-:A:B:C:D:E:F:G:H:I:J:K:L:M:N:O:P:Q:.R:S:T:U:V:W:X:Y:Z:-

13 May 2019

ప్రార్థన ఎలా చెయ్యాలి?

ప్రార్థన ఎలా చెయ్యాలి?

ప్రతి క్రైస్తవుడు ప్రార్థన చేస్తాడు కాని, ప్రార్థించిన ప్రతి ఒక్కరు జవాబు పొందుకొనలేరు. కొందరు ప్రార్థిస్తారు కాని, జవాబు గురించి ఆలోచించరు. కొందరు ప్రార్థించి జవాబు కొరకు ఎదురు చూసి, జవాబు రానందుకు వారి స్వంత నిర్ణయాలతో  ముందుకు వెళ్తారు. ఎందుకు జవాబు రాలేదో ఆలోచించరు. కొందరు ప్రార్థన ఎంత  సమయం చేసారో  లెక్కపెట్టుకుంటారు. మరి కొందరు మేము ఆత్మీయతలో సీనియర్స్, మేము పది నిమషములు ప్రార్థన చేస్తే చాలు దేవుడుreference బలమైన కార్యాలు చేస్తాడు అని అనుకుంటారు. ఎడతెగక దేవుని పరిచర్య చేసేవారు పది నిమిషములు కాదు, సమయం లేని సందర్భములో నడుస్తూ ప్రార్థించినా దేవుడుreference బలమైన కార్యములు చేయగలడు. కాని, దినమంత వ్యర్ధమైన  పనులు చేస్తూ పది నిమిషములు ప్రార్థించి దేవుడుreference బలమైన కార్యములు చేస్తాడు అనుకోవడం భ్రమ. నేనంటాను క్రీస్తు స్వభావం లేకుండా జీవిత కాలమంతా మోకాళ్ళ పై ఉన్నా వారి జీవితంలో దేవుని కార్యం ఒకటి కూడా చూడలేరు. మరి కొంతమంది ప్రార్థించి జవాబు వచ్చేవరకు విశ్వాసమును విడిచిపెట్టరు.
దావీదు ప్రార్థన జీవితాన్ని చూస్తే ఆశ్చర్యం కలిగిస్తుంది. కీర్తనలు 18:6 లొ ... నా దేవునికు ప్రార్థన చేసితిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన నంగీకరించెను నా మొర  ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. దావీదు ప్రార్థన చేసి తన ప్రార్థన దేవుని చెవులలోనికి వెళ్ళడం కూడా చూసాడు. 
దేవుని చేత ప్రేమించబడిన ప్రియ సహొదరి/సహొదరుడా దేవునికి  ఎలాంటి ప్రార్థన ఇష్టం? ప్రార్థన ఎలా చెయ్యాలి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కొరకు నేను అనేక నెలలు వెదకినప్పుడు. మొట్టమొదట నాకు వచ్చిన సందేహం, నా గురించి నేనెందుకు ప్రార్థన చెయ్యాలి? ఈ సందేహం మా తండ్రి గారిని చూసినప్పుడు కలిగింది. నా చిన్ననాటి నుండి ఏది కొనమని నా తండ్రిని అడగలేదు, నేను లేమి అనేది ఎప్పుడు చూడలేదు, అనుభవించలేదు. నాకు ఏది అవసరమో, ఎలాంటి బట్టలు వేస్తే బాగుంటుందో నన్ను కన్న నా తలిదండ్రులే కొని తెచ్చేవారు. ఇది నాకు లేదు అనే స్థితి నాకు రాలేదు. నా తండ్రే కాదు యే తండ్రైన తమ పిల్లలు సంతోషముగా ఉండాలనే కోరుకుంటారు. ఈ లోకములో నేను కలిగిన తండ్రే ఇలా ఉన్నప్పుడు పరలోకపు తండ్రి ఎలా ఉండాలి? అబద్దమాడనేరని దేవుడుreference తనను ప్రేమించే ప్రతి ఒక్కరి అవసరములు తీరుస్తాడు. 
దేవునికి యదార్ధముగా  ప్రార్థించే వారు కావలి, నటించేవారు కాదు.  మత్తయి 6:5 లో...మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె  ఉండవద్దు అని ఉంది. వేషధారి అంటె వంచకుడు, మత వంచకుడు. తనకు తెలియకుండ తననే మోసము చేసుకొనేవాడు. తనకు తెలిసి పరిశుద్ధాత్మను మోసము చేసేవాడు. దేవుని మెప్పును కాకుండా ఇహలోక మెప్పును కొరుకొనే వాడే  వేషధారి. మత్తయి 6:2లో  వేషధారి మనుష్యుల వలన ఘనత పొందాలని ధర్మం చేస్తాడు. మత్తయి6:5లొ వేషధారి మనుషులకు కనబడవలెనని ప్రార్థన చేస్తాడు. 
ప్రియ చదువరీ!, ప్రార్థన లో ఎంత సమయం గడిపావనేది ముఖ్యం కాదు, క్రీస్తు స్వభావంతో చేయడం ముఖ్యం. మోకాళ్ళు నల్లబడటం ముఖ్యం కాదు, హృదయంలోని నలుపు పోవడం ముఖ్యం. చక్కగా ప్రార్థన చేస్తాడు అని మెప్పు రావడం ముఖ్యం కాదు, నీ ప్రార్థన తో దేవుని మనసును కదిలించడం ముఖ్యం. ఆదిలో ఆత్మ నీళ్ళ పై అల్లాడినప్పుడు సృష్టిలో భయంకరమైన అద్భుతములు జలిగినవి. నీ ప్రార్థన సృష్టికర్తయైన దేవుని కదిలించినప్పుడు నీ జీవితంలో అద్భుతములు చూడగలవు. ప్రార్థన రెండు హృదయాల కలయిక.

