-:A:B:C:D:E:F:G:H:I:J:K:L:M:N:O:P:Q:.R:S:T:U:V:W:X:Y:Z:-

Showing posts with label S. Show all posts
Showing posts with label S. Show all posts

23 September 2024

స్తుతించుడి యెహోవా దేవుని సూర్యచంద్రులారా

 


స్తుతించుడి యెహోవా దేవుని సూర్యచంద్రులారా
పవిత్ర దూతగణ సేనాధిపతికి
ఉన్నతస్థలములలో యెహోవాను స్తుతించుడి ||స్తుతించుడి||

కాంతిగల నక్షత్రములారా పరమాకాశమా (2)
ఆకాశజలమా ఆవిరి హిమమా అగ్ని తుఫాను
మహాసముద్ర పర్వత వృక్ష మృగములు పశువులారా
ప్రశంసించుడి ఫలవృక్షములు పరమ తండ్రిని
యెహోవాను స్తుతించుడి ||స్తుతించుడి||

రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారా (2)
బాలురు యౌవన కన్యక వృద్ధులు ప్రభునుతించుడి
ప్రాకు జీవులు పలువిధ పక్షులు పాడి స్తుతించుడి
ప్రశంసించుడి ప్రభావ మహిమలు పరమ తండ్రిని
యెహోవాను స్తుతించుడి ||స్తుతించుడి||

 

 

3 August 2024

స్తుతులకు పాత్రుడా.... స్తోత్రాలకు అర్హుడా...

 


స్తుతులకు పాత్రుడా....  స్తోత్రాలకు అర్హుడా...
రాజులకు రాజా..   రక్షణ నిచ్చు దేవా...
స్తోత్రము యేసయ్య.... స్తుతి స్తోత్రం నీకే నయ్యా...


బంధుమిత్రులు నన్ను వీడి..... ఒంటరిగా ఉన్న నన్ను.. .
వెతికి రక్షించి.... కరుణించి కాపాడిన దేవాది దేవా...
స్తోత్రము యేసయ్య.... స్తుతి స్తోత్రం నీకే నయ్యా.

వేదనలో వెతికితిని.... వేసారి పోతిని....
వెంట ఎవరూ లేక..... ఒంటరినై ఏడ్చుంటిని...
నన్ను చూసి...  నా దరికి చేరి... నన్ను రక్షించిన.. దేవాది దేవా....
స్తోత్రము యేసయ్య.... స్తుతి స్తోత్రం నీకే నయ్యా.

14 May 2022

సాక్ష్యమిచ్చెద మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను దెల్పుటయే

 

 


 

సాక్ష్యమిచ్చెద మన స్వామి యేసు దేవుడంచు
సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను దెల్పుటయే (2)
సాక్ష్య మిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించె నంచు              ||సాక్ష్య||

దిక్కు దెసయు లేని నన్ను దేవుడెంతో కనికరించి (2)
మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతి నిచ్చినడో                    ||సాక్ష్య||

పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నా పైని గలదు (2)
పిల్లలకును బెద్దలకును బ్రేమతో నా స్వానుభవము              ||సాక్ష్య||

బోధ చేయలేను వాద ములకు బోను నాక దేల (2)
నాధు డేసు ప్రభుని గూర్చి నాకు దెలసినంత వరకు              ||సాక్ష్య||

పాపులకును మిత్రుడంచు బ్రాణ మొసగి లేచెనంచు (2)
బాపముల క్షమించు నంచు బ్రభుని విశ్వసించు డంచు          ||సాక్ష్య||

చోరు లైన జారు లనా చారు లైన నెవ్వరైన (2)
ఘోరపాపు లైన క్రీస్తు కూర్మితో రక్షించు నంచు                     ||సాక్ష్య||

పరమత దూషణము లేల పరిహసించి పలుకు టేల (2)
ఇరుగు పొరుగు వారి కెల్ల యేసు క్రీస్తు దేవు డంచు                ||సాక్ష్య||

