-:A:B:C:D:E:F:G:H:I:J:K:L:M:N:O:P:Q:.R:S:T:U:V:W:X:Y:Z:-

Showing posts with label . Show all posts
Showing posts with label . Show all posts

15 September 2024

ఎంతటి వాడను నేను యేసయ్యా

 

 ఎంతటి వాడను నేను యేసయ్యా


 

ఎంతటి వాడను నేను యేసయ్యా
కొంతైనా యోగ్యుడను కానయ్యా (2)
ఇంతగ నను హెచ్చించుటకు
ఈ స్థితిలో నన్నుంచుటకు (2)            ||ఎంతటి||

ఐశ్వర్యము గొప్పతనమును
కలిగించు దేవుడవీవే
హెచ్చించువాడవును
బలమిచ్చువాడవు నీవే (2)
అల్పుడను మంటి పురుగును
నన్ను ప్రేమించినావు
ప్రాణమును నీ సర్వమును
నా కొరకై అర్పించినావు            ||ఎంతటి||

నిను వెంబడించువారిని
నిజముగ సేవించువారిని
నీవుండే స్థలములలో
నిలిచే నీ సేవకుని (2)
ఎంతో ఘనపరచెదవు
ఆశీర్వదించెదవు
శత్రువుల కంటె ఎత్తుగా
అతని తలను పైకెత్తెదవు ||ఎంతటి||

వినయముగల మనుష్యులను
వర్దిల్లజేసెదవు
గర్విష్టుల గర్వమునణచి
గద్దె నుండి దించెదవు (2)
మాదు ఆశ్రయ దుర్గమా
మేమంతా నీ వారమే
మా శైలము మా కేడెమా
మాకున్నదంతా నీ దానమే          ||ఎంతటి||

 

3 August 2024

ఎటు చూచినా యుద్ధ సమాచారాలు ఎటు చూచినా కరువూ భూకంపాలు

 


 

ఎటు చూచినా యుద్ధ సమాచారాలు
ఎటు చూచినా కరువూ భూకంపాలు
ఎటు చూచినా దోపిడీ దౌర్జన్యాలు
ఎటు చూచినా ఎన్నో అత్యాచారాలు
ఓ సోదరా ఓ సోదరీ (2)
రాకడ గురుతులని తెలుసుకోవా
తినుటకు త్రాగుటకు ఇది సమయమా       ||ఎటు||

మందసము నీ ప్రజలు – గుడారములో నివసిస్తుండగ
యోవాబుని సేవకులు దండులో నుండగను (2)
తినుటకు త్రాగుటకు భార్యతో నుండుటకు (2)
ఇది సమయమా.. ఇది సమయమా.. అని
ఆనాడు ఊరియా దావీదునడిగాడు
ఈనాడు నిన్ను కూడా ప్రభువు అడుగుచున్నాడు      ||ఎటు||

నా పితరుల యొక్క – సమాధులుండు పట్టణము
పాడైపోయెను పాడైపోయెను (2)
యెరూషలేము గుమ్మములు అగ్ని చేత కాల్చబడగా (2)
సంతోషముగ నుండుటకు ఇది సమయమా.. అని
ఆనాడు నెహెమ్యా పర రాజునడిగాడు
ఈనాడు నిన్ను కూడా ప్రభువు అడుగుచున్నాడు         ||ఎటు||

ఈనాడు దేశంలో ఎన్నో ఎన్నో దౌర్జన్యాలు
సజీవ దహనాలు స్త్రీల మానభంగాలు (2)
ఎన్నో గుడులు నేల మట్టం చేయబడుచుండగా (2)
తినుటకు త్రాగుటకు ఇది సమయమా అని
నీ సృష్టికర్తగు యేసు నిన్ను అడుగుచున్నాడు
ఈనాడు దేశం కొరకు ప్రార్ధించమన్నాడు         ||ఎటు||

 

8 June 2023

ఎందకనీ నేనంటే ఇంత ప్రేమ - దేనికనీ నాపైన

 


 

 ఎందకనీ నేనంటే ఇంత ప్రేమ -  దేనికనీ నాపైన - ఇంత కరుణ
జడివాన లోయలో  - ఎదురీత బాటలో   -ఎన్నడూ వీడనీ - దైవమా యేసయ్య
ఎందకనీ నేనంటే ఇంత ప్రేమ - దేనికనీ నాపైన - ఇంత కరుణ

1. ఆశ చూపే లోకం - గాయాలు రేపెనే  - గాలి వానై నాలో - నను కృంగదీసెనే
మాతృమూర్తి నీవై - లాలించె నన్నిలా  - ఆదరించసాగే - నీ ప్రేమ వెన్నెల
క్షణమైనా - యుగమైనా - నీ మమతే కనుపాపలా

2. మోయలేని భారం - నీపైన మోపగా  - ఆరిపోదు దీపం - నీ చెంతనుండగా
ఎండమావియైనా - నీ ప్రేమ చాలుగా -  ఎంత దూరమైనా - నా తోడు నీవెగా
కలనైనా - ఇలనైనా - నీ కృపలో కాపాడవా
 

