-:A:B:C:D:E:F:G:H:I:J:K:L:M:N:O:P:Q:.R:S:T:U:V:W:X:Y:Z:-

8 March 2021

దీనుడా అజేయుడా - ఆదరణ కిరణమా ! Deenudaa Ajeyudaa Hossnna Songs 2021

 

 

దీనుడా అజేయుడా - ఆదరణ కిరణమా
 పూజ్యుడా పరిపూర్ణుడా - ఆనంద నిలయమా
 జీవదాతవు నీవని శృతిమించి పాడనా
 జీవధారవు నీవని కానుకనై పూజించనా
అక్షయ దీపము నీవే - నా రక్షణ శృంగము నీవే
 స్వరార్చన చేసిద నీకే - నా స్తుతులర్పించెద నీకే


 1: సమ్మతిలేని సుడిగుండాలే - ఆవరించగా
 గమనములేని పోరాటాలే - తరుముచుండగా
 నిరుపేదనైన నాయెడల - సందేహమేమి లేకుండా
హేతువేలేని - ప్రేమ చూపించి - సిలువచాటునే దాచావు
 సంతోషము నీవే - అమృత సంగీతము నీవే
స్తుతిమాలిక నీకే - వజ్రసంకల్పము నీవే            "దీనుడా"


2: సత్య ప్రమాణము నెరవేర్చుటకే - మార్గదర్శివై
 నిత్యనిబంధన నాతో చేసిన - సత్యవంతుడా
విరిగి నలిగిన మనస్సుతో - హృదయార్చనే చేసేద
 కరుణనీడలో - కృపావాడలో - నీతో ఉంటే చాలయ్యా
కర్తవ్యము నీవే - కనుల పండుగ నీవేగా
 విశ్వాసము నీవే - విజయశిఖరము నీవేగా            "దీనుడా"

 3: ఊహకందని ఉన్నతమైనది - దివ్యనగరమే
స్పటికము పోలిన సుందరమైనది - నీరాజ్యమే
ఆ నగరమే లక్ష్యమై - మహిమాత్మతో నింపినావు
అమరలోకాన - నీసన్నిధిలో - క్రొత్త కీర్తనే పాడెదను
 ఉత్సాహము నీవే - నయనోత్సవం నీవేగా
 ఉల్లాసము నీలో - ఊహలపల్లకి నీవేగా              "దీనుడా"

 


 

 

Join Telegram

Join Telegram
Telugu Christian Lyrics