-:A:B:C:D:E:F:G:H:I:J:K:L:M:N:O:P:Q:.R:S:T:U:V:W:X:Y:Z:-

30 September 2024

ఆరాధనా ఆరాధనా – ఆత్మతో ఆరాధనా ఆరాధనా ఆరాధనా – కృతజ్ఞత స్తుతి ప్రార్ధనా

 


ఆరాధనా ఆరాధనా – ఆత్మతో ఆరాధనా
ఆరాధనా ఆరాధనా – కృతజ్ఞత స్తుతి ప్రార్ధనా (2)
నీకే నా దేవా – తండ్రీ అందుకోవా (2)         ||ఆరాధనా||

అన్నిటికీ ఆధారమైనవాడా – నీకే ఆరాధనా (2)
ఎన్నటికీ మారని మంచివాడా
కృతజ్ఞత స్తుతి ప్రార్ధనా (2)      ||నీకే||

నోటను కపటము లేనివాడా – నీకే ఆరాధనా (2)
మాటతో మహిమలు చేయువాడా
కృతజ్ఞత స్తుతి ప్రార్ధనా (2)      ||నీకే||

అంతయు వ్యాపించియున్నవాడా – నీకే ఆరాధనా (2)
చింతలు తీర్చేటి గొప్పవాడా
కృతజ్ఞత స్తుతి ప్రార్ధనా (2)      ||నీకే||

 

29 September 2024

దేవా నీ కృప పొందుటకు - నాలోన ఏమున్నది



దేవా నీ కృప పొందుటకు - నాలోన ఏమున్నది
మలినమైనది నా గతం - చేజారినది నా జీవితం
ఉదయించే నాలో నీ స్వరం - వికసించెనుగా నా హృదయం

యేసు నీ కృపయేగా - ఇది నీ కృపయేగా
ఇది నీ కృపయేగా - వేరే లేదుగా !


వేషధారివని లోకం వెక్కిరించుచుండగా
దారి మరచి నిన్నే విడిచి నీకు దూరమవ్వగా
కోర్కెలన్ని కన్నీలై - కడకు నిన్ను చేరగా
కనికరించి ఓదార్చి స్వీకరించినావుగా

యేసు నీ కృపయేగా - ఇది నీ కృపయేగా
ఇది నీ కృపయేగా - వేరే లేదుగా !


ఏ యోగ్యత లేని నన్ను నీవెన్నుకున్నావు
నీ ఉన్నత సేవకు నన్ను పిలుచుకొన్నావు  
ఉప్పులా ఉండాలని - ఊటనై పారాలని
నీలోన నిలచి నే ఫలియించాలని

యేసు నీ కృపయేగా - ఇది నీ కృపయేగా
ఇది నీ కృపయేగా - వేరే లేదుగా !


ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనం

 

 


ఊహించలేని మేలులతో నింపిన
నా యేసయ్యా నీకే నా వందనం (2)
వర్ణించగలనా నీ కార్యముల్
వివరించగలనా నీ మేలులన్ (2)       ||ఊహించలేని||

మేలుతో నా హృదయం తృప్తిపరచినావు
రక్షణ పాత్రనిచ్చి నిను స్తుతియింతును (2)
ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా
స్తుతియింతును నీ నామమున్ (2)     ||ఊహించలేని||

నా దీనస్థితిని నీవు మార్చినావు
నా జీవితానికి విలువనిచ్చినావు (2)
నీ కృపకు నన్ను ఆహ్వానించినావు
నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు (2)   ||ఊహించలేని||

 

 ಊಹಿಂಚಲೆನಿ ಮೇಲುಲತೋ ನಿಂಪಿನ
 ನಾ ಯೇಸಯ್ಯಾ  ನೀಕು ನಾ ವಂದನಂ ||2||
ವರ್ಣಿಂಚಗಲನಾ ನೀ ಕಾರ್ಯಮುಲ್
ವಿವರಿಂಚಗಲನಾ ನೀ ಮೇಲುಲನ್ ||2|| ||ಊಹಿಂಚಲೆನಿ||

ಮೇಲುತೋ ನಾ ಹೃದಯಂ ತೃಪ್ತಿಪರಚಿನಾವು
ರಕ್ಷಣ ಪಾತ್ರನಿಚ್ಚಿ ನಿನ್ನು ಸ್ತುತಿಯಿಂಥುನು ||2||
ಇಸ್ರಾಯೇಲು ದೇವುಡಾ ನಾ ರಕ್ಷಕಾ
ಸ್ತುತಿಯಿಂಥುನು ನೀ ನಾಮಮುನ ||2|| ||ಊಹಿಂಚಲೆನಿ||

