-:A:B:C:D:E:F:G:H:I:J:K:L:M:N:O:P:Q:.R:S:T:U:V:W:X:Y:Z:-

Showing posts with label Good Friday Songs. Show all posts
Showing posts with label Good Friday Songs. Show all posts

18 March 2022

సిలువే నా శరణాయెను రా నీ సిలువే నా శర ణాయెను రా

 

 

సిలువే నా శరణాయెను రా నీ సిలువే నా శర ణాయెను రా సిలువ
యందే ముక్తి బలముఁ జూచితి రా ||నీ సిలువే||

1. సిలువను వ్రాలి యేసు పలికిన పలుకు లందు విలువలేని
ప్రేమామృతముఁ గ్రోలితి రా ||నీ సిలువే||


2. సిలువను జూచుకొలఁది శిలసమానమైన మనసు నలిగి కరిగి నీరగు
చున్నది రా ||నీ సిలువే||


3. సిలువను దరచి తరచితి విలువ కందఁగ రాని నీ కృప కలుష మెల్లనూ
బాపఁగఁ జాలును రా ||నీ సిలువే||


4. పలు విధ పథము లరసి ఫలిత మేమి గానలేక సిలువయెదుటను
నిలచినాఁడను రా ||నీ సిలువే||


5. శరణు యేసు శరణు శరణు శరణు శరణు నా ప్రభువా దురిత
దూరుఁడ నీ దరిఁ జేరితి రా ||నీ సిలువే||

 

27 March 2020

సిలువా ఓ సిలువా నీకెందుకే ఈ విలువ


సిలువా ఓ సిలువా నీకెందుకే ఈ విలువ "2"
యేసయ్యా నిను ఎత్తుకున్నందుకా నీవు యేసయ్యను మోసినందుకా "2"
                                   "సిలువ"

1.మా పాప భారమంతా మోసాడు కల్వరి గిరిలో మా పాప పరిహారముకై చిందించాడు తన రక్తమంతా "2"
మన కొరకై తన ప్రాణమిచ్చెను పునరుత్థానుడై తిరిగి లేచెను "2"
అందుకే నాకీ విలువా "2"
                                   "సిలువ"

2.బంధిచిన బంధకాలంతా దించాడు సిలువలో నాకై నా దాస్యపు బ్రతుకంతా విడిపించాడు యేసయ్య నాకై "2"
రాజరికము నాకు ఇచ్చి తన రాజ్యమునే సిద్ధపరచెను "2"
అందుకే నాకీ విలువా తెలుసుకోవే సిలువ
                                   "సిలువ"


29 November 2015

భాసిల్లెను శిలువలో పాపక్షమా - యేసు ప్రభూ నీ దివ్య క్షమా భాసిల్లెను శిలువలో పాపక్షమా





పల్లవి:     భాసిల్లెను శిలువలో పాపక్షమా - యేసు ప్రభూ నీ దివ్య క్షమా  

               భాసిల్లెను శిలువలో పాపక్షమా 

1.        
కలువరిలో నా పాపము పొంచి - శిలువకు నిన్ను యాహుతి చేసి
కలుషహర కరుణించితివి - కలుషహర  హరుణించితివి
భాసిల్లెను శిలువలో పాపక్షమా

2.        
నమ్మిన వారిని కాదని వనియు - నెమ్మది నొసగెడి నా ప్రభుడవని 
నమ్మితి నీ పాదంబులను - నమ్మితి నీ పాదంబులను
భాసిల్లెను శిలువలో పాపక్షమా - యేసు ప్రభూ  నీ దివ్య క్షమా  
భాసిల్లెను శిలువలో పాపక్షమా




Tags:Christmas songs lyrics in Telugu script, christmas songs lyrics in telugu script  telugu songs lyrics in telugu script free download  telugu songs lyrics in telugu script pdf  telugu songs lyrics in telugu language  telugu songs lyrics in telugu font  telugu movie songs lyrics in telugu font  sagara sangamam songs lyrics in telugu language  i songs lyrics telugu latest ,Christmas songs lyrics in telugu script  telugu songs lyrics in telugu script free download  telugu songs lyrics in telugu script pdf  telugu songs lyrics in telugu language  telugu songs lyrics in telugu font  telugu movie songs lyrics in Telugu font  sagara sangamam songs lyrics in telugu language  i songs lyrics Telugu latest

24 November 2015

కలువరి గిరి సిలువలో - పలు శ్రమలు పొందిన దైవమా


 
పల్లవి  కలువరి గిరి సిలువలో - పలు శ్రమలు పొందిన దైవమా      (2X)
విశ్వ మానవ శాంతి కోసం - ప్రాణ మిచ్చిన జీవమా          (2X)
యేసు దేవ నీదు త్యాగం - వివరింప తరమా                (2X)
కలువరి గిరి సిలువలో - పలు శ్రమలు పొందిన దైవమా 
1.       కరుణ లేని, కఠిన లోకం - కక్షతో సిలువేసిన                (2X)
కరుణ చిందు మోము పైన - గేలితో మ్మేసిన              (2X)
ముల్లతోను,  మకుటమల్లి - నీదు శిరమున నుంచిరా                          
నీదు శిరమున నుంచిరా                                            
కలువరిగిరి సిలువలో - పలు శ్రమలు పొందిన దైవమా 
2.       జాలి లేని పాప లోకం - కలువ లేదు చేసిన                 (2X)
మరణ మందు సిలువలోన - రుదిరమేనిను ముంచిరా       (2X)
కలుష రహిత వ్యధను చెప్పి - అలసి సొలసి పోతివా
అలసి సొలసి పోతివా                                              
కలువరి గిరి సిలువలో - పలు శ్రమలు పొందిన దైవమా      (2X)
విశ్వ మానవ శాంతి కోసం - ప్రాణ మిచ్చిన జీవమా          (2X)
యేసు దేవ నీదు త్యాగం  వివరింప తరమా                 (2X)
            కలువరి గిరి సిలువలో - పలు శ్రమలు పొందిన దైవమా

