-:A:B:C:D:E:F:G:H:I:J:K:L:M:N:O:P:Q:.R:S:T:U:V:W:X:Y:Z:-

28 August 2021

మాటల్లో చెప్పలేనిది - స్వరములతో పాడలేనిది

 



 

పల్లవి: మాటల్లో చెప్పలేనిది - స్వరములతో పాడలేనిది
కవితలలో వ్రాయలేనిది - ఎవరూ వర్ణించలేనిది
అ. ప: యేసూ నీప్రేమఒక్కటే... యేసూ నీ ప్రేమ ఒక్కటే "2"    
                                         "మాటల్లో"


1. స్వార్థంతో నిండినా ఈలోక ప్రేమాలోనా
మోసముతో కూడినా ఈ మనుషుల ప్రేమ మధ్య"2"
కల్మషమేలేనిది కరుణతో నిండినది"2"
కలవరమే తీసినది - కన్నీటిని తుడిచినది"2"

                                                               "యేసూ నీ ప్రేమ ఒక్కటే"



2. పాపముతో నిండినా ఈ లోకప్రేమాలోన
శాపముతో కూడిన - ఈ మనుష్యుల ప్రేమమధ్య"2"
లోకాన్ని ప్రేమించి - రక్తాన్ని చిందించి
సిలువలో మరణించినది - శిక్షను భరియించినది"2"

                                                                                                       
"యేసూ నీ ప్రేమ ఒక్కటే"

"మాటల్లో చెప్పలేనిది"

https://www.youtube.com/watch?v=FLTKhJc25KI

   


Lyric, Sung & Produced by : Joshua Gariki
Tune: Pastor.M.Jyothi raju
Music:J.K.Christopher
Mixed and Mastered by: J.K.Vinay & Sam k srinivas 

 

Bro yesanna songs jukebox | Hosanna ministries songs

 

 

 

 

song -1

కలవర పడి నే కొండల వైపు నా - కన్నులెత్తుదునా ?
కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ?
కొదువతో నేను కుమిలెదనా ?

కలవర పడి నే కొండల వైపు నా - కన్నులెత్తుదునా ?
నీవు నాకుండగా - నీవే నా అండగా -2
నీవే నా -3
నీవే నా ఆత్మదాహము తీర్చినా - వెంబడించిన బండవు
కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ? కొదువతో నేను కుమిలెదనా ?

 

1. సర్వకృపానిధివి - సంపదల ఘనివి -2
సకలము -3
సకలము - చేయగల నీ వైపే నా కన్నులెత్తి చూచెద కొండలవైపు నా కనులెత్తి - కొదువతో
నేను కుమిలెదనా ?
కొదువతో నేను కుమిలెదనా ?


 
2. నిత్యమూ కదలని - సీయోను కొండపై -2
యేసయ్యా -3
యేసయ్యా - నీదు ముఖము చూచుచూ పరవశించి పాడెద
కలవర పడి నే కొండల వైపు నా - కన్నులెత్తుదునా ?
కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ?
కొదువతో నేను కుమిలెదనా ?

కలవర పడి నే కొండల వైపు నా - కన్నులెత్తుదునా ?    


 

 

27 August 2021

నడిపించు నా నావ - నడి సంద్రమున దేవ Telugu Lyrics

 

 

 


 https://youtu.be/KnHcVmmlLkE

 

 నడిపించు  నా నావ - నడి సంద్రమున దేవ
     నవ జీవన మార్గమున - నా జన్మ తరి ఇంప


1.  నా జీవిత  తీరమున  - నా అపజయ భారమున
     నలిగినా నా హృదయమును - నడిపించుము లోతునకు
     నా ఆత్మా విరబూయ - నా దీక్ష  ఫలింప
     నా నావలో కాలిడుము - నా సేవ జేసుకోనుము //నడిపించు //

2. రాత్రంతయు శ్రమ పడినా - రాలేదు ప్రభు జయము
     రహదారులు వెదకినాను - రాదాయే ప్రతిపలము   
     రక్షించు  నీ సిలువ - రమణీయ లోతులలో
     రతనాలను  వేదకుటలో - రాజిల్లు నా పడవ //నడిపించు //


3. ఆత్మార్పణ చేయకయే - ఆశించితి నీ చెలిమి
    అహమును ప్రేమించుచునే - అరసితి నీ కలిమి  
    ఆశ నిరాశాయే - ఆవేదనేదురాయే
    ఆద్యాత్మిక లేమిగని - అల్లాడే నా వలలు  //నడిపించు //