ನಾ ದೀನಸ್ಥಿತಿನಿ ನೀವು ಮಾರ್ಚಿನಾವು
ನಾ ಜೀವಿತಾನಿಕಿ ವಿಲುವನಿಚ್ಚಿನಾವು ||2||
ನೀ ಕೃಪಾಕು ನನ್ನು ಆವರಿಂಚ್ಚಿ  ನಾವು
ನೀ ಸನ್ನಿಧಿ ನಾಕು ತೊಡುನಿಚ್ಚಿನಾವು ||2|| ||ಊಹಿಂಚಲೆನಿ||

 

ఈ లోకము నన్ను చూసినట్లు నీవు నన్ను చూడవె




1.ఈ లోకము నన్ను చూసినట్లు నీవు నన్ను చూడవె
నీ కన్నులు నన్ను చూడగానె నా  బ్రతుకు మారేనే ||2||
నీ సిలువ వలన జీవింతున్
నీ రక్తమే విమోచన ||2||
We are the జె జనరేషన్ ||4||

2.తల్లి గర్బo మునుపే నన్ను ఎన్నుకుంటివే
ఈ సృష్టికి మునుపే నన్ను నీవు పేరు పెట్టి పిలిచావే ||2||

నీ సిలువ వలన జీవింతున్
నీ రక్తమే విమోచన ||2||

We are the జె జనరేషన్ ||4||

3.మరణమైన జీవమైన నిను నే విడువను
నీ నామమును లోకమంతా చాటి చెప్పెదన్ ||2||

నీ సిలువ వలన జీవింతున్
నీ రక్తమే విమోచన ||2||

We are the జె జనరేషన్ ||4||

J E S U S We are the జె జనరేషన్ ||2||

మేము యేసయ్య తరము
మేము యెహోషువ తరము ||2||

We are the జె జనరేషన్ ||4||



28 September 2024

కంటిపాపలా కాచినావయ్యా – చంటిపాపను మోసినట్టు మోసినావయ్యా




కంటిపాపలా కాచినావయ్యా – చంటిపాపను మోసినట్టు మోసినావయ్యా
చేతి నీడలో దాచినావయ్యా – తోడుగా మా ముందరే నడచినావయ్యా
పోషించినావయ్యా.. బలపరచినావయ్యా – భయము వలదని ధైర్యమునిచ్చినావయ్యా
నడిపించినావయ్యా.. కాపాడినావయ్యా – ఓటమంచులో విజయమునిచ్చినావయ్యా
మా తలంపులు కావు.. నీ తలంపులే – మా జీవితాలలో జరిగించినావయ్యా
మా ఊహలే కాదు.. నీ ప్రణాళికే – మానక సమయానికి నెరవేర్చినావయ్యా           ||కంటిపాపలా||

ఎన్నో ఏళ్లుగా.. ఎదురు చూసాముగా – ఆశలే అడియాశలవ్వగా సోలిపోయాముగా
దారే కానక.. ఆగిపోయాముగా – అంధకారమే అలుముకోగా అలసిపోయాముగా
అనుదినమున నీ మాటలే ఆదరించి నడిపించెగా
అణగారిన మా ఆశలన్ని చిగురింపజేసెగా
ప్రతి క్షణమున నీ సన్నిధే ధైర్యపరచి బలపరచెగా
చితికిన మా జీవితాలను వెలిగింపజేసెగా
కన్నీరు తుడిచినావు.. నాట్యముగ మార్చినావు
ఎనలేని ప్రేమ మా పైన చూపి           ||కంటిపాపలా||

ఊహించువాటికంటే ఎంతో అధికముగా – హెచ్చించినావు దేవా.. నీ ప్రేమ మధురము
ఏ మంచి లేని మాకు మా మంచి కాపరై – దీవించినావు దేవా.. నీ ప్రేమ మరువము
హీనులం.. బలహీనులం.. నిలువలేక పడిపోయినా
లేవనెత్తి బండపైనే నిలబెట్టినావుగా
చీటికీ.. మాటి మాటికీ.. మా నమ్మకమే కోల్పోయినా
అడుగడుగున నీ నమ్మకత్వమును కనబరచినావుగా
పోగొట్టుకున్నదంతా.. రెట్టింపు చేసినావు
నీ గొప్ప ప్రేమ మా పైన చూపి           ||కంటిపాపలా||

