్కు సువార్త 6:34: యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి, వారు కాపరిలేని గొఱ్ఱెలవలె ఉన్నందున వారిమీద కనికరపడి, వారికి అనేక సంగతులను బోధింపసాగెను.

*లూకా సువార్త 15 లో యేసు ప్రభువు ఒక ఉపమానం చెప్పాడు.* ఒక కాపరికి 100 గొర్రెలు వున్నాయి. వాటిలో ఒకటి తప్పిపోయింది. ‘ఒకటిగా, పోతే పోనియ్, ఇంకా 99 గొర్రెలు నాకు వున్నాయి, చాలు’ అని కాపరి అనుకోలేదు. తప్పిపోయిన ఆ ఒక్క గొర్రె కోసం కాపరి వెదుకుకొంటూ వెళ్ళాడు. *అది దొరికినప్పుడు దానిని భుజాల మీద వేసుకొని, ఇంటికి వెళ్ళాడు.* తన స్నేహితులను, చుట్టుపక్కల వారిని ఇంటికి పిలిచి సంతోషించాడు. *తప్పి పోయిన నా గొర్రె దొరికింది అని చెప్పి సంబరపడ్డాడు.*
నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు. He restoreth my soul

మన ఆత్మలను సంధానం చేసి, దేవునితో అనుసంధానం చేసే కాపరి. 23 కీర్తనను ఈ రోజు మనం ధ్యానించాం.

కాపరి యొక్క సంబంధం, సమస్తం, సమృద్ధి, సమాధానం, సంధానం ల గురించి మనం ధ్యానించాము.

*❤️ ఈ గొప్ప కాపరియైన యేసు క్రీస్తు దగ్గరకు వచ్చి, మీరు రక్షణ పొందాలి అన్నదే నేటి మా ప్రేమ సందేశం.❤️*

📖 1యోహాను 2:1-2 నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండు టకై యీ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసినయెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రియొద్ద మనకున్నాడు.  ఆయనే మన పాపములకు శాంతికరమై యున్నాడు; మన పాపములకు మాత్రమేకాదు. సర్వలోకమునకును శాంతికరమై యున్నాడు.

📖 యోహాను 14:6 యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.

*హల్లెలూయ...*

*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*

*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*
➖➖➖➖➖➖➖➖➖➖

 


6 April 2020

దేవుడు ఆయనయందు ఆనందించెను


యేసునకు 30 సంవత్సరములు వచ్చినప్పుడు, పరలోకమునుండి తండ్రి ఆయనను గూర్చి ఈ మాటలు పలికాడు, ''ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేను ఆనందించుచున్నాను'' (మత్తయి 3:17). అప్పటికి ప్రభువైన యేసు ఒక అద్భుతముగాని లేక ఒక ప్రసంగము గాని చేయలేదు.

కాని దేవుడు ఆయనను అంగీకరించుటలో ఉన్న రహస్యమేమిటి? ఆయన బహిరంగ పరిచర్య ఆరంభించలేదు కాబట్టి ఆయన పరిచర్యనుబట్టి కూడా కాదు. కాని 30 సంవత్సరాలు ఆయన జీవించిన జీవితమునుబట్టి మాత్రమే.

మనము కూడా మన పరిచర్యలోని అభివృద్ధినిబట్టి కాదుకాని మన నిజజీవితములో శోధించబడినప్పుడు నమ్మకముగా ఉన్నదానినిబట్టి దేవునిచేత అంగీకరించబడతాము. యేసుయొక్క 30 సంవత్సరాల రహస్యజీవితములో (దేవాలయములోని సంఘటన తప్ప) రెండు విషయములున్నవి- ''ఆయన అన్ని విషయములలో మనవలె శోధింపబడినను పాపము చేయలేదు'' (హెబ్రీ 4:15) మరియు ''ఆయన తన్నుతాను సంతోషపరచుకొనలేదు'' (రోమా 15:3).

ప్రతి సమయములో ఆయన శోధనను నమ్మకముగా ఎదిరించాడు మరియు ఏ విషయములో కూడా ఆయన తన సొంతమును కోరలేదు. ఇదియే తండ్రిని ఆనందింపచేసినది.

