ఎఱ్ఱ సంద్రము నే చీల్చిన నీకే స్తోత్రమయ్యా
ఎరికో గోడలే కూల్చిన నీకే స్తోత్రమయ్యా బండ నుండి నీటిని ఆకాశం నుండి మన్నాను కురిపించిన దేవా నీకే స్తోత్రం అయ్యా ఆరాధన నీకే... స్తుతి ఆరాధన నీకే
!!ఎఱ్ఱ సంద్రము!!
1. గాలి తుఫాను అలలచేత కొట్టబడి నేనున్నపుడు నను ధైర్యపరచితివి నీ శక్తి నిచ్చితివి - ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే !!ఎఱ్ఱ సంద్రము!!
2. రాజులైన యాజకునిగా నను పిలిచిన నా దేవ నీ స్వాస్యమిచ్చితివి నీ వానిగనను మార్చితివి ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే. !!ఎఱ్ఱ సంద్రము!!
3.బాధలైన వేదనలైన నను విడువని నా యేసయ్యా ఆత్మ నిచ్చితివి నీ ప్రేమ నాపై చూపితివి ఆరాధన నీకే - స్తుతి ఆరాధన నీకే. !!ఎఱ్ఱ సంద్రము!!