4. ప్రభు మార్గము విడచితిని - ప్రార్థించుట మానితిని
    ప్రభు వాక్యము వదలితిని - పరమార్థము మరచితిని
    ప్రపంచ నటనలలో - ప్రావిన్యమును బొంది
    ఫల హీనుడని ఇపుడు - పాటింతు నీ మాట  //నడిపించు //


5. లోతైన జలములలో - లోతైన వినబడు స్వరమా
    లోబడుతాను నేర్పించి - లోపంబులు సవరించి
    లోనున్న ఈవులలో - లోతైన నా బ్రతుకు
    లోపించని యర్పనగా - లోకేష చేయుమయా  //నడిపించు //

6. ప్రభు యేసుని  శిష్యుడనై - ప్రభు ప్రేమలో పాదుకుని
    ప్రకటింతును లోకములో - పరిశుద్దుని ప్రేమ కథ
    పరమాత్మ ప్రోక్షణతో - పరి పూర్ణ సమర్పణతో
    ప్రానంబును ప్రభు కొరకు - పానార్పనము చేతు //నడిపించు // 

 https://youtu.be/KnHcVmmlLkE

 

 

 Tags: నడిపించు నా నావా christian songs/Sp balasubramanyam song/Christian songs / Telugu Christian songs/new Christian songs/ Album songs/ Album Christian songs/Telugu songs/ Christian video songs/Telugu gospel songs/ Gospel Christian songs/ Devotional songs / Devotional Christian songs/ Worship Christian songs/ Christian songs telugu/ Popular songs/ Popular Christian songs/Famous songs in telugu/ Famous Christian songs in telugu/ Christmas songs/Jesus songs/ Christian Jesus songs in Telugu/Telugu old songs/ Telugu new songs/Telugu Christian old songs/Telugu Christian new songs/ Telugu latest songs/ Telugu latest Christian songs/ songs in Telugu/ Christian songs in telugu/Christian songs 2021/ Christian songs 2021/ Christian songs 2021/ Christian songs 2017/ Sharon sister's Christian songs/ Stephen Paul Christian songs/ Jk Christopher Christian songs/ Paul Emmanuel Christian songs/ John Wesley Christian songs in Telugu/ Jayapaul Christian songs in telugu/Raj Prakash Paul Christian songs in Telugu/Satish kumar songs in Telugu /Enosh kumar Christian songs in telugu/Super hit Christian songs in telugu/ Melodious cover song in telugu/Melodious Christian songs in Telugu/ English Christian songs/ Andhra kraisthava keerthana lu songs/Andhra kraisthava keerthana Christian songs in Telugu/Gospel Christian songs/Gospel Christian songs in Telugu/Telugu songs/ Tamil songs/ Tamil songs / Indian Christian song Christians/ Indian Telugu Christian songs/4k Christian video/ 4k Christian songs/ Gospel music/ Gospel songs/Gospel Christian/Jesus Christ songs in Telugu/new Telugu Christian songs/ famous Christian songs in Telugu/ Latest Jesus Christ songs/Old Jesus Christ songs/ new songs in Telugu/Jesus Christ Telugu songs/Jesus Christ new Telugu songs/Christian video songs in Telugu/Christian videos/Worship songs/ Worship songs in Telugu/Worship Christian songs/Worship new Christian songs in Telugu/ Worship old Christian songs in Telugu/2021 hits Jesus Christ songs/2019 hits Jesus Christ songs/2018 Jesus Christ songs in Telugu/Christian lyrical songs/ lyrical songs/Jesus Christ lyrical songs/ Christ lyrics/ Christian lyrics/lyrical video songs/Video lyrics/Christian latest songs in Telugu/Christian lyrical songs/2020 new hit songs in Telugu/2020 Christian lyrical songs/2020 new songs/

26 August 2021

అందరు నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే

 

 


https://youtu.be/sPWOBa29j5o

 

అందరు నన్ను విడచినా
నీవు నన్ను విడువనంటివే (2)
నా తల్లియు నీవే
నా తండ్రియు నీవే
నా తల్లి తండ్రి నీవే యేసయ్యా (2)


లోకము నన్ను విడచినా
నీవు నన్ను విడువనంటివే (2)
నా బంధువు నీవే
నా మిత్రుడ నీవే
నా బంధు మిత్రుడ నీవే యేసయ్యా (2)