అవును ప్రియ చదువరి! మనకు ఇష్టమైన పాపమును విడిచిపెట్టి పరిశుద్ధ జీవితంలోనికి వచ్చాము. యేసు ప్రభువు తన కిష్టమైన పరలోకం విడిచి మన కోసం ఈ లోకమునకు వచ్చాడు. ఇదే రెండు హృదయాల కలయిక. మోకాళ్ళు నేలను తాకినప్పుడు, నోటిలోనుండి వచ్చే స్వరం చెవులకు వినిపించినపుడు, ఆహా! అది ఓ వర్ణించలేని అనుభూతి. హృదయం లోకంపై విజయ గర్వంతో నింపబడుతుంది. ప్రార్థన ఒక ఉప్పెన. సాతాను తంత్రములు పోట్టువలె కనిపిస్తుంటాయి ప్రార్థన ఒక శక్తివంతమైన విస్పోటనము. ఆది అపోస్తలుల లోకమును తలక్రిందులు చేయుటకు కారణం వారి పరిశుద్ధ, యదార్ధమైన హృదయంలో నుండి వచ్చిన ఆ ప్రార్థన వలననే సాతాను స్థావరములను ధ్వంసము చేసి సాతాను శక్తులను నిర్జీవపరచారు, అందుకే లోకం తలక్రిందులైంది.
ప్రార్థన లేని జీవితం చచ్చిన శవంతో సమానం. శవమునకు విజయానందం ఉండదు. లూకా 17:37 లో పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలును పోగవును... అనగా, సాతాను శక్తులు, అబద్ద ప్రవక్తలు పోగవుతారు. సత్యమునుండి తొలగించి క్రీస్తునకు విరోధులుగా చేయుటకు.
పరమగీతము 2:10-17 లో దేవుడుreference నీతో మాట్లాడుచున్నాడు. (వ11)ఈ సంవత్సరమునుండి పాపము విడిచి పెడతాను, రేపటినుండి ప్రార్థన చేస్తాను. ఆ పని ఈ పని అని ప్రార్థన వాయిదా వేయకు, దేశమంతా సువార్త ప్రకటించబడుచున్నది. క్రీస్తును దేవునిగా అంగీకరించుటకు అనేకులు ఆయన యొద్దకు తరలి వస్తున్నారు. బలమైన కార్యములు చేయుటకు దేవుని హస్తము చాపబడి యున్నది. ఇంకా చాలా సమయమున్నది అని ఎంత కాలం భ్రమపడతావు, లెమ్ము రమ్ము అని దేవుడుreference పిలుస్తున్నాడు. (వ 13,14) నా రక్తంలో కడగబడిన నీవు సుందరవతివి/సుందరుడవు; నా సన్నిధిలోనికి వచ్చి, నీ ముఖము కనబడనిమ్ము, నీ స్వరము వినబడనిమ్ము. ఎందుకంటే (వ 15) సంఘాలను,కుటుంబాలను చెరుపుచున్న గుంట నక్కలను పట్టుకొని దేవునికి సహాయము చేయుటకు. ప్రస్తుత దినాలలో అపవాది కుటుంబ వ్యవస్తని పాడుచేస్తున్నాడు. కుటుంబాలు విచ్చిన్నమై పోవుచున్నాయి. కుటుంబములో ఒకరితో ఒకరికి సమాధానం లేకుండా ఉన్నారు. కారణం కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, సంఘ సహవాసం లేకపోవుటయే.
దేవుని చేత ప్రేమింపబడుచున్న ప్రియచదువరి! సాకులు చెప్పకుండా ప్రార్థనను రేపటికి వాయిదా వేయకుండా, పైన తెలిపిన ఏడు లక్షణాలను కలిగి, పరిశుద్ధమైన ప్రార్థన కలిగియుండుటకు దేవుడుreference మీకు సహాయము చేయును గాక...!

