-:A:B:C:D:E:F:G:H:I:J:K:L:M:N:O:P:Q:.R:S:T:U:V:W:X:Y:Z:-

Showing posts with label . Show all posts
Showing posts with label . Show all posts

6 November 2025

ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును

 


 

 

ఆరాధన చేతును అన్ని వేళలా
ఆత్మతో సత్యముతో ఆరాధింతును (2) 
నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు
నన్ను కన్న తండ్రి నా యేసుకు (2)
స్తుతి స్తుతి స్తుతి స్తుతి ఆరాధన
హల్లెలూయ హల్లెలూయ ఆరాధన (2)
ఆరాధన ఆరాధన - ఆరాధన ఆరాధన (2)




1. బలవంతుడా జయశీలుడా
మృత్యుంజయుడా నా జీవనదాతా (2)
ఉన్నవాడా అనువాడా నీకే స్తోత్రము
సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము (2)
స్తుతి చేయుట నాకు ఎంతో శోభస్కరము (2)
స్తుతి స్తుతి స్తుతి స్తుతి ఆరాధన
హల్లెలూయ హల్లెలూయ ఆరాధన (2)
ఆరాధన ఆరాధన - ఆరాధన ఆరాధన (2)


2. నీతి సూర్యుడా నిజమైన దేవుడా
శక్తి మంతుడా  సర్వ శక్తి మంతుడా (2)
నీవు తప్ప ఎవరు నాకు లేనె లేరయ్యా
నిన్ను తప్ప వేరెవరిని పూజింపనయ్యా (2)
నిత్యము నీ నామమునే స్తుతియించెదను (2)
స్తుతి స్తుతి స్తుతి స్తుతి ఆరాధన
హల్లెలూయ హల్లెలూయ ఆరాధన (2)
ఆరాధన ఆరాధన - ఆరాధన ఆరాధన (2) "ఆరాధన" 

 

 

22 November 2024

ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి బలవంతుడు AASCHARYAKARUDU

 


ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
నిత్యుడగు తండ్రి బలవంతుడు
లోకాన్ని ప్రేమించి తన ప్రాణమునర్పించి
తిరిగి లేచిన పునరుద్ధానుడు
రండి మన హృదయాలను ఆయనకు అర్పించి
ఆత్మతో సత్యముతోను ఆరాధించెదము
ఆరాధించెదము

ఆరాధన ఆరాధన యేసయ్యకే ఈ ఆరాధన
పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతి శ్రేష్ఠుడు
రాజులకే రారాజు ఆ ప్రభువునే పూజించెదం
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా

సత్య స్వరూపి సర్వాంతర్యామి
సర్వాధికారి మంచి కాపరి
వేలాది సూర్యుల కాంతిని మించిన
మహిమా గలవాడు మహా దేవుడు

రండి మనమందరము – ఉత్సాహగానములతో
ఆ దేవ దేవుని – ఆరాధించెదము
ఆరాధించెదము

ఆరాధన ఆరాధన యేసయ్యకే ఈ ఆరాధన
పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతి శ్రేష్టుడు
రాజులకే రారాజు ఆ ప్రభువునే పూజించెదం
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా

 

 

30 September 2024

ఆరాధనా ఆరాధనా – ఆత్మతో ఆరాధనా ఆరాధనా ఆరాధనా – కృతజ్ఞత స్తుతి ప్రార్ధనా

 


ఆరాధనా ఆరాధనా – ఆత్మతో ఆరాధనా
ఆరాధనా ఆరాధనా – కృతజ్ఞత స్తుతి ప్రార్ధనా (2)
నీకే నా దేవా – తండ్రీ అందుకోవా (2)         ||ఆరాధనా||

అన్నిటికీ ఆధారమైనవాడా – నీకే ఆరాధనా (2)
ఎన్నటికీ మారని మంచివాడా
కృతజ్ఞత స్తుతి ప్రార్ధనా (2)      ||నీకే||

నోటను కపటము లేనివాడా – నీకే ఆరాధనా (2)
మాటతో మహిమలు చేయువాడా
కృతజ్ఞత స్తుతి ప్రార్ధనా (2)      ||నీకే||

