-:A:B:C:D:E:F:G:H:I:J:K:L:M:N:O:P:Q:.R:S:T:U:V:W:X:Y:Z:-

10 March 2019

నీతో నేను నడువాలని నీతో కలిసి ఉండాలని





నీతో నేను నడువాలని
నీతో కలిసి ఉండాలని


ఆశయ్యా.. చిన్న ఆశయ్యా
ఓ యేసయ్యా.. నీవే తీర్చాలయ్యా
నీతో నేను నడువాలని
నీతో కలిసి ఉండాలని (2)
ఆశయ్యా చిన్న ఆశయ్యా
ఓ యేసయ్యా.. నీవే తీర్చాలయ్యా (2)        ||నీతో||

నడవలేక నేను ఈ లోక యాత్రలో
బహు బలహీనుడనైతినయ్యా (2)
నా చేయి పట్టి నీతో నన్ను
నడిపించుమయ్యా నా యేసయ్యా (2)
నీతో నడువాలని – నీతో ఉండాలని
చిన్న ఆశయ్యా.. ఓ యేసయ్య            ||ఆశయ్యా||

సౌలును పౌలుగా
మార్చిన నా గొప్ప దేవుడా (2)
నీలో ప్రేమా నాలో నింపి
నీలా నన్ను నీవు మార్చుమయ్యా (2)
నీలా ఉండాలని – నీతో ఉండాలని
చిన్న ఆశయ్యా.. ఓ యేసయ్య            ||ఆశయ్యా||



No comments:

Post a Comment

Join Telegram

Join Telegram
Telugu Christian Lyrics