-:A:B:C:D:E:F:G:H:I:J:K:L:M:N:O:P:Q:.R:S:T:U:V:W:X:Y:Z:-

25 April 2018

మోషే - ఏడు గొప్ప సాకులు

*✳ మోషే - ఏడు గొప్ప సాకులు 🔥*

⏺  *' కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను ఇశ్రాయేలియులైన నా ప్రజలను నీవు ఐగుప్తులోనుండి; తోడుకొని పోవలెను'* (నిర్గ 3:10).

*పీఠిక :*
మోషే మంచి యౌవన ప్రాయములో దేవుని స్వరమును వినెను. అడవిలో గొర్రెలను కాయువానిని గొప్ప నాయకుడిగా దేవుడు ఎన్నుకొనుచున్నాడు. అందుకు మోషే దేవుడికి ఏడు గొప్ప సాకులు చెప్పుట గమనింతుము.

👉 1. *మొదటి సాకు :*

▪ 'నేను ఎంతటి వాడను' అందుకు మోషే - నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును, ఇశ్రాయేలియులను ఐగుప్తులో నుండి తోడు కొనిపోవుటకును ఎంతటివాడనని దేవునితో అనెను (నిర్గ 3:11).

♻ దేవుని ప్రత్యుత్తరము

*'నేను నీకు తోడై యున్నాను'. నేను నీకు ఒక సూచన ఇచ్చెదను. మీరు దేవుని సేవించెదరు* (నిర్గ 3:12).

👉 2. *మోషే రెండవ సాకు :*

▪ 'నేనేమి చెప్పవలెను' ఇశ్రాయేలీయులు - ఆయన పేరేమని అడిగిన యెడల నేనేమి చెప్పవలెను అని దేవుని అడిగెను (నిర్గ 3:13).

♻దేవుని ప్రత్యుత్తరము : *అందుకు దేవుడు - నేను ఉన్నవాడను అనువాడనై యున్ననని మోషేతో చెప్పెను*
(నిర్గ 3:14).

👉 3. *మోషే మూడవ సాకు :* '

▪వారు నన్ను నమ్మరు' అందుకు మోషే - చిత్తగించుము వారు నన్ను నమ్మరు, నా మాట వినరు (నిర్గ 4:1).

♻ *దేవుని ప్రత్యుత్తరము :* 'నేను నీకు సూచన లిచ్చుచున్నాను'.

A. *మోషే చేతిలోని కర్రపామగుట*
(నిర్గ 4:3).

B. *తన చెయ్యి రొమ్మును బెట్టుకొనగా కుష్టము గలదాయెను. మరల రొమ్ము నుండి వెలుపలికి తీసుకొనగా మిగిలిన శరీరమువలె నుండుట*
(నిర్గ 4:6-7).

C. *నీళ్లను కర్రతో కొట్టగా నీళ్లు రక్తముగా మారుట* (నిర్గ 4:1-9).

👉4. *మోషే నాలుగవ సాకు :*

▪'నేను మాట నేర్పరిని కాదు'.నేను నోటి మాంద్యము గలవాడను. నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పెను (నిర్గ 4:10).

♻దేవుని ప్రత్యత్తరము :

*'కాబట్టి నీ వెళ్లుము నేను నీ నోటికి తోడై యుందును', నీవు పలుక వలసినది నీకు బోధించెదనని చెప్పెను* (నిర్గ 4:11-12).

👉 5. *మోషే ఐదవసాకు :*

▪ 'నీవు మరియొకని పంపుము' - అందుకతడు అయ్యో ప్రభువా? నీవు పంపదలచిన వానిచేత పంపుము (నిర్గ 4:13)

♻దేవుని ప్రత్యుత్తరము :

*ఆయన మోషే మీద కోపపడి నీ అన్నయైన అహరోను లేడా? నీవు అతనితో మాట లాడి అతని నోటికి మాటలు అందియ్యవలెను. నేను నీ నోటికి అతని నోటికి తోడైయుండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించెదను* (నిర్గ 4:15-16).

👉 6. *మోషే ఆరవసాకు :*

▪ నా మొదటి యత్నము సాగలేదు (నిర్గ 5:25)

♻దేవుని ప్రత్యుత్తరము :

*నేనే యెహోవాను నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దారత్వములో నుండి, మిమ్మును విడిపించుదును*
(నిర్గ 6:6).

👉 7. *మోషే ఏడవసాకు :*

▪ 'నేను మాట మాంద్యము గలవాడను' - అందుకు మోషే - చిత్తగించుము ఇశ్రాయేలియులే నా మాట వినలేదు. నేను మాట మాంద్యము గలవాడను. ఫరో ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను (నిర్గ 6:12).

♻ *దేవుని ప్రత్యుత్తరము :*

▪ *'ఇదుగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండును', (నిర్గ 7:1) నీ అన్న అహరోను నీకు నోరుగా ఉండును.*

🌄దేవుడు నిన్ను పిలుచునప్పుడు నీవు ఆ గొప్ప అవకాశమును పోగొట్టుకొనక సాకులు చెప్పవద్దు. నీ యందు దేవునికి గల గొప్ప ఉద్దేశము ఏమనగా నీవు సాకులు మానుము దేవుని పిలుపు గుర్తించు, గొప్పసేవను గుర్తించుము నిన్ను నీవు రిక్తునిగా చేసుకొనుటకు సిద్ధపడుము.

▶  *పరిశుద్ధ గ్రంధములో కొంతమంది సాకులు చెప్పారు. క్లుప్తంగా కొన్ని విషయాలు చూద్దాం*.

👉 1 ఆదాము పండుతిని హవ్వే కారణమని సాకు చెప్పెను. (ఆది 3:12)

👉2. హవ్వ పండుతిని సైతాను కారణమని సాకు చెప్పెను. (ఆది 3:13)

👉3. లోతు సొదొమా నుండి బయటికి పొమ్మంటే చచ్చిపోతానేమో అని సాకు చెప్పెను. (ఆది 19:19)

👉4. మోషే ఇశ్రాయేలీయులను విడిపించుటకు దేవుడు వెళ్లమంటే వారు నామాట వినరు. నేను యోగ్యున్ని కాను, నత్తివాన్ని అని సాకు చెప్పెను. (నిర్గమ 3:11, 4:1,10)

👉5. అహరోను బంగారు దూడను తయారు చేసి ప్రజలే చేయమన్నారని సాకు చెప్పెను (నిర్గమ 32:22-24)

👉6. ఇశ్రాయేలీయులు దేవునికి లోబడటం ఇష్టం లేక సమూయేలు ముసలి వాడని సాకు చెప్పి, తమ కొరకు రాజు కావాలని కోరిరి. (1 సమూ 8:5)

👉7. సౌలు తొందరపడి యాజకుడు అర్పించవలసిన బలి అర్పించి సమూయేలు ఆలస్యమే దీనికి కారణమని సాకు చెప్పెను. (1 సమూ 13:11-12)

👉8. సౌలు దురాశతో శత్రువుల పశువులను చంపకుండా తన కొరకు దాచుకొని దేవునికి అర్పించడానికి తెచ్చాను అని సాకు చెప్పెను. (1 సమూ 15:21)

