-:A:B:C:D:E:F:G:H:I:J:K:L:M:N:O:P:Q:.R:S:T:U:V:W:X:Y:Z:-

10 March 2019

యేసయ్య వందనాలయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా


  యేసయ్య వందనాలయ్యా
నీ ప్రేమకై వందనాలయ్యా" |2|
"నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా" |2|


" వందనాలు వందనాలయ్యా
శతకోటి స్తోత్రాలయ్యా " |2|


1) నీ కృపచేత నన్ను, కాపాడినందుకు -
వేలాది వందనాలయ్యా
నీ దయచేత శిక్షను తప్పించినందుకు-
కోట్లాది స్తోత్రాలయ్యా
నీ జాలి నాపై కనపరచినందుకు -
వేలాది వందనాలయ్యా
నీ ప్రేమ నాపై కురిపించినందుకు -
కోట్లాది స్తోత్రాలయ్యా..... //వందనాలు\\


2) జీవ గ్రంథములో నా పేరుంచినందుకు -
వేలాది వందనాలయ్యా
పరలోక రాజ్యములొ చోటిచ్చినందుకు -
కోట్లాది స్తోత్రాలయ్యా
నన్ను నరకము నుండి తప్పించినందుకు
వేలాది వందనాలయ్యా
నీ సాక్షిగా ఇలలో నన్నుంచినందుకు
కోట్లాది స్తోత్రాలయ్యా .... //వందనాలు\\



No comments:

Post a Comment

Join Telegram

Join Telegram
Telugu Christian Lyrics