-:A:B:C:D:E:F:G:H:I:J:K:L:M:N:O:P:Q:.R:S:T:U:V:W:X:Y:Z:-

20 August 2024

అడగక ముందే అక్కరలెరిగి - అవసరాలు తీర్చిన ఆత్మీయుడా

 

అడగక ముందే అక్కరలెరిగి
అవసరాలు తీర్చిన ఆత్మీయుడా
ఎందరు ఉన్నా బంధువు నీవే
బంధాలను పెంచిన భాగ్యవంతుడా

పదే పదే నేను పాడుకోనా
ప్రతి చోట నీ మాట నా పాటగా
మరి మరి నే చాటుకోనా
మనసంతా పులకించని సాక్షిగా
నా జీవిత గమనానికి గమ్యము నీవే

చితికిన నా గుండెకు ప్రాణం నీవే (2)      ||పదే పదే||

మమతల మహా రాజా
(నా) యేసు రాజా (4)

అడగక ముందే అక్కరలెరిగి
అవసరాలు తీర్చిన ఆత్మీయుడా
ఎందరు ఉన్నా బంధువు నీవే
బంధాలను పెంచిన భాగ్యవంతుడా (2)


అవసరాలు తీర్చిన ఆత్మీయుడా
బంధాలను పెంచిన భాగ్యవంతుడా (2)       ||మమతల||

అడిగిన వేళ అక్కున చేరి
అనురాగం పంచిన అమ్మవు నీవే
నలిగిన వేళ నా దరి చేరి
నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే (2)
అనురాగం పంచిన అమ్మవు నీవే
నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే (2)      ||పదే పదే||

 

10 August 2024

అన్నిటి కన్నా ప్రార్థనే మిన్న

 

 

 


అన్నిటి కన్నా ప్రార్థనే మిన్న
అన్న బైబిల్ మాట ఉన్నదా జ్ఞాపకం
ఉన్నదా జ్ఞాపకం        ||అన్నిటి||

శోధనలోనికి మీరు జారిపడకుండాలంటే (2)
మెండుగా ప్రార్థన ఉండాలి గుండెలో (2)          ||అన్నిటి||

శాంతి లోపల మీకు సుఖము లోకములోన (2)
కలిగి బ్రతకాలంటే కావాలి ప్రార్థన (2)         ||అన్నిటి||

 

5 August 2024

యెహోవా దేవా.. యేసు రాజా..కృపగల దేవా.. కృపామయుడా..

 

 


యెహోవా దేవా..  యేసు రాజా...
కృపగల దేవా..  కృపామయుడా...

స్తోత్రము.... స్తోత్రము....  స్తోత్రము యేసయ్య..
స్తోత్రము.... స్తోత్రము....  స్తోత్రము యేసయ్య
యేసయ్యా స్తోత్రం....  యేసయ్య స్తోత్రం...


సర్వ సృష్టి....  కర్తవు నీవు. ..
కరుణ గల....  దేవుడవు.....
నన్ను ప్రేమించి.... నాకై మరణించి... 

ప్రేమమైయుడా .... స్తోత్రము స్తోత్రము..
స్తోత్రము.... స్తోత్రము....  స్తోత్రము యేసయ్య..
స్తోత్రము.... స్తోత్రము....  స్తోత్రము యేసయ్య
యేసయ్యా స్తోత్రం....  యేసయ్య స్తోత్రం...

మరణము నుండి... నన్ను.. మహిమ లోనికి పిలిచిన...  
దయగల దేవా...  దయామయుడా...
స్తోత్రము.... స్తోత్రము....  స్తోత్రము యేసయ్య..
స్తోత్రము.... స్తోత్రము....  స్తోత్రము యేసయ్య
యేసయ్యా స్తోత్రం....  యేసయ్య స్తోత్రం... 

Tags: Telugu Jesus New songs mp3 download
Telugu Christian Hit songs free download
Telugu Songs mp3 download
New Telugu songs list
Telugu Audio Songs

3 August 2024

స్తుతులకు పాత్రుడా.... స్తోత్రాలకు అర్హుడా...

 


స్తుతులకు పాత్రుడా....  స్తోత్రాలకు అర్హుడా...
రాజులకు రాజా..   రక్షణ నిచ్చు దేవా...
స్తోత్రము యేసయ్య.... స్తుతి స్తోత్రం నీకే నయ్యా...


బంధుమిత్రులు నన్ను వీడి..... ఒంటరిగా ఉన్న నన్ను.. .
వెతికి రక్షించి.... కరుణించి కాపాడిన దేవాది దేవా...
స్తోత్రము యేసయ్య.... స్తుతి స్తోత్రం నీకే నయ్యా.

వేదనలో వెతికితిని.... వేసారి పోతిని....
వెంట ఎవరూ లేక..... ఒంటరినై ఏడ్చుంటిని...
నన్ను చూసి...  నా దరికి చేరి... నన్ను రక్షించిన.. దేవాది దేవా....
స్తోత్రము యేసయ్య.... స్తుతి స్తోత్రం నీకే నయ్యా.

ఎటు చూచినా యుద్ధ సమాచారాలు ఎటు చూచినా కరువూ భూకంపాలు

 


 

ఎటు చూచినా యుద్ధ సమాచారాలు
ఎటు చూచినా కరువూ భూకంపాలు
ఎటు చూచినా దోపిడీ దౌర్జన్యాలు
ఎటు చూచినా ఎన్నో అత్యాచారాలు
ఓ సోదరా ఓ సోదరీ (2)
రాకడ గురుతులని తెలుసుకోవా
తినుటకు త్రాగుటకు ఇది సమయమా       ||ఎటు||

మందసము నీ ప్రజలు – గుడారములో నివసిస్తుండగ
యోవాబుని సేవకులు దండులో నుండగను (2)
తినుటకు త్రాగుటకు భార్యతో నుండుటకు (2)
ఇది సమయమా.. ఇది సమయమా.. అని
ఆనాడు ఊరియా దావీదునడిగాడు
ఈనాడు నిన్ను కూడా ప్రభువు అడుగుచున్నాడు      ||ఎటు||

నా పితరుల యొక్క – సమాధులుండు పట్టణము
పాడైపోయెను పాడైపోయెను (2)
యెరూషలేము గుమ్మములు అగ్ని చేత కాల్చబడగా (2)
సంతోషముగ నుండుటకు ఇది సమయమా.. అని
ఆనాడు నెహెమ్యా పర రాజునడిగాడు
ఈనాడు నిన్ను కూడా ప్రభువు అడుగుచున్నాడు         ||ఎటు||

ఈనాడు దేశంలో ఎన్నో ఎన్నో దౌర్జన్యాలు
సజీవ దహనాలు స్త్రీల మానభంగాలు (2)
ఎన్నో గుడులు నేల మట్టం చేయబడుచుండగా (2)
తినుటకు త్రాగుటకు ఇది సమయమా అని
నీ సృష్టికర్తగు యేసు నిన్ను అడుగుచున్నాడు
ఈనాడు దేశం కొరకు ప్రార్ధించమన్నాడు         ||ఎటు||

 

Join Telegram

Join Telegram
Telugu Christian Lyrics