-:A:B:C:D:E:F:G:H:I:J:K:L:M:N:O:P:Q:.R:S:T:U:V:W:X:Y:Z:-

3 July 2018

నైతిక విలువులు : స్త్రీ పురుషుల మధ్య సంబంధాలు



నైతిక విలువులు : స్త్రీ పురుషుల మధ్య సంబంధాలు 

పరమ 6:4 - 13, 1 తిమోతి 5:1 -2

పరమగీతములోను వాక్య భాగానికీ, తిమోతికి పౌలు ఇచ్చిన హెచ్చరికలకూ ఎంతైనా తేడా ఉంది. సొలొమోనును ఎంత జ్ఞానం, సంపద ఉన్నప్పటికీ అతని జీవితం విషాదాంతమైంది. అతడు వేసిన తప్పటడుగు స్త్రీల విషయంలోనే. ఇది అతని నైతిక విలువలను కూల ద్రోయడమే కాక, అన్య దేవతారాధనకు నడిపించింది. సొలొమోను పతనమైన ఫలితాలు అతని కుమారుడు రెహబాము పాలనలో పక్వానికొచ్చాయి. ఆ ఫలితాల ప్రభావం అనేక తరాలు నిలిచిపోయింది.

సోలోమోను వ్రాసిన పరమగీతం ఒక చక్కని షూనేమీ ఒక పిల్ల కథ. ఒక గొల్ల యువకుని ఆమె వివాహం వాడవలసియుంది సోలోమోను ప్రలోభాలకు ఆమె లొంగలేదు. తన ప్రియుడు పట్ల ఉన్న ప్రేమకే ఆమె కట్టుబడి ఉండిపోయింది. కామాతురతను ఖండిస్తూ పవిత్రమూ, సంపూర్ణమూ అయిన ప్రేమకు నీరాజనం ఇచ్చేదే ఈ పరమగీతం.

4-9 వచనాలు సొలొమోను పలికిన ముఖ స్తుతి పాటలు. ఆమె వాటిని తిప్పికొట్టింది. అందుకేనేమో సోలోమోను ఈమెను "సైన్యహిత సమభీకర రూపిణి" అన్నాడు. ఒక పల్లెటూరు అతని యుక్తులకు లొంగలేదు. అటువంటి కల్లాకపటం ఎరుగని మనస్సును లొంగదీసుకోవడం సొలొమోనును భయంకరమైన సైన్యంతో పోరాడటం లాగా అనిపించింది. 11,12 వచనాలలో ఆ అమ్మాయి తాను రాజుకు బందీగా చిక్కడం అతని కోరికను, తాను ప్రతిఘటించడం గురించి గుర్తు చేసుకుంటున్నది (వ 13).

ఇలాంటి విచ్చలవిడి కామేచ్ఛకు విరుద్ధంగా స్త్రీలపట్ల ఒక క్రైస్తవ దృక్పథం కలిగి ఉండమని పౌలు తిమోతీకి చెబుతున్నాడు (1తిమోతి 5:2). ఈ భావాన్ని రెండు మాటల్లో చెప్పవచ్చు - పవిత్రత, గౌరవం స్త్రీ, పురుషుల ప్రవర్తనకు ముఖ్యంగా యువతీయువకుల ప్రవర్తనకు సంబంధించిన కట్టుబాట్లు ఒక సంస్కృతికీ మరొక సంస్కృతికీ మారుతూ ఉండవచ్చు. అయితే అన్ని సమాజాలకూ సరిపోయే ఆదేశ సూత్రాలను బైబిలు ఇక్కడ తెలియజేస్తున్నది. మనం నివసిస్తున్న ఈ ప్రపంచంలో గౌరవం, పవిత్రత  వంటి విలువలకు గడ్డిపోచ విలువ కూడా లేదు. విశ్వాసులు బైబిలు ప్రమాణాల విషయంలో ధృడంగా నిలిచి ఈ నిర్ధేవ లోకం దరిచేరనీయకుండా జాగ్రత్తపడాలి.

పెద్దల పట్ల గౌరవభావాన్నీ, స్త్రీ పురుషులలో ఒకరి పట్ల ఒకరికి ఉండవలసిన దృక్పథాన్ని పౌలు ఒకే చోట చెప్పడం గమనించాలి. చిన్నవారు ఆత్మీయ దృష్టి గల పెద్దవాళ్ళ జ్ఞానానికీ అనుభవానికి తగిన మన్నన చూపాలి. అతి ప్రాముఖ్యమైన ఈ సంబంధాల విషయంలో దేవుని హస్తం ఎన్నడూ మనపై ఉండాలి ప్రార్థిద్దాం.

1తిమోతి 5:1-2;  పరమ  8:6; సామెతలు 23:16, 18, 22 


జె డబ్ల్యు . కెనడీ


No comments:

Post a Comment

Join Telegram

Join Telegram
Telugu Christian Lyrics