ఎల్లకాల మూరకుండ నేల యాత్మ శాంతి లేక (2)
తల్లడిల్లు వారలకును తండ్రి కుమా రాత్మ పేర                       ||సాక్ష్య||

 

18 March 2022

సిలువే నా శరణాయెను రా నీ సిలువే నా శర ణాయెను రా

 

 

సిలువే నా శరణాయెను రా నీ సిలువే నా శర ణాయెను రా సిలువ
యందే ముక్తి బలముఁ జూచితి రా ||నీ సిలువే||

1. సిలువను వ్రాలి యేసు పలికిన పలుకు లందు విలువలేని
ప్రేమామృతముఁ గ్రోలితి రా ||నీ సిలువే||


2. సిలువను జూచుకొలఁది శిలసమానమైన మనసు నలిగి కరిగి నీరగు
చున్నది రా ||నీ సిలువే||


3. సిలువను దరచి తరచితి విలువ కందఁగ రాని నీ కృప కలుష మెల్లనూ
బాపఁగఁ జాలును రా ||నీ సిలువే||


4. పలు విధ పథము లరసి ఫలిత మేమి గానలేక సిలువయెదుటను
నిలచినాఁడను రా ||నీ సిలువే||


5. శరణు యేసు శరణు శరణు శరణు శరణు నా ప్రభువా దురిత
దూరుఁడ నీ దరిఁ జేరితి రా ||నీ సిలువే||

 

8 March 2021

సర్వకృపానిధియగు ప్రభువా - సకల చరాచర సంతోషమా

 



 

1.       సర్వకృపానిధియగు ప్రభువా - సకల చరాచర సంతోషమా 

స్తోత్రము చేసి స్తుతించెదము -  సంతోషముగ నిను పొగడెదము 

 

పల్లవి:            హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ హల్లెలూయా 

హల్లెలూయ యని పాడెదను - ఆనందముతో సాగెదను

 

2.       ప్రేమించి నన్ను వెదకితివి - ప్రీతితో నను రక్షించితివి

పరిశుద్దముగ జీవించుటకై - పాపిని నను  కరుణించితివి                    .. హల్లెలూయ..

 

3.       మరణ శరీరము మార్పు నొంది - మహిమ శరీరము పొందుటకై 

మహిమాత్మతో నను నింపితివి  - మరణ భయములను తీర్చితివి  .. హల్లెలూయ..

https://youtu.be/xv-PqYciO7E


Tags: telugu christian songs lyrics app telugu christian songs lyrics pdf download telugu christian songs lyrics and chords telugu christmas songs lyrics pdf a.r. stevenson songs lyrics in telugu telugu christian songs lyrics in powerpoint hosanna telugu christian songs lyrics jesus songs lyrics

2 December 2020

స్తుతి గానమే పాడనా జయగీతమే పాడనా

 స్తుతి గానమే పాడనా
జయగీతమే పాడనా (2)
నా ఆధారమైయున్న
యేసయ్యా నీకు – కృతజ్ఞుడనై
జీవితమంతయు సాక్షినై యుందును (2) ||స్తుతి||


నమ్మదగినవి నీ న్యాయ విధులు
మేలిమి బంగారు కంటే – ఎంతో కోరతగినవి (2)
నీ ధర్మాసనము – నా హృదయములో
స్థాపించబడియున్నది – పరిశుద్ధాత్మునిచే (2) ||స్తుతి||

శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు
లౌకిక జ్ఞానము కంటే – ఎంతో ఉపయుక్తమైనవి (2)
నీ శ్రేష్టమైన – పరిచర్యలకై
కృపావరములతో నను – అలంకరించితివే (2) ||స్తుతి||


నూతనమైనది నీ జీవ మార్గము
విశాల మార్గము కంటే – ఎంతో ఆశించదగినది (2)
నీ సింహాసనము – నను చేర్చుటకై
నాతో నీవుంటివే – నా గురి నీవైతివే (2) ||స్తుతి||

