-:A:B:C:D:E:F:G:H:I:J:K:L:M:N:O:P:Q:.R:S:T:U:V:W:X:Y:Z:-

7 March 2025

జగములనేలే పరిపాలక - జగతికి నీవే ఆధారమా 2025

 


 

 జగములనేలే పరిపాలక  - జగతికి నీవే ఆధారమా
ఆత్మతో మనసుతో స్తోత్ర గానము పాడెద నిరతము ప్రేమగీతము
యేసయ్య యేసయ్య నీ కృపా చాలయ్యా
యేసయ్య యేసయ్య నీ ప్రేమే చాలయ్య
                                      //జగమునేలే పరిపాలక//

1.మహారాజుగా నా తోడువై  -నిలిచావు ప్రతి స్థలమున
నా భారము నీవు మోయగా -సులువాయే నా పయనము
 నీ దయచేతనే కలిగిన క్షేమము
ఎన్నడు నను విడదే_2
నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే_2
_యేసయ్య యేసయ్య నీ కృపా-

2.సుకుమారుడా నీ చరితము - నేనెంత వివరింతును
నీ మహిమను ప్రకటించగా - నేనెంతో ధన్యుడను
ఘనులకు లేదే ఈ శుభ తరుణం నాకిది  నీ భాగ్యమా_(2)
జీవితమంతా నీకర్పించి- నీ రుణము నే తీర్చనా_(2)
       //యేసయ్యా యేసయ్యా నీ కృపా//

3.పరిశుద్ధుడా సారధివై -  నడిపించు సీయోనుకే
నా యాత్రలో నే దాటిన - ప్రతి మలుపు నీ చిత్తమే
నా విశ్వాసము నీ పైనుంచి - విజయము నే చాటనా_(2)
నా ప్రతిక్షణము ఈ భావనతో - గురి యొద్దకే సాగెదా_(2)
(యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్య)

Join Telegram

Join Telegram
Telugu Christian Lyrics