-:A:B:C:D:E:F:G:H:I:J:K:L:M:N:O:P:Q:.R:S:T:U:V:W:X:Y:Z:-

Showing posts with label K. Show all posts
Showing posts with label K. Show all posts

6 November 2025

కృతజ్ఞాతతో స్తుతి పాడెద నా యేసు నాథా

 

కృతజ్ఞాతతో స్తుతి పాడెద నా యేసు నాథా
నాకై నీవు చేసిన మేళ్లకై కోటి కోటి కృతజ్ఞతలు

అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా
నా ఊహలకంటెను అధికముగా దయచేయు ప్రేమామయా          
[ కృతజ్ఞాత తో]

నిజ రక్షకుడు యేసు క్రీస్తని విశ్వసించెద
అను నిత్యము 
నీ పాద సేవలో బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము
నీ పాద సేవలో బ్రతుకుటకై వరములతో అభిషేకించు   
[ కృతజ్ఞాత తో ] 

 

28 September 2024

కంటిపాపలా కాచినావయ్యా – చంటిపాపను మోసినట్టు మోసినావయ్యా




కంటిపాపలా కాచినావయ్యా – చంటిపాపను మోసినట్టు మోసినావయ్యా
చేతి నీడలో దాచినావయ్యా – తోడుగా మా ముందరే నడచినావయ్యా
పోషించినావయ్యా.. బలపరచినావయ్యా – భయము వలదని ధైర్యమునిచ్చినావయ్యా
నడిపించినావయ్యా.. కాపాడినావయ్యా – ఓటమంచులో విజయమునిచ్చినావయ్యా
మా తలంపులు కావు.. నీ తలంపులే – మా జీవితాలలో జరిగించినావయ్యా
మా ఊహలే కాదు.. నీ ప్రణాళికే – మానక సమయానికి నెరవేర్చినావయ్యా           ||కంటిపాపలా||

ఎన్నో ఏళ్లుగా.. ఎదురు చూసాముగా – ఆశలే అడియాశలవ్వగా సోలిపోయాముగా
దారే కానక.. ఆగిపోయాముగా – అంధకారమే అలుముకోగా అలసిపోయాముగా
అనుదినమున నీ మాటలే ఆదరించి నడిపించెగా
అణగారిన మా ఆశలన్ని చిగురింపజేసెగా
ప్రతి క్షణమున నీ సన్నిధే ధైర్యపరచి బలపరచెగా
చితికిన మా జీవితాలను వెలిగింపజేసెగా
కన్నీరు తుడిచినావు.. నాట్యముగ మార్చినావు
ఎనలేని ప్రేమ మా పైన చూపి           ||కంటిపాపలా||

ఊహించువాటికంటే ఎంతో అధికముగా – హెచ్చించినావు దేవా.. నీ ప్రేమ మధురము
ఏ మంచి లేని మాకు మా మంచి కాపరై – దీవించినావు దేవా.. నీ ప్రేమ మరువము
హీనులం.. బలహీనులం.. నిలువలేక పడిపోయినా
లేవనెత్తి బండపైనే నిలబెట్టినావుగా
చీటికీ.. మాటి మాటికీ.. మా నమ్మకమే కోల్పోయినా
అడుగడుగున నీ నమ్మకత్వమును కనబరచినావుగా
పోగొట్టుకున్నదంతా.. రెట్టింపు చేసినావు
నీ గొప్ప ప్రేమ మా పైన చూపి           ||కంటిపాపలా||

13 September 2024

కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం



 కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే
ఆవిరి వంటిదిరా ఈ జీవితం
లోకాన కాదేది శాశ్వతం (2)
యేసే నిజ దేవుడు నిత్యజీవమిస్తాడు
మరణమైన జీవమైన నిన్ను విడువడు (2)       ||కొంతసేపు||