వ్యాధులు నన్ను చుట్టినా
బాధలు నన్ను ముట్టినా (2)
నా కొండయు నీవే
నా కోటయు నీవే
నా కొండ కోట నీవే యేసయ్యా (2)


నేను నిన్ను నమ్ముకొంటిని
నీవు నన్ను విడువనంటివే (2)
నా తోడుయు నీవే
నా నీడయు నీవే
నా తోడు నీడ నీవే యేసయ్యా (2)     ||అందరు నన్ను||

 

 https://youtu.be/sPWOBa29j5o

బండసందులలో జీవజలములు





*✍️ కీర్తనలు 23:3. నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతిమార్గములలో నన్ను నడిపించుచున్నాడు.*

నా ప్రాణానికి సేద తీరుస్తున్నాడు. తన పేరు ప్రతిష్ఠలకోసం నన్ను న్యాయ సమ్మతమైన మార్గాలలో నడిపిస్తూ ఉన్నాడు.



◼️విశ్వాసులగా మనం ఈ లోకంలో ఉన్నంత కాలం అలసట, విషమ పరీక్షలు తప్పవు.
◼️కొన్ని సార్లు  క్రుంగిపోయి నిరాశ చెందాలనే దుష్‌ప్రేరేపణకు కూడా గురి అవుతాము.
◼️అలాంటి సమయాల్లో  కాపరి  దరిచేరి మన ఆత్మలకు సేదదీర్చి ఊరడిస్తాడు.
◼️ఆయన మనలను నీతిన్యాయాల మార్గంలోనే నడిపిస్తాడు.
💥ఎన్నడూ వక్రమార్గాల్లో గానీ మోసకరమైన విశాల వీధుల్లో గానీ భ్రష్టత్వం, పాపం ఉన్న దారుల్లో గానీ నడిపించడు. ఈ మంచి కాపరి నిన్ను అబద్ధాల్లో ఇరికించే చెడ్డ దారుల్లో గానీ మంచి చట్టాన్ని మీరే విధానంలో న్యాయం తప్పి ప్రవర్తించవలసి వచ్చిన మార్గాల్లో గానీ నడిపించాడని ఎన్నడూ నీవు అనకూడదు.  ఆయన ఎన్నడూ అలా చేయడు. ఆయన నామం, ఆయన తండ్రి మహిమ తన గొర్రెలతో ముడిపడి ఉన్నాయి. *ఆయన వారినెప్పుడూ సత్యం, న్యాయం, యథార్థతతో కూడిన దారుల్లోనే నడిపిస్తాడు.*

 కాపరి యొక్క సంధానం 

నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు
He restoreth my soul

కాపరి ఆత్మలను restore చేస్తున్నాడు. Restoration జరుగుచున్నది. రెస్టోరేషన్ అంటే *తెగిపోయిన బంధాన్ని పునరుద్ధరించటం.* సంధానం చేయటం. *కాపరి తప్పిపోయిన గొఱ్ఱెలను వెదుకుచున్నాడు.* పాత నిబంధన మొత్తం దేవుడు చేసింది అదే. ఇశ్రాయేలీయులు బబులోను చెరలోకి వెళ్లిపోయినప్పుడు, దేవుడు యెహేజ్కేలు ప్రవక్త ద్వారా ఏమన్నాడు❓

యెహేజ్కేలు గ్రంధము 34వ అధ్యాయము
ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా ౼ *ఇదిగో నేను నేనే నా గొఱ్ఱెలను వెదికి వాటిని కనుగొందును*  15. నేనే నా గొఱ్ఱెలను మేపి పరుండబెట్టుదును; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. 16. తప్పిపోయిన దానిని నేను వెదకుదును, తోలివేసిన దానిని మరల తోలుకొని వచ్చెదను, గాయపడినదానికి కట్టు కట్టు దును, దుర్బలముగా ఉన్నదానిని బలపరచుదును. గాయపడిన గొఱ్ఱెలను మనం ఇక్కడ చూస్తున్నాము. మనం పాపం చేసినప్పుడు మనకు గాయాలవుతాయి. పాపం యొక్క పర్యవసానాలు మనం తప్పించుకొలేము. అయితే దేవుని ప్రేమ ఎలా ఉందో మీరు చూడండి. తప్పిపోయిన, గాయపడిన గొర్రెల కోసం ఆయన వెదుకుచున్నాడు. ఆ గొఱ్ఱెలు నశించిన స్థితిలో ఆయనకు కనిపించినాయి (మత్తయి సువార్త 10:6)