👉9. విందుకు రమ్మంటే ఒకడు నేనొక పొలమును కొనియున్నాను, మరియొకడు నేను ఎడ్లు కొనియున్నాను. వేరొకడు నేనొక స్త్రీని పెళ్ళిచేసుకున్నాను అని సాకు చెప్పి శ్రేష్టమైన ఆహ్వానాన్ని తిరస్కరించిరి. (లూకా 14:18-20)

👉10. సోమరియైన దాసుడు తనకివ్వబడిన తలాంతును రెట్టింపు చేయడం చేతకాక దేవుడే చెడ్డవాడని సాకు చెప్పెను. (మత్తయి 25:24,25)

👉11. ఫెలీక్సు రక్షణ పొందే అవకాశం పొందుకున్నప్పటికీ మిగుల భయపడి సాకు చెప్పి రక్షణ కోల్పోయాడు. (అపో||కా||24:25)

  💥  *సాకులు చెప్పక, దేవుని మాట చొప్పున చేయు శక్తి ఆ దేవుడే మనకు ప్రసాధించి,బలపర్చు గాక!*
ఆమెన్! ఆమేన్!! ఆమేన్!!!
*👆👆👆👆👆*

2 April 2018

ఇంతకి ఏది ముఖ్యం ? .. దేవుని వారసత్వమా ? ...సంఘ సభ్యత్వమా ?



♻ ఏది ముఖ్యం ?...✍

👉క్రీస్తుయేసు నందు విశ్వాసముంచి పరిశుద్ధపరచబడి, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడి,  క్రీస్తుయేసు నామములో ప్రార్ధనలు, ఆరాధనలు చేసే వారిని
" విశ్వాసి" అంటారు;
 ఇలాంటి  విశ్వాసుల సమూహాన్ని "దేవుని సంఘము" అంటాము.
(1-కోరింధి 1:2)

👉క్రైస్తవులు  ఎవరేనా ఏదో ఒక దేవుని సంఘంలో సభ్యలై ఉంటారు. ఇది సహజం. ఇదే సంఘ సభ్యత్వము.

"క్రీస్తుయేసును ఎందరు ఆంగికరింతురో, అనగా క్రీస్తుయేసు నామమునందు విస్వసముంచువారికందరికీ, దేవుని పిల్లలగుటకు అయన అధికారము అనుగ్రహించెను".(యోహాను 1:12)
👉ఇది దేవుని వారసత్వము గురించిన వాగ్ధానము.

"అద్వితీయకుమారుడైన క్రీస్తుయేసు నందు విస్వసముంచు ప్రతివారు నశింపక నిత్యజీవం పొందును". (యోహాను 3:16)
👉ఇది పరలోకం గురించిన వాగ్ధానము.

(యోహాను 1:12) మరియు (యోహాను 3:16) ప్రకారం యేసే; క్రీస్తు అని, దేవుని కుమారుడని, పాపుల రక్షకుడని ఆంగీకరించి, విశ్వసించి, మారుమనస్సు పొంది పరిశుద్ధంగా ఉండు ప్రతివారు దేవుని వారసులు మరియు నిత్యజీవమునకు అనగా పరలోకానికి వారసులు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు.

👉కానీ.... కొందరు మా సంఘమే నిజమైన సంఘము,

👉మా సంఘ విశ్వాసులు మాత్రమే పరలోకం పోతారు అని

🔺తమ సొంత మరియు తప్పుడు సిధంతాన్ని ప్రచారం చేస్తున్నారు. . . .

 తోటివిస్వసులలో కలవరాన్ని కలిగిస్తున్నారు. యేసు ఒకే ఒక్క సంఘం కట్టాడు. అది మా సంఘము. అని చెబుతారు.మా సంఘంలోకి రండి లేదంటే పరలోకం మీకు వుండదు అని చెబుతారు.

👉 చివరికి వీరి సిధంతం ఎలా ఉంటుందంటే . . .  ?

" నేను పాపం ఒప్పుకున్నాను, బాప్తిసం తీసుకున్నాను, ప్రార్ధన చేసుకుంటున్నాను, వాక్యం చదువుతున్నాను, పరిశుద్ధంగా ఉంటున్నాను, ఒక వాక్యానుసారమైన సంఘానికి క్రమంగా వెళ్తున్నాను" అని ఒకరు వీరితో చెప్పినా..

👉వీరు అంటారు "లాభంలేదు నువ్వు మా సంఘంకి వస్తేనే పరలోకం" అంటారు.
ఇది ఎక్కడి Bible సిధంతం.

నా ప్రియ స్నేహితులారా....

👉 ఇంతకి ఏది ముఖ్యం ?
 👉దేవుని వారసత్వమా ?
👉 సంఘ సభ్యత్వమా ?

యేసు నందు విశ్వాసం కన్నా గోప్పదైన ఈ సంఘ సభ్యత్వం గురించి నేను ఎక్కడ వినలేదు.

దేవుని వాక్యం చెబుతుంది "యేసుని విశ్వసించినవారలారా....మీదే నిత్యజీవం" అని.

👉నాకు పరలోకం ఇచ్చేది ఎవరు ?
👉నా సంఘానికున్న పేరా ? లేక యేసు నందు నాకు ఉన్న విస్వసమా.
దేవుని వాక్యం చెబుతుంది

 "యేసుక్రీస్తు నందు మీ విశ్వసము మీకు పరలోకం ఇస్తుందని.

👉గమనించండి. . . .
ఎంతో కస్టపడి, ప్రయాసపడి సువార్త చెప్పి ఒక సేవకుడు ఒక దేవుని సంఘాన్ని కడితే ఆ సంఘం విశ్వాసుల దగ్గరకు వెళ్లి మీది నిజమైన సంఘం కాదు మా సంఘానికి రండి అని విస్వసులను బ్రమపరచి ఆ సేవకుని సంఘ క్రమాన్ని కొందరు ఆటంకపరచుచున్నారు.

ఇలాగే. . . .
ఒక రోజు యేసు దగ్గరికి అయన శిష్యులు వచ్చి " బోధకుడా.... ఒకరు నీ నామములో పరిచర్య చేస్తున్నాడు, వాడు మనలను వెంబడించువాడు కాదు, అందుకే వాడిని ఆటంకపరచితిమి" అని చెప్పారు.అప్పుడు నా యేసయ్య వారితో ఇలా అన్నారు " వానిని ఆటంకపరచుకుడి, మనకు విరోధికానీ వాడు మన పక్షముగా ఉన్నవాడే కదా.వాడు మన వాడే." అని చెప్పాడు.(మార్కు 9:38-41).

♻ ఇక్కడ శిష్యులు అనుకున్నారు తమదే ఒకేఒక్క నిజమైన గుంపు అని, పరిచర్య చేయుటకు తమకు మాత్రమై హక్కు ఉందని.

 ఇది సంకుచితమైన మనస్సు, లోకనుసారమైన మనస్సు. కానీ యేసు దైవిక మనస్సుగలవాడు కనుకే తన నామములో పరిచర్య చేయు వాడిని ఆటంకపరచకండి అని కచ్చితంగా చెప్పారు.

👉 దేవుడు పక్షపాతికాడు. . . .
వాక్యం ఇంత చక్కగా చెబుతుందే....
👉ఎక్కడికి పోయిందండి  బోధకుల బుద్ది, ఈ వాక్యాలు చదివే టప్పుడు, ధ్యానిచేటప్పుడు ఏమయిందండి ఈ  బోధకుల జ్ఞానం.

