-:A:B:C:D:E:F:G:H:I:J:K:L:M:N:O:P:Q:.R:S:T:U:V:W:X:Y:Z:-

29 September 2024

దేవా నీ కృప పొందుటకు - నాలోన ఏమున్నది



దేవా నీ కృప పొందుటకు - నాలోన ఏమున్నది
మలినమైనది నా గతం - చేజారినది నా జీవితం
ఉదయించే నాలో నీ స్వరం - వికసించెనుగా నా హృదయం

యేసు నీ కృపయేగా - ఇది నీ కృపయేగా
ఇది నీ కృపయేగా - వేరే లేదుగా !


వేషధారివని లోకం వెక్కిరించుచుండగా
దారి మరచి నిన్నే విడిచి నీకు దూరమవ్వగా
కోర్కెలన్ని కన్నీలై - కడకు నిన్ను చేరగా
కనికరించి ఓదార్చి స్వీకరించినావుగా

యేసు నీ కృపయేగా - ఇది నీ కృపయేగా
ఇది నీ కృపయేగా - వేరే లేదుగా !


ఏ యోగ్యత లేని నన్ను నీవెన్నుకున్నావు
నీ ఉన్నత సేవకు నన్ను పిలుచుకొన్నావు  
ఉప్పులా ఉండాలని - ఊటనై పారాలని
నీలోన నిలచి నే ఫలియించాలని

యేసు నీ కృపయేగా - ఇది నీ కృపయేగా
ఇది నీ కృపయేగా - వేరే లేదుగా !


No comments:

Post a Comment

Join Telegram

Join Telegram
Telugu Christian Lyrics