కనుమా సిలువపై క్రీస్తేసుడు పొందిన శ్రమలు మనకై సిలువపై మేకులతో కొట్టబడెను





పల్లవి  కనుమా సిలువపై క్రీస్తేసుడు పొందిన శ్రమలు 
మనకై సిలువపై మేకులతో కొట్టబడెను
కనుమా సిలువపై క్రీస్తేసుడు పొందిన శ్రమలు 
మనకై సిలువపై మేకులతో కొట్టబడెను
                          
1.       ఘన దేవుడు మనపై తన ప్రేమను చూపెను                   
ప్రియమైన తన కుమారుని ఈ ధరకే పంపెను       
ఘన దేవుడు మనపై తన ప్రేమను చూపెను                   
ప్రియమైన తన కుమారుని ఈ ధరకే పంపెను         
ఎవరైతే దేవుని నమ్మకుందురో వారు నశింతురు    (2X) 
కనుమా సిలువపై క్రీస్తేసుడు పొందిన శ్రమలు 
మనకై సిలువపై మేకులతో కొట్టబడెను
2.       బరువైన సిలువ మోస్తూ నడవలేక నడిచెను                   
కొరడాల దెబ్బలతో తడబడుచు నడిచెను                        
బరువైన సిలువ మోస్తూ నడవలేక నడిచెను                   
కొరడాల దెబ్బలతో తడబడుచు నడిచెను
అలసి, సొలసి, నిస్సాహాయుడై తాను నిలిచెను     (2X)
కనుమా సిలువపై క్రీస్తేసుడు పొందిన శ్రమలు 
మనకై సిలువపై మేకులతో కొట్టబడెను
మేకులతో కొట్టబడెను
            మేకులతో కొట్టబడెను

9 November 2015

అపరాధిని యేసయ్య - క్రపజూపి బ్రోవుమయ్యా







అపరాధిని యేసయ్య
పల్లవి:    అపరాధిని యేసయ్య - క్రపజూపి బ్రోవుమయ్యా
నెపమెంచకయె నీ క్రపలో - నపరాధములను క్షమించు ..అపరాధిని..
1.        సిలువకు నినునే గొట్టితీ - తులువలతో జేరితిని
కలుషంబులను మోపితిని - దోషుండ నేను ప్రభువా ..అపరాధిని..
2.        ప్రక్కలో బల్లెపుపోటు - గ్రక్కున పొడిచితి నేనే
మిక్కిలి బాధించితిని - మక్కువ జూపితి వయ్యో       ..అపరాధిని..
3.        ముళ్ళతో కిరీటంబు - నల్లి నీ శిరమున నిడితి
నావల్ల నేరమాయె - చల్లని దయగల తండ్రీ             ..అపరాధిని..
4.        దాహంబు గొనగా చేదు - చిరకను ద్రావినిడితి
ద్రోహుండనై జేసితినీ - దేహంబు గాయంబులను      ..అపరాధిని..
5.        ఘోరంబుగా దూరితిని - నేరంబులను జేసితిని
క్క్రూరుండనై గొట్టితిని - ఘోరంపి పాపిని దేవా          ..అపరాధిని..



4 November 2015

కల్వరి ప్రేమ ప్రకటించుచున్నది - సర్వలోకానికి




పల్లవి:    కల్వరి ప్రేమ ప్రకటించుచున్నది - సర్వలోకానికి
    కల్వరి స్వరము వినిపించుచున్నది - ప్రతీ పట్టణానికి
    రమ్ము ప్రియుడా రమ్ము - క్రీస్తు ప్రేమను ప్రకటించుటకు
    లెమ్ము తెజరిల్లుమయా - క్రీస్తు వార్తను ప్రకటించుటకు - ఈ సువార్తను ప్రకటించుటకు


    1. చూడుము భూమి కంపించుచున్నది - చీకటి జనములను కమ్ముచున్నది - 2
    ఎందాక ప్రకటించుట మానెదవు - ఎందాక ఆలస్యం చేసెదవు - 2
    ప్రభు త్యాగమునే మరిచెదవా - ప్రభు సేవనే విడిచెదవా ? - 2
    రమ్ము ప్రియుడా రమ్ము - క్రీస్తు ప్రేమను ప్రకటించుటకు
    లెమ్ము తెజరిల్లుమయా - క్రీస్తు వార్తను ప్రకటించుటకు - ఈ సువార్తను ప్రకటించుటకు


    2. పాపపు ఊభిలో ప్రజలుండగా - సాతాను సంకెళ్లతో బంధించగా - 2
    ఎందాక పోరాటం మానెదవు - ఎందాక నిర్లక్ష్యం చేసెదవు - 2
    ప్రభు త్యాగమునే మరిచెదవా - ప్రభు సేవనే విడిచెదవా ? - 2
    రమ్ము ప్రియుడా రమ్ము - క్రీస్తు ప్రేమను ప్రకటించుటకు
    లెమ్ము తెజరిల్లుమయా - క్రీస్తు వార్తను ప్రకటించుటకు - ఈ సువార్తను ప్రకటించుటకు




Join Telegram

Join Telegram
Telugu Christian Lyrics