🔺ఎప్పుడు చూడు ఒకే పాట. . . .
🔺మాదే నిజమైన సంఘం. మాదే పురాతన సంఘం.
🔺మాదే క్రీస్తు కట్టిన సంఘం.
🔺 మాదే పరలోకం ఇచ్చే సంఘం.
🔺 మాదే నూతన నిబంధన సంఘం.

దేవుని వాక్యాన్ని అనుసరించి పరిచర్య చేసే ప్రతి ఒక్కరు దేవుని సేవకులే.

దేవుని వాక్యాన్ని అనుసరించి " అపోస్తలుల బోధలో, సహవాసంలో, రొట్టెవిరచుటలో, ప్రార్ధనలో నిలకడగా నిలచి ఫలించిన ప్రతి సంఘం పేరు ఏదేనా ఆ "సంఘం యేసుదేవుని సంఘమై." కాదు అనటానికి ఎవ్వరికి హక్కు లేదు.

(మార్కు 9:38-41)
👉 ప్రకారం దేవుని పని చేసే వాడికి మీ సంస్థ పేరు లేకున్నా వాడు దేవుని సేవకుడే అని ఎప్పుడండి నేర్చుకుంటారు.

(యోహాను 1:12) ప్రకారం
 యేసు నామములో విశ్వాసం ఉంచు వారు ఎవరేనా దేవుని కుమారులు, వారసులని అని ఎప్పుడండి నేర్చుకుంటారు.

(యోహాను 3:16) ప్రకారం కుమారుడిని చేర్చుకున్న వారు ఎవ్వరేనా నశింపక నిత్యజీవం, పరలోకం పొందుతారని ఎప్పుడండి నేర్చుకుంటారు.

🔺ఇంకా ఏంత కాలం మీ సంఘం పేరును బట్టి అతిశయిస్తారు ?

👉ఇలాగే సున్నతిని బట్టి అతిశయించు వారిగురించి పౌలు గారు మాట్లాడుతూ మాట్లాడుతూ
" మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరం అగునుగాక" అని పలుకుతాడు.(గలతీ6:11-14).

యేసు క్రిస్తుని నామంలో అతిశయించండి.

యేసు క్రిస్తుని సిలువనుబట్టి అతిశయించండి.

యేసు క్రిస్తు ఇచ్చిన రక్షణను బట్టి అతిశయించండి.

యేసు క్రిస్తుని పునరుద్ధానం బట్టి అతిశయించండి.

యేసు క్రిస్తుని రెండవ రాకడను బట్టి అతిశయించండి.

అతిశయించంటానికి, గొప్పగా చెప్పుకోటానికి యేసు క్రిస్తు మనకి ఎన్నో ఇచ్చారు అవి అన్ని వదిలేసి అతిశయించండానికి, గొప్పలు చెప్పుకోటానికి మీ సంఘం పేరే దొరికిందా.

నా ప్రియ స్నేహితులారా....

👉 ఇంతకి ఏది ముఖ్యం ?
👉 దేవుని వారసత్వమా ?
👉 సంఘ సభ్యత్వమా ?

పరలోకంలో మనకి కనిపించేది ఒకేఒక్క సంఘం వారుకాదు....

 ప్రతి వంశం నుండి,ఆయా బాషలు మాట్లాడువారి నుండి, ఆయా జాతులలో నుండి, ఆయా జనములలో నుండి, ఆయా ప్రజలలో నుండి ఎన్నికేన వారు అక్కడ ఉంటారు. (ప్రకటన 5:9).

👉 సంఘ సభ్యత్వం పరలోకంలో పనికి రానే రాదు.

మనం దేవుని బిడ్డలం యేసు మనకు ఇచ్చిన  విశ్వాసం మనలను పరలోకం తీసుకుపోతుంది.

దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానం, దత్తపుత్రాత్మ, యేసు కృప, యేసు మనకొరకు ఇచ్చిన క్రయధానం ఇవి అన్ని కలిపి మనలను పరలోకం తిసుకుపోతాయి.

👉 కనుక పరలోకం ఇచ్చే సంఘం, ఒకేఒక్కే సంఘం,మాదే నిజమైన సంఘం పేరుతో మన ముందుకు వచ్చే వారికీ కొంచం దూరంగా వుందం.

హల్లెలూయ...

మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.

ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!

మరణం తరువాత


మరణం తరువాత ఏమిటి?....✍


క్రైస్తవ విశ్వాసులలోనే, మరణం తరువాత ఏమి జరుగుతుంది అను విషయమును గూర్చి గొప్ప సందిగ్ధం ఉంది.

👉మరణం తరువాత ఆఖరి తీర్పు వరకు అందరు “నిద్రిస్తారు,” ఆ తరువాత అందరు పరలోకానికి లేక నరకానికి పంపబడతారని కొందరు నమ్ముతారు.

👉మరణించిన వెంటనే ఒకనికి తీర్పుతీర్చబడి పరలోకానికి లేక నరకానికి పంపబడతారు అని మరికొందరు నమ్ముతారు.

 మరణించిన తరువాత ప్రజల యొక్క ప్రాణములు/ఆత్మలు “తాత్కాలిక” పరలోకం లేక నరకంలోనికి పంపబడి, ఆఖరి పునరుత్ధానం, ఆఖరి తీర్పు, మరియు వారి యొక్క నిత్య గమ్యము యొక్క తీర్పు కొరకు ఎదురుచూస్తారు.

👉  కాబట్టి, మరణం తరువాత ఖచ్చితంగా ఏమి జరుగుతుందని బైబిల్ చెబుతుంది?

♻ యేసు క్రీస్తు యొక్క విశ్వాసి కొరకు, క్రీస్తును రక్షకునిగా అంగీకరించుట ద్వారా వారి పాపములు క్షమించబడెను కాబట్టి, మరణం తరువాత వారి ఆత్మలు/ప్రాణములు పరలోకానికి తీసుకొని పోబడతాయని బైబిల్ చెబుతుంది (యోహాను 3:16, 18, 36).

👉 విశ్వాసులకు మరణం అనగా
“శరీరమును వెడలిపోయి క్రీస్తుతో ఉండెదను” (2 కొరింథీ. 5:6-8; ఫిలిప్పీ. 1:23).
 అయితే, విశ్వాసులు పునరుత్ధానం పొంది మహిమగల శరీరములు పొందుకుంటారని 1 కొరింథీ. 15:50-54 మరియు 1 థెస్స. 4:13-17 వివరిస్తుంది.

👉మరణం అయిన వెంటనే విశ్వాసులు క్రీస్తుతో ఉండుటకు వెళ్తే, ఈ పునరుత్ధానం యొక్క ఉద్దేశము ఏమిటి? విశ్వాసుల యొక్క ఆత్మలు/ప్రాణములు మరణం అయిన వెంటనే క్రీస్తు యొద్దకు వెళ్తే, భౌతిక శరీరము సమాధిలో “నిద్రిస్తుంది” అనిపిస్తుంది.

👉విశ్వాసుల యొక్క పునరుత్ధానంలో, భౌతిక శరీరం పునరుత్ధానం పొందుతుంది, మహిమ పొందుతుంది, మరియు ఆత్మ/ప్రాణముతో మరలా జతపరచబడుతుంది. ఈ మరలా జతపరచబడిన మరియు మహిమపరచబడిన శరీరం-ప్రాణం-ఆత్మ నూతన ఆకాశం మరియు నూతన భూమిలో నిత్యత్వం వరకు విశ్వాసుల యొక్క స్వాస్థ్యం అవుతుంది (ప్రకటన 21-22).


