-:A:B:C:D:E:F:G:H:I:J:K:L:M:N:O:P:Q:.R:S:T:U:V:W:X:Y:Z:-

12 December 2022

నువ్వు బోయే దారిలో యెరూషలేం గుడికాడ

 

 


 

నువ్వు బోయే దారిలో యెరూషలేం గుడికాడ (2)
ఆచం మల్లె పూల తోటో యేసయ్య (2)

1.సన్న సన్న బైబిల్లు సంచుల్లో పెట్టుకొని (2)
సారోలె బయలెల్లినారె యేసయ్య
సంకటనలు బాపినారె యేసయ్య (2) || నువ్వు బోయే ||

2.దోడు దొడ్డు బైబిల్లు దోసిల్లో పెట్టుకొని (2)
దొరోల్లే బయలెల్లినారె యేసయ్య
దోషములను బాపినారె యేసయ్య (2) || నువ్వు బోయే ||

3.తెంపిరి పువ్వోలు గుచ్చిరి దండాలు (2)
ఏసిరి నీ మెడలోన యేసయ్య
చేసిరి నీ పాద పూజ యేసయ్య (2) || నువ్వు బోయే ||

ఏలో ఏలో ఏలో అంటూ వచ్చారండీ గొల్లలు సంతోషాలే పొంగేనండీ - హైలెస్సా

 

 


 

ఏలో ఏలో ఏలో అంటూ వచ్చారండీ గొల్లలు  
సంతోషాలే పొంగేనండీ - హైలెస్సా
దారే చూపే దేవుడొచ్చే ఉల్లాసంగా ఊరు ఆడే
సంగీతాలే పాడాలండీ - హైలెస్సా
అంధకారాన్ని తొలగించే మహనీయుడు
పుట్టినాడండీ యేసయ్య మనదేవుడు
నిన్నే కోరి నిన్నే చేరి
ఇట్టా రక్షించ వచ్చాడు పరమాత్ముడు

1. లోకాలనేలేటి రారాజురా - ఉదయించె సూరీడై వచ్చాడురా
ఆకాశ వీధి - మెరిసేటి దారి - ఒకతార మురిసిందిగా (2)
దూతాళి పాడి - కొలిచారు చూడు
ఘనమైన ఒక వేడుక   
ఆ గొల్లలేగా - దరువేసే చూడు
మెస్సయ్య - పుట్టాడనీ          
మన మెస్సయ్య - పుట్టాడనీ    

2. వెన్నెల్లో పూసింది ఓ సందడీ  - పలికింది ఊరంతా ఈ సంగతీ  
ఈ దీనుడంట - పసిబాలుడంట - వెలిసాడు మహరాజుగా (2)
మనసున్న వాడు - దయ చూపువాడు
అలనాటి అనుబంధమే
కనులారా చూడు - మనసారా వేడు
దిగి వచ్చే మనకోసమే
ఇల దిగి వచ్చే మనకోసమే

3. ఆ నింగి తారల్లా వెలగాలిరా - జగమంత చూసేలా బ్రతకాలిరా
వెలిగించు వాడు - మనలోని వాడు - నిలిచాడు మన తోడుగా  (2)
సలిగాలి రాత్రి  -  పిలిసింది సూడు
మనలోన ఒక పండగ
భయమేల నీకు - దిగులేల నీకు
యేసయ్య మనకుండగా
మన యేసయ్య మనకుండగా

Join Telegram

Join Telegram
Telugu Christian Lyrics