అంతయు వ్యాపించియున్నవాడా – నీకే ఆరాధనా (2)
చింతలు తీర్చేటి గొప్పవాడా
కృతజ్ఞత స్తుతి ప్రార్ధనా (2)      ||నీకే||

 

27 July 2023

ఆనందం నీలోనే - ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే - నా యేసయ్యా స్తోత్రహుడా

 


ఆనందం నీలోనే - ఆధారం నీవేగా
ఆశ్రయం నీలోనే - నా యేసయ్యా స్తోత్రహుడా
అర్హతెలేని నన్ను - ప్రేమించినావు
జీవింతును ఇలలో నీకోసమే సాక్ష్యార్తమై    || 2 ||

ఆనందం నీలోనే - ఆధారం నీవేగా
ఆశ్రయం నీలోనే - నా యేసయ్యా స్తోత్రహుడా


1. పదే పదే నిన్నే చేరగా - ప్రతిక్షణం నీవే ధ్యాసగా    || 2 ||
కలవరాల కోటలో - కన్నీటి బాటలో    || 2 ||
కాపాడే కవచముగా - నన్ను ఆవరించిన
దివ్యక్షేత్రమా - స్తోత్రగీతమా
|| ఆనందం నీలోనే ||


2. నిరతరం నీవే వెలుగని - నిత్యమైన స్వాస్థ్యం నీదని    || 2 ||
నీ సన్నిధి వీడకా - సన్నుతించి పాడనా     || 2 ||
నీకొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించన
సత్యవాక్యమే - జీవవాక్యమే

|| ఆనందం నీలోనే ||

౩. సర్వసత్యమే నా మార్గమై - సంఘక్షేమమే నా ప్రాణమై
లోకమహిమ చూడక - నీ జాడలు వీడకా  || 2 ||
నీతోనే నిలవాలి - నిత్యసీయోనులో
ఈ దర్శనం - నా ఆశయం

ఆనందం నీలోనే - ఆధారం నీవేగా
ఆశ్రయం నీలోనే - నా యేసయ్యా స్తోత్రహుడా
అర్హతెలేని నన్ను - ప్రేమించినావు
జీవింతును ఇలలో నీకోసమే సాక్ష్యార్తమై   
ఆనందం నీలోనే - ఆధారం నీవేగా
ఆశ్రయం నీలోనే - నా యేసయ్యా స్తోత్రహుడా

 

 

14 May 2022

ఆగని పరుగులో ఎండిన ఎడారులు

 


 

ఆగని పరుగులో ఎండిన ఎడారులు (2)
కృంగిన బ్రతుకులో నిండిన కొరతలు
ఉన్నపాటునా నలిగె నా వైపున
కదలిరాలేవా ఆదరించగ రావా
కన్నీరే నా మజిలీ – దరి చేరే నీ జాలి
లాలించే నీ ప్రేమ – నా ప్రాణమై
కరుణించే నీ చూపు – మన్నించే నా మనవి
అందించే నీ చేయి – నా స్నేహమై     ||ఆగని||

లోకప్రేమే సదా – కలల కడలే కదా
తరంగమై కావుమా – తిరిగి తీరమునకు (2)
నీవే కదా ఆధారం – సదా నీకే దాసోహం
యేసయ్యా… అర్పించెదా – నా జీవితం     ||ఆగని||

ఎదుట నిలిచె నీవే – ప్రేమకు రూపం నీవే
కృపామయా కావుమా – జార విడువకు నన్ను (2)
నీవే కదా నా మూలం – సదా నీపై నా భారం
యేసయ్యా… ప్రేమించెదా – కలకాలము     ||ఆగని||

                        పాట రచయిత: జాషువా షేక్

13 May 2022

ఆనందింతుము ఆనందింతుము యేసుని సన్నిధిలో ఆనందింతుము..