మన బాహ్యమైన అభివృద్ధిని, లోకస్థులు మరియు శరీరసంబంధమైన విశ్వాసులు గుర్తించవచ్చును కాని దేవుడు మన గుణశీలమునుమాత్రమే గుర్తిస్తాడు. మన గుణశీలము మాత్రమే దేవుని యొక్క అంగీకారమును తెచ్చును. మన విషయములో దేవుని అభిప్రాయము తెలుసుకొనవలెనంటే, మనము ఎంత పరిచర్య చేసామనేది మరచి, పాపము విషయములో మరియు స్వార్థము విషయములో మన తలంపులగూర్చి ఆలోచించాలి. అది మాత్రమే మన ఆత్మీయస్థితికి కొలబద్ద (ఆవిధముగా మాత్రమే మన ఆత్మీయ స్థితిని తెలుసుకొనగలము).

ఆవిధముగా లోకమంతటా తిరిగి స్వస్థపరచి మరియు బోధించే వానికిని మరియు కేవలము ఇంటిలోనే పనికలిగియుండే తల్లికిని, దేవుని మెప్పును (అంగీకారమును) పొందుటకు సమాన అవకాశము కలదు.

ఇప్పుడు క్రైస్తవులలో మొదటిగా ఉన్నవారు అనేకులు క్రీస్తు తీర్పు సింహాసనము ఎదుట కడపటివారగుదురు. ఎవరైతే ఇప్పుడు తాము కడపటివారమనుకుంటారో (గుర్తింపుపొందిన పరిచర్య వారికి లేదుకాబట్టి వారు మొదటివారగుదురు.                
       - జాక్‌ పూనెన్‌

20 October 2018

ఆదాము స్థానములో నువ్వుంటే ...❓


👉 ఆదాము స్థానములో నువ్వుంటే...❓

🔴 ఒక రోజు ఒక యవ్వనస్తుడు పాష్టర్ గారితో ఆదాము గురించి మాట్లాడుతూ...
పాష్టర్ గారు.... ఆదాముకి అసలు బుద్ధి లేదండి"అని అంటే పాస్టర్ గారు అదేమిటయ్యా...!అంత పెద్ద మాట అనేశావు అని ఆచ్చర్యయంగా చూడగా ఆ యవ్వనస్తుడు -లేకపోతే ఏమిటండీ..!

👉 దవుడు అన్ని పండ్లు  ఇచ్చి ఒకే ఒక్క పండు తినవద్దుని అన్నాడు మిగిలిన పండ్లను అన్నిటినీ వదిలేసి ఆ ఒక్క పండే తిన్నాడు వద్దంటే ఎందుకు తినాలి చెప్పండి...

అదే ఆనాడు ఆదాము స్థానంలో నేను ఉన్నట్లయితే అసలు ఆ పండు జోలికే వెళ్ళేవాడిని కాదు అని అంటుంటే అప్పుడు ఆ పాష్టర్ గారు బాగా ఆలోచించి ఆ కుర్రవాడిని తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు..

🔹పష్టర్ గారు రకరకాల వంటలు సిద్ధం చేయించి డైనింగ్ టేబుల్ పై పెట్టించారు.
ఆ యవ్వనస్తుడికి అన్ని డిషెస్ చూపిస్తూ-బాబు ఈ టేబుల్ మీద ఉన్న ఐటమ్స్ అన్నీ నీ కోసమే, అయితే మధ్యలో ఉన్న గిన్నె మాత్రం తెరచే ప్రయత్నం చేయొద్దు... దాని సంగతి తర్వాత చూద్దాం అన్నారు ఇంతలో పోన్ కాల్ వస్తే మాట్లాడడానికి పాష్టర్ గారు హాల్లోకి వెళ్లారంట.

👉 ఆ యవ్వస్తుడికి తన కళ్ల ముందు ఎన్నో రకాల వంటలు ఉన్నపటికీ వాటితో తృప్తి పడలేక పోతున్నాడు కారణం...అసలు పాష్టర్ గారు ఆ మధ్య గిన్నె మూత ఎందుకు తెరవద్ద అన్నారు...
ఎలాగూ పాష్టర్ గారు ఫోన్ మాట్లాడడానికి వెళ్లారు ఈ లోపు చూద్దాం అనీ దాని మూత తెరిచే ప్రయత్నం చేయగా ....