యేసు ప్రార్ధన ... ప్రార్ధంచే సమయాలు ?


ప్రభువైన యేసు క్రీస్తు దేవుని కుమారుడై యుండి కూడ, ఆయన ఎంతగానో ప్రార్థన చేసెవాడు. ఆయన ప్రార్థించే స్థలాలు: తోటలలో, అరణ్యములలో, కొండల పైన, ప్రార్ధంచే సమయాలు: ఉదయముననే, సాయంకాలమందు, రాత్రంతా ప్రార్ధిస్తూ ఉండేవాడు. ప్రభువైన యేసు మనకు గొప్ప మాదిరిగా ఉన్నాడు. ఆయన ప్రార్ధించడం ద్వారా గొప్ప ఫలితాలు సాధించాడు.
1. బోధించటానికి:
మార్కు1:35 లో యేసు ప్రభువు వారు ఉదయ కాలములో ప్రార్ధించడానికి అరణ్యములోకి వెళ్ళినాడు. 36 వ వచనములో ఆయన బోధంచుటకు ఇతర గ్రామములకు వెళ్ళినట్లుగా వ్రాయబడివుంది. ప్రతి ఉదయమున (యెషయా 50:4) తండ్రితో గడిపి ఆ తరువాత బోధించెవాడు. ప్రభువైన యేసు క్రిస్తు జీవితమంతా ప్రార్ధనామయము, తన పరిచర్యను ప్రార్ధనతొ ప్రారంభించాడు, నలువది దినములు ఉపవాసముండి, ప్రార్ధించినాడు. తన పరిచర్య ముగింపులో గెత్సమనే తొటలో ఆ రాత్రి ప్రార్థించాడు, చివరకు సిలువలో వ్రేలాడుతూ కూడా ప్రార్ధించాడు. అ.కా 4:30లో శిష్యులు ప్రార్ధన చేసిన తరువాత గొప్ప ధైర్యముతొ బోధించినారు. బోధించెవారు, సాక్ష్యం చెప్పేవారు, సువార్తికులు, సండె స్కూలు టీచర్లు వీరంతా ప్రభువు వలె వాక్యాన్ని ప్రకటించక ముందు ఎక్కువ సేపు ప్రార్ధనలో గడపాలి.
2. శోధన తప్పించుకోవడానికి:
మత్తయి 14:23లో ఐదు రొట్టెలు, రెండు చేపలు ఐదు వేల మంది భుజించిన వారిలొ కొందరు యేసు ప్రభువును రాజుగా చేయాలని తలంచారు. అది దేవుని చిత్తము కాదు, ఈ ఆలోచన సాతాను ప్రేరేపణ వలన వచ్చినదే, రాజు అయినవాడు ఏవిధంగా సిలువకు ఎక్కగలడు? అవును యేసు ప్రభువు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు కానీ మొదటి రాకడలొ ఆయన రాజుగా ఉండడానికి రాలేదు అయితే అనేకులకు ప్రతిగా తన ప్రాణమును విమోచనక్రయధనముగా ఇవ్వడానికి వచ్చినాడు. రాజుగా చేయాలన్న ఈ శోధనను తప్పించుకొవడానికి యేసు వెంటనే కొండ మీదికి ప్రార్ధన చేయడానికి వెళ్ళినాడు. "మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థనచేయుడి; ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి" మత్తయి 26:41. ప్రార్ధన లేమి మనలను అనేకమైన శోధనలలోనికి నడిపిస్తుంది. ప్రార్థనా కొరత వలన ఈనాడు వ్యక్తిగత జీవితాలలో, కుటుంబాలలో, మరియు సంఘాలలో అనేక శోధనలను ఎదుర్కోవలసి వస్తుంది. ప్రభువే శోధనను తప్పించుకొవడానికి ప్రార్థన చేసినప్పుడు, మనము కూడ ఆయన మార్గములో వెళ్ళవలసి ఉంది.
3, నిర్ణయాలు తీసుకోవడానికి:
లూకా 6:12 ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడానికి ప్రభువు రాత్రంతా ప్రార్ధించినాడు. ఈ లోకాన్ని తలక్రిందులు చేయడానికి, అనేకులకు సువార్త ప్రకటించడానికి, అనేకులు నిత్యరాజ్యములో చేర్చబడడానికి, ఈ గొప్ప పని కొరకు ఆయనకు పన్నెండుగురు అపోస్తలలు అవసరం. రాత్రంతా వారి కొరకు ప్రార్ధించి, ఉదయ కాలములో శిష్యులను పిలిచి, వారిలో పన్నెండుగురు అపోస్తలలును ఏర్పరచుకొన్నాడు. మనమైతే ప్రార్థనలో కనిపెట్టకుండా, దేవుని చిత్తము ఏమిటో తెలుసుకోకుండానే, హాడావుడి నిర్ణయాలు తీసుకొని, ఆ తరువాత నష్టపోయిన సందర్భాలు అనేకం.
