-:A:B:C:D:E:F:G:H:I:J:K:L:M:N:O:P:Q:.R:S:T:U:V:W:X:Y:Z:-

10 March 2021

నీవే హృదయ సారధి-ప్రగతికి వారధి Neeve Hrudaya saaradhi ! Hossanna Songs 2021

పల్లవి:- నీవే హృదయ సారధి-ప్రగతికి వారధి

నీ స్నేహమే సౌభాగ్యము- సంక్షేమ సంతకం

 నా పాటకి సౌందర్యము నీవే యేసయ్యా

 

1. మదిలో చేదుజ్ఞాపకాలవిలయలవేదిక కూల్చి

చిగురాశల దిశగా నను పయనింప చేసినా

నీ మాటలు స్థిరపరచెను విశ్వాస ప్రేమలో

కలనైనా అనుకొని అనురాగ బంధమైతివే.  -"నీవే నా హృదయ"

 

 2 . నీవు లేని జీవితం ప్రళయసాగరమే

దిక్కుతోచని సమయములో నీవే దిక్సూచివై

చుక్కానిగా నడిపించుము ఆత్మీయ యాత్రలో

 కనుపాపగ నను కాచిన నా మంచి కాపరి - " నీవే నా హృదయ

 

 3.  చేరనైతి కోరనైతి స్నేహ సౌధము

 చిరు దివ్యెగ దరిచేరి చేర్చావు సన్నిధి

 చావైనా బ్రతుకైనా నీ కోసమే ప్రభు

 చాటింతు నీ ప్రేమను ప్రణుతింతు ప్రేమసాగరా  - " నీవే నా హృదయ"
 

 https://www.youtube.com/watch?v=q5BGAKh27ao


 

 

 Tags:  Neeve Hrudaya saaradhi, Hossanna Songs 2021, Telugu Christan Songs

9 March 2021

నీ దయలో నేనున్న ఇంత కాలం నీ కృపలో దాచినావు గత కాలం .. Nee dayalo nenunna intha kalamu


నీ దయలో నేనున్న ఇంత కాలం

నీ కృపలో దాచినావు గత కాలం (2)

నీ దయ లేనిదే నేనేమౌదునో (2)

 తెలియదయ్యా ||నీ దయలో||

 

11.  తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో

చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా (2)

నీ దయ ఉంటే వారు కాగలరు అధిపతులుగా

నీ దయ లేకపోతే ఇలలో బ్రతుకుట జరుగునా

 నీ సిలువ నీడలోనే నను దాచియుంచావని

నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని ||నీ దయలో||

 

22.  నేల రాలే నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు

అపవాది కోరలకు అంటకుండ దాచావు (2)

నీ రెక్కల నీడలో నాకాశ్రయ దుర్గము

ఏ కీడు నా దారికి రాకుండ నీ కృపను తోడుంచినావు

 నీ పాదాల చెంతనే నే పరవశించాలని

 నా ఆయువున్నంత వరకు నీ ప్రేమ పొందాలని ||నీ దయలో||

https://www.youtube.com/watch?v=jVwx4Q1pzTw

 

Tags: Nee dayalo nenunna intha kalamu Telugu Christian Songs, Telugu Songs

8 March 2021

సర్వకృపానిధియగు ప్రభువా - సకల చరాచర సంతోషమా

 



 

1.       సర్వకృపానిధియగు ప్రభువా - సకల చరాచర సంతోషమా 

స్తోత్రము చేసి స్తుతించెదము -  సంతోషముగ నిను పొగడెదము 

 

పల్లవి:            హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ హల్లెలూయా 

హల్లెలూయ యని పాడెదను - ఆనందముతో సాగెదను

 

2.       ప్రేమించి నన్ను వెదకితివి - ప్రీతితో నను రక్షించితివి

పరిశుద్దముగ జీవించుటకై - పాపిని నను  కరుణించితివి                    .. హల్లెలూయ..

 

3.       మరణ శరీరము మార్పు నొంది - మహిమ శరీరము పొందుటకై 

మహిమాత్మతో నను నింపితివి  - మరణ భయములను తీర్చితివి  .. హల్లెలూయ..

https://youtu.be/xv-PqYciO7E


Tags: telugu christian songs lyrics app telugu christian songs lyrics pdf download telugu christian songs lyrics and chords telugu christmas songs lyrics pdf a.r. stevenson songs lyrics in telugu telugu christian songs lyrics in powerpoint hosanna telugu christian songs lyrics jesus songs lyrics

Join Telegram

Join Telegram
Telugu Christian Lyrics