ప: యదలోనే సిలువ చిత్రము కదులుచున్నది
గుండెల్లో నీ నామ ప్రభావం రగులుచున్నది
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన- 4
(1)దుష్టులు కొరడాలతో బాధించగా
అవమానము అపహాస్యము నిను చేయగా
నా పాపమే నిను బాధించగా
నా శాపమే నిను శిక్షించగా
మోనినై సిలువలో నిను చూడగా
వెచ్చని నీ హస్తమే నను తాకగా
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన- 4
(2) కలువరి సిలువ వ్రేలాడగా
రక్తము ధారాలై ప్రవహించగా
నాదోషమే నిను హింసించగా
నా అక్రమమే నిను వేధించగా
భయముతో నీ పాదముల్ నే చేరగా
నీదు సన్నిధి నే అనుభవించగా
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన- 4
(3) ఆశతో ఆకాంక్షతో నిను చూడగా
సురూపము సొగసైనను లేదయగా
నా రోగమే నీవు భరియించగా
నా వ్యసనమే నీవు వహియించగా
ప్రేమతో నీ కౌగిట నే చేరనా
రక్షణ భాగ్యము నే పొందగా
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన - 4
No comments:
Post a Comment