ఎందకనీ నేనంటే ఇంత ప్రేమ - దేనికనీ నాపైన - ఇంత కరుణ
జడివాన లోయలో - ఎదురీత బాటలో -ఎన్నడూ వీడనీ - దైవమా యేసయ్య
ఎందకనీ నేనంటే ఇంత ప్రేమ - దేనికనీ నాపైన - ఇంత కరుణ
1. ఆశ చూపే లోకం - గాయాలు రేపెనే - గాలి వానై నాలో - నను కృంగదీసెనే
మాతృమూర్తి నీవై - లాలించె నన్నిలా - ఆదరించసాగే - నీ ప్రేమ వెన్నెల
క్షణమైనా - యుగమైనా - నీ మమతే కనుపాపలా
2. మోయలేని భారం - నీపైన మోపగా - ఆరిపోదు దీపం - నీ చెంతనుండగా
ఎండమావియైనా - నీ ప్రేమ చాలుగా - ఎంత దూరమైనా - నా తోడు నీవెగా
కలనైనా - ఇలనైనా - నీ కృపలో కాపాడవా
#JoshuaShaikSongs #PranamKamlakhar #Anwesshaa #JesusSongsTelugu #TeluguChristianSongs
No comments:
Post a Comment