 యేసుప్రభువు ఏమన్నాడు❓

నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను.
లూకా సువార్త 19:10.
 మన పాపాల్లో నశించిన గొఱ్ఱెలము మనమే. మనలను వెదకి రక్షించటానికి వచ్చిన కాపరి యేసు క్రీస్తు. కాపరి లేని గొఱ్ఱెలముగా తప్పిపోయిన మనలను చూసి ఆయన కనికరబడ్డాడు.

మార్కు సువార్త 6:34: యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి, వారు కాపరిలేని గొఱ్ఱెలవలె ఉన్నందున వారిమీద కనికరపడి, వారికి అనేక సంగతులను బోధింపసాగెను.

*లూకా సువార్త 15 లో యేసు ప్రభువు ఒక ఉపమానం చెప్పాడు.* ఒక కాపరికి 100 గొర్రెలు వున్నాయి. వాటిలో ఒకటి తప్పిపోయింది. ‘ఒకటిగా, పోతే పోనియ్, ఇంకా 99 గొర్రెలు నాకు వున్నాయి, చాలు’ అని కాపరి అనుకోలేదు. తప్పిపోయిన ఆ ఒక్క గొర్రె కోసం కాపరి వెదుకుకొంటూ వెళ్ళాడు. *అది దొరికినప్పుడు దానిని భుజాల మీద వేసుకొని, ఇంటికి వెళ్ళాడు.* తన స్నేహితులను, చుట్టుపక్కల వారిని ఇంటికి పిలిచి సంతోషించాడు. *తప్పి పోయిన నా గొర్రె దొరికింది అని చెప్పి సంబరపడ్డాడు.*
నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు. He restoreth my soul

మన ఆత్మలను సంధానం చేసి, దేవునితో అనుసంధానం చేసే కాపరి. 23 కీర్తనను ఈ రోజు మనం ధ్యానించాం.

కాపరి యొక్క సంబంధం, సమస్తం, సమృద్ధి, సమాధానం, సంధానం ల గురించి మనం ధ్యానించాము.

*❤️ ఈ గొప్ప కాపరియైన యేసు క్రీస్తు దగ్గరకు వచ్చి, మీరు రక్షణ పొందాలి అన్నదే నేటి మా ప్రేమ సందేశం.❤️*

📖 1యోహాను 2:1-2 నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండు టకై యీ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసినయెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రియొద్ద మనకున్నాడు.  ఆయనే మన పాపములకు శాంతికరమై యున్నాడు; మన పాపములకు మాత్రమేకాదు. సర్వలోకమునకును శాంతికరమై యున్నాడు.

📖 యోహాను 14:6 యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.

*హల్లెలూయ...*

*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*

*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*
➖➖➖➖➖➖➖➖➖➖

 


నన్నెంతగా ప్రేమించితివో... నిన్నంతగా దూషించితినో...

 

 


 

 

నన్నెంతగా ప్రేమించితివో...
నిన్నంతగా దూషించితినో...

నన్నెంతగా నీవెరిగితివో...
నిన్నంతగా నే మరచితినో...


గలనా... నే చెప్పగలనా...
దాయనా ... నే దాయగలనా... (2)
అయ్యా... నా యేసయ్యా...


నాదం... తాళం... రాగం
ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము... (2)


1. ఏ రీతిగా నా ఉదయమును ... నీ ఆత్మతో దీవించితివో...
ఏ రీతిగా నా భారమును ... నీ కరుణతో మోసితివో ... (2)

ఏ రీతిగా నా పలుకులో ... నీ నామమును నిలిపితివో...
ఏ రీతిగా నా కన్నీటిని .... నీ ప్రేమతో తుడిచితివో ... (2) || గలనా ||



2. ఏ రీతిగా నా రాతను ... నీ చేతితో రాసితివో...
ఏ రీతిగా నా బాటను... నీ మాటతో మలిచితివో... (2)


ఏ రీతిగా నా గమ్యమును ... నీ సిలువతో మార్చితివో...
ఏ రీతిగా నా దుర్గమును ... నీ కృపతో కట్టితివో... (2) || గలనా || 

Join Telegram

Join Telegram
Telugu Christian Lyrics