-:A:B:C:D:E:F:G:H:I:J:K:L:M:N:O:P:Q:.R:S:T:U:V:W:X:Y:Z:-

Showing posts with label క్ష. Show all posts
Showing posts with label క్ష. Show all posts

27 July 2023

క్షణమైనా నను విడువని దేవా - నిన్ను విడిచి నే నుండగలనా

 

 


క్షణమైనా నను విడువని దేవా - నిన్ను విడిచి నే నుండగలనా (2)
ఉండగలనా ....ఆ ...ఆ ...ఆ ...  (2) -నువ్వు లేకుండా నే నుండగలనా....  
                                                  
1.  కంటిలో చూపువైనావు ... - చెవిలో వినికిడైనావు (2)
శ్వాసలో ....శ్వాసవై ..... (2) - ఉంటున్నావు నడిపించుచున్నావు (2)
నడువగాలనా...ఆ ...ఆ ...ఆ ....నే నడువగలనా ...
నువ్వు లేకుండా నే నడువగలనా (2)
                                            
2.  ఏటిలో నీటివైనావు ... - నా దాహం తీర్చే ఊటవైనావు (2)
ప్రాణములో ప్రాణమై (2) - ఉంటున్నావు ...బ్రతికి౦చుచున్నావు (2)
బ్రతుక గలనా ...ఆ ...ఆ ...ఆ ... - నే బ్రతుక గలనా ...ఆ ...ఆ ...ఆ ...
నువ్వు లేకుండా నే బ్రతుక గలనా (2)
                                          
3.  నోటిలో పాటవైనావు -గొంతులో రాగమైనావు  (2)
నా మదిలో గానమువై - ఉంటున్నావు పాట - పాడించుచున్నావు
పాడగలనా….పాట పాడగలనా.. - నీవు లేకుండా నే పాడగలనా
                                    
4.  నిదురలో స్వప్నమైనావు - మధురమైన దర్శనమైనావు  (2)
కలనైనా..నిజమైనా… - కన్నుల ఎదుటే నీవుంటున్నావు - మనగలనా…
     నే మనగలనా…నివులేకుండా మరచిపోగలనా  (2)
                                   
5.  పాటలో పల్లవి అయినావు  - అందమైన రాగమైనావు  (2)
మధురమైనా చరణం అయినావు
నా బ్రతుకులో నీవు నిలువువున్నావు  (2)
పాడగలనా…. నే పాడగలనా… నీవులేకుండా నే పాడగలనా  (2)

Join Telegram

Join Telegram
Telugu Christian Lyrics