-:A:B:C:D:E:F:G:H:I:J:K:L:M:N:O:P:Q:.R:S:T:U:V:W:X:Y:Z:-

Showing posts with label . Show all posts
Showing posts with label . Show all posts

28 September 2024

నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నా యేసయ్యా

 


 

నీవు నా తోడు ఉన్నావయ్యా
నాకు భయమేల నా యేసయ్యా
నీవు నాలోనే ఉన్నావయ్యా
నాకు దిగులేల నా మెస్సయ్యా
నాకు భయమేల నాకు దిగులేల
నాకు చింతేల నాకు భీతి ఏల ||నీవు||

కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు
వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు (2)
అడిగిన వారికి ఇచ్చేవాడవు
వెదకిన వారికి దొరికేవాడవు (2)
తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు (2)
దేవా దేవా నీకే స్తోత్రం (4)

వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు
రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు (2)
నేనే సత్యం అన్న దేవా
నేనే మార్గం అన్న దేవా (2)
నేనే జీవము అని పలికిన దేవా (2)
దేవా దేవా నీకే స్తోత్రం (4) ||నీవు||

నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం

 


నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం
నిన్న నేడు నిరంతరం మారని దేవా
ఈ లోకమంత నేను వేదకినా లేదయ్యా ఎక్కడ ఆనందం
నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను(2)

1. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నను -
   ఏది నా సొంతం కాదనుకున్నాను (2)
   తప్పిపోయిన కుమారుని నేనయితే -
   నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసూ (2)

2. ఏ ప్రేమా నీ ప్రేమకు సాటిరాదయ్యా
    ఎన్ని ఉన్నా నీతో సరియేదికాదయా (2)
    నన్ను మరువని ప్రేమ నీదయ్యా
    నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా (2) 

 

22 September 2024

నేను నా ఇల్లు నా ఇంటి వారందరు మానక స్తుతించెదము

 


నేను నా ఇల్లు నా ఇంటి వారందరు
మానక స్తుతించెదము (2)
నీ కనుపాప వలె నన్ను కాచి
నేను చెదరక మోసావు స్తోత్రం (2)
ఎబినేజరే ఎబినేజరే – ఇంత కాలం కాచితివే
ఎబినేజరే ఎబినేజరే – నా తోడువై నడచితివే (2)
స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కనుపాపగా కాచితివి స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కౌగిలిలో దాచితివి స్తోత్రం       ||నేను||

ఎడారిలో ఉన్న నా జీవితమును
మేలుతో నింపితివే (2)
ఒక కీడైన దరి చేరక నన్ను
తండ్రిగా కాచావు స్తోత్రం (2)       ||ఎబినేజరే||

నిరాశతో ఉన్న నా హీన బ్రతుకును
నీ కృపతో నింపితివే (2)
నీవు చూపిన ప్రేమను పాడగా
పదములు సరిపోవు తండ్రి (2)       ||ఎబినేజరే||

జ్ఞానుల మధ్యలో నను పిలిచిన నీ పిలుపే
ఆశ్చర్యమాశ్చర్యమే (2)
నీ పాత్రను కానే కాను
కేవలము నీ కృపయే స్తోత్రం (2)       ||ఎబినేజరే||

 

19 July 2023

నీ కృప నాకు చాలును

 

 


నీ కృప నాకు చాలును
నీ కృప లేనిదే నే బ్రతుకలేను (2)
నీ కృప లేనిదే నే బ్రతుకలేను

జల రాసులన్ని ఏక రాసిగా
నిలిచిపోయెనే నీ జనుల ఎదుట (2)
అవి భూకంపాలే అయినా
పెను తుఫానులే అయినా (2)
నీ కృపయే శాశించునా
అవి అణగిపోవునా (2)         నీ కృప

జగదుద్పత్తికి ముందుగానే
ఏర్పరచుకొని నన్ను పిలచితివా (2)
నీ పిలుపే స్థిరపరచెనే
నీ కృపయే బలపరచెనే (2)
నీ కృపయే ఈ పరిచర్యను
నాకు అనుగ్రహించెను (2)      నీ కృప

