-:A:B:C:D:E:F:G:H:I:J:K:L:M:N:O:P:Q:.R:S:T:U:V:W:X:Y:Z:-

Showing posts with label J. Show all posts
Showing posts with label J. Show all posts

7 March 2025

జయ సంకేతమా దయా క్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్య -2025

 



జయ సంకేతమా దయా క్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్య_2
అపురూపము నీ ప్రతి తలుపు  - అలరించిన ఆత్మీయ గెలుపు _2
నడిపించే నీ ప్రేమ పిలుపు
        //జయ సంకేతమా//

1. నీ ప్రేమ నాలో ఉదయించగా - నా కొరకు స్వరము సమకూర్చేనే_2
నన్నెల ప్రేమించ మనసాయెను - నీ మనసెంతో మహోన్నతము
కొంతైనా నీ రుణము తీర్చేదెలా నీవు లేక క్షణమైన బ్రతికేదెలా
విరిగి నలిగిన మనసుతో నిన్నే - సేవించేద నా యజమానుడా-(2)
జయ సంకేతమా

2. నిలిచెను నా మదిలో నీ వాక్యమే నాలోన రూపించే నీ రూపమే- (2)
దీపము నాలో వెలిగించగా నా ఆత్మ దీపము వెలిగించగా
రగిలించే నాలో స్తుతి జ్వాలలు  -భజియించి నిన్నే కీర్తింతును
జీవితగమనం స్థాపించితివి - సీయోను చేర నడిపించుమా- (2) 

                         జయ సంకేతమా

3. నీ కృప నాయెడల విస్తారమే - ఏనాడు తలవని భాగ్యమిది_2
నీ కృప నాకు తోడుండగా - నీ సన్నిధియే నాకు నీడాయెను
ఘనమైన కార్యములు నీవు చేయగా  - కొదువేమి లేదాయె నాకెన్నడు
ఆత్మబలముతో నన్ను నడిపించే నా గొప్ప దేవుడవు నీవేనయ్యా
బహు గొప్ప దేవుడవు నీవేనయ్యా
       (జయ సంకేతమా)

14 April 2023

జీవించుచున్నవాడా నీకే ఆరాధన అర్పింతున్



జీవించుచున్నవాడా నీకే ఆరాధన అర్పింతున్
జీవాధిపతి యేసు నీకే ఆరాధన అర్పింతున్ (2)
హల్లెలూయా హోసన్నా (8)

మరణము జయించితివే నీకే ఆరాధన అర్పింతున్
సాతానును జయించితివే నీకే ఆరాధన అర్పింతున్ (2)
హల్లెలూయా హోసన్నా (8)

విన్నపము వినువాడా నీకే ఆరాధన అర్పింతున్
విడుదల నిచ్చువాడా నీకే ఆరాధన అర్పింతున్ (2)
హల్లెలూయా హోసన్నా (8)

కన్నీరు తుడుచువాడా నేకే ఆరాధన అర్పింతున్
కష్టములు తీర్చువాడా నీకే ఆరాధన అర్పింతున్ (2)
హల్లెలూయా హోసన్నా (8)




Join Telegram

Join Telegram
Telugu Christian Lyrics