-:A:B:C:D:E:F:G:H:I:J:K:L:M:N:O:P:Q:.R:S:T:U:V:W:X:Y:Z:-

Showing posts with label . Show all posts
Showing posts with label . Show all posts

30 June 2022

చేయి పట్టుకో నా చేయి పట్టుకో

 

 


 

చేయి పట్టుకో నా చేయి పట్టుకో
జారిపోకుండా నే పడిపోకుండా
యేసు నా చేయి పట్టుకో (2)        ||చేయి||

 

కృంగిన వేళ ఓదార్పు నీవేగా
నను ధైర్యపరచు నా తోడు నీవేగా (2)
మరువగలనా నీ మధుర ప్రేమను
యేసు నా జీవితాంతము (2)
యేసు నా జీవితాంతము              ||చేయి||

 

శోధన బాధలు ఎన్నెన్నో కలిగినా
విశ్వాస నావలో కలకలమే రేగిననూ (2)

విడువగలనా ఒక నిమిషమైననూ
యేసు నా జీవితాంతము (2)
యేసు నా జీవితాంతము        
     ||చేయి
||

7 March 2021

చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్లెంత కాలం

 

చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్లెంత కాలం

 కష్టాల బాటలోనె సాగదు పయనం

విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును

 

1.  నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు యిచ్చునులె

నీవు పొందిన వేదనలన్ని త్వరలో తీరిపోవునులె

నీ స్థితి చూసి నవ్వినవారే సిగ్గుపడే దినమొచ్చేనులే

 విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును

 

 2.  అనుభవించిన లేమి బాధలు ఇకపై నీకు వుండవులే

 అక్కరలోన ఉన్నవారికి నీవే మేలు చేసే వులే

మొదట నీ స్థితి కోంచమె ఉన్న తుదకు వృద్ధిని పొందునులే

విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును

 

 


 Tags: Inspirational song , telugu christan  songs ,telugu christian songs mp3 download
telugu christian songs lyrics
telugu christian songs audio
jesus songs telugu download 2020
jesus songs telugu list
jesus songs mp3

9 November 2015

చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా








పల్లవి:    చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా                           (2X)
నా తోడు  నీవయ్యా, నీ స్నేహం  చాలయ్యా
నా నీడ  నీవయ్యాప్రియ ప్రభువా యేసయ్యా
చిరకాల స్నేహంఇధి నా యేసు  స్నేహం                                              (2X)
  1. బంధువులు వెలివేసిన, వెలివేయని  స్నేహం
లోకాన లేనట్టి ఓ దివ్య  స్నేహంనాయేసుని  స్నేహం
చిరకాల స్నేహంఇధి నా యేసు  స్నేహం                                              (2X)
  1. కష్టాలలో, కన్నీళ్లలోనను మోయు  నీ స్నేహం
నను ధైర్యపరచి  ఆదరణ కలిగించు, నాయేసుని  స్నేహం
చిరకాల స్నేహంఇధి నా యేసు  స్నేహం                                              (2X)
  1. నిజమైనది, విడువనిధిప్రేమించు నీ స్నేహం
కలువరిలొ చూపినఆ సిలువ స్నేహంనాయేసుని  స్నేహం
చిరకాల స్నేహంఇధి నా యేసు  స్నేహం                                              (2X)
చిరకాల స్నేహితుడా

Join Telegram

Join Telegram
Telugu Christian Lyrics