-:A:B:C:D:E:F:G:H:I:J:K:L:M:N:O:P:Q:.R:S:T:U:V:W:X:Y:Z:-

14 May 2022

పూజనీయుడేసు ప్రభు పలునిందల నొందితివా నాకై

 


 

పూజనీయుడేసు ప్రభు
పలునిందల నొందితివా నాకై (2)      ||పూజనీయుడేసు||

నీ స్వకీయులే నిందించినా
నిన్నంగీకరించక పోయినా (2)
ఎన్నో బాధ లొందితివా నాకై (2)
సన్నుతింతును నీ ప్రేమకై         ||పూజనీయుడేసు||

సత్యము మార్గము మరి జీవమై
నిత్యజీవమియ్యను వచ్చితివి (2)
వంచకుడవని నిన్ను నిందించిరా (2)
ఓ దయామయా నజరేయుడా         ||పూజనీయుడేసు||

యూదా గోత్రపు ఓ సింహమా
ఆద్యంతరహిత దైవమా (2)
అధములు నిను సమరయుడనిరా (2)
నాథుడా నిను బహు దూషించిరా         ||పూజనీయుడేసు||

మధురం నీ నామం అతి మధురం
మధుర గీతముతో నిన్నారాధింతును (2)
వధియించబడితివా యీ పాపికై (2)
వందితా ప్రభు నిన్ను పూజింతును         ||పూజనీయుడేసు||
 

 

No comments:

Post a Comment

Join Telegram

Join Telegram
Telugu Christian Lyrics