ఆధ్యాత్మిక సందేశాలు- 1 DOWNLOAD
ఆధ్యాత్మిక సందేశాలు-2 DOWNLOAD
ఆధ్యాత్మిక సందేశాలు- 3 DOWNLOAD
ఆధ్యాత్మిక సందేశాలు- 4 DOWNLOAD
ఆధ్యాత్మిక సందేశాలు- 5 DOWNLOAD
ఆధ్యాత్మిక సందేశాలు- 6 DOWNLOAD
Telugu Kristva keertanalu, Tamil Kristva keertanalu,Hindi Kristva keertanalu,Telugu Hindi Tamil Kannada, Maliyalamu Christan Songs
ప్రేమించెదన్ అధికముగా
ఆరాధింతున్ ఆసక్తితో
నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్
పూర్ణ బలముతో ప్రేమించెదన్
ఆరాధన ఆరాధనా
ఆ.. ఆ.. ఆరాధన ఆరాధనా (2)
ఎబినేజరే ఎబినేజరే
ఇంత వరకు ఆదుకొన్నావే (2)
ఇంత వరకు ఆదుకొన్నావే || నిన్ను పూర్ణ ||
ఎల్రోహి ఎల్రోహి
నన్ను చూచావే వందనమయ్యా (2)
నన్ను చూచావే వందనమయ్యా || నిన్ను పూర్ణ ||
యెహోవా రాఫా యెహోవా రాఫా
స్వస్థపరిచావే వందనమయ్యా (2)
స్వస్థపరిచావే వందనమయ్యా || నిన్ను పూర్ణ ||
సిలువే నా శరణాయెను రా నీ సిలువే నా శర ణాయెను రా సిలువ
యందే ముక్తి బలముఁ జూచితి రా ||నీ సిలువే||
1. సిలువను వ్రాలి యేసు పలికిన పలుకు లందు విలువలేని
ప్రేమామృతముఁ గ్రోలితి రా ||నీ సిలువే||
2. సిలువను జూచుకొలఁది శిలసమానమైన మనసు నలిగి కరిగి నీరగు
చున్నది రా ||నీ సిలువే||
3. సిలువను దరచి తరచితి విలువ కందఁగ రాని నీ కృప కలుష మెల్లనూ
బాపఁగఁ జాలును రా ||నీ సిలువే||
4. పలు విధ పథము లరసి ఫలిత మేమి గానలేక సిలువయెదుటను
నిలచినాఁడను రా ||నీ సిలువే||
5. శరణు యేసు శరణు శరణు శరణు శరణు నా ప్రభువా దురిత
దూరుఁడ నీ దరిఁ జేరితి రా ||నీ సిలువే||
ఎక్కడో మనసు వెళ్ళిపోయింది
ఏమిటో ఇటు రానే రానంది
ఆహాహా.. ఓహోహో…
నిజ ప్రేమ చెంతకు తను చేరానంటుంది
ఈ భువిలోన ఎక్కడైనను కానరాదంది (2)
అక్కడే చిక్కుకుపోయానంటుంది
బయటకు రానే రాలేనంటూ మారాము చేస్తుంది (2) ||ఎక్కడో||
జీవితాంతము పాద చెంతనే ఉంటానంటుంది
తన ప్రియుని వదలి క్షణమైనా రాలేనన్నది (2)
దేనికీ ఇక చోటే లేదంది
యేసు రాజుని గుండె నిండ నింపుకున్నానంటుంది (2) ||ఎక్కడో||
ఏకాంతముగా యేసయ్యతో ఉన్నానంటుంది
ఎవరైనా సరే మధ్యలో అసలెందుకు అంటుంది (2)
అక్కడే కరిగిపోతానంటుంది
ప్రేమ ప్రవాహములో మునిగి పోయానంటుంది (2) ||ఎక్కడో||
పాట రచయిత: ప్రసన్న బెన్హర్
పల్లవి:- ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు
మనస్సే మందిరమాయె - నా మదిలో దీపము నీవే
నిన్నాశ్రయించిన వారిని - ఉదయించు సూర్యునివలెనే
నిరంతరం నీ మాటతో ప్రకాశింపచేయుదువు
1.అమరమైన నీ చరితం - విమలమైన నీ రుధిరం
ఆత్మీయముగా ఉత్తేజపరచిన - పరివర్తన క్షేత్రము
ఇన్నాళ్ళుగ నను స్నేహించి - ఇంతగ ఫలింపజేసితివి
ఈ సర్వసంపదనంతటితో - అభినయించి నే పాడెదను
ఉండలేను - బ్రతుకలేను - నీతోడు లేకుండా - నీ నీడలేకుండా
|| ప్రేమే ||
2.కమ్మనైన నీ ఉపదేశము - విజయమిచ్చె శోధనలో
ఖడ్గముకంటే బలమైన నీ వాక్యము - ధైర్యమిచ్చె నా శ్రమలో
కరువుసీమలో సిరులోలికించెను - నీ వాక్యప్రవాహాము
గగనము చీల్చి మోపైన - దీవెన వర్షము కురిపించితివి
ఘనమైన నీ కార్యములు - వివరింప నా తరమా - వర్ణింప నా తరమా
|| ప్రేమే ||
3.విధిరాసిన విషాదగీతం - సమసిపోయె నీ దయతో
సంబరమైన వాగ్దానములతో - నాట్యముగా మార్చితివి
మమతల వంతెన దాటించి - మహిమలో స్థానమునిచ్చితివి
నీ రాజ్యములో జేష్ఠులతో - యుగాయుగములు నే ప్రకాశించనా
నా పైన ఎందుకింత గాఢమైన ప్రేమ నీకు మరువలేను యేసయ్యా
|| ప్రేమే ||
Tags: Preme Saswathamaina song Lyrics ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు, Hossana 2022 New Songs
కలువరి సిలువ సిలువలో విలువ -నాకు తెలిసెనుగా
కలుషము బాపి కరుణను చూపి - నన్ను వెదికెనుగా (2)
అజేయుడా విజేయుడా -సజీవుడా సంపూర్ణుడా (2) |కలువరి|
కష్టాలలోన నష్టాలలోన - నన్నాదుకొన్నావయ్యా
వ్యాధులలోన బాధలలోన - కన్నీరు తుడిచావయ్యా (2)
మధురమైన నీ ప్రేమ - మరువగలనా ఆ ప్రేమ (2)
అనుక్షణం నీ ఆలోచన -నిరంతరము నాకు నీవిచ్చిన |కలువరి|
పాపానికైనా శాపానికైనా -రక్తాన్ని కార్చావయ్యా
దోషానికైనా ద్వేషానికైనా -మరణించి లేచావయ్యా (2)
మధురమైన నీ ప్రేమ -మరువగలనా ఆ ప్రేమ (2)
అనుక్షణం నీ ఆలోచన -నిరంతరము నాకు నీవిచ్చిన |కలువరి|
ఇన్నాళ్లు తోడుగా మాతో నడిచావు
ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు (2)
ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము
నిన్నే అనుసరింతుము జీవితాంతము (2)
ఘనులైన వారే గతియించగా
ధనమున్నవారే మరణించగా (2)
ఎన్నతగని వారమైనా మమ్ము కనికరించావు
మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు (2) ||ఇశ్రాయేలు||
మా కంట కన్నీరు జారకుండగా
ఏ కీడు మా దరికి చేరకుండగా (2)
కంటి రెప్పలా కాచి భద్రపరచియున్నావు
దుష్టుల ఆలోచనలు భంగపరచియున్నావు (2) ||ఇశ్రాయేలు||