 #JoshuaShaikSongs #PranamKamlakhar #Anwesshaa #JesusSongsTelugu #TeluguChristianSongs

17 June 2022

ఎవరు నన్ను చేయి విడచినన్‌ యేసు చేయి విడువడు

 

 


ఎవరు నన్ను చేయి విడచినన్‌
యేసు చేయి విడువడు (2)
చేయి విడువడు (3)
నిన్ను చేయి విడువడు ||ఎవరు ||

తల్లి ఆయనే తండ్రి ఆయనే (2)
లాలించును పాలించును (2) ||ఎవరు||

వేదన శ్రమలూ ఉన్నప్పుడల్లా (2)
వేడుకొందునే కాపాడునే (2) ||ఎవరు||

రక్తము తోడ కడిగి వేసాడే (2)
రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే (2) ||ఎవరు||

ఆత్మ చేత అభిషేకించి (2)
వాక్యముచే నడుపుచున్నాడే (2) ||ఎవరు||

17 March 2022

ఎక్కడో మనసు వెళ్ళిపోయింది ఏమిటో ఇటు రానే రానంది

 

 


ఎక్కడో మనసు వెళ్ళిపోయింది
ఏమిటో ఇటు రానే రానంది
ఆహాహా.. ఓహోహో…

నిజ ప్రేమ చెంతకు తను చేరానంటుంది
ఈ భువిలోన ఎక్కడైనను కానరాదంది (2)
అక్కడే చిక్కుకుపోయానంటుంది
బయటకు రానే రాలేనంటూ మారాము చేస్తుంది (2)         ||ఎక్కడో||

జీవితాంతము పాద చెంతనే ఉంటానంటుంది
తన ప్రియుని వదలి క్షణమైనా రాలేనన్నది (2)
దేనికీ ఇక చోటే లేదంది
యేసు రాజుని గుండె నిండ నింపుకున్నానంటుంది (2)         ||ఎక్కడో||

ఏకాంతముగా యేసయ్యతో ఉన్నానంటుంది
ఎవరైనా సరే మధ్యలో అసలెందుకు అంటుంది (2)
అక్కడే కరిగిపోతానంటుంది
ప్రేమ ప్రవాహములో మునిగి పోయానంటుంది (2)         ||ఎక్కడో||

 

 పాట రచయిత: ప్రసన్న బెన్హర్

7 April 2020

ఎఱ్ఱ సంద్రము నే చీల్చిన నీకే స్తోత్రమయ్యా



ఎఱ్ఱ సంద్రము నే చీల్చిన నీకే స్తోత్రమయ్యా
 ఎరికో గోడలే కూల్చిన నీకే స్తోత్రమయ్యా బండ నుండి నీటిని ఆకాశం నుండి మన్నాను కురిపించిన దేవా నీకే స్తోత్రం అయ్యా ఆరాధన నీకే... స్తుతి ఆరాధన నీకే
                      !!ఎఱ్ఱ సంద్రము!!



1. గాలి తుఫాను అలలచేత కొట్టబడి నేనున్నపుడు    నను ధైర్యపరచితివి నీ శక్తి నిచ్చితివి - ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే              !!ఎఱ్ఱ సంద్రము!!

2. రాజులైన యాజకునిగా నను పిలిచిన నా దేవ నీ స్వాస్యమిచ్చితివి నీ వానిగనను మార్చితివి ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే.            !!ఎఱ్ఱ సంద్రము!!


3.బాధలైన వేదనలైన నను విడువని నా యేసయ్యా ఆత్మ నిచ్చితివి నీ ప్రేమ నాపై చూపితివి ఆరాధన నీకే - స్తుతి ఆరాధన నీకే.                !!ఎఱ్ఱ సంద్రము!!


23 November 2015

ఎందుకో నన్నింతగ నీవు ప్రేమించితివో దేవా


 
పల్లవి:    ఎందుకో నన్నింతగ నీవు ప్రేమించితివో దేవా 
అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయ యేసయ్యా 
1.        నా పాపము బాప నరరూపి వైనావు - నా శాపము మాప నలిగి వ్రేలాడితివి
నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే            .. హల్లెలూయ..
2.        నీ రూపము నాలో నిర్మించి యున్నావు నీ పోలికలోనే నివసించు చున్నావు 
నీవు నన్ను ఎన్ను కొంటివి  నీ కొరకై నీ క్రుపలో                 .. హల్లెలూయ..
3.        నా శ్రమలు సహించి నా ఆశ్రయ మైనావు - నా వ్యధలు భరించి నన్నా దు కొన్నావు 
నన్ను నీలో చూచుకున్నావు నను దాచి యున్నావు         .. హల్లెలూయ..

Join Telegram

Join Telegram
Telugu Christian Lyrics