గర్వము వ్యభిచారము కంటే అపాయకరమైనది
ఎదోముమీద దేవుని తీర్పును గురించి ఓబద్యా మాట్లాడెను. ఎదోము మన శరీరమునకు సాదృశ్యముగా ఉన్నది. గనుక ఈ ప్రవచనము మన శరీరము యొక్క పతనమును గూర్చి సూచించుచున్నది.
ఎదోము యొక్క గర్వము గురించి ఇక్కడ చెప్పబడి యున్నది. ''అత్యున్నతమైన పర్వతములమీద ఆసీనుడవైయుండి కొండ సందులలో నివసించువాడవు''. నన్ను క్రిందకు పడద్రోయ గలవాడెవడని అనుకొనువాడా, నీ హృదయపు గర్వముచేత నీవు మోసపోతివి. పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకొని నక్షత్రములలో నీవు దానిని కట్టినను అచ్చటనుండియు నేను నిన్ను క్రింద పడవేతును (ఓబద్యా 1:3,4).
శరీరము ఎల్లప్పుడు తన్నుతాను హెచ్చించుకొనుటను కోరును. కాని ఆ గర్వమంతటినీ పూర్తిగా నాశనము చేయుటకు దేవుడు నిర్ణయించెను. దొంగలు రాత్రివేళ వచ్చినట్లయితే వారు సమస్తమును దొంగిలించలేరు. కాని ఇక్కడ ''వారి సొమ్ము సోదా చేయబడును, వారు దాచిపెట్టిన ధనమంతయు పట్టబడును''. దీని భావము ఆత్మచేత ''శరీరానుసారమైన'' సమస్తమును, శరీరయిచ్ఛలును పూర్తిగా నాశనము చేయబడును.
యాకోబు సంతతి బంధీలుగా పట్టబడి గొప్ప అవసరములో ఉన్నప్పుడు తమ సొంత బంధువులైన వారిని బలాత్కారము చేసినందున, దేవుడు ఎదోమును శిక్షించెను, పరదేశులు వారి ఆస్తిని పట్టుకొనిపోయిన దినమందు, అన్యులు వారి గుమ్మములలోనికి చొరబడి యెరూషలేము మీద చీట్లు వేసిన దినమందు నీవును వారితో కలసికొంటివిగదా అనెను (ఓబద్యా 1:10,11). ఇశ్రాయేలీయుల శత్రువుల వలె వారు పని చేసిరి. ఇశ్రాయేలుకు సహాయపడుటకు ఎదోము ఏమియు చేయలేదు.
చేయవలసినవి చేయకపోవుట మరియు చెయ్యకూడనివి చేయుట అను పాపములు ఉన్నవి. తరచుగా మనము పాపములను గూర్చి తలంచినప్పుడు, కేవలము చేసిన పాపములను మాత్రమే తలంచెదము. గమనించండి. మంచిసమరయుని కథలో యాజకుడు మరియు లేవీయుడు పాపము చేయలేదు. పడియున్న వ్యక్తిని వారు కొట్టలేదు. అవసరములో ఆ వ్యక్తికి వారి చేతివ్రేలితో కూడా సహాయపడకపోవడమే పాపము. అవసరములో ఉన్న వ్యక్తికి సహాయపడకపోవడము పాపమని మీరు గుర్తించుచున్నారా? అది చేయవలసినది చేయకపోవడమనే పాపము.
ఎదోము చేయవలసినది చేయలేదు- దానిని ప్రభువు తీవ్రముగా తీసుకొనెను. ఇశ్రాయేలీయుల శ్రమను చూచి సంతోషించుట ఎదోము చేసిన రెండవపాపము (ఓబద్యా 1:12). నీకు ఇష్టములేని వారికి శ్రమ కలిగినప్పుడు, నీవు సంతోషించుచున్నావా? అది పాపము. ఇతరుల శ్రమలను బట్టి మనము సంతోషింపకూడదు. కాని అది మాత్రమే కాదు నిస్సహాయులైన ఇశ్రాయేలీయులను సంహరించుటకు ఎదోమీయులు అడ్డత్రోవలలో నిలిచిరి (ఓబద్యా 1:14). వారు ఇశ్రాయేలీయుల శత్రువులకు సహకరించిరి. చివరకు ఇశ్రాయేలీయులు స్వతంత్రులగుదురని ప్రభువు చెప్పెను. దాదాపు ప్రతి ప్రవక్త మళ్ళీ స్థాపించబడటము గూర్చి చెప్పిరి.
ఒకరోజు ''తప్పించుకొనిన వారు యెరూషలేములో నివసింతురు'' (ఓబద్యా 1:17). అది ప్రతిష్టిత స్థలమగును. యాకోబు సంతతివారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకొందురు. ఆ సమయమున యాకోబు సంతతివారు అగ్నియు, ఏశావు సంతతివారు కొయ్యకాలగుదురు మరియు ఏశావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండమీద రక్షకులు పుట్టుదురు. అప్పుడు రాజ్యము యెహోవాది యగును (ఓబద్యా 1:21). దిగజారిన దేవుని ప్రజలకు ''ఇదిగో మీ రాజు'' అని ప్రకటించి మరియు వారిని వెనుకకు పిలచుటకు రక్షకులుగా ఉండుటకు దేవుడు మనలను పిలచెను.
ఎదోము పతనమగుటకు కారణమేమిటి? ''నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి'' (ఓబద్యా 1:3). గర్వము, సాతాను స్వభావమైయున్నందున మనము గర్వించినప్పుడు ఆత్మీయ మోసమునకు ద్వారము తెరచినట్లగును. నీకున్న అందమును బట్టి, తెలివితేటలను బట్టి, ఆత్మీయతనుబట్టి, బైబిలు జ్ఞానమును బట్టి, మరిదేని గూర్చి యైనను నీవు గర్వించిన వెంటనే సాతాను నీ మీదకువచ్చి ఇప్పుడు ''నీవు మరియు నేను సహవాసము కలిగియున్నామని చెప్పును''. మరొకవైపున యేసు, భూమి మీద మనుష్యులందరిలో దీనుడైయున్నాడు మరియు నిన్ను నీవు తగ్గించుకొనిన వెంటనే ఆయనతో సహవాసము కలిగియుందువు.
వ్యభిచారము బహిరంగపాపము గనుక వ్యభిచారము కంటే గర్వమే అపాయకరమైనది మరియు బహిరంగ పాపములు రహస్య పాపముల కంటె అపాయకరమైనవి కావు. వారి గర్వములో సంతోషించువారు మోసపోయెదరని ఓబద్యా వారిని హెచ్చరించుచున్నాడు. శరీరెచ్ఛల బంధకాలలో మన చుట్టూ ఉన్నవారికి, ప్రభువైన యేసు వారిని పూర్తిగా విడిపించగలడని ప్రకటించుటకు ఈ క్లుప్తమైన హెచ్చరికనుండి మనము నేర్చుకొనెదము గాక. - జాక్ పూనెన్
No comments:
Post a Comment