-:A:B:C:D:E:F:G:H:I:J:K:L:M:N:O:P:Q:.R:S:T:U:V:W:X:Y:Z:-

14 April 2023

నా చెలిమి కోరి – నీ కలిమి వీడి

 

 


నా చెలిమి కోరి – నీ కలిమి వీడి
నా చెంత చేరావు శ్రీమంతుడా
నా రక్షణ కొరకై – ఆ శిక్షను పొంది
బలియాగమైన నిజ స్నేహితుడా       ||నా చెలిమి||

ద్రోహినై దూరమైతిని – పాపినై పరుగులెడితిని
గమ్యమే ఎరుగనైతిని – మరణమే శరణమాయెను
ఎంతో ప్రేమించితివి – నా స్థానమందు నిలిచితివి
కృపతో నన్ రక్షించితివి – నా దోషశిక్ష భరించితివి       ||నా చెలిమి||

నిందలు అవమానములు – హేళనలు చీత్కారములు
కఠిన దెబ్బలు ముళ్లపోటులు – సిలువ భారం కాయమంతా గాయం
హృదినే బాధించినా – భరియించావు వేదన మౌనముగా
తనువే తల్లడిల్లినా – తృప్తినొందావు నను తలచుకొని       ||నా చెలిమి||

ఏ రీతి నిన్ను – కీర్తించగలను
నా నీతి నీవే ఓ యేసుదేవా
నీ సాక్షిగ నిలిచి – నీ ప్రేమను చాటి
ఘనపరతును నిన్నే ప్రియ స్నేహితుడా

 

No comments:

Post a Comment

Join Telegram

Join Telegram
Telugu Christian Lyrics