👉 అందులో ఉన్న పక్షి కాస్త పైకి ఎగిరిపోయిందిట అయ్యో..!పాష్టర్ గారు వచ్చేలోపు ఎలాగయినా ఆ పక్షిని పట్టుకొని ఆ గిన్నెలో పెట్టి మూత పెట్టాలని...ఆ పక్షిని పట్టుకునే ప్రయత్నంలో డైనింగ్ టేబుల్ పై పడ్డాడు ఆ శబ్దానికి పాష్టర్ గారు గబ గబా వచ్చి ఆయ్యయ్యో...!ఏమైందయ్యా అని అంటూ వుంటే...ఆ యవ్వనస్తుడు ఇలా ఆన్నాడు -

🔴 *ఆదాము స్థానంలో నేనున్నా ...! నేను కూడా ఆ పండు తినేవాణ్ణి అని ఇప్పుడు అర్థమైంది అన్నాడట*

👉 దయచేసి గమనించండి.....
పాపములో పడిపోయిన వారిని చూసి...లేక బలహినులను చూసి -ఆ స్థానంలో నేనుంటే ఆ విదంగా పాపిష్టి పనులు చేసేవాడిని,చేసేదాన్ని, కాదు అని గొప్పలు చెప్పుకోకుండా - దారితప్పిన- పాపములో పడినవారిపై కనికరపడి ఆదరించి మరలా వారు విశ్వాసంలో కొనసాగులాగున బలపరిచే బాధ్యత మనమీదనే వుంది అన్న సత్యం మరచిపోవద్దు

👉 📖 సహోదరులారా ! ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కిన యెడల ఆత్మసంబంధమైన మనము శోధింప బడుదుమేమో అని తన విషయమై చూచుకొనుచు....సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచిదారికి తీసుకుని రావెలెను (గలతీ 6:1)

👉 తప్పు చేసి పాపములో పడిన వారిని చూసి సులభంగా తీర్పుతీర్చడం ప్రతీ మూర్కుడు చేయగలడు కానీ అదే స్థితిలో నేనున్నా...అదే తప్పు చేసేవాడినేమో,చేసేదాన్నేమో, అని స్వపరిక్షచేసుకుని బహుజాగ్రత్తగా జీవిస్తూ, ఇతరులకు మాదిరికరంగా జీవించమని మనవిచేస్తున్నాను.... *"తాను నిలుచున్నానని తలంచువాడు పడిపోకుండా జాగ్రత్తగా చుచుకొనవలెను* (📖 1 కొరింధీ 10:12)
విశ్వాసమునకు కర్తయు, దానిని కొనసాగించువాడైన యేసునే చూస్తూ ఆయన మీద ఆధారపడి జీవించినట్లైతే ప్రతి పాపముపై జయమును పొందుకుంటాము...

ఆ సర్వేశ్వరుడు శ్రీమంతుడు దేవాధిదేవుడైన యేసు ప్రభువు వారు మిమ్ములను మీ కుటుంబ సభ్యులను మీకు కలిగిన అంతటిని ఆశీర్వదించి దీవించును గాక

*ఆమేన్ ఆమేన్ ఆమేన్*



19 October 2018

ఆత్మతో నింపబడాలి. ప్రార్ధించడంలో ఆనందించాలి E Message


ఆత్మతో నింపబడాలి. ప్రార్ధించడంలో ఆనందించాలి.*

♻️ *ఎక్కువ సమయం ప్రార్ధించడానికి ఆసక్తి కలిగిన కొందరిని మాదిరిగా కలిగివుందాము.*

🙇‍♂ *బాల్యములో సమూయేలు వలె ప్రార్ధించు*
(1సమూ 3:1-10)

🙇‍♂ *యవ్వనంలో తిమోతి వలె ప్రార్ధించు*
(2 తిమో 2:22)

