-:A:B:C:D:E:F:G:H:I:J:K:L:M:N:O:P:Q:.R:S:T:U:V:W:X:Y:Z:-

28 May 2022

ప్రార్ధన వినెడి పావణుడా - ప్రార్ధన మాకు నేర్పుమయా

 

 

 ప్రార్ధన వినెడి పావణుడా - ప్రార్ధన మాకు నేర్పుమయా  || 2 ||

శ్రేష్ఠమైన భావము గూర్చి - శిష్యబృందముకు నేర్పితివి || 2 ||
పరముడనిను ప్రణుతించెద ప్రియముగా పరలోకప్రార్ధన నేర్పుమయా || 2 ||  {ప్రార్ధన}

 జడియనుబెదరను నా యేసు - నాతోఉండగా || 2 ||
గాడాందకారములో నే నడచినవేళలలో || 2 ||
కంటిపాపవలె నన్ను కునుకాక కాపాడును     || 2 ||
ప్రభువైన యేసునకు జీవితమంత పాడెదన   || 2 ||     {జెడియను}

 అళలాతొ కొట్టాబడిన నా నావలో నేనునుండగా || 2 ||
ప్రభుయేసు కృపనన్ను విడువాక - కాపాడును || 2 ||
 అబయామిచ్చినన్ను అద్దరికి చేర్చును || 2 ||       {జెడియను}

కన్నీరే తుడిచావయ్య సంతోషం  ఇచ్చావయ్య || 2 ||
నా సర్వం యేసయ్య, నా జీవం యేసయ్య, నా ప్రాణం యేసయ్య, నా ధ్యానం యేసయ్య  || 2 ||
రక్షనను అందించి రక్తాన్ని చిందించి మోక్షన్ని ఇచ్చావయ్య -
ధనవంతులుగా మములను చేయ దారిద్రమొందావయ్య        || 2 ||     {కన్నీరే}

 

17 May 2022

గాడాంధకారపు లోయలో-నే సంచరించిన వేళలో

 


గాడాంధకారపు లోయలో-నే సంచరించిన వేళలో
అపాయమేమియు రానీయక-ఉన్నావు తోడుగ నా త్రోవలో (2)
యేసయ్య నీవే మా కాపరివి-ఏమి లేమి లేక కాపాడితివి (2)
నా ఆశ్రయ దుర్గము నీవే-నా బలమైన శైలము నీవే
నా రక్షణ శృంగము నీవే- నా శిక్షను భరియించితివే         ||గాడాంధకారపు||

 

పచ్చిక గల చోట్లలో నిలిపావు - శాంతి జలములందు నన్ను నడిపావు (2)
యేసయ్య నీవే మా కాపరివి - ఏమి లేమి లేక కాపాడితివి (2)
నా ఎత్తైన కోట నీవే - నే నడిచే ప్రతి చోట నీవే
నా రక్షణకర్తా నీవే - నా జీవన దాతా నీవే              |గాఢాంధకారపు|

నూనెతో నా తలను అంటావు- నా గిన్నెను పొర్లి పారజేసావు (2)
యేసయ్య నీవే మా కాపరివి -ఏమి లేమి లేక కాపాడితివి (2)
నా మొరను ఆలించావే -నీ వరములు నాకొసగావే
నా పరమ తండ్రివి నీవే -నీ కరమున నను దాచావే          ||గాఢాంధకారపు||

చీకటి బ్రతుకును వెలిగించావు -మరణపు భయమును తొలగించావు (2)
యేసయ్య నీవే మా కాపరివి - ఏమి లేమి లేక కాపాడితివి (2)
నా త్రోవకు వెలుగు నీవే - నా నావకు చుక్కాని నీవే
నను కావగ ఏతెంచితివే - కొనిపోవగ రానున్నావే             |గాఢాంధకారపు|

కలములతో రాయగలమా కవితలతో వర్ణించగలమా

 




కలములతో రాయగలమా
కవితలతో వర్ణించగలమా
కలలతో వివరించగలమా
నీ మహోన్నతమైన ప్రేమా (2)
ఆరాధింతును (4) - రారాజువు నీవే
నా తండ్రివి నీవే
నిను విడువను ఎడబాయను (2)

ఆకాశములు నీ మహిమను
వివరించుచున్నవి
అంతరిక్షము నీ చేతి పనిని
వర్ణించుచున్నది (2)

దేవా నా ప్రాణము
నీ కొరకై తపియించుచున్నది (2)     ||ఆరాధింతును||


సెరాపులు కెరూబులు
నిత్యము నిను స్తుతియించుచున్నవి
మహా దూతలు ప్రధాన దూతలు
నీ నామము కీర్తించుచున్నవి (2)

దేవా నా ప్రాణము
నీ కొరకై తపియించుచున్నది (2)      ||ఆరాధింతును||
 

 

 

14 May 2022

సాక్ష్యమిచ్చెద మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను దెల్పుటయే