  ఆనందింతుము ఆనందింతుము
యేసుని సన్నిధిలో ఆనందింతుము.. హే (2)
గంతులేసి నాట్యమాడి
ఉత్సహించి పాడెదం (2)
యేసుని సన్నిధిలో ఆనందింతుము (2)      ||ఆనందింతుము||

భయమూ ఎందుకూ… దిగులూ ఎందుకూ
దేవాది దేవుని తోడు మనకుండగా (2)
హల్లెలూయ అంటు ఆరా-ధింతుము ఎల్లప్పుడూ (2)
యేసుని సన్నిధిలో ధైర్యమొందెదం (2)      ||ఆనందింతుము||

నీతి లేని లోకంతో స్నేహం ఎందుకూ
నీతి సూర్యుడైన యేసు మనకూ ఉండగా (2)
పరిశుద్దుడంటూ పొగడి కొలిచెదము అనుదినం (2)
యేసుని సన్నిధిలో పరవశించెదం (2)      ||ఆనందింతుము||

ప్రేమలేని హితుల సఖ్యం ఎందుకూ
ప్రేమామయుడైన ప్రభువు మనకు ఉండగా! (2)
మహిమకరుడు అంటూ మ్రొక్కి పూజింతుము అనుక్షణం (2)
యేసుని సన్నిధిలో ఉత్సాహించెదం (2)      ||ఆనందింతుము||

 

 

31 January 2022

ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను

 

 


ఆకాశమందున్న ఆసీనుడా
నీ తట్టు కనులెత్తుచున్నాను
నేను నీ తట్టు కనులెత్తుచున్నాను        |ఆకాశ|

దారి తప్పిన గొర్రెను నేను
దారి కానక తిరుగుచున్నాను (2)
కరుణించుమా యేసు కాపాడుమా        |నీ తట్టు|

గాయపడిన గొర్రెను నేను
బాగు చేయుమా పరమ వైద్యుడా (2)
కరుణించుమా యేసు కాపాడుమా        |నీ తట్టు|

పాప ఊభిలో పడియున్నాను
లేవనెత్తుమా నన్ను బాగు చేయుమా (2)
కరుణించుమా యేసు కాపాడుమా        |నీ తట్టు|

 https://www.youtube.com/watch?v=s2DJPKurZcg

 

23 September 2018

ఆనందింతు నీలో దేవా అనుదినం నిను స్తుతించుచు

ఆనందింతు నీలో దేవా
అనుదినం నిను స్తుతించుచు (2)
మధురమైన నీ నామమునే (2)
మరువక ధ్యానించెద ప్రభువా          
||ఆనందింతు||
 
 
1) ఆత్మ నాథా అదృశ్య దేవా
అఖిల చరాలకు ఆధారుండా (2)
అనయము నిను మది కొనియాడుచునే
ఆనందింతు ఆశ తీర (2)        
||ఆనందింతు||
 
 
2) నాదు జనములు నను విడచినను
నన్ను నీవు విడువకుండా (2)
నీ కను దృష్టి నాపై నుంచి
నాకు రక్షణ శృంగమైన (2)        
||ఆనందింతు||
 
 
3) శ్రేష్ఠమగు నీ స్వాస్థ్యము కొరకు
మేఘమందు రానైయున్న (2)
ఆ ఘడియ ఎప్పుడో ఎవరికి తెలుసు
అంతం వరకును భద్రపరచుము (2)        
||ఆనందింతు||
 
 
4) శ్రమలు నన్ను చుట్టిన వేళ
చింతలో కృశించిన వేళ (2)
అభయముగా నీ దర్శనమిచ్చి
శ్రమలు బాపి శాంతినిచ్చితివి (2)        
||ఆనందింతు||

10 September 2016

ashalanni neevegaa yesayya telugu lyrics




ఆనంద యాత్ర ఇది ఆత్మీ యాత్ర




Aananda Yaathra
Idi Aathmeeya Yaathra
Yesutho Noothana
Yerushalemu Yaathra 
Yesuni Rakthamu
Paapamulanundi Vidipinchunu
Veyi Nollatho Sthuthinchinanu
Theerchalemu Aa Runamunu             
Raathriyu Pagalunu
Paadamulaku Raayi Thagalakunda
Manaku Paricharya Cheyuta Koraku
Deva Doothalu Manakundagaa          
Kruthagnatha Leni Vaaru
Velakoladiga Koolinanu
Krupaa Vaakyamunaku Saakshulamai
Krupa Vembadi Krupa Pondedamu      
Aanandam Aanandam
Yesuni Chooche Kshanam Aasannam
Aathmaananda Bharithulamai
Aagamanaakaankshatho Saagedan