🙇‍♂ *ఉదయకాలమున దావీదు వలె ప్రార్ధించు*
( కీర్తన 63:1)

🙇‍♂ *మధ్యాహ్నమున దానియేలు వలె ప్రార్ధించు*
(దానియేలు 6:10)

🙇‍♂  *శరీరక శ్రమలలో రాత్రివేళ పౌలు, సీలలు వలె ప్రార్ధించు*
(అపో 16:25)

🙇‍♂ *అపాయములో పేతురు వలె ప్రార్ధించు*
(మత్తయి 14:30)

🙇‍♂ *దుఃఖములో హన్నా వలె ప్రార్ధించు*
(1సమూ 1:10)

🙇‍♂ *శ్రమలలో యోబు వలె ప్రార్ధించు*
(యోబు 42:10)

🙇‍♂ *మరణ సమయములో స్థెఫను వలె ప్రార్ధించు*
(అపో 7:60)

🙇‍♂ *ఏ పని ప్రారంభించిన ఎలియేజరు వలె ప్రార్ధించు*
(ఆది 24:12)

🙇‍♂ *పని ముగింపులో సలోమోను వలె ప్రార్ధించు*
(1రాజులు 8:54)

🙇‍♂ *అన్ని సమయములో యేసు వలె ప్రార్ధించు*
(యెహాను 6:38)

🔺 *అనవసరమైన పనులను ప్రక్కనబెట్టి ఎక్కువ సమయం ప్రార్ధించడానికి ఆసక్తి కలిగి యుండాలి.*

లూకా 21: 36:-
*కాబట్టి మీరు జరుగబోవు వీటినెల్లను తప్పించు కొని, మనుష్యకుమారుని యెదుట నిలువబడుటకు శక్తిగలవారగునట్లు ఎల్లప్పుడును ప్రార్థనచేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను.*

*భక్తుడైన జాన్‌ హైడ్‌ ప్రభువు సన్నిధిలో గంటల తరబడి నిద్రాహారాలు మరచి గడిపేవాడు.*

👉పలబుడ్డి ప్రార్ధనలను వీడి పోరాట ప్రార్ధనలకు మనం ఎదగాలి.

👉సతానుకు బెదరక, అదరక, పవిత్ర జీవితం కలిగి, ప్రభువును హత్తుకుని, వానిని ప్రార్ధనాయూధం ద్వారా హతమార్చండి!

👉పరార్ధనలో ఆత్మీయ పోరాటం జయాన్నిస్తుంది.

👉 *మీరు అలా ప్రార్ధించగలరా? ఆలోచించండి'*
 అని వ్రాసాడో భక్తుడు.

👉 *నేటి నుండే మీ ప్రార్ధన జీవితం సరి చేసుకుని, సమర్ధవంతమైన ప్రార్ధన అనుభవంతో ప్రభువు రాక కొరకు కనిపెట్టండి.పరిశుద్ధాత్మ దేవుడు మీకు ప్రార్ధనాత్మను దయ చేయును గాక!*

ఆ రీతిగా మన హృదయాలను సిద్ధ పరచుకొని ప్రార్ధిద్దాం!

*హల్లెలూయ...*

*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*

*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*

👉 *మీకు పంపుతున్నా అను దిన ఆత్మీయ సందేశాలు నేను మరియు కొంతమంది దైవజనులు కొన్ని గంటలు శ్రమించి మీ ముందుకు తెస్తున్నాము.*
గనుక మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మాకు తెలపగలరు.


👉 *మీ మిత్రులకు share చేసి మీ వంతుగా దేవుని పని చేయండి.*

క్రైస్తవ కుటుంబము E Message



క్రైస్తవ కుటుంబము

✳️ *అంశం: భార్య- భర్తలు మధ్య ఉండవలసిన  బంధం* ...✍️

👉 భర్యాభర్తల మధ్య వచ్చే విషయాలు ఏంటి?
తల్లిదండ్రులై ఉండవచ్చును. ఆదికాండము 2 : 24 లో *"కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడచి తన భార్యను హత్తుకొనును. వారు ఏకశరీరమైయుందురు"*
 అని చెప్పుచున్నది.
👉ఇక్కడ నీవు ఒక దానిని విడిచిపెట్టాలి మరియు
👉 మరొక దానిని హత్తుకోవాలి అని ఉంది.

