గుండె బరువెక్కిపోతున్నది
ప్రాణము సొమ్మ సిల్లుచున్నది -2
నా మనసేమో కలవరపడుచున్నది -2
యేసయ్య.... ఆదరించారావా
యేసయ్య.. బలపరచరావయ్యా
"గుండె"
1
ప్రాకారములేని పురముగా నేనుంటిని.
ఆదరణలేక దిగులుతోనేనుంటిని-2
నెమ్మదిలేదాయనే శాంతి కారువాయెనే
యేసయ్య ఆధారం నీవేకదా
యేసయ్య ప్రాతాపరి నీవేకదా
"గుండె"
2
అందకారములోన దీపం ఆరిపోయేనే
అరణ్యరోధనలో ప్రాణము సొమ్మ సిల్లెనే-2
దిన దినము నేను క్రుంగుచున్నాను-2
యేసయ్య వెలిగించగరావా
యేసయ్య ప్రేమనిత్యారావా
"గుండె'
3.
ఎక్కడచూసినను నెమ్మదిలేదాయనే
ఎవరిలో చూసినను ప్రేమ కరువాయెనే-2
ఆత్మలభారముతో ములుగుచున్నానయ్య-2
యేసయ్య దర్శించారావా
యేసయ్య ప్రేమతో నింపుమయ్యా
" గుండె"
No comments:
Post a Comment