ఎదురౌతారెందరో నీ పయనంలో
నిలిచేది ఎందరు నీ అక్కరలో (2)
వచ్చేదెవరు నీతో మరణము వరకు (2)
ఇచ్చేదేవరు ఆపై నిత్య జీవము నీకు         ||యేసే||

చెమటోడ్చి సుఖము విడిచి కష్టమునోర్చి
ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా (2)
ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే (2)
సంపాదన ఎవరిదగును యోచించితివా         ||యేసే||

నీ శాపం తాను మోసి పాపం తీసి
రక్షణ భాగ్యము నీకై సిద్ధము చేసి (2)
విశ్రాంతినీయగ నిన్ను పిలువగా (2)
నిర్లక్ష్యము చేసిన తప్పించుకొందువా         ||యేసే||

 

27 July 2023

క్షణమైనా నను విడువని దేవా - నిన్ను విడిచి నే నుండగలనా

 

 


క్షణమైనా నను విడువని దేవా - నిన్ను విడిచి నే నుండగలనా (2)
ఉండగలనా ....ఆ ...ఆ ...ఆ ...  (2) -నువ్వు లేకుండా నే నుండగలనా....  
                                                  
1.  కంటిలో చూపువైనావు ... - చెవిలో వినికిడైనావు (2)
శ్వాసలో ....శ్వాసవై ..... (2) - ఉంటున్నావు నడిపించుచున్నావు (2)
నడువగాలనా...ఆ ...ఆ ...ఆ ....నే నడువగలనా ...
నువ్వు లేకుండా నే నడువగలనా (2)
                                            
2.  ఏటిలో నీటివైనావు ... - నా దాహం తీర్చే ఊటవైనావు (2)
ప్రాణములో ప్రాణమై (2) - ఉంటున్నావు ...బ్రతికి౦చుచున్నావు (2)
బ్రతుక గలనా ...ఆ ...ఆ ...ఆ ... - నే బ్రతుక గలనా ...ఆ ...ఆ ...ఆ ...
నువ్వు లేకుండా నే బ్రతుక గలనా (2)
                                          
3.  నోటిలో పాటవైనావు -గొంతులో రాగమైనావు  (2)
నా మదిలో గానమువై - ఉంటున్నావు పాట - పాడించుచున్నావు
పాడగలనా….పాట పాడగలనా.. - నీవు లేకుండా నే పాడగలనా
                                    
4.  నిదురలో స్వప్నమైనావు - మధురమైన దర్శనమైనావు  (2)
కలనైనా..నిజమైనా… - కన్నుల ఎదుటే నీవుంటున్నావు - మనగలనా…
     నే మనగలనా…నివులేకుండా మరచిపోగలనా  (2)
                                   
5.  పాటలో పల్లవి అయినావు  - అందమైన రాగమైనావు  (2)
మధురమైనా చరణం అయినావు
నా బ్రతుకులో నీవు నిలువువున్నావు  (2)
పాడగలనా…. నే పాడగలనా… నీవులేకుండా నే పాడగలనా  (2)

17 May 2022

కలములతో రాయగలమా కవితలతో వర్ణించగలమా

 




కలములతో రాయగలమా
కవితలతో వర్ణించగలమా
కలలతో వివరించగలమా
నీ మహోన్నతమైన ప్రేమా (2)
ఆరాధింతును (4) - రారాజువు నీవే
నా తండ్రివి నీవే
నిను విడువను ఎడబాయను (2)

ఆకాశములు నీ మహిమను
వివరించుచున్నవి
అంతరిక్షము నీ చేతి పనిని
వర్ణించుచున్నది (2)

దేవా నా ప్రాణము
నీ కొరకై తపియించుచున్నది (2)     ||ఆరాధింతును||


సెరాపులు కెరూబులు
నిత్యము నిను స్తుతియించుచున్నవి
మహా దూతలు ప్రధాన దూతలు
నీ నామము కీర్తించుచున్నవి (2)

దేవా నా ప్రాణము
నీ కొరకై తపియించుచున్నది (2)      ||ఆరాధింతును||
 

 

 