*నీవు విడిచి పెట్టకుండా హత్తుకుంటే, నీవు ఏకమవ్వలేవు.*
👉పపము లోకములోనికి రాకముందు లేఖనములో దేవుడిచ్చిన ఆజ్ఞ ఇది.

*నీ తండ్రిని, నీ తల్లిని విడిచిపెట్టుము.*
👉 వవాహమైన వారిని నేను అడుగుచున్నాను. నీ తండ్రిని, తల్లిని విడిచిపెట్టావా?
🔺అనగా శారీరకముగా కాదు వారు చనిపోవువరకు వారి గురించి జాగ్రత్తవహించుము. మనము అలాగున చేయాలి. మన తల్లిదండ్రులను సన్మానించాలి.
*కాని వారిని నీకు మరియు నీ వివాహజీవితానికి మధ్యకు రానియ్యకుము.*

👉 పరేమతో వారిని విడవాలి. వారు అనేక సం||లు నిన్ను పెంచి మరియు పెద్ద చేశారు. అది మంచిది.
👉కని నీవు పెళ్ళి చేసుకున్నావు కాబట్టి వారిని విడవాలి. చాలామంది భర్తలు వారి తల్లిదండ్రులతో ఉన్న అనురాగాన్ని విడిచిపెట్టరు. కాబట్టి వారి వివాహజీవితములో సమస్యలు ఉంటున్నాయి. అలాగే అనేకమంది భార్యలు కూడా ఉన్నారు. వారి భర్తలతో వారు ఏకమవ్వలేదు.

👉ఇది బాధాకరము. ప్రభువు మొదటగా ఉండకుండా, తల్లిదండ్రులు వారి మధ్యలో ఉంటున్నారు.
👉 కన్నిసార్లు ఉద్యోగము ముఖ్యమైయుండవచ్చు. దేవుడు కాకుండా ధనముగాని లేక పిల్లలుకాని లేక మరేదైనా కాని మధ్యలోనికి రాకూడదు.

 *ఒక మంచి ఉధ్యానవనమును నాటుటకు ఐదు నియమములను, వాటిని మన వివాహ బాంధవ్యములో భార్య మరియు భర్తల మధ్య అన్వయించుకొనవచ్చును.*

💐 *నీ వివాహము ఒక మంచి ఉధ్యానవనమువలె ఉండనిమ్ము* 💐

1⃣ *వ్యాధులను తట్టుకొనే విత్తనములు ఉపయోగించుడి*

వ్యాధులను అదుపుచేయుటకు మంచి పద్ధతి అది రాకుండా చూచుకొనుట.
*మనము మన నాలుకతో విత్తనములు నాటుదుము.*

 🔺మరు ఒకరితో ఒకరు మాటలాడుకొనినప్పుడు మీ మాటల ద్వారా వ్యాధులు వ్యాపించకుండా చూచుకొనుడి.
🔺మరు మాటలాడునప్పుడు వ్యాధులను తట్టుకొనే మాటలనే మాటలాడుడి. కొన్ని వ్యాధులనుండి మొక్కలను కాపాడుటకు తరచు పురుగుల మందులు జల్లుచుండవలెను. మీ ఉధ్యానవనములో కలుపు మొక్కలు లేకుండా ఉండవలెనంటే మీ నాలుక గూర్చి జాగ్రత్త వహించు విషయములో మీరు నిర్దాక్షిణ్యముగా ఉండవలయును.

2⃣ *నేలను ఎరువులతో బలపర్చవలెను.*

👉మకు సంతోషకరమైన వివాహజీవితము ఉండవలెనంటె ఒకరినొకరు ప్రోత్సహించుకొనుడి మరియు మెచ్చుకొనుచుండుడి. నేలలోనికి ఇటువంటి ఎఱువులను వేయుచుండుడి. అప్పుడు మీకు నిజముగా మంచి పంటవచ్చును.

