పల్లవి: కల్వరిగిరిపై నా యేసయ్య – నాకొరకై నీప్రాణం పెట్టావయ్యా!
నీకెన్నిశ్రమలు కరుణామయా ! నీప్రేమకు సాటేది ఓనజరేయా ! -2 | కల్వరిగిరిపై|
1. కాళ్ళకు మేకులు కొట్టిరా – తలపై ముళ్ళకిరీటమా
నేరమే ఏమిలేకనే – అయ్యో ఇంతటి ఘోరమా -2
మా పాపభారం మోసావయ్యా మాకొరకై సిలువ మరణమొందావయ్యా
నీకెన్నిశ్రమలు కరుణామయా ! నీప్రేమకు సాటేది ఓనజరేయా ! -2 | కల్వరిగిరిపై|
2. తనువునే చీల్చి వేసిరా – రుథిరమే ఏరులైపారెనా
లోకమే ఏక మాయెనా – అయ్యో అంతటి ద్వేషమా -2
మాపాపభారం మోసావయ్యా మాకొరకై సిలువ మరణమొందావయ్యా
నీకెన్నిశ్రమలు కరుణామయా ! నీప్రేమకు సాటేది ఓనజరేయా ! -2 | కల్వరిగిరిపై|
No comments:
Post a Comment