గాడాంధకారపు లోయలో-నే సంచరించిన వేళలో
అపాయమేమియు రానీయక-ఉన్నావు తోడుగ నా త్రోవలో (2)
యేసయ్య నీవే మా కాపరివి-ఏమి లేమి లేక కాపాడితివి (2)
నా ఆశ్రయ దుర్గము నీవే-నా బలమైన శైలము నీవే
నా రక్షణ శృంగము నీవే- నా శిక్షను భరియించితివే ||గాడాంధకారపు||
పచ్చిక గల చోట్లలో నిలిపావు - శాంతి జలములందు నన్ను నడిపావు (2)
యేసయ్య నీవే మా కాపరివి - ఏమి లేమి లేక కాపాడితివి (2)
నా ఎత్తైన కోట నీవే - నే నడిచే ప్రతి చోట నీవే
నా రక్షణకర్తా నీవే - నా జీవన దాతా నీవే |గాఢాంధకారపు|
నూనెతో నా తలను అంటావు- నా గిన్నెను పొర్లి పారజేసావు (2)
యేసయ్య నీవే మా కాపరివి -ఏమి లేమి లేక కాపాడితివి (2)
నా మొరను ఆలించావే -నీ వరములు నాకొసగావే
నా పరమ తండ్రివి నీవే -నీ కరమున నను దాచావే ||గాఢాంధకారపు||
యేసయ్య నీవే మా కాపరివి - ఏమి లేమి లేక కాపాడితివి (2)
నా త్రోవకు వెలుగు నీవే - నా నావకు చుక్కాని నీవే
నను కావగ ఏతెంచితివే - కొనిపోవగ రానున్నావే |గాఢాంధకారపు|
No comments:
Post a Comment