14 April 2023

నా చెలిమి కోరి – నీ కలిమి వీడి

 

 


నా చెలిమి కోరి – నీ కలిమి వీడి
నా చెంత చేరావు శ్రీమంతుడా
నా రక్షణ కొరకై – ఆ శిక్షను పొంది
బలియాగమైన నిజ స్నేహితుడా       ||నా చెలిమి||

ద్రోహినై దూరమైతిని – పాపినై పరుగులెడితిని
గమ్యమే ఎరుగనైతిని – మరణమే శరణమాయెను
ఎంతో ప్రేమించితివి – నా స్థానమందు నిలిచితివి
కృపతో నన్ రక్షించితివి – నా దోషశిక్ష భరించితివి       ||నా చెలిమి||

నిందలు అవమానములు – హేళనలు చీత్కారములు
కఠిన దెబ్బలు ముళ్లపోటులు – సిలువ భారం కాయమంతా గాయం
హృదినే బాధించినా – భరియించావు వేదన మౌనముగా
తనువే తల్లడిల్లినా – తృప్తినొందావు నను తలచుకొని       ||నా చెలిమి||

ఏ రీతి నిన్ను – కీర్తించగలను
నా నీతి నీవే ఓ యేసుదేవా
నీ సాక్షిగ నిలిచి – నీ ప్రేమను చాటి
ఘనపరతును నిన్నే ప్రియ స్నేహితుడా

 

23 March 2023

నీ పిలుపు వలన నేను నశించి పోలేదు

 


నీ పిలుపు వలన నేను నశించి పోలేదు
నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు
నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను
నీ ప్రేమకు సాటి లేదు (2)

1.నశించుటకు ఎందరో వేచియున్నను
నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను
ద్రోహము నిందల మధ్యలో నే నడచినను
నీ నిర్మల హస్తము నన్ను భరియించెను
యజమానుడా నా యజమానుడా…నన్ను పిలచిన యజమానుడా
యజమానుడా నా యజమానుడా…నన్ను నడిపించే యజమానుడా

2.మనుషులు మూసిన తలుపులు కొన్నైనను
నాకై నీవు తెరచినవి అనేకములు
మనోవేదనతో నిన్ను విడిచి పరుగెత్తిననునన్ను వెంటాడి నీ సేవను చేసితివి
నా ఆధారమా నా దైవమా....పిలిచిన ఈ పిలుపునకు కారణమా(2)

3.పిలిచిన నీవు నిజమైన వాడవు
నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు
ఏదేమైనను కొనసాగించితివి
నీపై ఆధారపడుటకు అర్హుడవు
నిన్ను నమ్మెదను, వెంబడింతును
చిరకాలము నిన్నే సేవింతును(2)
 

నీ పిలుపు వలన నేను నశించి పోలేదు
నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు
నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను
నీ ప్రేమకు సాటి లేదు (2)

12 December 2022

నువ్వు బోయే దారిలో యెరూషలేం గుడికాడ

 

 


 

నువ్వు బోయే దారిలో యెరూషలేం గుడికాడ (2)
ఆచం మల్లె పూల తోటో యేసయ్య (2)

1.సన్న సన్న బైబిల్లు సంచుల్లో పెట్టుకొని (2)
సారోలె బయలెల్లినారె యేసయ్య
సంకటనలు బాపినారె యేసయ్య (2) || నువ్వు బోయే ||

2.దోడు దొడ్డు బైబిల్లు దోసిల్లో పెట్టుకొని (2)
దొరోల్లే బయలెల్లినారె యేసయ్య
దోషములను బాపినారె యేసయ్య (2) || నువ్వు బోయే ||

3.తెంపిరి పువ్వోలు గుచ్చిరి దండాలు (2)
ఏసిరి నీ మెడలోన యేసయ్య
చేసిరి నీ పాద పూజ యేసయ్య (2) || నువ్వు బోయే ||