🔺1కోరింథీయులకు 15:44
ప్రకృతిసంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మసంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరమున్నది గనుక ఆత్మసంబంధమైన శరీరము కూడ ఉన్నది.

🔺మరొక వాక్యభాగమును పరిశీలించిన యెడల మన యేసయ్య, మృతులలో నుండి మొట్టమొదటి సారిగా మహిమ గల శరీరముతో లేపబడినవాడు అని స్పష్టం అవుతుంది.

కొలస్సీయులకు 1:18:
సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు; ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము, ఆయన ఆదియైయుండి మృతులలోనుండి లేచుటలో ఆదిసంభూతుడాయెను.

1 కోరింథీయులకు 15: 42, 43:
మృతుల పునరుత్థానమును ఆలాగే. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును;ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును; బలహీనమైనదిగా విత్తబడి, బలమైనదిగా లేపబడును;

👉 కనుక యేసయ్య ఏ విధముగా చనిపోయి, మహిమ గల శరీరముతో తిరిగి లేపబడ్డాడో
అదే విధముగా మనము కూడా చనిపోయి మహిమ గల శరీరముతో తిరిగి  పైకి లేపబడుదుము.
 ఏలయనగా యేసయ్య మృతులలోనుండి లేచుటలో ఆదిసంభూతుడు (కొలస్సీయులకు 1:18) . ఆయన మనందరికీ సాదృశ్యం అయి ఉన్నాడు.

👉ఆయన ఎలాంటి మహిమ గల ధరించాడు అని బైబిల్ గ్రంధమును మనం పరిశీలించినట్లయితే

యోహాను 20:26, 27
ఎనిమిది దినములైన తరువాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడ ఉండెను. తలుపులు మూయబడియుండగా యేసు వచ్చి మధ్యను నిలిచిమీకు సమాధానము కలుగును గాక అనెను.తరువాత తోమాను చూచినీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము; నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుమనెను.

🔹1). తోమా యేసయ్యను గుర్తు పట్టగలిగినట్లు, మనము కూడా ఇతరులచే గుర్తుపట్టగలం.

🔹2). తలుపులు మూయబడి వున్నా కూడా యేసయ్య గదిలోనికి ఏ విధముగా రాగలిగాడో , అదే విధముగా మనము కూడా ప్రవేశించగలం.

🔹3). యేసయ్యకు శిలువ మరణము వలన కలిగిన గురుతులు వలె, మనము కూడా భౌతికపరమైన గురుతులు కలిగి ఉండగలము.

👉  శరీరములను ధరించుకొంటాము అనగా
ఈ లోక సంభంధమైన శరీరము కాదు, మహిమ గల  అక్షయమైన శరీరము ధరించుకొంటాము అని రూడిగా మన హృదయములో  బద్రపరుచుకోవాలి.

1కోరింథీయులకు 15:44:
ప్రకృతిసంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మసంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతిసంబంధమైన శరీరమున్నది గనుక ఆత్మసంబంధమైన శరీరముకూడ ఉన్నది.

♻ క్రీస్తును రక్షకునిగా అంగీకరించనివారికి, మరణం అనగా నిత్య శిక్ష అవుతుంది.
 అయితే, విశ్వాసుల వలెనే, అవిశ్వాసులు కూడా ఆఖరి పునరుత్ధానం, తీర్పు, మరియు నిత్య గమ్యము కొరకు తాత్కాలిక స్థలమునకు పంపబడతారు. ధనవంతుడు మరణించిన వెంటనే హింసించబడెను అని లూకా 16:22-23 వర్ణిస్తుంది.

అవిశ్వాసులుగా మరణించిన వారందరు తిరిగి లేచి, గొప్ప శ్వేత సింహాసనం యొద్ద తీర్పును పొంది, తరువాత అగ్ని గుండమునకు పంపబడతారని ప్రకటన 20:11-15 వివరిస్తుంది.

👉 అనగా, అవిశ్వాసులు మరణం తరువాత వెంటనే నరకంలోనికి (అగ్ని గుండములోనికి) పంపబడరుగాని, తీర్పు మరియు శిక్ష అను తాత్కాలిక స్థలంలో ఉంటారు.

👉అయితే, అవిశ్వాసులు వెంటనే అగ్ని గుండములోనికి పంపబడనప్పటికీ, మరణం తరువాత వారి గమ్యం అంత సుఖవంత కాదు. ధనవంతుడు, “నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని” కేకలు వేశాడు (లూకా 16:24).

👉కాబట్టి,
మరణం తరువాత, ఒక వ్యక్తి “తాత్కాలిక” పరలోకం లేక నరకంలో ఉంటాడు. ఆ తాత్కాలిక ప్రదేశం తరువాత, ఆఖరి పునరుత్ధానంలో, ఆ వ్యక్తి యొక్క నిత్య గమ్యం మార్చబడదు. ఆ నిత్య గమ్యం యొక్క ఖచ్చితమైన “స్థానం” మారుతుంది అంతే.

విశ్వాసులకు తుదకు నూతన ఆకాశం మరియు నూతన భూమిలోనికి ప్రవేశం లభిస్తుంది (ప్రకటన 21:1).

అవిశ్వాసులు తుదకు అగ్నిగుండములోనికి పంపబడతారు (ప్రకటన 20:11-15).

👉 ఇవి ప్రజలందరి యొక్క ఆఖరి నిత్య గమ్యాలు-వారు తమ రక్షణ కొరకు యేసు క్రీస్తుపై మీద మాత్రమే విశ్వాసం ఉంచారో లేదో అను దాని ఆధారంగా (మత్తయి 25:46; యోహాను 3:36).

♻ మరణం తరువాత జీవితము ఉందా ?

అనునది సార్వత్రిక ప్రశ్న.
“స్త్రీ కనిన నరుడు కొద్ది దినములవాడై మిక్కిలి బాధనొందును, పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును నీడ కనబడక పోవునట్లు వాడు నిలువక పారిపోవును...మరణము తరువాత నరులు బ్రతుకుదురా?”
 అని అంటూ యోబు మనందరి కొరకు మాట్లాడుచున్నాడు (యోబు 14:1-2, 14).

👉మరణం తరువాత జీవితము మాత్రమే కాదు, మహిమ కరమైన నిత్య జీవము ఉన్నదని,
 “దేవుడు తన్ను ప్రేమించువారికొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరముకాలేదు” (1 కొరింథీ. 2:9)
 అని బైబిల్ చెబుతుంది.

👉యేసు క్రీస్తు, శరీరధారియైన దేవుడు, నిత్య జీవమను ఈ బహుమతిని మనకిచ్చుటకు ఈ భూమి మీదికి వచ్చెను. “మన యతిక్రమ క్రియలనుబట్టి అతడు గాయపరచబడెను, మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను. అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది” యెషయా 53:5.

మనమంతా పొందవలసిన శిక్షను యేసు తనపై వేసుకొని మన పాపమునకు పరిహారం చెల్లించుటకు తన జీవితమును బలిగా ఇచ్చెను. మూడు దినములు తరువాత, సమాధి నుండి తిరిగిలేచుట ద్వారా మరణముపైన ఆయన విజయవంతుడని రుజువు చేసెను. ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళుటకు ముందు నలభై దినములు భూమి మీద ఉండి వేల మందికి కనిపించెను.

“ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి, మనము నీతుమంతులముగా తీర్చబడుటకై లేపబడెను” అని రోమా. 4:25 చెబుతుంది.

 క్రీస్తు యొక్క పునరుత్ధానం చక్కగా లిఖించబడిన సన్నివేశం. దీని చెల్లుబాటును పరీక్షించుటకు సాక్షులను ప్రశ్నించమని అపొస్తలుడైన పౌలు ప్రజలను అడిగెను గాని, దాని సత్యమును ఎవరు ఎదురించలేకపోయిరి.

👉 పునరుత్ధానం క్రైస్తవ విశ్వాసమునకు మూలరాయిగా ఉన్నది.


👉క్రీస్తు మరణము నుండి తిరిగిలేచెను గనుక, మనము కూడ తిరిగి లేస్తామనే విశ్వాసం మనం కలిగియుండవచ్చు.

👉 యేసు యొక్క పునరుత్ధానం మరణం తరువాత జీవితానికి అంతిమ రుజువు.

👉మరణము నుండి తిరిగి లేచు వారి గొప్ప కోతకు క్రీస్తు ప్రథమ ఫలము మాత్రమే.

🔹 శారీరిక మరణం మనం అనుబంధం కలిగియున్న ఆదాము అను ఒకే పురుషుని ద్వారా వచ్చెను.
అయితే యేసు క్రీస్తు నందు విశ్వాసము ద్వారా దేవుని కుటుంబములోనికి స్వీకరించబడిన వారందరికీ నూతన జీవితము ఇవ్వబడును
 (1 కొరింథీ. 15:20-22).

👉దేవుడు యేసు యొక్క శరీరమును లేపినట్లే, యేసు రాకడ వచ్చినప్పుడు మన శరీరములు కూడ లేపబడును (1 కొరింథీ. 6:14).

🔹మనమంతా తుదకు తిరిగి లేచినప్పటికీ,అందరు పరలోకానికి వెళ్ళరు.
ఈ జీవితములో ప్రతి వ్యక్తి ఒక నిర్ణయం తీసుకోవాలి,మరియు ఈ నిర్ణయం ఒకని నిత్య గమ్యమును శాసిస్తుంది.

👉మనమంతా ఒక మారు మాత్రమే మరణించవలసి యున్నదని, ఆ తరువాత తీర్పు వస్తుందని బైబిల్ చెబుతుంది (హెబ్రీ. 9:27).

క్రీస్తుయందలి విశ్వాసము ద్వారా నీతిమంతులుగా చేయబడినవారంతా పరలోకములోనికి నిత్యజీవమునకు వెళ్ళుదురు,

🔹 కాని క్రీస్తును రక్షకునిగా నిరాకరించినవారు నిత్య శిక్షలోనికి అనగా నరకము లోనికి పంపబడుదురు (మత్తయి. 25:46).

👉నరకము, పరలోకములానే, కేవలం నివసించు ఒక స్థితికాదు గాని,
🔹వాస్తవిక స్థలము.
🔹ఇది అనీతిమంతులు అంతముకానిది,
🔹దేవుని నిత్య ఉగ్రతను అనుభవించు స్థలము. నరకము అగాధముగాను (లూకా 8:31; ప్రకటన 9:1)
మరియు మండుచుండు అగ్ని గుండముగాను వివరించ బడెను, మరియు
🔹 ఇక్కడ ప్రజలు నిత్యము పగలు రాత్రి హింసించబడతారు
 (ప్రకటన 20:10).

🔹నరకములో గొప్ప దుఖమును కోపమును సూచిస్తూ, ఏడ్పులును పండ్లు కొరుకుటను ఉండును (మత్తయి. 13:42).

👉 దుష్టుల మరణము దేవునికి అయిష్టమైనది, అయితే వారు తమ దుష్ట మార్గముల నుండి వెనుకకు తిరిగి జీవించాలని ఆయన ఆశించుచున్నాడు (యెహే. 33:11).

👉 అయితే ఆయన మనలను లోపరచడు;
👉ఆయనను తిరస్కరించాలని మనం కోరినయెడల,
నిత్యత్వములో ఆయనకు వేరుగా జీవించాలని మనం తీసుకొను నిర్ణయమును ఆయన అంగీకరిస్తాడు.
👉భువిపై జీవితం ఒక పరీక్ష వంటిది,
👉ఇది రానున్న వాటికి సిద్ధపాటు.

విశ్వాసులకు, మరణము తరువాత జీవితము పరలోకములో దేవునితో నిత్యజీవము.

అవిశ్వాసులకు, మరణము తరువాత జీవితము అగ్నిగుండములో నిత్యత్వము.

👉మరణము తరువాత నిత్యజీవమును మనం ఎలా పొందగలము మరియు అగ్నిగుండములో నిత్యత్వమును ఎలా తప్పించుకొనగలము?

👉ఒకే మార్గమున్నది - యేసు క్రీస్తులో విశ్వాసము మరియు నమ్మిక. యేసు చెప్పెను, “పునరుత్ధానమును జీవమును నేనే; నాయందు విశ్వాసము ఉంచువాడు చనిపోయినను బ్రదుకును; బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు...” యోహాను 11:25-26.

👉నిత్య జీవమను ఉచిత బహుమానము అందరికీ అందుబాటులో ఉంది.

 “కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వానిమీద నిలిచియుండును” (యోహాను 3:36).

మరణము తరువాత రక్షణ అను దేవుని ఉచిత బహుమానమును స్వీకరించుటకు మనకు అవకాశం ఉండదు.

👉మన భూలోక జీవితములలో యేసు క్రీస్తును అంగీకరించుట లేక తిరస్కరించుట మన నిత్య గమ్యమును శాసిస్తుంది.

 “ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము” (2 కొరింథీ. 6:2).

👉దేవునికి విరోధముగా మనం చేసిన పాపమునకు యేసు క్రీస్తు యొక్క మరణం పరిపూర్ణ పరిహారం అని మనం నమ్మిన యెడల,
మనం కేవలం ఈ లోకములో
 👉మాత్రమే అర్థవంతమైన జీవితము కలిగియుండముగాని,
👉 మరణము తరువాత క్రీస్తు యొక్క మహిమగల సన్నిధిలో నిత్యజీవము కలిగి యుందుము.

హల్లెలూయ...

మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.

ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!

మన కన్నులు తెరచు యేసు - యేసు యొక్క పునరుత్థానం మొదటి ఆదివారమున ఐదు సార్లు


మన కన్నులు తెరచు యేసు.......

(లూకా 24:31 వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి.)

యేసు యొక్క పునరుత్థానం మొదటి ఆదివారమున ఐదు సార్లు తన శిష్యులకు దర్శనం ఇచ్చాడు.
👉 మగ్దలేనే మరియకు,
👉 ఇతర స్త్రీలకు,
👉 ఎమ్మాయి మార్గములోని ఇరువురు శిష్యులకు,
👉 సీమోను పేతురుకు మరియు
👉 తోమా లేకుండా ఉన్న పదిమంది శిష్యులకు ఆయన దర్శనం ఇచ్చాడు.

