-:A:B:C:D:E:F:G:H:I:J:K:L:M:N:O:P:Q:.R:S:T:U:V:W:X:Y:Z:-

Showing posts with label 2022. Show all posts
Showing posts with label 2022. Show all posts

13 June 2022

నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా

 




 నీతో గడిపే ప్రతి క్షణము
ఆనంద బాష్పాలు ఆగవయ్యా (2)
కృప తలంచగా మేళ్లు యోచించగా (2)
నా గలమాగదు స్తుతించక – నిను కీర్తించక
యేసయ్యా యేసయ్యా – నా యేసయ్యా (4)        ||నీతో||

1. మారా వంటి నా జీవితాన్ని
మధురముగా మార్చి ఘనపరచినావు (2)
నా ప్రేమ చేత కాదు
నీవే నను ప్రేమించి (2)
రక్తాన్ని చిందించి
నన్ను రక్షించావు (2)         ||యేసయ్యా||

2. గమ్యమే లేని ఓ బాటసారిని
నీతో ఉన్నాను భయము లేదన్నావు (2)
నా శక్తి చేత కాదు
నీ ఆత్మ ద్వారానే (2)
వాగ్ధానము నెరవేర్చి
వారసుని చేసావు (2)         ||యేసయ్యా||

 

Ps.Jyothi Raju

 

NEETHO GADIPE PRATHI KSHANAM | Ps.Jyothi Raju | Telugu Christian Song | Live Worship

 

3 June 2022

సరిచేయును...స్థిరపరచును

 


 సరిచేయును...స్థిరపరచును
కనుమరుగు చేయుదుననె వరేదుట,
ఎనలేని వృద్దిచేయు దేవ..
నిన్ను కనుమరుగు చేయుదుననె వరేదుట,
ఎనలేని వృద్దిచేయు దేవ..
సరిచేయ జాలని నీ బ్రతుకు,
సరిపరచ తానే వచ్చుచున్నాడు.

ఓ. ఓ.. సరిచేయును.. స్థిరపరచును .. బలపరచి పుర్ణునిచేయున్..
నిన్ను సరిచేయును.. స్థిరపరచును .. బలపరచి పుర్ణునిచేయున్..
నిన్ను బలపరచి పుర్ణునిచేయున్....


సరి సగ రిస, సరి సగ రిస, సపమ పమ నిదప,
గరి సరి సగ రిస, సరి సగ రిస, సపమ గరి సస


1. అల్పకాలం పాటు, పొందిన శ్రమలన్ని
  మంచువలె నీ యెదుట కరిగిపోవన్ (2)
  నీ కష్టము, నష్టము అన్నియును తీరున్ (2)
  క్షేమములె నీ దరిచేరున్..

ఓ. ఓ.. సరిచేయును.. స్థిరపరచును .. బలపరచి పుర్ణునిచేయున్..
నిన్ను సరిచేయును.. స్థిరపరచును .. బలపరచి పుర్ణునిచేయున్..
నిన్ను బలపరచి పుర్ణునిచేయున్....

2. ఖ్యాతిని అణచివెయు, కూటములు అన్నియును
   యేసు నీ తోడని తలలు వంచున్ (2)
   విరోధులు చేసిన గాయములు మానున్ (2)
   నీ ఖ్యాతి నీ దరిచేరున్..

ఓ. ఓ.. సరిచేయును.. స్థిరపరచును .. బలపరచి పుర్ణునిచేయున్..
నిన్ను సరిచేయును.. స్థిరపరచును .. బలపరచి పుర్ణునిచేయున్.. నిన్ను బలపరచి పుర్ణునిచేయున్....

సరి సగ రిస, సరి సగ రిస, సపమ పమ నిదప,
గరి సరి సగ రిస, సరి సగ రిస, సపమ గరి సస

 

 

5 March 2022

Preme Saswathamaina song Lyrics ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు

 


 

పల్లవి:- ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు
మనస్సే మందిరమాయె - నా మదిలో దీపము నీవే
నిన్నాశ్రయించిన వారిని - ఉదయించు సూర్యునివలెనే
నిరంతరం నీ మాటతో ప్రకాశింపచేయుదువు

1.అమరమైన నీ చరితం - విమలమైన నీ రుధిరం
ఆత్మీయముగా ఉత్తేజపరచిన - పరివర్తన క్షేత్రము
ఇన్నాళ్ళుగ నను స్నేహించి - ఇంతగ ఫలింపజేసితివి
ఈ సర్వసంపదనంతటితో - అభినయించి నే పాడెదను
ఉండలేను - బ్రతుకలేను - నీతోడు లేకుండా - నీ నీడలేకుండా
|| ప్రేమే ||

2.కమ్మనైన నీ ఉపదేశము - విజయమిచ్చె శోధనలో
ఖడ్గముకంటే బలమైన నీ వాక్యము - ధైర్యమిచ్చె నా శ్రమలో
కరువుసీమలో సిరులోలికించెను - నీ వాక్యప్రవాహాము
గగనము చీల్చి మోపైన - దీవెన వర్షము కురిపించితివి
ఘనమైన నీ కార్యములు - వివరింప నా తరమా - వర్ణింప నా తరమా
|| ప్రేమే ||

3.విధిరాసిన విషాదగీతం - సమసిపోయె నీ దయతో
సంబరమైన వాగ్దానములతో - నాట్యముగా మార్చితివి
మమతల వంతెన దాటించి - మహిమలో స్థానమునిచ్చితివి
నీ రాజ్యములో జేష్ఠులతో - యుగాయుగములు నే ప్రకాశించనా
నా పైన ఎందుకింత గాఢమైన ప్రేమ నీకు మరువలేను యేసయ్యా
|| ప్రేమే ||

 

 Tags: Preme Saswathamaina song Lyrics  ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు, Hossana 2022 New Songs

Join Telegram

Join Telegram
Telugu Christian Lyrics