13 June 2022

నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా

 




 నీతో గడిపే ప్రతి క్షణము
ఆనంద బాష్పాలు ఆగవయ్యా (2)
కృప తలంచగా మేళ్లు యోచించగా (2)
నా గలమాగదు స్తుతించక – నిను కీర్తించక
యేసయ్యా యేసయ్యా – నా యేసయ్యా (4)        ||నీతో||

1. మారా వంటి నా జీవితాన్ని
మధురముగా మార్చి ఘనపరచినావు (2)
నా ప్రేమ చేత కాదు
నీవే నను ప్రేమించి (2)
రక్తాన్ని చిందించి
నన్ను రక్షించావు (2)         ||యేసయ్యా||

2. గమ్యమే లేని ఓ బాటసారిని
నీతో ఉన్నాను భయము లేదన్నావు (2)
నా శక్తి చేత కాదు
నీ ఆత్మ ద్వారానే (2)
వాగ్ధానము నెరవేర్చి
వారసుని చేసావు (2)         ||యేసయ్యా||

 

Ps.Jyothi Raju

 

NEETHO GADIPE PRATHI KSHANAM | Ps.Jyothi Raju | Telugu Christian Song | Live Worship

 

18 February 2022

నీతోనే నడిచేదనయ్యా నీతోనే సాగేదనయ్యా

  నీతోనే నడిచేదనయ్యా
నీతోనే సాగేదనయ్యా       
ఎదురు గలలే నాపై వీచిన
జీవిత అలలే నన్ను ముంచిన       
నీతోనే నడిచేదనయ్యా

నీతోనే సాగేదనయ్యా      
కన్నీటి సముద్రాన మునిగియున్నా
ఏ తోడు లేక తిరుగుచున్నా          
నాకున్న ఒక్క ఆశ నీవేనయ్యా
మిగిలున్న ఒక్క ఆశ నీవేనాయ్యా      

                                            |నీతోనే నడిచేదనయ్యా|

నీతోనే సాగేదనయ్యా
అనాధు దైవము నీవేకదా దేవా 

 నా చేయి విడువను అంటివికదా దేవా     
నను దాటి పోకుము దేవా
నా చేయి వుడువకు దేవా            

                                        |నీతోనే నడిచేదనయ్యా|

27 August 2021

నడిపించు నా నావ - నడి సంద్రమున దేవ Telugu Lyrics

 

 

 


 https://youtu.be/KnHcVmmlLkE

 

 నడిపించు  నా నావ - నడి సంద్రమున దేవ
     నవ జీవన మార్గమున - నా జన్మ తరి ఇంప


1.  నా జీవిత  తీరమున  - నా అపజయ భారమున
     నలిగినా నా హృదయమును - నడిపించుము లోతునకు
     నా ఆత్మా విరబూయ - నా దీక్ష  ఫలింప
     నా నావలో కాలిడుము - నా సేవ జేసుకోనుము //నడిపించు //

2. రాత్రంతయు శ్రమ పడినా - రాలేదు ప్రభు జయము
     రహదారులు వెదకినాను - రాదాయే ప్రతిపలము   
     రక్షించు  నీ సిలువ - రమణీయ లోతులలో
     రతనాలను  వేదకుటలో - రాజిల్లు నా పడవ //నడిపించు //


3. ఆత్మార్పణ చేయకయే - ఆశించితి నీ చెలిమి
    అహమును ప్రేమించుచునే - అరసితి నీ కలిమి  
    ఆశ నిరాశాయే - ఆవేదనేదురాయే
    ఆద్యాత్మిక లేమిగని - అల్లాడే నా వలలు  //నడిపించు //

4. ప్రభు మార్గము విడచితిని - ప్రార్థించుట మానితిని
    ప్రభు వాక్యము వదలితిని - పరమార్థము మరచితిని
    ప్రపంచ నటనలలో - ప్రావిన్యమును బొంది
    ఫల హీనుడని ఇపుడు - పాటింతు నీ మాట  //నడిపించు //