ఈ ఐదు దర్శనాలలో కూడా అత్యంత మనోహరమైనది ఎమ్మాయి మార్గములో యేసు ఇద్దరు శిష్యులకు ఇచ్చిన దర్శనం. వారితో నడుస్తూ ప్రభువు సంభాషణ చేయడం, ఈ సంభాషణలో ప్రభువును సిలువ వేసిన తరువాత శిష్యుల యొక్క స్థితిగతులను గురించిన విషయాలు యేసు తెలుసుకోవడం ఈ సందర్భంలో మనం చూడగలం.

ఈ ఎమ్మాయి వృత్తాంతం కేవలం లూకా సువార్తలోనే వ్రాయబడి యున్నది. ఈ ఇద్దరు శిష్యులలో ఒకరి పేరు క్లెయొపా అని వ్రాయబడినది. బహుశా ఆ రెండవవాడు లూకా అయివుండాలని వాఖ్యాన కర్తల ఊహ. కారణం సువార్తీకులు తమ పేర్లను గ్రంధంలో వ్రాసుకోలేదు గనుక. ఆ ఇద్దరు శిష్యులు యేరుషలేమునకు ఆమడ దూరములో ఉన్న అనగా షుమారు పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎమ్మాయి గ్రామమునకు పోవుచూ యేసు సిలువ వేయబడుటను గూర్చి ఒకరితో నొకరు మాటలాడు కొనుచుండిరి. ఈ ఎమ్మాయి వృత్తాంతంలోని కొన్ని ఆత్మీయ విషయాలను పరిశీలన చేద్దాం.

1. వారి బాధను తెలుసుకోవాలని వారితో నడిచిన యేసు: యేసు సిలువ సందర్భంగా జరిగిన భయంకరమైన కార్యములను బట్టి ఆ ఇద్దరి శిష్యుల మనస్సులు, కలత చెంది, ఎంతో దుఃఖముతో నిరాశతో వారు మాటలాడుచూ ఎమ్మాయి గ్రామమునకు పోవుచున్నారు. (లూకా 24:13  ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడదూరమున ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్లుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి యొకరితో నొకరు సంభాషించుచుండిరి)

అలా మాట్లాడుకొంటూ, చర్చించుకొంటూ ఉండగా యేసు తానే వారిని వెదకి కనుకొని దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాడు.(లూకా 19:10  నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను.)

ఆదామును వెదకిన దేవుడు, సమరయ స్త్రీని వెదకి రక్షించిన ప్రభువు, జక్కయ్యను వెదకి రక్షించిన ప్రభువు, నిన్ను నన్ను కూడా వెదకువాడు.

 “మీరు దుఃఖంతో నడుస్తూ ఒకరితో ఒకరు చెప్పుకొంటున్న సంగతి ఏమిటి?” అని ఆయన వారినడిగాడు. యేసు తరచుగా ఇలాంటి ప్రశ్నలు అడిగేది తనకు జవాబు తెలియక కాదు. వారు తమ ఆలోచనలను వారంతట వారే బయటికి చెప్పాలనే. ప్రభువు ఆ రీతిగా వారిని అడిగినాడు. అలనాడు ఆదాము హవ్వలు చెట్లచాటున దాగియుండగా “అదామా! ఎక్కడున్నావు” అని ప్రభువు వారిని అడిగి యున్నాడు. వారు ఎక్కడున్నది వారిచేతనే ఒప్పించి చెప్పించాలని ప్రభువు ఉద్దేశ్యం.

2. కండ్లు మూయబడిన శిష్యులు: (లూకా 24:16 అయితే వారి కండ్లు మూయబడి ఉన్నవి గనుక వారాయనను గుర్తుపట్టలేదు.) వారు యేసును గుర్తు పట్టకుండా దేవుడే వారి కళ్ళు మూశాడు. ఎందుకంటే వారి కళ్ళను వాస్తవ పరిస్థితులను చూడకుండా దేవుడు మూయడంలో ఆయన ఒక ప్రయోజనం కలిగి ఉన్నాడు. వారి నమ్మకాన్ని పరీక్షిస్తున్నాడు.

యేసు ఇక్కడ వారి కన్నులను మూయడంలో ఆయన దయలేనివాడు అని కాదు అర్ధం.  దేవుని యొక్క వాగ్దానాలపై వారి నమ్మకం గురించి కొన్ని పాఠాలను వారు నేర్చుకోవటానికి వీలుగా ఆయనే వారి కన్నులను మూసి యున్నాడు. ఇది శిష్యులైన వారి నమ్మకానికి పరీక్ష. జరుగబోవు చున్న సంఘటనలను గూర్చి ఆయన ఎన్నో సార్లు తన శిష్యులకు చెప్పియున్నాడు గాని వారు వాటిని నమ్మలేని వారుగా ఉన్నారు. కొన్ని కొన్ని సార్లు మనం కన్నులు మూయబడి నప్పుడు అనగా చిక్కుల్లో ఉన్నప్పుడు, సమస్యలలో ఉన్నపుడు, ఏదారి కానరాని పరిస్థితులలో ఉన్నప్పుడు, అనగా మన మనోనేత్రాలకు దారి తెలియనప్పుడు ప్రభువు మీద పూర్తి నమ్మకం ఉంచాలని ఆయన కోరుకుంటున్నాడు.  

3. శిష్యుల దృష్టిలో యేసు ఎవరు?: వారు తమ వేదనను ప్రభువుకు వివరించుచూ తమ మాటలలో యేసును కేవలం ఒక ప్రవక్తగా వారు చెప్పుచున్నారు. (లూకా 24:19  ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే; ఆయన దేవుని యెదుటను ప్రజలందరి యెదుటను క్రియలోను వాక్యములోను శక్తి గల ప్రవక్తయై యుండెను. లూకా 24:21  ఇశ్రాయేలును విమోచింపబోవువాడు ఈయనే అని మేము నిరీక్షించి యుంటిమి)

ఆ శిష్యులు మాటలను బట్టి చూస్తే యేసు మెస్సియాగా వచ్చాడని, ఆయన వచ్చి రాజ్యాన్ని స్థాపించి ఆ రాజ్యంలో శిష్యులైన వారికి ఏమి చేయాలో, మరియు ఆయన వాటిని ఏవిధంగా చేయవలసి యున్నదో వారు ముందుగానే ఆలోచించి ఎన్నో ఆశలు ఆయన మీద పెట్టుకున్నారు. కానీ వారు ఊహించుకున్న ఆలోచనల ప్రకారం ప్రభువు వెళ్ళలేదు, చేయలేదు అందును బట్టి వారి ఆశలన్నీ పూర్తిగా విఫలమయ్యాయి. వారి ఆశ మరియు విశ్వాసం వృధా అయినట్లు వారు మాట్లాడుకుంటున్నారు.

అయితే దేవుడు ఎల్లప్పుడూ తన బిడ్డల గురించి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనము ఎల్లప్పుడూ ఆయన ప్రణాళిక ప్రకారం నడవాలి గాని మనం ఎదురు చూస్తున్నట్లుగానే పరిస్థితులను ఆయన మార్చాడు. దానికి బదులుగా మనమే ప్రభువు ప్రణాళిక ప్రకారం మనలను మనం మార్చుకొని ఆయనకు లోబడవలసి యున్నది.

4. అల్ప విశ్వాసం గలవారుగా ఉన్నారు: “అవివేకులరా, మందమతులారా!” అని ప్రభువు  వారి అల్పవిశ్వాసం చూచి గద్దిస్తున్నాడు. (లూకా 24:25  అందుకాయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటిని నమ్మని మందమతులారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా..)