4. ప్రార్ధనాపరుల కొరకు :
ఆయన ఒక చోట చేరి ప్రార్ధించుచుండెను లూకా 11:1. యేసు ప్రార్ధించుచుండగా ఆయన శిష్యులు, మాకు కూడ ప్రార్ధన నేర్పమని అడిగారు. బాప్తీస్మమమిచ్చు యోహాను, ఆయన శిష్యులు ప్రార్ధించుచున్నారు అయితే మాకు ప్రార్ధించుట తెలియదు. యేసు ప్రభువు ప్రార్ధించడం వల్ల, వారు పురికొల్పబడి, వాళ్ళకు కూడ ప్రార్ధన భారము పెరిగింది. మనము ప్రార్ధించితే, ఇతరులు పురికొల్పబడి వారు కూడ ప్రార్ధన చేయడం ప్రారంభిస్తారు. ఈనాడు సంఘానికీ ప్రార్ధనాపరులు అవసరం అది మనతో ప్రారంభమవ్వాలి.
5. శ్రమలు ఎదుర్కోవడానికి:
ప్రభువు సిలువ, శ్రమలు ధైర్యంగా ఎదుర్కోవడానికి గెత్సమనే తోటలో ఆ రాత్రి ప్రార్ధించినాడు, మత్తయి 26:36. మనము ప్రార్ధించినప్పుడు దేవుని చిత్తమయితే శ్రమలు తొలగిస్తాడు, ఒకవేళ దేవుని చిత్తము కాకపోతే ఆ శ్రమలను ధైర్యంగా ఎదుర్కోవడానికి తగిన కృపను మనకు ఇస్తాడు. యేసు మూడు సార్లు ప్రార్ధిస్తాడు, పౌలు కూడ మూడు సార్లు ప్రార్ధన చేసినాడు, దేవుడు ఆయనకున్న ఆ ముల్లును తొలగించ లేదు కానీ నా కృప నీకు చాలును అని చెప్పినాడు. "మీలో ఎవనికైనను శ్రమ సంభవించెనా? అతడు ప్రార్ధన చేయవలెను (యాకోబు 5:13). మనం ప్రార్ధించినప్పుడు, దేవుడు మన శ్రమలను తొలగించి మనకు క్షేమాన్ని ఇస్తాడు.
6. క్షమించండం కొరకు :
యేసు సిలువలో వ్రేలాడుతూ, "తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము" (లూకా 23:34). ప్రభువైన యేసు జీవితమంతా ప్రార్ధనామయమే. ఏ వ్యక్తి ప్రార్ధిస్తాడో అతడు ఇతరులను సులభంగా క్షమించగలడు. ప్రార్ధన లేమి హృదయాన్ని కఠిన పరుస్తుంది. ప్రార్ధించే వ్యక్తి ఇతరులను క్షమిస్తాడు, ప్రేమిస్తాడు, మానవ సంబంధాలను మెరుగు పరుచుకుంటాడు.
7. ముఖ తేజస్సు కొరకు:
"ఆయన ప్రార్ధించుచుండగా ఆయన ముఖరూపము మారెను" (లూకా 9:29). భక్తులు, పరిశుద్ధులు ప్రార్ధించినప్పుడు వారి ముఖము కాంతివంతంగా ఉండేది. సీనాయి కొండ మీద దేవునితో గడిపిన మోషే ముఖచర్మము ప్రకాశించింది, ప్రార్ధనలేని వ్యక్తి ముఖములో చింత, విచారము ఉంటాయి (ఫిలిప్పు 4:6). నెమ్మది, సమాధానము కొరకు ఎక్కువగా ప్రార్ధించాలి.
ప్రియ స్నేహితుడా, సహోదరీ! శరీరధారియైయున్న దినములలో మహా రోదనముతోను, కన్నీళ్ళతోను ప్రార్ధన చేసిన యేసు ప్రభువు వారి ప్రార్ధనా జీవితం మనముందు గొప్ప మాదిరిగా ఉంది. ప్రభువుకు, ప్రవక్తలకు, పరిశుద్ధలకు అంత ప్రార్ధన అవసరమయితే, సామాన్య విశ్వాసులమైన మనకు ప్రార్ధన ఎంత అవసరం! ప్రార్ధనా జీవితాన్ని ప్రారంభిద్దాము, దేవుని ఆశీర్వాదాలను పొందుకొందాము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక!

