-:A:B:C:D:E:F:G:H:I:J:K:L:M:N:O:P:Q:.R:S:T:U:V:W:X:Y:Z:-

14 November 2025

తల్లిలా ఆదరణ ఎల్ షద్దాయి రొమ్మున హేతువు చూడని నీ ప్రేమా

 


తల్లిలా ఆదరణ ఎల్ షద్దాయి రొమ్మున
హేతువు చూడని నీ ప్రేమా
హత్తుకున్నది హృదయాన (2)


ఎల్ షద్దాయి ఆదరణ (2)
నా ఆవేదనను ఆరాధన గా మార్చివేసవే (2)
మార్చివేసావే


1. కడసారి కలవరి యాత్ర లో
తల్లడిల్లిన తనయా తల్లితో
అమ్మ ఇదిగో నీ కుమారుడని
ప్రాణాలే పోతున్నా ఆదరించావే
తల్లినే నిర్మించిన మనసుకు ఉండదా ఈ ప్రేమ
తల్లి లాంటి ఆదరణే తుడిచినది నా కన్నీళ్లే   ||ఎల్ షద్దాయి ఆదరణ||

2. దినమెల్ల చేతులు చాపావు
లోబడనోళ్ళని మా యెడ నీ ప్రేమ
కోడి తన పిల్లలను చేర్చినట్లుగా
నిత్యము రెక్కల క్రింద దాచియుంచావే
బలమైన మరణాన్నే లెక్కచేయనిది ఈ ప్రేమ
రక్తాన్నే కార్చినది ప్రాణాలే అర్పించినది  ||ఎల్ షద్దాయి ఆదరణ||

3. పిల్లలు పోయిన ఎలుగు బంటిలా
శత్రువునే చీల్చివేసావే
అరచేతులలోనే చెక్కుకున్నావే
రోషముతో ఒడిలో దాచుకున్నావే
నన్ను ముట్టిన వాడు నీ కన్ను గుడ్డునే
ముట్టాడని నా యెడల నీ ప్రేమ
ఎందాకైన వెళుతుంది  ||ఎల్ షద్దాయి ఆదరణ||



4. దినమెల్ల చేతులు చాపావు –
లోబడనోల్లని మా యెడ నీ ప్రేమ
కోడి తన పిల్లలను చేర్చునట్లుగా –
నిత్యము రెక్కల క్రింద దాచియుంచావే
బలమైన మరణాన్ని లెక్క చేయనిది ఈ ప్రేమ
రక్తాన్నే కార్చినది పాణాలే అర్పించింది
 

 

6 November 2025

అతిపరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును

 


అతిపరిశుద్ధుడా స్తుతి నైవేద్యము
నీకే అర్పించి కీర్తింతును (2)
నీవు నా పక్షమై నను దీవించగా
నీవు నా తోడువై నను నడిపించగా
జీవింతును నీ కోసమే – ఆశ్రయమైన నా యేసయ్యా 
          
    

సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా
ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే (2)
ముందెన్నడూ చవిచూడని
సరిక్రొత్తదైన ప్రేమామృతం (2)
నీలోనే దాచావు ఈనాటికై
నీ ఋణం తీరదు ఏనాటికి (2)    
    అతిపరిశుద్ధుడా

సద్గుణరాశి నీ జాడలను నా యెదుట నుంచుకొని
గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే (2)
కృప వెంబడి కృప పొందగా
మారాను మధురముగా నే పొందగా (2)
నాలోన ఏ మంచి చూసావయ్యా
నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా (2)            
    అతిపరిశుద్ధుడా

సారెపైనున్న పాత్రగ నన్ను చేజారిపోనివ్వక
శోధనలెన్నో ఎదిరించినను నను సోలిపోనివ్వక (2)
ఉన్నావులే ప్రతిక్షణమునా
కలిసున్నావులే ప్రతి అడుగున (2)
నీవేగా యేసయ్యా నా ఊపిరి
నీవేగా యేసయ్యా నా కాపరి (2)      
    అతిపరిశుద్ధుడా 


ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును

 


 

 

ఆరాధన చేతును అన్ని వేళలా
ఆత్మతో సత్యముతో ఆరాధింతును (2) 
నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు
నన్ను కన్న తండ్రి నా యేసుకు (2)
స్తుతి స్తుతి స్తుతి స్తుతి ఆరాధన
హల్లెలూయ హల్లెలూయ ఆరాధన (2)
ఆరాధన ఆరాధన - ఆరాధన ఆరాధన (2)




1. బలవంతుడా జయశీలుడా
మృత్యుంజయుడా నా జీవనదాతా (2)
ఉన్నవాడా అనువాడా నీకే స్తోత్రము
సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము (2)
స్తుతి చేయుట నాకు ఎంతో శోభస్కరము (2)
స్తుతి స్తుతి స్తుతి స్తుతి ఆరాధన
హల్లెలూయ హల్లెలూయ ఆరాధన (2)
ఆరాధన ఆరాధన - ఆరాధన ఆరాధన (2)


2. నీతి సూర్యుడా నిజమైన దేవుడా
శక్తి మంతుడా  సర్వ శక్తి మంతుడా (2)
నీవు తప్ప ఎవరు నాకు లేనె లేరయ్యా
నిన్ను తప్ప వేరెవరిని పూజింపనయ్యా (2)
నిత్యము నీ నామమునే స్తుతియించెదను (2)
స్తుతి స్తుతి స్తుతి స్తుతి ఆరాధన
హల్లెలూయ హల్లెలూయ ఆరాధన (2)
ఆరాధన ఆరాధన - ఆరాధన ఆరాధన (2) "ఆరాధన" 

 

 

కృతజ్ఞాతతో స్తుతి పాడెద నా యేసు నాథా

 

కృతజ్ఞాతతో స్తుతి పాడెద నా యేసు నాథా
నాకై నీవు చేసిన మేళ్లకై కోటి కోటి కృతజ్ఞతలు

అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా
నా ఊహలకంటెను అధికముగా దయచేయు ప్రేమామయా          
[ కృతజ్ఞాత తో]

నిజ రక్షకుడు యేసు క్రీస్తని విశ్వసించెద
అను నిత్యము 
నీ పాద సేవలో బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము
నీ పాద సేవలో బ్రతుకుటకై వరములతో అభిషేకించు   
[ కృతజ్ఞాత తో ] 

 

Join Telegram

Join Telegram
Telugu Christian Lyrics