-:A:B:C:D:E:F:G:H:I:J:K:L:M:N:O:P:Q:.R:S:T:U:V:W:X:Y:Z:-

9 March 2021

నీ దయలో నేనున్న ఇంత కాలం నీ కృపలో దాచినావు గత కాలం .. Nee dayalo nenunna intha kalamu


నీ దయలో నేనున్న ఇంత కాలం

నీ కృపలో దాచినావు గత కాలం (2)

నీ దయ లేనిదే నేనేమౌదునో (2)

 తెలియదయ్యా ||నీ దయలో||

 

11.  తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో

చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా (2)

నీ దయ ఉంటే వారు కాగలరు అధిపతులుగా

నీ దయ లేకపోతే ఇలలో బ్రతుకుట జరుగునా

 నీ సిలువ నీడలోనే నను దాచియుంచావని

నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని ||నీ దయలో||

 

22.  నేల రాలే నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు

అపవాది కోరలకు అంటకుండ దాచావు (2)

నీ రెక్కల నీడలో నాకాశ్రయ దుర్గము

ఏ కీడు నా దారికి రాకుండ నీ కృపను తోడుంచినావు

 నీ పాదాల చెంతనే నే పరవశించాలని

 నా ఆయువున్నంత వరకు నీ ప్రేమ పొందాలని ||నీ దయలో||

https://www.youtube.com/watch?v=jVwx4Q1pzTw

 

Tags: Nee dayalo nenunna intha kalamu Telugu Christian Songs, Telugu Songs

Join Telegram

Join Telegram
Telugu Christian Lyrics