 

 


 

సాక్ష్యమిచ్చెద మన స్వామి యేసు దేవుడంచు
సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను దెల్పుటయే (2)
సాక్ష్య మిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించె నంచు              ||సాక్ష్య||

దిక్కు దెసయు లేని నన్ను దేవుడెంతో కనికరించి (2)
మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతి నిచ్చినడో                    ||సాక్ష్య||

పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నా పైని గలదు (2)
పిల్లలకును బెద్దలకును బ్రేమతో నా స్వానుభవము              ||సాక్ష్య||

బోధ చేయలేను వాద ములకు బోను నాక దేల (2)
నాధు డేసు ప్రభుని గూర్చి నాకు దెలసినంత వరకు              ||సాక్ష్య||

పాపులకును మిత్రుడంచు బ్రాణ మొసగి లేచెనంచు (2)
బాపముల క్షమించు నంచు బ్రభుని విశ్వసించు డంచు          ||సాక్ష్య||

చోరు లైన జారు లనా చారు లైన నెవ్వరైన (2)
ఘోరపాపు లైన క్రీస్తు కూర్మితో రక్షించు నంచు                     ||సాక్ష్య||

పరమత దూషణము లేల పరిహసించి పలుకు టేల (2)
ఇరుగు పొరుగు వారి కెల్ల యేసు క్రీస్తు దేవు డంచు                ||సాక్ష్య||

ఎల్లకాల మూరకుండ నేల యాత్మ శాంతి లేక (2)
తల్లడిల్లు వారలకును తండ్రి కుమా రాత్మ పేర                       ||సాక్ష్య||

 

హే దునియా కే లోగో ఉంఛీ ఆవాజ్ కరో గావో ఖుషీ కే గీత్

 

 


హే దునియా కే లోగో ఉంఛీ ఆవాజ్ కరో
గావో ఖుషీ కే గీత్
ఉస్-కా గున్-గాన్ కరో
ఇబాదత్ కరో ఉస్-కీ ఇబాదత్ కరో
ఇబాదత్ కరో ఉస్-కీ ఇబాదత్ కరో (2)

యాద్ రకో కీ వహీ ఇక్ ఖుదా హై
హమ్ కో యే జీవన్ ఉసీనే దియా హై
ఉస్ ఛారగాహ్ సే హమ్ సబ్ హై ఆయే
హమ్-దో సనా కే హమ్ గీత్ గాయే
రబ్ క తుమ్ శుక్ర్ కరో
ఉంఛీ ఆవాజ్ కరో
గావో ఖుషీ కే గీత్
ఉస్-కా గున్-గాన్ కరో
ఇబాదత్ కరో ఉస్-కీ ఇబాదత్ కరో
ఇబాదత్ కరో ఉస్-కీ ఇబాదత్ కరో

నామే ఖుదావన్ కిత్-నా ముబారక్
మేరా ఖుదావన్ కిత్-నా భళా హై
రెహ్-మత్ హై ఉస్-కీ సది-యో పురానీ
వఫా కా అజర్ సే యహీ సిల్-సిలా హై
ఉస్-పర్ ఈమాన్ ధరో, ఉస్-కే ఘర్ ఆవ్ ఛలో
గావో ఖుషీ కే గీత్
ఉస్-కా గున్-గాన్ కరో
ఇబాదత్ కరో ఉస్-కీ ఇబాదత్ కరో
ఇబాదత్ కరో ఉస్-కీ ఇబాదత్ కరో ||హే దునియా||

 

 

नीले आसमां के पार जाएंगे मेरा यीशु रहता वहाँ

 


 

नीले आसमां के पार जाएंगे
मेरा यीशु रहता वहाँ (2)
हम मिलेंगे बादलों पर (2)
देखेगा सारा जहां (2)     ||नीले||

उसका कोई भी वादा – न होता अधूरा
हर एक वादा उसका – होता है पूरा (2)
उसका कोई भी वादा
उसके आने का वादा – भी पूरा होगा
देखेगा सारा जहां (2)         ||हम मिलेंगे||

ये विश्वास है मेरा – जो होगा पूरा
सपना ये मेरा न – रहेगा अधूरा (2)
ये विश्वास है मेरा
संग संग हम रहेंगे – अपने यीशु के
देखेगा सारा जहां (2)         ||हम मिलेंगे||

 

 

పూజనీయుడేసు ప్రభు పలునిందల నొందితివా నాకై

 


 

పూజనీయుడేసు ప్రభు
పలునిందల నొందితివా నాకై (2)      ||పూజనీయుడేసు||

నీ స్వకీయులే నిందించినా
నిన్నంగీకరించక పోయినా (2)
ఎన్నో బాధ లొందితివా నాకై (2)
సన్నుతింతును నీ ప్రేమకై         ||పూజనీయుడేసు||