స్తోత్రబలి స్తోత్రబలీ మంచి దేవ నీకేనయ్యా sthothrabhali sthrothrabhali

 స్తోత్రబలి స్తోత్రబలీ మంచి దేవ నీకేనయ్యా
శుభవేళ ఆనందమే నాతండ్రీ నీ చిరుపాదమే


1. నిన్నటి బాధలంతా - నేటికి మాయమయ్యే -2
నెమ్మది ఉదయించే - అది శాశ్వతమైనదయ్యా -2
కోటి, కోటి స్తోత్రం డాడి (తండ్రి)- 2 "స్తోత్ర"


2. రేయంతా కాచితివి - మరుదినమిచ్చితివి -2
మరువని నా స్నేహమా - కలసి సంతోషింతును -2
కోటి, కోటి స్తోత్రం డాడి (తండ్రి)- 2 "స్తోత్ర"

3. నీసేవ మార్గములో - ఉత్సాహం నొసగితివి -2
ఉరికురికి పనిచేయ - నాకారోగ్యమిచ్చితివి
కోటి, కోటి స్తోత్రం డాడి (తండ్రి)- 2 "స్తోత్ర"


4. వేదన ధుఖ:మైనా - ఎన్నడు విడదీయదు -2
యేసయ్యా నీ నీడలో దిన దినం జీవింతును -2
కోటి, కోటి స్తోత్రం డాడి (తండ్రి)- 2 "స్తోత్ర"

స్తోత్రం చెల్లింతుము - స్తుతి స్తోత్రం చెల్లింతుము

పల్లవి: స్తోత్రం చెల్లింతుము - స్తుతి స్తోత్రం చెల్లింతుము (2X)

యేసు నాథుని మేలులు తలంచి (స్తోత్రం)

1. దివారాత్రములు - కంటిపాపవలె కాచి (2X)

దయగల హస్త్తముతో - బ్రోచి నడిపించితివి (స్తోత్రం)


2. గాడాందకారములో - కన్నీటి లోయలలో (2X)

క్రుసించి పోనీయక - క్రుపలతో బలపరచితివి (స్తోత్రం)


3. సజీవ యాగముగా - మా శరీరము సమర్పించి (2X)

సంపూర్ణ సిద్దినొంద - శుద్దాత్మను నొసగి తివి (స్తోత్రం) 

27 March 2020

సిలువా ఓ సిలువా నీకెందుకే ఈ విలువ


సిలువా ఓ సిలువా నీకెందుకే ఈ విలువ "2"
యేసయ్యా నిను ఎత్తుకున్నందుకా నీవు యేసయ్యను మోసినందుకా "2"
                                   "సిలువ"

1.మా పాప భారమంతా మోసాడు కల్వరి గిరిలో మా పాప పరిహారముకై చిందించాడు తన రక్తమంతా "2"
మన కొరకై తన ప్రాణమిచ్చెను పునరుత్థానుడై తిరిగి లేచెను "2"
అందుకే నాకీ విలువా "2"
                                   "సిలువ"

2.బంధిచిన బంధకాలంతా దించాడు సిలువలో నాకై నా దాస్యపు బ్రతుకంతా విడిపించాడు యేసయ్య నాకై "2"
రాజరికము నాకు ఇచ్చి తన రాజ్యమునే సిద్ధపరచెను "2"
అందుకే నాకీ విలువా తెలుసుకోవే సిలువ
                                   "సిలువ"


సిలువలో వ్రేలాడుచున్న యేసుని చూడు పాపులకై ప్రాణం విడిచిన యేసుని చూడు



సిలువలో వ్రేలాడుచున్న యేసుని చూడు పాపులకై ప్రాణం విడిచిన యేసుని చూడు "2"
నీ కోసమే నా కోసమే మనలను  రక్షించుటకోసమే "2"

                                  "సిలువలో"