5. లోతైన జలములలో - లోతైన వినబడు స్వరమా
    లోబడుతాను నేర్పించి - లోపంబులు సవరించి
    లోనున్న ఈవులలో - లోతైన నా బ్రతుకు
    లోపించని యర్పనగా - లోకేష చేయుమయా  //నడిపించు //

6. ప్రభు యేసుని  శిష్యుడనై - ప్రభు ప్రేమలో పాదుకుని
    ప్రకటింతును లోకములో - పరిశుద్దుని ప్రేమ కథ
    పరమాత్మ ప్రోక్షణతో - పరి పూర్ణ సమర్పణతో
    ప్రానంబును ప్రభు కొరకు - పానార్పనము చేతు //నడిపించు // 

 https://youtu.be/KnHcVmmlLkE

 

 

 Tags: నడిపించు నా నావా christian songs/Sp balasubramanyam song/Christian songs / Telugu Christian songs/new Christian songs/ Album songs/ Album Christian songs/Telugu songs/ Christian video songs/Telugu gospel songs/ Gospel Christian songs/ Devotional songs / Devotional Christian songs/ Worship Christian songs/ Christian songs telugu/ Popular songs/ Popular Christian songs/Famous songs in telugu/ Famous Christian songs in telugu/ Christmas songs/Jesus songs/ Christian Jesus songs in Telugu/Telugu old songs/ Telugu new songs/Telugu Christian old songs/Telugu Christian new songs/ Telugu latest songs/ Telugu latest Christian songs/ songs in Telugu/ Christian songs in telugu/Christian songs 2021/ Christian songs 2021/ Christian songs 2021/ Christian songs 2017/ Sharon sister's Christian songs/ Stephen Paul Christian songs/ Jk Christopher Christian songs/ Paul Emmanuel Christian songs/ John Wesley Christian songs in Telugu/ Jayapaul Christian songs in telugu/Raj Prakash Paul Christian songs in Telugu/Satish kumar songs in Telugu /Enosh kumar Christian songs in telugu/Super hit Christian songs in telugu/ Melodious cover song in telugu/Melodious Christian songs in Telugu/ English Christian songs/ Andhra kraisthava keerthana lu songs/Andhra kraisthava keerthana Christian songs in Telugu/Gospel Christian songs/Gospel Christian songs in Telugu/Telugu songs/ Tamil songs/ Tamil songs / Indian Christian song Christians/ Indian Telugu Christian songs/4k Christian video/ 4k Christian songs/ Gospel music/ Gospel songs/Gospel Christian/Jesus Christ songs in Telugu/new Telugu Christian songs/ famous Christian songs in Telugu/ Latest Jesus Christ songs/Old Jesus Christ songs/ new songs in Telugu/Jesus Christ Telugu songs/Jesus Christ new Telugu songs/Christian video songs in Telugu/Christian videos/Worship songs/ Worship songs in Telugu/Worship Christian songs/Worship new Christian songs in Telugu/ Worship old Christian songs in Telugu/2021 hits Jesus Christ songs/2019 hits Jesus Christ songs/2018 Jesus Christ songs in Telugu/Christian lyrical songs/ lyrical songs/Jesus Christ lyrical songs/ Christ lyrics/ Christian lyrics/lyrical video songs/Video lyrics/Christian latest songs in Telugu/Christian lyrical songs/2020 new hit songs in Telugu/2020 Christian lyrical songs/2020 new songs/

26 August 2021

నన్నెంతగా ప్రేమించితివో... నిన్నంతగా దూషించితినో...

 

 


 

 

నన్నెంతగా ప్రేమించితివో...
నిన్నంతగా దూషించితినో...

నన్నెంతగా నీవెరిగితివో...
నిన్నంతగా నే మరచితినో...


గలనా... నే చెప్పగలనా...
దాయనా ... నే దాయగలనా... (2)
అయ్యా... నా యేసయ్యా...