సత్యము మార్గము మరి జీవమై
నిత్యజీవమియ్యను వచ్చితివి (2)
వంచకుడవని నిన్ను నిందించిరా (2)
ఓ దయామయా నజరేయుడా         ||పూజనీయుడేసు||

యూదా గోత్రపు ఓ సింహమా
ఆద్యంతరహిత దైవమా (2)
అధములు నిను సమరయుడనిరా (2)
నాథుడా నిను బహు దూషించిరా         ||పూజనీయుడేసు||

మధురం నీ నామం అతి మధురం
మధుర గీతముతో నిన్నారాధింతును (2)
వధియించబడితివా యీ పాపికై (2)
వందితా ప్రభు నిన్ను పూజింతును         ||పూజనీయుడేసు||
 

 

ఆగని పరుగులో ఎండిన ఎడారులు

 


 

ఆగని పరుగులో ఎండిన ఎడారులు (2)
కృంగిన బ్రతుకులో నిండిన కొరతలు
ఉన్నపాటునా నలిగె నా వైపున
కదలిరాలేవా ఆదరించగ రావా
కన్నీరే నా మజిలీ – దరి చేరే నీ జాలి
లాలించే నీ ప్రేమ – నా ప్రాణమై
కరుణించే నీ చూపు – మన్నించే నా మనవి
అందించే నీ చేయి – నా స్నేహమై     ||ఆగని||

లోకప్రేమే సదా – కలల కడలే కదా
తరంగమై కావుమా – తిరిగి తీరమునకు (2)
నీవే కదా ఆధారం – సదా నీకే దాసోహం
యేసయ్యా… అర్పించెదా – నా జీవితం     ||ఆగని||

ఎదుట నిలిచె నీవే – ప్రేమకు రూపం నీవే
కృపామయా కావుమా – జార విడువకు నన్ను (2)
నీవే కదా నా మూలం – సదా నీపై నా భారం
యేసయ్యా… ప్రేమించెదా – కలకాలము     ||ఆగని||

                        పాట రచయిత: జాషువా షేక్

13 May 2022

కూర్చుందును నీ సన్నిధిలో – దేవా ప్రతి దినం

 


కూర్చుందును నీ సన్నిధిలో – దేవా ప్రతి దినం
ధ్యానింతును నీ వాక్యమును – దేవా ప్రతి క్షణం (2)
నిరంతరం నీ నామమునే గానము చేసెదను
ప్రతి క్షణం నీ సన్నిధినే అనుభవించెదను           ||కూర్చుందును||

ప్రతి విషయం నీకర్పించెదా
నీ చిత్తముకై నే వేచెదా (2)
నీ స్ఫూర్తిని పొంది నే సాగెదా (2)
నీ నామమునే హెచ్చించెదా (2)
నా అతిశయము నీవే – నా ఆశ్రయము నీవే
నా ఆనందము నీవే – నా ఆధారము నీవే
యేసూ యేసూ యేసూ యేసూ..         ||కూర్చుందును||

ప్రతి దినము నీ ముఖ కాంతితో
నా హృదయ దీపం వెలిగించెదా (2)
నీ వాక్యానుసారము జీవించెదా (2)
నీ ఘన కీర్తిని వివరించెదా (2)
నా దుర్గము నీవే – నా ధ్వజము నీవే
నా ధైర్యము నీవే – నా దర్శనం నీవే
యేసూ యేసూ యేసూ యేసూ..         ||కూర్చుందును||

 

 

ఆనందింతుము ఆనందింతుము యేసుని సన్నిధిలో ఆనందింతుము..

  ఆనందింతుము ఆనందింతుము
యేసుని సన్నిధిలో ఆనందింతుము.. హే (2)
గంతులేసి నాట్యమాడి
ఉత్సహించి పాడెదం (2)
యేసుని సన్నిధిలో ఆనందింతుము (2)      ||ఆనందింతుము||

భయమూ ఎందుకూ… దిగులూ ఎందుకూ
దేవాది దేవుని తోడు మనకుండగా (2)
హల్లెలూయ అంటు ఆరా-ధింతుము ఎల్లప్పుడూ (2)
యేసుని సన్నిధిలో ధైర్యమొందెదం (2)      ||ఆనందింతుము||

నీతి లేని లోకంతో స్నేహం ఎందుకూ
నీతి సూర్యుడైన యేసు మనకూ ఉండగా (2)
పరిశుద్దుడంటూ పొగడి కొలిచెదము అనుదినం (2)
యేసుని సన్నిధిలో పరవశించెదం (2)      ||ఆనందింతుము||

ప్రేమలేని హితుల సఖ్యం ఎందుకూ
ప్రేమామయుడైన ప్రభువు మనకు ఉండగా! (2)
మహిమకరుడు అంటూ మ్రొక్కి పూజింతుము అనుక్షణం (2)
యేసుని సన్నిధిలో ఉత్సాహించెదం (2)      ||ఆనందింతుము||

 

 

Join Telegram

Join Telegram
Telugu Christian Lyrics