1.నా పాపములన్నీ నా శాపములన్నీ సిలువలో నీ రక్తముతో కడిగినావు "2"
ఏ పాపము లేని నీవు లోక పాపములను "2"
సిలువలో మాకై విడిపించావు "2"
                                  "సిలువలో"

2.ద్రోహినైన (నన్ను) నా పాప దోషాలు (ఎన్నో) సిలువలో నీవే తొలిగించావు
ఏ దోషము లేని నీవు లోక దోషములను "2"
సిలువలో మాకై భరియించావు "2"
                                  "సిలువలో"

3.నా మరణ శిక్షకై నా పాప క్షమాపణకై కలువరి సిలువలో ప్రాణం అర్పించావు "2"
ఏ శిక్ష లేని నీకు లోక శిక్షలన్నిటికై "2"
సిలువలో ఘోరంగా మరణించావు "2"


సిలువ సిలువ శ్రేమల సిలువ యేసు క్రీస్తు మరణ విలువ


సిలువ  సిలువ  శ్రేమల   సిలువ  యేసు  క్రీస్తు  మరణ  విలువ 
పాపా  క్షమాల   ప్రభలు  వెలిగిన  శోకమూర్తి  వేధన
ప్రేమమూర్తి  తూలి  సోలిన  కన్నీటి  శోధన



1. ఒలీవల  కొండపైన  దీనుడై   విజ్ఞాపన
గెత్సేమనే  వనములో  రాత్రంతా  ప్రార్ధన
సిలువవేసే  పాపకర్ముల  మన్నించు  నివేధనా 


2. గోడు  గోడున  యేడ్చుచు  ఏడూ  మాటలుపాల్కేను
కృంగిపోయిన  దొంగకూడ  యేసు  మాటను  నమ్మెను
నీతి  దర్మం  తెలిసి  ప్రభువు  ఘోర   బాధలనోర్చెను



3 March 2019

సంబరమాయె బేత్లెహేములో సందడియాయె పశులపాకలో



సంబరమాయె బేత్లెహేములో
సందడియాయె పశులపాకలో /2/
​నీతిమంతుడు సర్వశక్తునిగా లోకరక్షకునిగా..
యేసు అవతరించెను
లోక రక్షకునిగా క్రీస్తు ఉదయించెను /సంబర/


​1. దూత చెప్పిన వార్తతో యేసును చూడవెళ్లే గొల్లలు /2/
 ​రక్షకుడేసు పుట్టాడని – క్రీస్తే వెలుగుగ వచ్చాడని /2/
రక్షణ మనకు తెచ్చాడని… 
పరుగున వెళ్లారు – యేసును చూచారు
పాటలు పాడారు – నాట్యం చేశారు /2/సంబర/

2. తార చూపిన దారిలో – యేసుని చూడవెళ్ళే గొల్లలు /2/
యూదుల రాజుని చూడాలని
భక్తితో యేసుని మ్రొక్కాలని /2/
త్వరపడి యేసుని చేరాలని..
 వేగమె వెళ్లారు – యేసుని చూచారు
కానుక లిచ్చారు – యేసుని పూజించారు /2/సంబర



సీయోనులో నుండి నీవు ప్రకాశించూచున్నావు నాపై




సీయోనులో నుండి నీవు 
ప్రకాశించూచున్నావు నాపై     " 2 "
 సమాధానమై సదాకాలము
 నను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై
 సీయోనులో మహోన్నతుడా యేసయ్య

                           "  సీయోనులో  "

నిర్దోషమైన మార్గములో నా
అంతరంగమున ధైర్యము నిచ్చి " 2 "
నీ సన్నిధిలో నను నిలిపి
ఉన్నత విజయము నిచ్చితివి   " 2 "
నీ ఆశలు నెరవేరుటకు
నీ చిత్తము జరిగించుటకు
విడువవు నను ఎడబాయవు    " 2 "
                            "  సీయోనులో  "