3 March 2022

కలువరి సిలువ సిలువలో విలువ -నాకు తెలిసెనుగా

 

 


కలువరి సిలువ సిలువలో విలువ -నాకు తెలిసెనుగా
కలుషము బాపి కరుణను చూపి - నన్ను వెదికెనుగా (2)
అజేయుడా విజేయుడా -సజీవుడా సంపూర్ణుడా (2)    |కలువరి|

కష్టాలలోన నష్టాలలోన - నన్నాదుకొన్నావయ్యా
వ్యాధులలోన బాధలలోన - కన్నీరు తుడిచావయ్యా (2)
మధురమైన నీ ప్రేమ - మరువగలనా ఆ ప్రేమ (2)
అనుక్షణం నీ ఆలోచన -నిరంతరము నాకు నీవిచ్చిన       |కలువరి|

పాపానికైనా శాపానికైనా -రక్తాన్ని కార్చావయ్యా
దోషానికైనా ద్వేషానికైనా -మరణించి లేచావయ్యా (2)
మధురమైన నీ ప్రేమ -మరువగలనా ఆ ప్రేమ (2)
అనుక్షణం నీ ఆలోచన -నిరంతరము నాకు నీవిచ్చిన      |కలువరి|

https://www.youtube.com/watch?v=0gqOoFh-2Os

10 March 2019

కల్వరిగిరిపై నా యేసయ్య – నాకొరకై నీప్రాణం పెట్టావయ్యా






     పల్లవి:  కల్వరిగిరిపై నా యేసయ్య – నాకొరకై నీప్రాణం పెట్టావయ్యా!
     నీకెన్నిశ్రమలు  కరుణామయా !   నీప్రేమకు సాటేది ఓనజరేయా ! -2  | కల్వరిగిరిపై|

 
1.  కాళ్ళకు మేకులు కొట్టిరా – తలపై ముళ్ళకిరీటమా
     నేరమే ఏమిలేకనే – అయ్యో ఇంతటి ఘోరమా -2
     మా పాపభారం మోసావయ్యా మాకొరకై సిలువ  మరణమొందావయ్యా
     నీకెన్నిశ్రమలు  కరుణామయా !   నీప్రేమకు సాటేది ఓనజరేయా ! -2  | కల్వరిగిరిపై|

2.  తనువునే చీల్చి వేసిరా – రుథిరమే ఏరులైపారెనా
      లోకమే ఏక మాయెనా – అయ్యో అంతటి ద్వేషమా  -2
      మాపాపభారం మోసావయ్యా మాకొరకై సిలువ  మరణమొందావయ్యా
     నీకెన్నిశ్రమలు  కరుణామయా !   నీప్రేమకు సాటేది ఓనజరేయా ! -2  | కల్వరిగిరిపై|


24 November 2015

కనుమా సిలువపై క్రీస్తేసుడు పొందిన శ్రమలు మనకై సిలువపై మేకులతో కొట్టబడెను





పల్లవి  కనుమా సిలువపై క్రీస్తేసుడు పొందిన శ్రమలు 
మనకై సిలువపై మేకులతో కొట్టబడెను
కనుమా సిలువపై క్రీస్తేసుడు పొందిన శ్రమలు 
మనకై సిలువపై మేకులతో కొట్టబడెను
                          
1.       ఘన దేవుడు మనపై తన ప్రేమను చూపెను                   
ప్రియమైన తన కుమారుని ఈ ధరకే పంపెను       
ఘన దేవుడు మనపై తన ప్రేమను చూపెను                   
ప్రియమైన తన కుమారుని ఈ ధరకే పంపెను         
ఎవరైతే దేవుని నమ్మకుందురో వారు నశింతురు    (2X) 
కనుమా సిలువపై క్రీస్తేసుడు పొందిన శ్రమలు 
మనకై సిలువపై మేకులతో కొట్టబడెను
2.       బరువైన సిలువ మోస్తూ నడవలేక నడిచెను                   
కొరడాల దెబ్బలతో తడబడుచు నడిచెను                        
బరువైన సిలువ మోస్తూ నడవలేక నడిచెను                   
కొరడాల దెబ్బలతో తడబడుచు నడిచెను
అలసి, సొలసి, నిస్సాహాయుడై తాను నిలిచెను     (2X)
కనుమా సిలువపై క్రీస్తేసుడు పొందిన శ్రమలు 
మనకై సిలువపై మేకులతో కొట్టబడెను
మేకులతో కొట్టబడెను
            మేకులతో కొట్టబడెను

