-:A:B:C:D:E:F:G:H:I:J:K:L:M:N:O:P:Q:.R:S:T:U:V:W:X:Y:Z:-

25 April 2018

మోషే - ఏడు గొప్ప సాకులు

*✳ మోషే - ఏడు గొప్ప సాకులు 🔥*

⏺  *' కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను ఇశ్రాయేలియులైన నా ప్రజలను నీవు ఐగుప్తులోనుండి; తోడుకొని పోవలెను'* (నిర్గ 3:10).

*పీఠిక :*
మోషే మంచి యౌవన ప్రాయములో దేవుని స్వరమును వినెను. అడవిలో గొర్రెలను కాయువానిని గొప్ప నాయకుడిగా దేవుడు ఎన్నుకొనుచున్నాడు. అందుకు మోషే దేవుడికి ఏడు గొప్ప సాకులు చెప్పుట గమనింతుము.

👉 1. *మొదటి సాకు :*

▪ 'నేను ఎంతటి వాడను' అందుకు మోషే - నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును, ఇశ్రాయేలియులను ఐగుప్తులో నుండి తోడు కొనిపోవుటకును ఎంతటివాడనని దేవునితో అనెను (నిర్గ 3:11).

♻ దేవుని ప్రత్యుత్తరము

*'నేను నీకు తోడై యున్నాను'. నేను నీకు ఒక సూచన ఇచ్చెదను. మీరు దేవుని సేవించెదరు* (నిర్గ 3:12).

👉 2. *మోషే రెండవ సాకు :*

▪ 'నేనేమి చెప్పవలెను' ఇశ్రాయేలీయులు - ఆయన పేరేమని అడిగిన యెడల నేనేమి చెప్పవలెను అని దేవుని అడిగెను (నిర్గ 3:13).

♻దేవుని ప్రత్యుత్తరము : *అందుకు దేవుడు - నేను ఉన్నవాడను అనువాడనై యున్ననని మోషేతో చెప్పెను*
(నిర్గ 3:14).

👉 3. *మోషే మూడవ సాకు :* '

▪వారు నన్ను నమ్మరు' అందుకు మోషే - చిత్తగించుము వారు నన్ను నమ్మరు, నా మాట వినరు (నిర్గ 4:1).

♻ *దేవుని ప్రత్యుత్తరము :* 'నేను నీకు సూచన లిచ్చుచున్నాను'.

A. *మోషే చేతిలోని కర్రపామగుట*
(నిర్గ 4:3).

B. *తన చెయ్యి రొమ్మును బెట్టుకొనగా కుష్టము గలదాయెను. మరల రొమ్ము నుండి వెలుపలికి తీసుకొనగా మిగిలిన శరీరమువలె నుండుట*
(నిర్గ 4:6-7).

C. *నీళ్లను కర్రతో కొట్టగా నీళ్లు రక్తముగా మారుట* (నిర్గ 4:1-9).

👉4. *మోషే నాలుగవ సాకు :*

▪'నేను మాట నేర్పరిని కాదు'.నేను నోటి మాంద్యము గలవాడను. నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పెను (నిర్గ 4:10).

♻దేవుని ప్రత్యత్తరము :

*'కాబట్టి నీ వెళ్లుము నేను నీ నోటికి తోడై యుందును', నీవు పలుక వలసినది నీకు బోధించెదనని చెప్పెను* (నిర్గ 4:11-12).

👉 5. *మోషే ఐదవసాకు :*

▪ 'నీవు మరియొకని పంపుము' - అందుకతడు అయ్యో ప్రభువా? నీవు పంపదలచిన వానిచేత పంపుము (నిర్గ 4:13)

♻దేవుని ప్రత్యుత్తరము :

*ఆయన మోషే మీద కోపపడి నీ అన్నయైన అహరోను లేడా? నీవు అతనితో మాట లాడి అతని నోటికి మాటలు అందియ్యవలెను. నేను నీ నోటికి అతని నోటికి తోడైయుండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించెదను* (నిర్గ 4:15-16).

👉 6. *మోషే ఆరవసాకు :*

▪ నా మొదటి యత్నము సాగలేదు (నిర్గ 5:25)

♻దేవుని ప్రత్యుత్తరము :

*నేనే యెహోవాను నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దారత్వములో నుండి, మిమ్మును విడిపించుదును*
(నిర్గ 6:6).