అంజలి ఘటియింతు దేవా - నీ మంజుల పాదాంబుజముల కడ

 


అంజలి ఘటియింతు దేవా (2)
నీ మంజుల పాదాంబుజముల కడ
నిరంజన మానస పరిమళ పుష్పాంజలి       ||అంజలి||

పరమాత్మ నీ పాద సేవ
చిరజీవ సంద్రాన నావ (2)
సిలువ మహా యజ్ఞ సింధూర
రక్తా రుణమేయ సంభావనా (2)
దేవా దేవా యేసు దేవా (2)
అంజలి ఘటియింతు దేవా       ||అంజలి||

అవతార మహిమా ప్రభావ
సువిశాల కరుణా స్వభావ (2)
పరలోక సింహాసనాసీన
తేజో విరాజమాన జగదావనా (2)
దేవా దేవా యేసు దేవా (2)
అంజలి ఘటియింతు దేవా       ||అంజలి||

 Lyrics : RRK Murthy garu
Vocal  : Pas.K.Parishuddarao
Keys   : Dany Unique & Jwalith Ophir
Tabla  :  Noah & Prasanth Ophir
Rhythms : Babu
Bass  : Kanna

 

నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నా యేసయ్యా

 


 

నీవు నా తోడు ఉన్నావయ్యా
నాకు భయమేల నా యేసయ్యా
నీవు నాలోనే ఉన్నావయ్యా
నాకు దిగులేల నా మెస్సయ్యా
నాకు భయమేల నాకు దిగులేల
నాకు చింతేల నాకు భీతి ఏల ||నీవు||

కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు
వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు (2)
అడిగిన వారికి ఇచ్చేవాడవు
వెదకిన వారికి దొరికేవాడవు (2)
తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు (2)
దేవా దేవా నీకే స్తోత్రం (4)

వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు
రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు (2)
నేనే సత్యం అన్న దేవా
నేనే మార్గం అన్న దేవా (2)
నేనే జీవము అని పలికిన దేవా (2)
దేవా దేవా నీకే స్తోత్రం (4) ||నీవు||

నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం

 


నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం
నిన్న నేడు నిరంతరం మారని దేవా
ఈ లోకమంత నేను వేదకినా లేదయ్యా ఎక్కడ ఆనందం
నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను(2)

1. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నను -
   ఏది నా సొంతం కాదనుకున్నాను (2)
   తప్పిపోయిన కుమారుని నేనయితే -
   నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసూ (2)

2. ఏ ప్రేమా నీ ప్రేమకు సాటిరాదయ్యా
    ఎన్ని ఉన్నా నీతో సరియేదికాదయా (2)
    నన్ను మరువని ప్రేమ నీదయ్యా
    నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా (2) 

 

Telugu Bible Study Books Download


 

 

ఈ క్షణమే చచ్చిపో.pdf   Download

 

మీరు సేవకులా  .pdf"  Download

బైబిల్ డిక్షనరీ.pdf" Download

బైబిల్ అధ్యయన విధానము.pdf   Download

ప్రసంగము సిద్దపాటు మరియు బోధన.pdf   Download


దేవుడు_కాపరుల_నుండి_ఏం_ఆశిస్తున్నాడు_1.pdf    Download

జయించిన_వారి_అద్భుత_సాక్షాలు.pdf   Download

క్రైస్తవ_విశ్వాస_పునాదులు.pdf   Download


Prasanga Sarukulu @Bible Study.pdf   Download


300 ప్రసంగములు.pdf  Download


ప్రార్ధనలో నీపై నీవే విజయం సాధించాలి  Download

G
M
T
Y
Text-to-speech function is limited to 200 characters

26 September 2024

Maruvani Needu Prematho - మరువని నీదు ప్రేమతో కాచితివే కనుపాపగా

 


మరువని నీదు ప్రేమతో కాచితివే కనుపాపగా
విడువని స్నేహ బంధమై నడిచితివే నా తోడుగా (2)
ఇంతవరకు ఉన్న ఊపిరి నీదు దయకు సాక్ష్యమేగా
పొందుకున్న మేలులన్ని నీదు ఎన్నిక ఫలితమేగా (2)       ||మరువని||

