-:A:B:C:D:E:F:G:H:I:J:K:L:M:N:O:P:Q:.R:S:T:U:V:W:X:Y:Z:-

6 June 2023

పైనున్న ఆకాశమందునా క్రిందున్న భూలోకమందునా

 


 

పైనున్న ఆకాశమందునా
క్రిందున్న భూలోకమందునా (2)
లేదు రక్షణ ఏ నామమున
లేదు పాప విమోచన – (2)       పైనున్న

అన్ని నామములకు పైని కలదు
ఉన్నతంబగు యేసుని నామము (2)
యేసు నామములో శక్తి కలదు (2)
దోషులకు శాశ్వత ముక్తి కలదు (2)       పైనున్న

అలసి సొలసిన వారికి విశ్రం
జీవము లేని వారికి జీవము (2)
నాశనమునకు జోగేడి వారికి (2)
యేసు నామమే రక్షణ మార్గము (2)       పైనున్న

యేసు నామము స్మరియించగానే
మనసు మారి నూతనమగును (2)
బేధమేమియు లేదెవ్వరికిని (2)
నాథుని స్మరియించి తరింప (2)       పైనున్న

No comments:

Post a Comment

Join Telegram

Join Telegram
Telugu Christian Lyrics