👉 7. *మోషే ఏడవసాకు :*

▪ 'నేను మాట మాంద్యము గలవాడను' - అందుకు మోషే - చిత్తగించుము ఇశ్రాయేలియులే నా మాట వినలేదు. నేను మాట మాంద్యము గలవాడను. ఫరో ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను (నిర్గ 6:12).

♻ *దేవుని ప్రత్యుత్తరము :*

▪ *'ఇదుగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండును', (నిర్గ 7:1) నీ అన్న అహరోను నీకు నోరుగా ఉండును.*

🌄దేవుడు నిన్ను పిలుచునప్పుడు నీవు ఆ గొప్ప అవకాశమును పోగొట్టుకొనక సాకులు చెప్పవద్దు. నీ యందు దేవునికి గల గొప్ప ఉద్దేశము ఏమనగా నీవు సాకులు మానుము దేవుని పిలుపు గుర్తించు, గొప్పసేవను గుర్తించుము నిన్ను నీవు రిక్తునిగా చేసుకొనుటకు సిద్ధపడుము.

▶  *పరిశుద్ధ గ్రంధములో కొంతమంది సాకులు చెప్పారు. క్లుప్తంగా కొన్ని విషయాలు చూద్దాం*.

👉 1 ఆదాము పండుతిని హవ్వే కారణమని సాకు చెప్పెను. (ఆది 3:12)

👉2. హవ్వ పండుతిని సైతాను కారణమని సాకు చెప్పెను. (ఆది 3:13)

👉3. లోతు సొదొమా నుండి బయటికి పొమ్మంటే చచ్చిపోతానేమో అని సాకు చెప్పెను. (ఆది 19:19)

👉4. మోషే ఇశ్రాయేలీయులను విడిపించుటకు దేవుడు వెళ్లమంటే వారు నామాట వినరు. నేను యోగ్యున్ని కాను, నత్తివాన్ని అని సాకు చెప్పెను. (నిర్గమ 3:11, 4:1,10)

👉5. అహరోను బంగారు దూడను తయారు చేసి ప్రజలే చేయమన్నారని సాకు చెప్పెను (నిర్గమ 32:22-24)

👉6. ఇశ్రాయేలీయులు దేవునికి లోబడటం ఇష్టం లేక సమూయేలు ముసలి వాడని సాకు చెప్పి, తమ కొరకు రాజు కావాలని కోరిరి. (1 సమూ 8:5)

👉7. సౌలు తొందరపడి యాజకుడు అర్పించవలసిన బలి అర్పించి సమూయేలు ఆలస్యమే దీనికి కారణమని సాకు చెప్పెను. (1 సమూ 13:11-12)

👉8. సౌలు దురాశతో శత్రువుల పశువులను చంపకుండా తన కొరకు దాచుకొని దేవునికి అర్పించడానికి తెచ్చాను అని సాకు చెప్పెను. (1 సమూ 15:21)

👉9. విందుకు రమ్మంటే ఒకడు నేనొక పొలమును కొనియున్నాను, మరియొకడు నేను ఎడ్లు కొనియున్నాను. వేరొకడు నేనొక స్త్రీని పెళ్ళిచేసుకున్నాను అని సాకు చెప్పి శ్రేష్టమైన ఆహ్వానాన్ని తిరస్కరించిరి. (లూకా 14:18-20)

👉10. సోమరియైన దాసుడు తనకివ్వబడిన తలాంతును రెట్టింపు చేయడం చేతకాక దేవుడే చెడ్డవాడని సాకు చెప్పెను. (మత్తయి 25:24,25)

👉11. ఫెలీక్సు రక్షణ పొందే అవకాశం పొందుకున్నప్పటికీ మిగుల భయపడి సాకు చెప్పి రక్షణ కోల్పోయాడు. (అపో||కా||24:25)

  💥  *సాకులు చెప్పక, దేవుని మాట చొప్పున చేయు శక్తి ఆ దేవుడే మనకు ప్రసాధించి,బలపర్చు గాక!*
ఆమెన్! ఆమేన్!! ఆమేన్!!!
*👆👆👆👆👆*

Join Telegram

Join Telegram
Telugu Christian Lyrics