17 November 2015

ఆరాధించెదను నిన్ను, నా యేసయ్య - ఆత్మతో సత్యముతో





పల్లవి  ఆరాధించెదను నిన్ను, నా యేసయ్య  - ఆత్మతో సత్యముతో                  (2X)
ఆనందగానముతో -  ఆర్భటనాదముతో                                  (2X)
ఆరాధించెదను నిన్ను, నా యేసయ్య -  ఆత్మతో సత్యముతో                    (2X)
1.       నీ జీవవాక్యము నాలో -   జీవము కలిగించే                                             (2X)
జీవిత  కాలమంత,  నా యేసయ్య  -  నిన్నే కొలిచెదను                            (2X)
ఆరాధించెదను నిన్ను, నా యేసయ్య  -  ఆత్మతో సత్యముతో   (2X)
2.       చింతలెన్ని కలిగినను -  నిందలన్ని నన్ను చుట్టినా                                 (2X)
సంతోషముగ నేను,   నా యేసయ్య -  నిన్నే వెంబడింతును                    (2X)
ఆరాధించెదను నిన్ను, నా యేసయ్య  -  ఆత్మతో సత్యముతో                   (2X)
ఆనందగానముతో -  ఆర్భటనాదముతో                                                    (2X)
ఆరాధించెదను నిన్ను, నా యేసయ్య  - ఆత్మతో సత్యముతో                   (2X)
 

9 November 2015

ఆడెదన్, పాడెదన్, యేసుని సన్నిధిలో యేసుని సన్నిధిలో





డెదన్ పాడెదన్
పల్లవి:    డెదన్, పాడెదన్, యేసుని సన్నిధిలో యేసుని సన్నిధిలో
స్తుతింతును ఆరాధింతున్ యేసుని సన్నిధిలో
ఉజ్జీవ మిచ్చిన దేవుని సన్నిధిలో
ఆడెదన్, పాడెదన్, యేసుని సన్నిధిలో నను బలపరచిన దేవుని సన్నిధిలో
స్తుతింతును ఆరాధింతున్ యేసుని సన్నిధిలో
ఉజ్జీవ మిచ్చిన దేవుని సన్నిధిలో
1.        నను దర్శించి నూతన జీవం యిచ్చిన సన్నిధిలో
నను బలపరచి ఆదరించిన యేసుని సన్నిధిలో                             (2X)
ఆడెదన్, పాడెదన్ దేవుని సన్నిధిలో
స్తుతించెదన్ స్తుతించెదన్ ఆరధించెదన్ ఆరధించెదన్ దేవుని సన్నిధిలో
ఆడెదన్, పాడెదన్, యేసుని సన్నిధిలో నను బలపరచిన దేవుని సన్నిధిలో
స్తుతింతును ఆరాధింతున్ యేసుని సన్నిధిలో
ఉజ్జీవ మిచ్చిన దేవుని సన్నిధిలో
2.        పరిశుద్దాత్మజ్వాల రగిలించి నన్ను మండించిన సన్నిధిలో
పరిశుద్దాత్మలో నను అభిషేకించిన యేసుని సన్నిధిలో                     (2X)
ఆడెదన్, పాడెదన్ దేవుని సన్నిధిలో
స్తుతించెదన్ స్తుతించెదన్ ఆరధించెదన్ ఆరధించెదన్ దేవుని సన్నిధిలో
ఆడెదన్, పాడెదన్, యేసుని సన్నిధిలో యేసుని సన్నిధిలో
స్తుతింతును ఆరాధింతున్ యేసుని సన్నిధిలో
ఉజ్జీవ మిచ్చిన దేవుని సన్నిధిలో
ఆడెదన్, పాడెదన్, యేసుని సన్నిధిలో నను బలపరచిన దేవుని సన్నిధిలో
స్తుతింతును ఆరాధింతున్ యేసుని సన్నిధిలో
ఉజ్జీవ మిచ్చిన దేవుని సన్నిధిలో

Join Telegram

Join Telegram
Telugu Christian Lyrics