-:A:B:C:D:E:F:G:H:I:J:K:L:M:N:O:P:Q:.R:S:T:U:V:W:X:Y:Z:-

Showing posts with label B. Show all posts
Showing posts with label B. Show all posts

10 March 2019

భయము లేదు మనకు, ఇకపై ఎదురు వచ్చుఁ గెలుపు



భయము లేదు మనకు, ఇకపై
ఎదురు వచ్చుఁ గెలుపు
అదిగో యేసు పిలుపు, వినుమా
పరము చేరు వరకు 


ఫలితమేదయిన  ప్రభును  వీడకు 
కష్టమెంతయినా కలత చెందకు
అలుపు లేకుండా  పరుగు సాగని
శోధనలు నిన్ను చూసి  బెదరని  ||  భయము ||

సంధించిన బాణమల్లె  నీ గురి కొనసాగని
మన తండ్రి వాగ్దనాలే ఊపిరిగా మారని || 2 ||
కష్టలే మెట్లుగా మారి యేసులో  ఎదిగించని
తన వాక్యం  నీలో వెలిగి  చీకటి తొలగించని   || 2 ||  || ఫలిత ||

మండించే అగ్గితోనే మెరుయును  బంగారము
శోధనల కొలిమిలోనే బలపడు విశ్వాసము  || 2 ||
నీ తరపున యుద్ధం చేసే యెహోవా నీ అండ
తొలగిపోకు ఆ  మార్గన్నీ  తన ఆజ్ఞను వినకుండా || 2 ||  || ఫలిత ||

కనలేదా సిలువలోన యేసురాజు  కష్టము
తానొందినా శ్రమల ద్వారా నశియించే  పాపమూ  || 2 ||
నీ శ్రమల కాలంలోనే మనసు దృఢము కావాలి
తిరిగి నీలో పుట్టే పాపం బీజము  నశియించాలి  || 2 ||  || ఫలిత ||

ప్రియమయిన  పుత్రుని మనకై నలిగించిన దేవుడు
అప్పగించలేడ?  సకలం,  సర్వశక్తిమంతుడు   || 2 ||
తన సన్నిధి రావాలంటూ నిన్ను కోరుతున్నాడు
నీతి నీలో పెంచేటందుకు తపన పడుతూ ఉన్నాడు  || 2 ||  || ఫలిత ll




3 March 2019

బాలుడు కాదమ్మో - బలవంతుడు యేసు పసివాడు కాదమ్మో - పరమాత్ముడు క్రీస్తు


బాలుడు కాదమ్మో - బలవంతుడు యేసు
పసివాడు కాదమ్మో - పరమాత్ముడు క్రీస్తు = 2
పరమును విడచి - పాకలో పుట్టిన
పాపుల రక్షకుడు - మన యేసయ్యా - 2


                                                ||బాలుడు||

1. కన్య మరియ గర్భమందు - బెత్లహేము పురమునందు
ఆ పశుశాలలోన - పుట్టినాడమ్మా
ఆ వార్త తెలియగానే - గొర్రేలను విడచి
పరుగూ పరుగున - పాకను చేరామే - {2}

మనసారా మ్రొక్కినాము - మదినిండా కొలచినాము - 2
 మా మంచి కాపరని - సంతోషించామే!

 సందడి సందడి సందడి సందడి - సందడి చేసామే - 4

                                                ||బాలుడు||

2.  చుక్కను చూసి వచ్చినాము - పాకలో మేము చేరినాము
పరిశుద్ధుని చూసి - పరవశించామే
రాజుల రాజని - యూదుల రాజని
 ఇతడే మా రాజని - మ్రొక్కినామమ్మా - {2} 

బంగారం సాంబ్రాణి బోళం - కానుకగా ఇచ్చినాము - 2 
ఇమ్మానుయేలని - పూజించామమ్మో !