ప్రార్థన ఎలా చేయాలి... ?


 ప్రార్థన ఎలా చేయాలి ?

1.నిలువబడి ప్రార్థనచేయవచ్చు

మీకు ఒకనిమీద విరోధ మేమైనను కలిగియున్న యెడల, మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడెల్లను వాని క్షమించుడి.
(మార్కు 11:25)

2. కూర్చుండి  ప్రార్థన చేయవచ్చు


ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి యేడ్చి, కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి, ఆకాశమందలి దేవుని యెదుట విజ్ఞాపన చేసితిని.
(నెహెమ్యా 1:4)

3. నడుచుచు ప్రార్థన చేయవచ్చు

తాను దిగి యింటిలో ఇవతల నుండి యవతలకు ఒకసారి తిరిగి నడచి, మరల మంచముమీద ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ యేడుమారులు తుమ్మి కండ్లు తెరచెను.
(2రాజులు 4:35)

4. తలవంచి ప్రార్థన చేయవచ్చు

అందుకు మోషే త్వరపడి నేలవరకు తలవంచుకొని నమస్కారముచేసి
(నిర్గుమ.కా.34:8)

 5. మోకరించి  ప్రార్థన చేయవచ్చు

వారి యొద్దనుండి రాతివేత దూరము వెళ్లి మోకాళ్లూని
(లూకా22:42)

6. చేతులెత్తి ప్రార్థన చేయవచ్చు

కావున ప్రతిస్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను.
(1తిమోతి 2:8)

7. సాగిలపడి  ప్రార్థించవచ్చు

కొంత దూరము వెళ్లి, సాగిలపడి నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నాయొద్దనుండి తొలగి పోనిమ్ము, అయినను నా యిష్టప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్మని ప్రార్థించెను.
(మత్తయి 26:39)

👉🏾 మన జీవితములో అపవిత్రపరచిన పాపాన్ని ఒప్పుకొంటూ యదార్థ హృదయముతో ప్రార్థించాలి.
👉🏾 మనం ఎటువంటి పరిస్థితిలో వున్నా ...సరే  దేవుని సన్నిధి మనతోనే వుంటుంది. ఆ నమ్మకము తోనే  ప్రార్థన ద్వారా ఆయన దగ్గరకు రావాలి.


