దేవా నీ కృప పొందుటకు - నాలోన ఏమున్నది
మలినమైనది నా గతం - చేజారినది నా జీవితం
ఉదయించే నాలో నీ స్వరం - వికసించెనుగా నా హృదయం
యేసు నీ కృపయేగా - ఇది నీ కృపయేగా
ఇది నీ కృపయేగా - వేరే లేదుగా !
వేషధారివని లోకం వెక్కిరించుచుండగా
దారి మరచి నిన్నే విడిచి నీకు దూరమవ్వగా
కోర్కెలన్ని కన్నీలై - కడకు నిన్ను చేరగా
కనికరించి ఓదార్చి స్వీకరించినావుగా
యేసు నీ కృపయేగా - ఇది నీ కృపయేగా
ఇది నీ కృపయేగా - వేరే లేదుగా !
ఏ యోగ్యత లేని నన్ను నీవెన్నుకున్నావు
నీ ఉన్నత సేవకు నన్ను పిలుచుకొన్నావు
ఉప్పులా ఉండాలని - ఊటనై పారాలని
నీలోన నిలచి నే ఫలియించాలని
యేసు నీ కృపయేగా - ఇది నీ కృపయేగా
ఇది నీ కృపయేగా - వేరే లేదుగా !
Telugu Kristva keertanalu, Tamil Kristva keertanalu,Hindi Kristva keertanalu,Telugu Hindi Tamil Kannada, Maliyalamu Christan Songs
29 September 2024
దేవా నీ కృప పొందుటకు - నాలోన ఏమున్నది
8 March 2021
దీనుడా అజేయుడా - ఆదరణ కిరణమా ! Deenudaa Ajeyudaa Hossnna Songs 2021
దీనుడా అజేయుడా - ఆదరణ కిరణమా
పూజ్యుడా పరిపూర్ణుడా - ఆనంద నిలయమా
జీవదాతవు నీవని శృతిమించి పాడనా
జీవధారవు నీవని కానుకనై పూజించనా
అక్షయ దీపము నీవే - నా రక్షణ శృంగము నీవే
స్వరార్చన చేసిద నీకే - నా స్తుతులర్పించెద నీకే
1: సమ్మతిలేని సుడిగుండాలే - ఆవరించగా
గమనములేని పోరాటాలే - తరుముచుండగా
నిరుపేదనైన నాయెడల - సందేహమేమి లేకుండా
హేతువేలేని - ప్రేమ చూపించి - సిలువచాటునే దాచావు
సంతోషము నీవే - అమృత సంగీతము నీవే
స్తుతిమాలిక నీకే - వజ్రసంకల్పము నీవే "దీనుడా"
2: సత్య ప్రమాణము నెరవేర్చుటకే - మార్గదర్శివై
నిత్యనిబంధన నాతో చేసిన - సత్యవంతుడా
విరిగి నలిగిన మనస్సుతో - హృదయార్చనే చేసేద
కరుణనీడలో - కృపావాడలో - నీతో ఉంటే చాలయ్యా
కర్తవ్యము నీవే - కనుల పండుగ నీవేగా
విశ్వాసము నీవే - విజయశిఖరము నీవేగా "దీనుడా"
3: ఊహకందని ఉన్నతమైనది - దివ్యనగరమే
స్పటికము పోలిన సుందరమైనది - నీరాజ్యమే
ఆ నగరమే లక్ష్యమై - మహిమాత్మతో నింపినావు
అమరలోకాన - నీసన్నిధిలో - క్రొత్త కీర్తనే పాడెదను
ఉత్సాహము నీవే - నయనోత్సవం నీవేగా
ఉల్లాసము నీలో - ఊహలపల్లకి నీవేగా "దీనుడా"
4 November 2015
దేవుని ప్రేమ - దేవుని ప్రేమ - శాశ్వతమైన ప్రేమ
దేవుని ప్రేమ - దేవుని ప్రేమ - శాశ్వతమైన ప్రేమ - 2
నిన్నా నేడూ ఎల్లపుడూ - మారని యేసు ప్రేమ - 2
1. ప్రతిదినం ప్రత్యేకముగా - కాచి కాపాడే ప్రేమ
అన్నివేళలలో నన్ను - లాలించే దివ్య ప్రేమ
ఆశీర్వదించే ప్రేమా - ఆదరణ చూపే ప్రేమా - 2
2. తల్లిదండ్రులు విడచినా - వీడని నా యేసు ప్రేమ
ఎన్ని బాధలు కలిగినా - నాకు తోడుగా నిలిచే ప్రేమ
నన్ను నడిపించే ప్రేమా - నా యేసు క్రీస్తుని ప్రేమా - 2
దేవుని స్తుతియించుడి - ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి ఆ ..
దేవుని స్తుతియించుడి - ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి ఆ ..
1. ఆయన పరిశుద్ద ఆలయమందు - ఆయన సన్నిదిలో
ఆ .. ఆ .. ఆయన సన్నిదిలో - ఎల్లప్పుడు
2. ఆయన బలమును ప్రసిద్ది చేయు - ఆకాశ విశాలమందు
ఆ .. ఆ.. ఆకాశ విశాలమందు - ఎల్లప్పుడు
3. ఆయన పరాక్రమ కార్యముల్ బట్టి - ఆయన ప్రభావమును
ఆ..ఆ.. ఆయన ప్రభావమును - ఎల్లప్పుడు
4. బూర ధ్వనితో ఆయనన్ స్తుతియించుడి - స్వరమండలములతో
ఆ...ఆ.. స్వరమండలములతో - ఎల్లప్పుడు
5. సన్నాతంత్రుల సితారతోను - చక్కని స్వరములతో
ఆ..ఆ.. చక్కని స్వరములతో - ఎల్లప్పుడు
6. తంబురతోను నాట్యముతోను - తంతి వాయిద్యములతో
ఆ..ఆ.. తంతి వాయిద్యములతో - ఎల్లప్పుడు
7. పిల్లన గ్రోవులు చల్లగానూది - ఎల్ల ప్రజలు చేరి
ఆ..ఆ.. ఎల్ల ప్రజలు చేరి - ఎల్లప్పుడు
8. మ్రోగు తాళములతో ఆయనను స్తుతియించుడి గంభీర తాళముతో
ఆ..ఆ.. గంభీర తాళముతో - ఎల్లప్పుడు
9. సకలా ప్రాణులు యెహోవాను స్తుతియించుడి - హల్లెలుయా ఆమెన్
ఆ..ఆ.. హల్లెలుయా ఆమెన్ - ఎల్లప్పుడు