నాదం... తాళం... రాగం
ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము... (2)


1. ఏ రీతిగా నా ఉదయమును ... నీ ఆత్మతో దీవించితివో...
ఏ రీతిగా నా భారమును ... నీ కరుణతో మోసితివో ... (2)

ఏ రీతిగా నా పలుకులో ... నీ నామమును నిలిపితివో...
ఏ రీతిగా నా కన్నీటిని .... నీ ప్రేమతో తుడిచితివో ... (2) || గలనా ||



2. ఏ రీతిగా నా రాతను ... నీ చేతితో రాసితివో...
ఏ రీతిగా నా బాటను... నీ మాటతో మలిచితివో... (2)


ఏ రీతిగా నా గమ్యమును ... నీ సిలువతో మార్చితివో...
ఏ రీతిగా నా దుర్గమును ... నీ కృపతో కట్టితివో... (2) || గలనా || 

10 March 2021

నీవే హృదయ సారధి-ప్రగతికి వారధి Neeve Hrudaya saaradhi ! Hossanna Songs 2021

పల్లవి:- నీవే హృదయ సారధి-ప్రగతికి వారధి

నీ స్నేహమే సౌభాగ్యము- సంక్షేమ సంతకం

 నా పాటకి సౌందర్యము నీవే యేసయ్యా

 

1. మదిలో చేదుజ్ఞాపకాలవిలయలవేదిక కూల్చి

చిగురాశల దిశగా నను పయనింప చేసినా

నీ మాటలు స్థిరపరచెను విశ్వాస ప్రేమలో

కలనైనా అనుకొని అనురాగ బంధమైతివే.  -"నీవే నా హృదయ"

 

 2 . నీవు లేని జీవితం ప్రళయసాగరమే

దిక్కుతోచని సమయములో నీవే దిక్సూచివై

చుక్కానిగా నడిపించుము ఆత్మీయ యాత్రలో

 కనుపాపగ నను కాచిన నా మంచి కాపరి - " నీవే నా హృదయ

 

 3.  చేరనైతి కోరనైతి స్నేహ సౌధము

 చిరు దివ్యెగ దరిచేరి చేర్చావు సన్నిధి

 చావైనా బ్రతుకైనా నీ కోసమే ప్రభు

 చాటింతు నీ ప్రేమను ప్రణుతింతు ప్రేమసాగరా  - " నీవే నా హృదయ"
 

 https://www.youtube.com/watch?v=q5BGAKh27ao


 

 

 Tags:  Neeve Hrudaya saaradhi, Hossanna Songs 2021, Telugu Christan Songs

9 March 2021

నీ దయలో నేనున్న ఇంత కాలం నీ కృపలో దాచినావు గత కాలం .. Nee dayalo nenunna intha kalamu


నీ దయలో నేనున్న ఇంత కాలం

నీ కృపలో దాచినావు గత కాలం (2)

నీ దయ లేనిదే నేనేమౌదునో (2)

 తెలియదయ్యా ||నీ దయలో||

 

11.  తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో

చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా (2)

నీ దయ ఉంటే వారు కాగలరు అధిపతులుగా

నీ దయ లేకపోతే ఇలలో బ్రతుకుట జరుగునా

 నీ సిలువ నీడలోనే నను దాచియుంచావని

నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని ||నీ దయలో||

 

22.  నేల రాలే నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు

అపవాది కోరలకు అంటకుండ దాచావు (2)

నీ రెక్కల నీడలో నాకాశ్రయ దుర్గము

ఏ కీడు నా దారికి రాకుండ నీ కృపను తోడుంచినావు

 నీ పాదాల చెంతనే నే పరవశించాలని

 నా ఆయువున్నంత వరకు నీ ప్రేమ పొందాలని ||నీ దయలో||

https://www.youtube.com/watch?v=jVwx4Q1pzTw

 