నాయందు దృష్టి నిలిపి
నీ స్నేహబంధముతో ఆకర్షించి   " 2 "
కృపావరములతో నను నింపి
సత్యసాక్షిగా మర్చితివి              " 2 "
నీ మనసును పొందుకొని
నీ ప్రేమను నింపుకొని
కీర్తించెదను ప్రతి నిత్యం
నిను ఆరాదింతును అనుక్షణం
                              *"  సీయోనులో  "*

దేదివ్యమైన మహిమను
పరలోకమందు నే చూచెదను " 2 "
నీ కౌగిలిలో  చేర్చుకొని
ప్రతి భాష్ప బిందువును తుడిచెదవు " 2 "
నీ మాటల మకరందమును
మరపురాని అనుబంధమును
మరువను ఎన్నడు విడువను
నేను మరువను ఎన్నడు విడువను
                                *"  సీయోనులో  "*

  
     *Hosanna Ministry 2019*
            *New Year Song*


10 September 2016

సంతోషించుమా ఓ యెరుషలేమా





సంతోషించుమా ఓ యెరుషలేమా
సర్వోన్నతుని జనాంగమా
ఆనందించుమా సియోను నగరమా
ఉత్సహించి పాడుమా
షాలోం.. షాలోం యెరుషలేమా
సమాధానము నిత్యం నీకు సమాధానము
1. భూరాజులందరు నిన్ను గూర్చి
ఒక దినము ఇలలో సంతోషించును
అంజుర వృక్షమైన నీ చేతి కొమ్మలు
చిగురించి ఫలియించును
షాలోం.. షాలోం యెరుషలేమా

సమాధానము నిత్యం నీకు సమాధానము
2. సర్వలోకమంతయు నీ ద్వారా
ఆశీర్వదించ బడియుండెను
నీలోన పుట్టిన రక్షకుడు
లోకాన్ని రక్షించెను
షాలోం.. షాలోం యెరుషలేమా
సమాధానము నిత్యం నీకు సమాధానము


Tags:Santhosinchuma

29 November 2015

శుద్ధ హృదయం కలుగజేయుము




శుద్ధ హృదయం కలుగజేయుము (3)
నీ వాత్సల్యం నీ బాహుళ్యం
నీ కృపా కనికరం చూపించుము (2)
పాపము చేసాను దోషినై ఉన్నాను (2)
తెలిసియున్నది నా అతిక్రమమే
తెలిసియున్నది నా పాపములే (2)
నీ సన్నిధిలో నా పాపములే
ఒప్పుకొందునయ్యా (2)
శుద్ధ హృదయం కలుగజేయుము (2)
నాలోనా నాలోనా (2)
శుద్ధ హృదయం కలుగజేయుము (3)
నీ జ్ఞానమును నీ సత్యమును
నా ఆంతర్యములో పుట్టించుము (2)
ఉత్సాహ సంతోషం నీ రక్షనానందం
కలుగజేయుము నా హృదయములో (4)
నీ సన్నిధిలో పరిశుద్దాత్మతో
నన్ను నింపుమయ్యా (2)         ||శుద్ధ||

Lyrics:
Shudhdhaa Hrudayam Kalugajeyumu (3)
Nee Vaathsalyam Nee Baahulyam
Nee Krupaa Kanikaram Choopinchumu (2)
Paapamu Chesaanu Doshinai Unnaanu (2)
Thelisiyunnadi Naa Athikramame
Thelisiyunnadi Naa Paapamule (2)
Nee Sannidhilo Naa Paapamule
Oppukondunayyaa (2)
Shudhdhaa Hrudayam Kalugajeyumu ||2||
Naalonaa Naalonaa (2)
Shudhdhaa Hrudayam Kalugajeyumu (3)
Nee Gnaanamunu Nee Sathyamunu
Naa Aantharyamulo Puttinchumu (2)
Utsaaha Santhosham Nee Rakshanaanandam
Kalugajeyumu Naa Hrudayamulo (4)
Nee Sannidhilo Parishudhdhaathmatho
Nannu Nimpumayyaa (2)    ||Shudhdhaa||



Join Telegram

Join Telegram
Telugu Christian Lyrics