ఘనమైనవి నీ కార్యములు నా యెడల - స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా ॥2॥
కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి - స్తుతులర్పి౦చెదను అన్ని వేళలా ॥2॥
అనుదినము నీ అనుగ్రహమే - ఆయుష్కాలము నీ వరమే ॥2॥ ॥ ఘనమైనవి॥
1. ఏ తెగులు సమీపించనియ్యక - ఏ కీడైన దరిచేరనియ్యక
ఆపదలన్ని తొలగేవరకు - ఆత్మలో నెమ్మది కలిగే వరకు ॥2॥
నా భారము మోసి - బాసటగా నిలచి ఆదరి౦చితివి
ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లి౦చెదను జీవితా౦తము ॥ఘనమైనవి॥
2. నాకు ఎత్తైన కోటవు నీవే - నన్ను కాపాడు కేడెము
నీవే ఆశ్రయమైన బ౦డవు నీవే - శాశ్వత కృపకాధారము నీవే ॥2॥
నా ప్రతి క్షణమును నీవు దీవెనగా మార్చి - నడిపించుచున్నావు
ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లి౦చెదను జీవితా౦తము ॥ఘనమైనవి॥
3. నీ కృప తప్ప వేరొకటి లేదయా - నీ మనస్సులో నేను౦టే చాలయా
బహుకాలముగా నేనున్న స్థితిలో - నీ కృప నా యెడ చాలున౦టివే ॥2॥
నీ అరచేతిలో నను చెక్కుకొ౦టివి - నాకేమి కొదువ
ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లి౦చెదను జీవితా౦తము
ఘనమైనవి....స్థిరమైనవి.... ॥ఘనమైనవి॥
Tags: Hosanna, Ministries, Hosanna ministries, Hosanna ministries songs 22hosanna ministries, Hosanna ministries rjv, Hosanna ministries songs, Hosanna ministries live today, Hosanna ministries john wesley worship songs 22hosanna ministries hyderabad, Hosanna ministries messages, Hosanna ministries new songs, Hosanna ministries john wesley songs, Hosanna ministries live, Hosanna ministries old songs, Hosanna ministries songs 221, Hosanna ministries worship songs, hosanna+ministries+songs+download, hosanna+ministries,hosanna+ministries+songs+mp3+download+2020,hosanna+ministries+2020+audio+songs+download,hosanna ministries songs,hosanna ministries live today,hosanna ministries official,hosanna ministries john wesley songs,hosanna ministries old songs,hosanna ministries songs tracks,hosanna ministries messages,