Tags: Nee dayalo nenunna intha kalamu Telugu Christian Songs, Telugu Songs

7 April 2020

నా ప్రార్థనలన్ని ఆలకించినావు నా స్తుతిహోమములన్ని నీకే అర్పింతుము

నా ప్రార్థనలన్ని ఆలకించినావు
నా స్తుతిహోమములన్ని నీకే అర్పింతుము

నీ శిలువ త్యాగమే నన్ను బంధించెను
నీ బానిసనై యుందును బ్రదుకు దినములన్నియు } 2|| నా ప్రార్థనలన్ని ||

అడిగినంతకంటె అధికముగా చేయు
ఐశ్వర్యవంతుడవు నీవే యేసయ్యా } 2
పరిపూర్ణమైన నీ దైవత్వమంతా
పరిశుద్ధతకే శుభ ఆనవాలు } 2|| నా ప్రార్థనలన్ని ||

ఆపత్కాలములో మొరపెట్టగానే
సమీపమైతివే నా యేసయ్యా } 2
సమీప భాందవ్యములన్నిటికన్నా
మిన్నయైనది నీ స్నేహబంధము } 2|| నా ప్రార్థనలన్ని ||

ఎక్కలేనంత ఎత్తైన కొండపై
ఎక్కించుము నన్ను నా యేసయ్యా } 2
ఆశ్చర్యకరమైన నీ ఆలోచనలు
ఆత్మీయతకే స్థిరపునాదులు } 2|| నా ప్రార్థనలన్ని ||

10 March 2019

నీతో నేను నడువాలని నీతో కలిసి ఉండాలని





నీతో నేను నడువాలని
నీతో కలిసి ఉండాలని


ఆశయ్యా.. చిన్న ఆశయ్యా
ఓ యేసయ్యా.. నీవే తీర్చాలయ్యా
నీతో నేను నడువాలని
నీతో కలిసి ఉండాలని (2)
ఆశయ్యా చిన్న ఆశయ్యా
ఓ యేసయ్యా.. నీవే తీర్చాలయ్యా (2)        ||నీతో||

నడవలేక నేను ఈ లోక యాత్రలో
బహు బలహీనుడనైతినయ్యా (2)
నా చేయి పట్టి నీతో నన్ను
నడిపించుమయ్యా నా యేసయ్యా (2)
నీతో నడువాలని – నీతో ఉండాలని
చిన్న ఆశయ్యా.. ఓ యేసయ్య            ||ఆశయ్యా||

సౌలును పౌలుగా
మార్చిన నా గొప్ప దేవుడా (2)
నీలో ప్రేమా నాలో నింపి
నీలా నన్ను నీవు మార్చుమయ్యా (2)
నీలా ఉండాలని – నీతో ఉండాలని
చిన్న ఆశయ్యా.. ఓ యేసయ్య            ||ఆశయ్యా||



10 September 2016

నన్ను కరుణించుమో దేవా - Nannu Karuninchumo Deva




నన్ను కరుణించుమో దేవా
నన్ను కరుణించుమో తండ్రి
నీ రెక్కలే నాకు ఆశ్రయం
నీ హస్తములే నాకు అభయము

1. విరిగిన హృదయాలకు ఆసన్నుడా
నలిగిన మనస్సులకు ఆశ్రయుడా
గొప్ప దేవుడవు నీవే స్తుతులకు పాత్రుడవీవే

2. నీ కృపతో నన్ను బలపరచుము
నీ ప్రేమతో నన్ను నడిపించుము
గొప్ప దేవుడవు నీవే స్తుతులకు పాత్రుడవీవే


Tags:Nannu Karuninchumo Deva – నన్ను కరుణించుమో దేవా

20 August 2016

నీ ప్రేమే నను ఆదరించేను nee preme nanu

 


నీ ప్రేమే నను ఆదరించేను -2
సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను -2

1.
చీకటి కెరటాలలో కృంగిన వేళలో -1
    ఉదయించెను నీ కృప నా యెదలో - చెదరిన మనసే నూతనమాయెనా -2
    మనుగడయే మరో మలుపు తిరిగేనా -2
  