3⃣ *బాగుపడని వ్యాధులుండిన మొక్కలు ఏమైనా ఉండినట్లయితే వాటిని నాశనము చేయుడి*

ఇది అదుపు చేయలేని మరియు వ్యసనముగా మారిన కార్యక్రమములు

*అనగా టి.వీ. కి అతుక్కొని పోవుట వంటి వాటి గూర్చి చెప్పుచున్నది. నాశనము చేయుడి, నేననేది టి.వీ. ని కాదు, కాని దాని ముందు కూర్చుని వ్యర్ధపరచే సమయమును.*

 అటువంటి వాటిని ఈ నియమము అదుపు చేయలేని వ్యాధి గూర్చి చెప్పుచున్నది. నీవు వాటిని అదుపు చేయగల్గినట్లయితే అది మంచిది మరియు ప్రాముఖ్యమైన విషయము. కాని అటువంటి వ్యాపకములను అదుపుచేయుట మంచిది.

4⃣ *వ్యాధి కలిగియున్న ఆకులను నీవు గమనించిన వెంటనే కత్తిరించివేయుము*

దీని అర్ధము నీకు ఎదుటివ్యక్తిని బాధించినట్లు నీవు గ్రహించగానే అది ఒక వ్యాధి కలిగియుండిన ఆకు - దానిని వెంటనే కత్తిరించి వేయుము.

*క్షమాపణ వెంటనే అడుగుము. మరియు వెంటనే క్షమించుము. అప్పుడు ఆ ఆకు కత్తిరించ బడునట్లగును. లేకపోయినట్లయితే ఆ సమస్య తీవ్రమగును*

ఇంకొక విషయము : ఆ వ్యాధి కలిగిన ఆకును పారవేయుము. గతమును జ్ఞాపకముంచుకొనవద్దు.

5⃣  *నీవు సరిగా సంరక్షింపగల వాటికంటె ఎక్కువ నాటవద్దు పూర్తిగా మొక్కలతో నింపివేయవద్దుఎక్కువగా నాటినట్లయితే మంచిగాలి ప్రసరణను ఆటంకపరచును మరియు కావలసిన సూర్యరశ్మి తగులకుండా ఆటంకపరచును.*
👉దని అర్ధము నీవు రోజుకుండిన 24 గంటలలో అనేకమైన పనులు చేయుటకు ప్రయత్నించకూడదు. అట్లు చేసినట్లయితే మీ వివాహ ఉద్యానవనము నిర్లక్ష్యము చేయబడును. మరియు మీ కుటుంబము మీ ప్రాధాన్యతలలో ఆఖరిదగును.

🎯 *ఉధ్యానవనమనబడే ‘మీ కుటుంబము’ మీకు మొదటి ముఖ్యమైన విషయముగా ఉండవలెను.*

 ఎక్కువ మొక్కలు నాటబడి ఉండుట తగినంత సూర్యరశ్మి (దేవుని వెలుగు) తగలకుండా మరియు మంచిగాలి ప్రసరణలేకుండా (మీ ఇరువురి మధ్య మంచి సహవాసము) ఆటంకపరచును.

లోకమంతట ఉన్న ఉధ్యానవనముల కోసం దేవుడే ఏర్పాటు చేసిన చట్టములు ఇవి.
*మీ కుటుంబము మీకు మొదటి ప్రాధాన్యతగా ఉంచుకొనుడి.*

🔺భర్యభర్తల ఆ బంధాన్ని మరణము వరకు నిలబెట్టుకోవాలి.
🔺ఒకరి తప్పులు ఇంకొకరు సరిదిద్దుతూ,
🔺మంచి ఎలా స్వీకరిస్తామో చెడు కూడా అలాగే స్వీకరిస్తూ వివాహబంధాన్ని కొనసాగించాలి.

కాబట్టి ప్రియులారా దేవుని యందు భయ భక్తులు కలిగి మంచి బార్యభర్తలుగా ఉండాలి అని ఆశిస్తున్నాను.
దేవుడు మిమ్ము దీవించును గాక!

*హల్లెలూయ...*

Join Telegram

Join Telegram
Telugu Christian Lyrics