యేసు పునరుత్తానుడైన తరువాత ఖాళి సమాధిని దర్శించిన మహిళల యొక్క నివేదికలను ఈ శిష్యులైన వారు విన్నారు. తాము కూడా ఖాళీ సమాధిని చూసారు, కాని వారు విశ్వసించలేదు. మృతులలోనుండి యేసును లేపటానికి దేవుడు చేసిన అత్యద్భుతమైన కార్యం వారి ఊహలకు అందనిదిగా ఉన్నది. యేసు ఎవరో ఎంత శక్తివంతుడో ఈ శిష్యులైన వారు ఎన్నడూ పట్టించుకోలేదు ఆయనను గుర్తించలేదు. ఇదే స్థితిలో ఈనాడు మనం కూడా వున్నాము. మనము కూడా ప్రభువు యొక్క అద్భుత కార్యాలను వివరించలేము అర్థం చేసుకోలేము ఎందుకంటే దేవుని గురించి ఎప్పుడు మనం తక్కువగానే ఆలోచిస్తాము గనుక.

ప్రియదేవుని బిడ్డలారా! ఈ శిష్యులు చేసిన అదే పొరపాటు మనం చేయకుండా జాగ్రత్తగా ఉండవలెను. దేవుడు ఒక్కోసారి తన చిత్తాన్ని సహజంగానే అనగా మనం ఊహించిన రీతిగానే నేరవేర్చుతాడు, కాని ఒక్కోసారి మనం ఊహలకు అందని రీతిలో తన చిత్తాన్ని నేరవేరుస్తాడు.

దేవుని విధానం ఒక్కోసారి మనకు అర్ధం చేసుకోలేని విధానంలో ఉంటుంది. ఈ ఇద్దరు శిష్యులకు ఏదో జరిగిందని తెలుసు, కాని ఆ జరిగినది వారి ఊహకు అందనిదిగా ఉన్నది అనగా అది వారి విశ్వాసం యొక్క స్థాయికి మించినదిగా ఆ కార్యం ఉన్నది. అనగా ఈ ఇద్దరు శిష్యులకు యేసు అంటే ఎవరో తెలుసు కాని పూర్తిగా తెలియదు. ఈ దినాలలో చాలామంది ఇదే విధంగా ఉంటున్నారు. అనగా యేసుని గురించి పూర్తిగా తెలియని వారుగా ఉంటున్నారు. ఆయన శక్తి ఏమిటో గుర్తించలేని వారుగా ఉంటున్నారు.

5. ప్రభువు వారి కన్నులను వాక్యం ద్వారా తెరచు చున్నాడు: (లూకా 24:31  వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి;)

ప్రభువు మన కన్నులు తెరచువాడు. శారీరకంగా, మానసికంగా ఆత్మీయంగా కూడా ప్రభువు మన కన్నులు తెరచువాడు. ప్రభువు వారి అపనమ్మకాన్ని పోగొట్టి వారి కన్నులు తెరచుటకు వాక్యాన్ని ఉపయోగిస్తున్నాడు.

విస్తారమైన లేఖన భాగాల ద్వారా వారి కన్నులు తెరస్తున్నాడు. పాతనిభంధన ప్రవచనాలు యేసు ద్వారా ఎలా నేరవేర్చబడవలసి యున్నదో సమస్త ప్రవక్తల లేఖనాలను వారికి తెలుపుచున్నాడు.

6. శిష్యుల హృదయాలు మండించిన లేఖన భాగాలు:(లూకా 24:32  అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచు చున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని యొకనితో ఒకడు చెప్పుకొనిరి.)

11 కిలోమీటర్లు వారు సుదీర్ఘంగా మాట్లాడుకుంటూ నడిచారంటే బహుశా యేసు వారికి మెస్సియాను గురించిన ఎన్నో ప్రవచనాలు వివరంగా విస్తారంగా వారి హృదయాలు మండేలా చెప్పిఉండాలి. వారి హృదయాలను మండురీతిగా ప్రభువు తన గురించి చెప్పిన లేఖన భాగాలు బహుశా ఏమైఉండాలి? (లూకా 24:27  మోషేయు  సమస్త ప్రవక్తలును మొదలు  కొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను.)

పాత నిబంధన ప్రవక్తలు బాధలనుభవించే అభిషిక్తుణ్ణి గురించి, మహిమతో రాబోయే అభిషిక్తుణ్ణి గురించి కూడా రాశారు.  అయితే ఆ కాలం యూదా ప్రజలు సిలువ శ్రమను అనుభవించే ప్రభువును మర్చిపోయి మహిమ రాజుగా వచ్చే మెస్సియా కోసమే ఎదురుచూశారు. వారి గ్రహింపులోని లోపాన్ని యేసు ఇప్పుడు సరి చేస్తున్నాడు. మోషే (బైబిలులో మొదటి ఐదు గ్రంథాలు) నుంచి కూడా పాత నిబంధన అంతా యేసుప్రభువును గురించిన ప్రవచనాలతో నిండి ఉంది.

మనం కూడా నమ్మకం, విధేయత కనపరిస్తే యేసుప్రభువు పాతనిబంధన సత్యాలను మనక్కూడా వివరిస్తాడు. తన పరిశుద్ధాత్మ ద్వారా, తన సేవకుల ద్వారా ఇది చేస్తాడు

మెస్సియా ప్రారంభ ప్రవచనాలు మొదలుకొని అనగా  బహుశా యేసు ఆదికాండము 3: 15 లో మొదలుపెట్టి, సర్పంతో దేవుడు మాట్లాడిన భాగం చెప్పిఉండాలి. (“మరియు నీకును స్త్రీకిని నీ సంతాన మునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమె మీద కొట్టుదువని చెప్పెను”)

అక్కడి నుండి ప్రభువు బహుశా వారిని ద్వితీయోపదేశ కాండము 18:16 కి మళ్ళించి ఉంటాడు, " నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నావంటి ప్రవక్తను నీ సహోదరులలో నీకొరకు పుట్టించును)

మరియు అక్కడి నుండి యెషయా 7:14 కు: (“కాబట్టి ప్రభువు తానే యొక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును")

అక్కడి నుండి యేసు వారిని యెషయా 53: 3 కు తీసుకువెళ్లి ఉంటాడు: ("అతడు తృణీకరింపబడిన వాడును ఆయెను మనుష్యులవలన విసర్జింపబడినవాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి ననుభవించినవాడు గాను  మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను”).

ఆ తరువాత బహుశా యెషయా 53: 7 గురించి చెప్పిఉండాలి: (“అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వధకు తేబడు గొఱ్ఱపిల్లయు బొచ్చు కత్తిరించువానియెదుట గొఱ్ఱయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరువలేదు.”)

యేసు వారికి జెకర్యా 12:10 ఉద్బోధించి ఉండాలి: ("వారు తాము పొడిచిన నామీద దృష్టియుంచి, యొకడు తన యేక కుమారుని విషయమై దుఃఖించునట్లు,తన జ్యేష్ఠపుత్రుని విషయమై యొకడు ప్రలా పించునట్లు అతని విషయమై దుఃఖించుచు  ప్రలాపింతురు.”) 

