-:A:B:C:D:E:F:G:H:I:J:K:L:M:N:O:P:Q:.R:S:T:U:V:W:X:Y:Z:-

9 November 2015

అందాల తార అరుదెంచె నాకై - అంబర వీధిలో

 
అందాల తార
పల్లవి:    అందాల తార అరుదెంచె నాకై - అంబర వీధిలో
అవతారమూర్తి యేసయ్య కీర్తి -అవని చాటుచున్
ఆనందసంద్ర ముప్పోంగెనాలో - అమరకాంతిలో
ఆది దేవుని జూడ - అశింపమనసు పయనమైతిమి
                             .. అందాల తార..
1.        విశ్వాసయాత్ర - దూరమెంతైన - విందుగా దోచెను
వింతైన శాంతి - వర్షంచెనాలో - విజయపధమున
విశ్వాలనేలెడి - దేవకుమారుని - వీక్షించు దీక్షలో
విరజిమ్మె బలము - ప్రవహించె ప్రేమ - విశ్రాంతి నొసగుచున్   .. అందాల తార..
2.        యెరూషలేము - రాజనగరిలో - ఏసును వెదకుచు
ఎరిగిన దారి - తొలగిన వేల - ఎదలో క్రంగితి
ఏసయ్యతార - ఎప్పటివోలె - ఎదురాయె త్రోవలో
ఎంతో యబ్బురపడుచు - విస్మయ మొందుచు ఏగితి స్వామి కడకు      .. అందాల తార
..
3.        ప్రభుజన్మస్ధలము - పాకయేగాని పరలోక సౌధమే
బాలునిజూడ - జీవితమెంత - పావనమాయెను
ప్రభుపాదపూజ - దీవెనకాగా - ప్రసరించె పుణ్యము
బ్రతుకె మందిరమాయె - అర్పణలే సిరులాయె ఫలియించె ప్రార్ధన            .. అందాల తార..

No comments:

Post a Comment

Join Telegram

Join Telegram
Telugu Christian Lyrics