-:A:B:C:D:E:F:G:H:I:J:K:L:M:N:O:P:Q:.R:S:T:U:V:W:X:Y:Z:-

3 June 2022

పరమ జీవము నాకు నివ్వ – తిరిగి లేచెను నాతో నుండ

 


1. పరమ జీవము నాకు నివ్వ – తిరిగి లేచెను నాతో నుండ
నిరంతరము నన్ను నడిపించును – మరల వచ్చి యేసు కొని పోవును

పల్లవి: యేసు చాలును – యేసు చాలును
యే సమయమైన యే స్థితికైన
నా జీవితములో యేసు చాలును

2.సాతాను శోధనలధికమైన – సొమ్మసిల్లక సాగి వెళ్ళదను
లోకము శరీరము లాగినను – లోబడక నేను వెళ్ళదను .. యేసు..

3.పచ్చిక బయలులో పరుండజేయున్ – శాంతి జలము చెంత నడిపించును
అనిశము ప్రాణము తృప్తిపరచున్ – మరణ లోయలో నన్ను కాపాడును

4.నరులెల్లరు నన్ను విడిచినను – శరీరము కుళ్ళి కృశించినను
హరిన్చినన్ నా ఐశ్వర్యము – విరోధివలె నన్ను విడచినను .. యేసు.

 

Join Telegram

Join Telegram
Telugu Christian Lyrics