7. తనను తాను ప్రత్యక్ష పరచుకొనిన యేసు: యేసు తాను ఎవరో ఎందుకు వచ్చాడో, తాను రావడం ఎందుకు అవసరమో మొదలగు విషయాలన్నీ స్పష్టంగా వాక్యం ద్వారా వారికి ప్రత్యక్షంగా ఒక చిత్ర రూపంలో చూపించాడు కాబట్టే వారి హృదయాలు మండినవి. (లూకా 24:29  వారు సాయంకాలము కావచ్చినది,   ప్రొద్దు గ్రుంకినది, మాతోకూడ ఉండుమని చెప్పి, ఆయనను బలవంతముచేసిరి గనుక ఆయన వారితో కూడ ఉండుటకు లోపలికి వెళ్లెను.)

ప్రొద్దు గ్రుంకు చీకటి సమయాన  ఎమ్మాయి రహదారి ప్రమాదకరమైనది. కాని ప్రభువు ఆ చీకటిలో వారితో నడిచాడు వారితో మాట్లాడి, లేఖనాలను వివరించాడు. ఇంటిలోనికి వచ్చాడు రొట్టె విరిచాడు. తనను తను ప్రత్యక్ష పరచుకున్నాడు.

ప్రియ దేవుని బిడ్డలారా! దీనిని బట్టి మనం నేర్చుకోవలసినది ఏమంటే, తనగురించి లేఖనాలు చెప్పేవి మాత్రమే మనం నమ్మవలసి యున్నదని యేసు కోరుకున్నాడు, ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన ఎందుకు సిలువ వేయబడ్డాడు? పరిశుద్ద గ్రంథం యేసు ఎవరో హృదయాలు మండేలా సాక్ష్యం ఇస్తుంది.

ఆయనను తెలియని వారి కళ్ళను తెరవడానికి నేడు కూడా దేవుడు తన వాక్యాన్ని అద్భుతంగా ఉపయోగిస్తున్నాడు.

కేవలం ఆయన తన వాక్యం ద్వారా మాత్రమే తనను తాను ప్రత్యక్ష పర్చుకొంటాడు. వాక్యం ద్వారా కన్నులు మరియు హృదయాలు తెరుస్తాడు.

ఇక్కడ రెండు ముఖ్య విషయం మనం గమనించాలి.

మొదటిగా వారు యేసును గుర్తుపట్టగానే ఆయన వారికి ఎందుకు అదృశ్యుడాయెను? (లూకా 24:31  వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి; అంతట ఆయన వారికి అదృశ్యుడాయెను.) కేవలం వాక్యం ద్వారా మాత్రమే యేసు మనకు ప్రత్యక్షం అగుటకు ఇష్టపడుచున్నాడు.

ఆఇద్దరు శిష్యులు హృదయాలలో యేసు వాక్య రూపంలో ప్రత్యక్షంగా ఉన్నాడు. మనకు ఆయనతో ఉన్న సహవాసము ఆయనను మన కళ్ళతో చూసే సామర్ధ్యం మీద ఆధారపడి ఉండదు గాని ఆయనతో మన సహవాసం,  వాక్యం ద్వారా ఆయనను మనోనేత్రాలతో చూచే సామర్ధ్యంమీద ఆధారపడి ఉంటుంది.

యేసు ఆయన వాక్యపు సత్యాల ద్వారా మన కళ్ళు తెరిచి మనకు తనను తాను వెల్లడిచేస్తాడు.

రెండవదిగా, భోజనం దగ్గర ఆయన తనను తాను ప్రత్యక్ష పరచుకున్నాడు. పునరుత్తానుడైన యేసు భోజన సందర్బాలలో తనను తాను శిష్యులకు కనపరచుకొన్నట్లు ఈ క్రింది వాక్య భాగాలలో చూడగలం. (లూకా 24:41  అయితే వారు సంతోషముచేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన ఇక్కడ మీయొద్ద ఏమైన ఆహారము కలదా అని వారినడిగెను.  45  అప్పుడు వారు లేఖనములు గ్రహించునట్లుగా ఆయన వారి మనస్సును తెరచి,

యోహాను 21:12 యేసు రండి భోజనము చేయుడని వారితో అనెను. ఆయన ప్రభువని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యులలో ఎవడును ఆయనను అడుగ తెగింపలేదు.)

భోజనం సహవాసాన్ని తెలియజేస్తున్నది. వారు యేసుతో సహవాసం కలిగి ఉన్నప్పుడే ఆయన వారికి తనను తాను వెల్లడించు కున్నాడు. యేసు తన వాక్యపు సత్యాల ద్వారా మన కళ్ళు తెరిచిన మనకు తనను తాను వెల్లడిచేస్తాడు.

శిష్యులు  యేసుతో సహవాసం కలిగి ఉన్నప్పుడే ఆయన వారికి తనను తాను వెల్లడించుకున్నాడు.

లేఖన సత్యాల ద్వారా వారి కళ్ళు తెరవబడి, భోజన సహవాసం ద్వారా వారి హృదయాలు తెరువబడి, ప్రభువును గుర్తించి, తమ సాక్ష్యాలను ఒకరితో ఒకరు పంచుకొనసాగిరి.

వారు అనుభవించిన ఉత్సాహం మీరు ఊహించగలరా? వారు ఒకరితో ఒకరు, "ఆయన మనకు లేఖనములను వివరిస్తున్నప్పుడు, ఆయన ఎమ్మాయి దారిలో మనతో మాట్లాడుతున్నప్పుడు "మన హృదయాలు మనలో మండలేదా” అని భావోద్వేగంతో ఒకరినొకరు పురికొల్పుకున్నారు.

పునరుత్తానుడైన యేసు ద్వారా మన కళ్ళు తెరవబడినప్పుడు  మనం ఇతరులు కళ్ళు తెరబడుటకు సువార్త సాక్ష్యాలు చెప్పాలి. వాక్యం ద్వారా ప్రభువును గుర్తు పడదాం. మనలను రక్షించుట కొరకు ఆయన చేసిన బలియాగాన్ని మన కన్నులలో ఉంచుకుందాం 

ప్రియ స్నేహితుడా! ప్రొద్దు గ్రుంకు చీకటి సమయంలో ప్రియ ప్రభువు నీతో పాటు నడుస్తున్నాడని నీకు తెలుసా? ఆయన నీతో చెప్పే మాటలు నీ హృదయాన్ని మండించడం లేదా? నీ జీవితంలో ఆయన ఉనికిని గురించి  సాక్ష్యమివ్వడానికి సిద్ధంగా ఉన్నావా? 

చీకటి ముసిరే నీ జీవిత ఎమ్మాయి దారులలో నీవు తనను నీ ఇంట్లోకి ఆహ్వానించాలని ఆయన కోరిక. శిష్యులు ఆయనను ఇంటిలోనికి ఆహ్వానించారు. నీవు ఆహ్వానించకపోతే, ఆయన ప్రవేశించడు. ఆయనెవరో తెలియకుండానే వారాయన్ను ఆహ్వానించారు. అద్భుతంగా వారి కన్నులు తెరవబడినాయి. ఆయన ఎవరో తెలిసిన మనము ఆయనను మనం ఇంటిలోనికి ఆహ్వానించుటకు, ఆయన ద్వార మన కన్నులు కూడా తెరవబడుటకు పరిశుద్దాత్మ దేవుడు మనకు సమృద్ధిగా తన సహాయం అనుగ్రహించును గాక!    ఆమెన్!!

దైవాశ్శీసులు!!! 

Join Telegram

Join Telegram
Telugu Christian Lyrics