2. బలసూచకమైనా మందసమా నీకై -1
    సజీవ యాగమై యుక్తమైన సేవకై - ఆత్మాభిషేకముతో నను నింపితివా -2
    సంఘ క్షేమమే నా ప్రాణమాయెనా -2



Tags: నీ ప్రేమే నను ఆదరించేను nee preme nanu,kristhava keerthanalu is available in MP3 form that is more easy to download. In Telugu many kristhava keerthanalu are available. Most of them are available in Best quality. You can simply download without much effort. We all know Jesus is Loves everyone specially those who are not having relations to take care. suffering people. Some kristhava keerthanalu will touch our Hear each lines in that song will say .No need to worry in this Dirty world Because Jesus is my savior. We can sing along with angles in Heaven Jesus is my savior and my good shepherd Amen

20 December 2015

నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును - యేసు



నిన్నే ప్రేమింతును
పల్లవి:    నిన్నే ప్రేమింతును,  నిన్నే ప్రేమింతును  -  యేసు
నిన్నే ప్రేమింతును,   నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా
నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగా
1.       నిన్నే పూజింతును,  నిన్నే పూజింతును -  యేసు
నిన్నే పూజింతును,  నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా
నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగా
2.        నిన్నే కీర్తింతును,  నిన్నే కీర్తింతును -  యేసు
నిన్నే కీర్తింతును,  నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా
నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగ
3.        నిన్నే ప్రార్దింతును,  నిన్నే ప్రార్దింతును -  యేసు
నిన్నే ప్రార్దింతును,  నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా
           నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగా

29 November 2015

నీవుంటే నాకు చాలు యేసయ్యా - నీ వెంటే నేను వుంటా నేసయ్యా



పల్లవి:     నీవుంటే  నాకు చాలు యేసయ్యా - నీ వెంటే నేను వుంటా నేసయ్యా

            నీవుంటే  నాకు చాలు యేసయ్యా - నీ వెంటే నేను వుంటా నేసయ్యా

             నీ మాట చాలయ్యా - నీ చూపు చాలయ్యా 

             నీ తోడు చాలయ్యా - నీ నీడ చాలయ్యా 



Songs:

నీవుంటే  నాకు చాలు యేసయ్యా - నీ వెంటే నేను వుంటా నేసయ్యా
నీవుంటే  నాకు చాలు యేసయ్యా - నీ వెంటే నేను వుంటా నేసయ్యా


1.        
ఎన్ని భాదలున్నను - యిబ్బందులైనను 

              ఎంత కష్టమొచ్చిన - నిష్టూర మైనను              .. నీ మాట. 



2.        
బ్రతుకు నావ పగిలినా - కడలి పారైనను 

         అలలు ముంచి వేసినా - ఆశలు అనగారిన           .. నీ మాట..


3.        
ఆస్తులన్ని పోయినా అనాధగా మిగిలినా 

         ఆప్తులే విడనాడినా - ఆరోగ్యం క్షీణించినా .. నీ మాట..


4.        
నీకు ఇలలో ఏదియు - లేదు అసాధ్యము 

        నీదు కృపతో నాకేదియు - నాకిల సమానము       .. నీ మాట..







Tags:neevunte naku chalu yesayya lyrics, neevunte naku chalu yesayya lyrics, neevunte naku chalu yesayya lyricsChristmas songs lyrics in Telugu script, christmas songs lyrics in telugu script  telugu songs lyrics in telugu script free download  telugu songs lyrics in telugu script pdf  telugu songs lyrics in telugu language  telugu songs lyrics in telugu font  telugu movie songs lyrics in telugu font  sagara sangamam songs lyrics in telugu language  i songs lyrics telugu latest ,Christmas songs lyrics in telugu script  telugu songs lyrics in telugu script free download  telugu songs lyrics in telugu script pdf  telugu songs lyrics in telugu language  telugu songs lyrics in telugu font  telugu movie songs lyrics in Telugu font  sagara sangamam songs lyrics in telugu language  i songs lyrics Telugu latest

Join Telegram

Join Telegram
Telugu Christian Lyrics