సందడి సందడి సందడి సందడి - సందడి చేసామే - 4

                                                ||బాలుడు||




29 November 2015

భాసిల్లెను శిలువలో పాపక్షమా - యేసు ప్రభూ నీ దివ్య క్షమా భాసిల్లెను శిలువలో పాపక్షమా





పల్లవి:     భాసిల్లెను శిలువలో పాపక్షమా - యేసు ప్రభూ నీ దివ్య క్షమా  

               భాసిల్లెను శిలువలో పాపక్షమా 

1.        
కలువరిలో నా పాపము పొంచి - శిలువకు నిన్ను యాహుతి చేసి
కలుషహర కరుణించితివి - కలుషహర  హరుణించితివి
భాసిల్లెను శిలువలో పాపక్షమా

2.        
నమ్మిన వారిని కాదని వనియు - నెమ్మది నొసగెడి నా ప్రభుడవని 
నమ్మితి నీ పాదంబులను - నమ్మితి నీ పాదంబులను
భాసిల్లెను శిలువలో పాపక్షమా - యేసు ప్రభూ  నీ దివ్య క్షమా  
భాసిల్లెను శిలువలో పాపక్షమా




Tags:Christmas songs lyrics in Telugu script, christmas songs lyrics in telugu script  telugu songs lyrics in telugu script free download  telugu songs lyrics in telugu script pdf  telugu songs lyrics in telugu language  telugu songs lyrics in telugu font  telugu movie songs lyrics in telugu font  sagara sangamam songs lyrics in telugu language  i songs lyrics telugu latest ,Christmas songs lyrics in telugu script  telugu songs lyrics in telugu script free download  telugu songs lyrics in telugu script pdf  telugu songs lyrics in telugu language  telugu songs lyrics in telugu font  telugu movie songs lyrics in Telugu font  sagara sangamam songs lyrics in telugu language  i songs lyrics Telugu latest

9 November 2015

బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా నిలవాలని ఉన్నా నిలువలేకున్నా






బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా నిలవాలని ఉన్నా నిలువలేకున్నా
బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా నిలవాలని ఉన్నా నిలువలేకున్నా
చూడాలని ఉన్నా చూడలేకున్నా చేరాలని ఉన్నా నిను చేరలేకున్నా
బ్రతికించుమో ఏసయ్యా దరి చేర్చుమో నన్నయా
బ్రతికించుమో ఏసయ్యా…… దరి చేర్చుమో నన్నయా
బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా నిలవాలని ఉన్నా నిలువలేకున్నా
కాపరి లేని గొర్రేనయితి కాటికి నే చేరువయితి
కావాలి లేని తోటనయితి కారడవిగా నే మారితి
గూడు చెదరిన గువ్వనయితి గుండె పగిలిన ఏకాకినయితి
గుండె దిగులుగా ఉందయా గూడు చేర్చుమో ఏసయ్యా
గుండె దిగులుగా ఉందయా గూడు చేర్చుమో ఏసయ్యా
బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా నిలవాలని ఉన్నా నిలువలేకున్నా
నా ఆశలే అడియాశలై అడుగంటేనే నా జీవితం
శోధనలా సుడివడిలో తొట్రిల్లేనే నా పయనం
చుక్కాని లేని నావనయితి గమ్యము తెలియక అల్లాడుచుంటి
గురి చేర్చుమో ఏసయ్యా గుండె గుడిలో నీవుండయ్యా……..
గురి చేర్చుమో ఏసయ్యా….నా గుండె గుడిలో నీవుండయ్యా……..
బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా నిలవాలని ఉన్నా నిలువలేకున్నా
బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా నిలవాలని ఉన్నా నిలువలేకున్నా
చూడాలని ఉన్నా చూడలేకున్నా చేరాలని ఉన్నా నిను చేరలేకున్నా
బ్రతికించుమో ఏసయ్యా దరి చేర్చుమో నన్నయా
బ్రతికించుమో ఏసయ్యా…… దరి చేర్చుమో నన్నయా
బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా నిలవాలని ఉన్నా నిలువలేకున్నా





Join Telegram

Join Telegram
Telugu Christian Lyrics