దీనుడా అజేయుడా - ఆదరణ కిరణమా
పూజ్యుడా పరిపూర్ణుడా - ఆనంద నిలయమా
జీవదాతవు నీవని శృతిమించి పాడనా
జీవధారవు నీవని కానుకనై పూజించనా
అక్షయ దీపము నీవే - నా రక్షణ శృంగము నీవే
స్వరార్చన చేసిద నీకే - నా స్తుతులర్పించెద నీకే
1: సమ్మతిలేని సుడిగుండాలే - ఆవరించగా
గమనములేని పోరాటాలే - తరుముచుండగా
నిరుపేదనైన నాయెడల - సందేహమేమి లేకుండా
హేతువేలేని - ప్రేమ చూపించి - సిలువచాటునే దాచావు
సంతోషము నీవే - అమృత సంగీతము నీవే
స్తుతిమాలిక నీకే - వజ్రసంకల్పము నీవే "దీనుడా"
2: సత్య ప్రమాణము నెరవేర్చుటకే - మార్గదర్శివై
నిత్యనిబంధన నాతో చేసిన - సత్యవంతుడా
విరిగి నలిగిన మనస్సుతో - హృదయార్చనే చేసేద
కరుణనీడలో - కృపావాడలో - నీతో ఉంటే చాలయ్యా
కర్తవ్యము నీవే - కనుల పండుగ నీవేగా
విశ్వాసము నీవే - విజయశిఖరము నీవేగా "దీనుడా"
3: ఊహకందని ఉన్నతమైనది - దివ్యనగరమే
స్పటికము పోలిన సుందరమైనది - నీరాజ్యమే
ఆ నగరమే లక్ష్యమై - మహిమాత్మతో నింపినావు
అమరలోకాన - నీసన్నిధిలో - క్రొత్త కీర్తనే పాడెదను
ఉత్సాహము నీవే - నయనోత్సవం నీవేగా
ఉల్లాసము నీలో - ఊహలపల్లకి నీవేగా "దీనుడా"
No comments:
Post a Comment