మోషేకు దేవుడిచ్చిన మూడు సూచనలు



మోషేకు దేవుడిచ్చిన మూడు సూచనలు......

నిర్గమకాండము 4: 1,2
*అందుకు మోషేచిత్తగించుము; వారు నన్ను నమ్మరు నా మాట వినరుయెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరమియ్యగా*
*యెహోవానీ చేతిలోనిది ఏమిటి అని అతని నడిగెను. అందుకతడుకఱ్ఱ అనెను.*

నిర్గమకాండము 4వ అధ్యాయములో దేవుడు మోషేను పిలుచుట గూర్చి చదువుతాము. మోషేను ప్రోత్సహించి మరియు అతనికి బోధించుటకు మూడు సూచనలు దేవుడు అనుగ్రహించాడు.

*''నేను చెప్పునది వారు నమ్మరని''* మోషే దేవునితో చెప్పినప్పుడు, నీ చేతిలో ఏమున్నదని ఆయన అడిగాడు. దీనిని గమనించండి.

👉 *మన చేతిలో ఇప్పటికే ఉన్నదానితో దేవుడు ఎల్లప్పుడు ఆరంభిస్తాడు.*

 మనకు లేనిదానికొరకు మనము చూడనవసరము లేదు విధవరాలిని ఎలీషా ఇట్లడిగాడు, *''నీ యింటిలో ఏమున్నది?''* నూనె కుండ ఉన్నదని ఆమె చెప్పింది (2రాజులు 4:2,3).

*మోషే చేతిలో కఱ్ఱ మాత్రమే యున్నది. అది చాలును. దేవుడే నీతో ఉన్నట్లయితే, కఱ్ఱతో కూడా అద్భుతములు జరుగును.*

1⃣ *మొదటి సూచన* -
 *కఱ్ఱను నేలపడవేయుమని మోషేతో దేవుడు చెప్పాడు. అది పాముగా మారింది. మోషే దానినుండి పారిపోయాడు.* (నిర్గమకాండము 4:3).

 *''భయపడవద్దు నీ చేయి చాపి దాని తోక పట్టుకొనుమని''* దేవుడు చెప్పాడు. అతడు దానిని పట్టుకొనగా, అది మరలా కఱ్ఱగా మారింది.

👉 ఇక్కడ మనకున్న సందేశమేమిటి?
*కఱ్ఱ మోషేకు ఎంత సన్నిహితముగా ఉన్నదో సాతాను మనకు అంత సన్నిహితముగా ఉన్నాడు.*

🔹 సతాను మనకు ఎంతో దూరములో ఉన్నాడని నీవనుకొనుచున్నావా? కాదు. భార్యభర్తల మధ్య, పరిచారకుల మధ్య మొదలగువారి మధ్య మనస్పర్థలు వచ్చేటట్లు చేస్తాడు. కాని మనము సాతానుని జయించవచ్చును. అతడు ఇప్పటికే నశింపచేయబడి ఓడిపోయాడు.

కాబట్టి మనము అతనికి భయపడము. దేవుడు అతనిని మన పాదముల క్రింద త్రొక్కిపెట్టును. మనము ప్రభువును సేవించునప్పుడు, మొదటిగా మనము నేర్చుకొనవలసిన పాఠము, *''సాతానుకు భయపడకూడదు''.*  సాతానుకు కోట, దుర్గము ఉన్నది కాని మనము అతని నుండి పారిపోము.

*మనము యౌవనేచ్ఛల నుండి పారిపోవాలి.* (2తిమోతి 2:22). అయితే *సాతాను మనయొద్దనుండి పారిపోతాడు.*
 (యాకోబు 4:7).