కరుగుతున్న కాలమంతా నీదు కృపలో నన్ను తడిపె
వెలుగు పంచే నీదు వాక్యం నీదు మార్గము నాకు తెలిపె (2)
పాడెదను నూతన గీతములు ఎల్లవేళల స్తుతిగానములు
ఘనత మహిమ ఆరోపణము నాదు జీవితమే అర్పితము (2)       ||మరువని||

నిన్న నేడు ఎన్నడైనా మారిపోని మనసు నీది
తల్లి మరచినా మరచి పోక కాపు కాసే ప్రేమ నీది (2)
పొందుకున్న జన్మ దినము నీవు ఇచ్చే దయా కిరీటము
నీవు ఇచ్ఛే వాగ్ధానాలు చేయు అధికము బ్రతుకు దినములు (2)       ||మరువని||

 

 

23 September 2024

స్తుతించుడి యెహోవా దేవుని సూర్యచంద్రులారా

 


స్తుతించుడి యెహోవా దేవుని సూర్యచంద్రులారా
పవిత్ర దూతగణ సేనాధిపతికి
ఉన్నతస్థలములలో యెహోవాను స్తుతించుడి ||స్తుతించుడి||

కాంతిగల నక్షత్రములారా పరమాకాశమా (2)
ఆకాశజలమా ఆవిరి హిమమా అగ్ని తుఫాను
మహాసముద్ర పర్వత వృక్ష మృగములు పశువులారా
ప్రశంసించుడి ఫలవృక్షములు పరమ తండ్రిని
యెహోవాను స్తుతించుడి ||స్తుతించుడి||

రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారా (2)
బాలురు యౌవన కన్యక వృద్ధులు ప్రభునుతించుడి
ప్రాకు జీవులు పలువిధ పక్షులు పాడి స్తుతించుడి
ప్రశంసించుడి ప్రభావ మహిమలు పరమ తండ్రిని
యెహోవాను స్తుతించుడి ||స్తుతించుడి||

 

 

22 September 2024

నేను నా ఇల్లు నా ఇంటి వారందరు మానక స్తుతించెదము

 


నేను నా ఇల్లు నా ఇంటి వారందరు
మానక స్తుతించెదము (2)
నీ కనుపాప వలె నన్ను కాచి
నేను చెదరక మోసావు స్తోత్రం (2)
ఎబినేజరే ఎబినేజరే – ఇంత కాలం కాచితివే
ఎబినేజరే ఎబినేజరే – నా తోడువై నడచితివే (2)
స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కనుపాపగా కాచితివి స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కౌగిలిలో దాచితివి స్తోత్రం       ||నేను||

ఎడారిలో ఉన్న నా జీవితమును
మేలుతో నింపితివే (2)
ఒక కీడైన దరి చేరక నన్ను
తండ్రిగా కాచావు స్తోత్రం (2)       ||ఎబినేజరే||

నిరాశతో ఉన్న నా హీన బ్రతుకును
నీ కృపతో నింపితివే (2)
నీవు చూపిన ప్రేమను పాడగా
పదములు సరిపోవు తండ్రి (2)       ||ఎబినేజరే||

జ్ఞానుల మధ్యలో నను పిలిచిన నీ పిలుపే
ఆశ్చర్యమాశ్చర్యమే (2)
నీ పాత్రను కానే కాను
కేవలము నీ కృపయే స్తోత్రం (2)       ||ఎబినేజరే||

 

15 September 2024

ఎంతటి వాడను నేను యేసయ్యా

 

 ఎంతటి వాడను నేను యేసయ్యా


 

ఎంతటి వాడను నేను యేసయ్యా
కొంతైనా యోగ్యుడను కానయ్యా (2)
ఇంతగ నను హెచ్చించుటకు
ఈ స్థితిలో నన్నుంచుటకు (2)            ||ఎంతటి||

ఐశ్వర్యము గొప్పతనమును
కలిగించు దేవుడవీవే
హెచ్చించువాడవును
బలమిచ్చువాడవు నీవే (2)
అల్పుడను మంటి పురుగును
నన్ను ప్రేమించినావు
ప్రాణమును నీ సర్వమును
నా కొరకై అర్పించినావు            ||ఎంతటి||