4 November 2015

కల్వరి ప్రేమ ప్రకటించుచున్నది - సర్వలోకానికి




పల్లవి:    కల్వరి ప్రేమ ప్రకటించుచున్నది - సర్వలోకానికి
    కల్వరి స్వరము వినిపించుచున్నది - ప్రతీ పట్టణానికి
    రమ్ము ప్రియుడా రమ్ము - క్రీస్తు ప్రేమను ప్రకటించుటకు
    లెమ్ము తెజరిల్లుమయా - క్రీస్తు వార్తను ప్రకటించుటకు - ఈ సువార్తను ప్రకటించుటకు


    1. చూడుము భూమి కంపించుచున్నది - చీకటి జనములను కమ్ముచున్నది - 2
    ఎందాక ప్రకటించుట మానెదవు - ఎందాక ఆలస్యం చేసెదవు - 2
    ప్రభు త్యాగమునే మరిచెదవా - ప్రభు సేవనే విడిచెదవా ? - 2
    రమ్ము ప్రియుడా రమ్ము - క్రీస్తు ప్రేమను ప్రకటించుటకు
    లెమ్ము తెజరిల్లుమయా - క్రీస్తు వార్తను ప్రకటించుటకు - ఈ సువార్తను ప్రకటించుటకు


    2. పాపపు ఊభిలో ప్రజలుండగా - సాతాను సంకెళ్లతో బంధించగా - 2
    ఎందాక పోరాటం మానెదవు - ఎందాక నిర్లక్ష్యం చేసెదవు - 2
    ప్రభు త్యాగమునే మరిచెదవా - ప్రభు సేవనే విడిచెదవా ? - 2
    రమ్ము ప్రియుడా రమ్ము - క్రీస్తు ప్రేమను ప్రకటించుటకు
    లెమ్ము తెజరిల్లుమయా - క్రీస్తు వార్తను ప్రకటించుటకు - ఈ సువార్తను ప్రకటించుటకు




కలములతో వ్రాయగలమా.. కవితలతో వర్ణించగలమా.. ?





    కలములతో వ్రాయగలమా.. కవితలతో వర్ణించగలమా.. ?
    కళలతో వివరించగలమా.. నీ మహోన్నతమైన ప్రేమా... = 2
    ఆరాధింతును - ఆరాధింతును - 2
    రారాజువు నీవే - నా తండ్రివి నీవే - నిను విడువను ఎడబాయను - 2

    1. ఆకాశములు - నీ మహిమను - వివరించుచున్నవి
    అంతరిక్షము - నీ చేతిపనిని - వర్ణించుచున్నది = 2
    దేవా.. నా ప్రాణము - నీకొరకై తపియించుచున్నది - 2
    ఆరాధింతును - ఆరాధింతును - 2
    రారాజువు నీవే - నా తండ్రివి నీవే - నిను విడువను ఎడబాయను - 2

    2. సెరాపులు - కెరూబులు - నిత్యము నిను స్తుతియించుచున్నవి
    మహాదూతలు - ప్రధానదూతలు - నీ నామము కీర్తించుచున్నవి = 2
    దేవా.. నా ప్రాణము - నీకొరకై తపియించుచున్నది - 2
    ఆరాధింతును - ఆరాధింతును - 2
    రారాజువు నీవే - నా తండ్రివి నీవే - నిను విడువను ఎడబాయను - 2




Join Telegram

Join Telegram
Telugu Christian Lyrics