👉సతాను ఏ నామమును బట్టి మనలను భయపెట్టాలనుకుంటాడో ఆ సర్వశక్తిగల శ్రేష్టమైన యేసునామమే, సముద్రములను రెండు పాయలుగా చేసి, దేవుని ప్రజలు ముందుకు వెళ్ళుటకు మన చేతిలో కఱ్ఱగా ఉండును.

*దేవుని సేవకులముగా మనకు మొదటిగా బైబిలు జ్ఞానముకాదు గాని దేవునియొక్క పునరుత్థాన శక్తి, అధికారము కావాలి.*

 నేను ఏ రోజైనా బైబిలు జ్ఞానము కంటే ఆత్మీయ శక్తి(జీవింపచేసే పరిశుద్ధాత్మ శక్తి)ని కలిగియుంటాను. మోషేకు మొదటిగా శత్రువు మీద అధికారము కావాలి. తన దాసుడైన ఫరో ద్వారా సాతాను, ఇశ్రాయేలీయులను బానిసలుగా చేసుకొనుటకు ప్రయత్నించియున్నాడు. కాబట్టి భయపడకుండా దాని తోక పట్టుకొని లేపాడు. *సాతానును గూర్చి మనమెప్పటికీ భయపడకూడదు.*

2⃣ *రెండవ సూచన*-

*దేవుడు మోషేతో నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొనమని చెప్పాడు.* (6వ).

మోషే తన చెయ్యిపెట్టి, తీసిన తరువాత ఆ చెయ్యి కుష్టుగలదాయెను.

👉 *దేవుని సేవకులముగా మనము తెలుసుకొనవలసిన రెండవ విషయము మన శరీరమందు మంచిది ఏదియు నివసించదు.* (రోమా 7:18).

*స్వార్థము మరియు భ్రష్టత్వము మన శరీర (ప్రాచీన స్వభావ)మంతటిలో ఉన్నది. నీవు ఇది నిజము కాదనుకొనినచో, నిన్నునీవే పరీక్షించుకొనుము.*

 నీలో ఉన్న కుష్టురోగము గురించి నీకు వెలుగు దయచేయుమని దేవునికి ప్రార్థించుము. నీవు ఈ పాఠము నేర్చుకోనట్లయితే, ఇతరులు నీకంటే చెడ్డవారని వారిని ఖండించే అవకాశమున్నది. మనము చేయలేని పాపమేదియు ఇతరులు చేయరు.

*వారు చేసిన పాపము మనము చేయలేదంటే దానికి కారణము కేవలము దేవుని కనికరము మరియు వారికి వచ్చినంతగా మనకు శోధన రాకపోవడము. మనము ఏ మనిషి కంటే కూడా మంచివారముకాదు. ఈ లోకములో ఉన్న ఏఒక్క వ్యక్తికంటే కూడా నీవు మంచివాడవనుకుంటే దేవుని సేవకు నీవు అనర్హుడవు.*

3⃣ *మూడవ సూచన*-

*కొంచెము ఏటినీళ్ళు తీసుకొని ఎండిననేల మీద పోయగా రక్తమగును.* (9వ).

 నైలునది ఐగుప్తీయులకు ఇష్టదేవత మరియు రక్తము మరణానికి సాదృశ్యము. దీనియొక్క ఆత్మీయ అర్థమేమిటనగా
*ఈ లోకస్తులు ఆశపడి వెంటాడి మరియు ఆరాధించే ఈ లోకసంబంధమైనవన్నియు చివరకు మరణాన్ని తెస్తాయి.*

👉 *ఒకదైవసేవకునకు లోకమును లోకమునకు అతడును సిలువ వేయబడియున్నారు. ఈ లోకము, నాకు అత్యవసరమైన జీవజలనదికాదు కాని రక్తమైయున్నది. కాబట్టి అది త్రాగవలెననే శోధన కూడా నాకురాదు. ఈ లోకములోని సమస్తమును మనము ఆవిధంగా చూడాలి.*                                          
 
*జాక్‌ పూనెన్*

Join Telegram

Join Telegram
Telugu Christian Lyrics