నిను వెంబడించువారిని
నిజముగ సేవించువారిని
నీవుండే స్థలములలో
నిలిచే నీ సేవకుని (2)
ఎంతో ఘనపరచెదవు
ఆశీర్వదించెదవు
శత్రువుల కంటె ఎత్తుగా
అతని తలను పైకెత్తెదవు ||ఎంతటి||

వినయముగల మనుష్యులను
వర్దిల్లజేసెదవు
గర్విష్టుల గర్వమునణచి
గద్దె నుండి దించెదవు (2)
మాదు ఆశ్రయ దుర్గమా
మేమంతా నీ వారమే
మా శైలము మా కేడెమా
మాకున్నదంతా నీ దానమే          ||ఎంతటి||

 

13 September 2024

కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం



 కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే
ఆవిరి వంటిదిరా ఈ జీవితం
లోకాన కాదేది శాశ్వతం (2)
యేసే నిజ దేవుడు నిత్యజీవమిస్తాడు
మరణమైన జీవమైన నిన్ను విడువడు (2)       ||కొంతసేపు||

ఎదురౌతారెందరో నీ పయనంలో
నిలిచేది ఎందరు నీ అక్కరలో (2)
వచ్చేదెవరు నీతో మరణము వరకు (2)
ఇచ్చేదేవరు ఆపై నిత్య జీవము నీకు         ||యేసే||

చెమటోడ్చి సుఖము విడిచి కష్టమునోర్చి
ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా (2)
ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే (2)
సంపాదన ఎవరిదగును యోచించితివా         ||యేసే||

నీ శాపం తాను మోసి పాపం తీసి
రక్షణ భాగ్యము నీకై సిద్ధము చేసి (2)
విశ్రాంతినీయగ నిన్ను పిలువగా (2)
నిర్లక్ష్యము చేసిన తప్పించుకొందువా         ||యేసే||

 

6 September 2024

నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్‌

 


 

నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్‌
నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్‌ - (2)
అ.ప. : అంతా నా మేలుకే - ఆరాధనా యేసుకే
అంతా నా మంచికే - (తన ఛచిత్తమునకు తల వంచితే)-(2)
అరాధన ఆపను - స్తుతియించుట మానను - (2)
స్తుతియించుట మానను

1. కన్నీల్లే పానములైన - కఠిన దుఃఖ బాధలైన
స్థితిగతులే మారిన - అవకాశం చేజారిన
మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ - (2)
మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ - (2)

2. ఆస్తులన్ని కోల్పొయిన - కన్నవారే కునుమరుగైన
ఊపిరి బరువైన - గుండెలే పగిలినా
యెహోవా యిచ్చెను - యెహోవా తీసికొనెను - (2)
ఆయన నామమునకే - స్తుతి కలుగు గాక - (2)

3. అవమానం ఎంతైన - నా వారే కాదన్న
నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందునా ?
నీవు నా కుండగా - ఏది నాకక్కర లేదు - (2)
నీవు నా కుండగా - ఏది నాకక్కర లేదు - (2)

4. ఆశలే సమాధియైన - వ్యాధి బాధ వెల్లువైన
అధికారము కొప్పుకొని - రక్షణకై ఆనందింతున్‌
నాదు మనస్సు నీ మీద - ఆనుకొనగ ఓ నాధా (2)
పూర్ణశాంతి నే పొంది నిన్నే నే కీర్తింతున్‌ (2) - (2)

5. చదువులే రాకున్న - ఓటమి పాలైన
ఉద్యోగం లేకున్న - భూమికే బరువైన
నా యెడల నీ తలంపులు - ఎంతో ప్రియములు - (2)
నీవుద్దేశించినది నిష్ఫ్టలము కానేరదు - (2)

6. సంకల్పాన పిలుపొంది - నిన్నే ప్రేమించు నాకు
సమస్తము సమకూడి - మేలుకై జరుగును
యేసుని సారూప్యము నేను పొందాలని - (2)
అనుమతించిన ఈ - విలువైన సిలువకై - (2)

7. నీవు చేయునది - నాకిప్పుడు తెలియదు
ఇక మీదట నేను - తెలిసికొందును
ప్రస్తుతము సమస్తము - దుఃఖ కరమే - (2)
అభ్యసించిన నీతి - సమాధాన ఫలమే - (2)

 

Join Telegram

Join Telegram
Telugu Christian Lyrics