-:A:B:C:D:E:F:G:H:I:J:K:L:M:N:O:P:Q:.R:S:T:U:V:W:X:Y:Z:-

13 May 2019

ప్రార్థన ఎలా చెయ్యాలి?

ప్రార్థన ఎలా చెయ్యాలి?

ప్రతి క్రైస్తవుడు ప్రార్థన చేస్తాడు కాని, ప్రార్థించిన ప్రతి ఒక్కరు జవాబు పొందుకొనలేరు. కొందరు ప్రార్థిస్తారు కాని, జవాబు గురించి ఆలోచించరు. కొందరు ప్రార్థించి జవాబు కొరకు ఎదురు చూసి, జవాబు రానందుకు వారి స్వంత నిర్ణయాలతో  ముందుకు వెళ్తారు. ఎందుకు జవాబు రాలేదో ఆలోచించరు. కొందరు ప్రార్థన ఎంత  సమయం చేసారో  లెక్కపెట్టుకుంటారు. మరి కొందరు మేము ఆత్మీయతలో సీనియర్స్, మేము పది నిమషములు ప్రార్థన చేస్తే చాలు దేవుడుreference బలమైన కార్యాలు చేస్తాడు అని అనుకుంటారు. ఎడతెగక దేవుని పరిచర్య చేసేవారు పది నిమిషములు కాదు, సమయం లేని సందర్భములో నడుస్తూ ప్రార్థించినా దేవుడుreference బలమైన కార్యములు చేయగలడు. కాని, దినమంత వ్యర్ధమైన  పనులు చేస్తూ పది నిమిషములు ప్రార్థించి దేవుడుreference బలమైన కార్యములు చేస్తాడు అనుకోవడం భ్రమ. నేనంటాను క్రీస్తు స్వభావం లేకుండా జీవిత కాలమంతా మోకాళ్ళ పై ఉన్నా వారి జీవితంలో దేవుని కార్యం ఒకటి కూడా చూడలేరు. మరి కొంతమంది ప్రార్థించి జవాబు వచ్చేవరకు విశ్వాసమును విడిచిపెట్టరు.
దావీదు ప్రార్థన జీవితాన్ని చూస్తే ఆశ్చర్యం కలిగిస్తుంది. కీర్తనలు 18:6 లొ ... నా దేవునికు ప్రార్థన చేసితిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన నంగీకరించెను నా మొర  ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. దావీదు ప్రార్థన చేసి తన ప్రార్థన దేవుని చెవులలోనికి వెళ్ళడం కూడా చూసాడు. 
దేవుని చేత ప్రేమించబడిన ప్రియ సహొదరి/సహొదరుడా దేవునికి  ఎలాంటి ప్రార్థన ఇష్టం? ప్రార్థన ఎలా చెయ్యాలి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కొరకు నేను అనేక నెలలు వెదకినప్పుడు. మొట్టమొదట నాకు వచ్చిన సందేహం, నా గురించి నేనెందుకు ప్రార్థన చెయ్యాలి? ఈ సందేహం మా తండ్రి గారిని చూసినప్పుడు కలిగింది. నా చిన్ననాటి నుండి ఏది కొనమని నా తండ్రిని అడగలేదు, నేను లేమి అనేది ఎప్పుడు చూడలేదు, అనుభవించలేదు. నాకు ఏది అవసరమో, ఎలాంటి బట్టలు వేస్తే బాగుంటుందో నన్ను కన్న నా తలిదండ్రులే కొని తెచ్చేవారు. ఇది నాకు లేదు అనే స్థితి నాకు రాలేదు. నా తండ్రే కాదు యే తండ్రైన తమ పిల్లలు సంతోషముగా ఉండాలనే కోరుకుంటారు. ఈ లోకములో నేను కలిగిన తండ్రే ఇలా ఉన్నప్పుడు పరలోకపు తండ్రి ఎలా ఉండాలి? అబద్దమాడనేరని దేవుడుreference తనను ప్రేమించే ప్రతి ఒక్కరి అవసరములు తీరుస్తాడు. 
దేవునికి యదార్ధముగా  ప్రార్థించే వారు కావలి, నటించేవారు కాదు.  మత్తయి 6:5 లో...మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె  ఉండవద్దు అని ఉంది. వేషధారి అంటె వంచకుడు, మత వంచకుడు. తనకు తెలియకుండ తననే మోసము చేసుకొనేవాడు. తనకు తెలిసి పరిశుద్ధాత్మను మోసము చేసేవాడు. దేవుని మెప్పును కాకుండా ఇహలోక మెప్పును కొరుకొనే వాడే  వేషధారి. మత్తయి 6:2లో  వేషధారి మనుష్యుల వలన ఘనత పొందాలని ధర్మం చేస్తాడు. మత్తయి6:5లొ వేషధారి మనుషులకు కనబడవలెనని ప్రార్థన చేస్తాడు. 
ప్రియ చదువరీ!, ప్రార్థన లో ఎంత సమయం గడిపావనేది ముఖ్యం కాదు, క్రీస్తు స్వభావంతో చేయడం ముఖ్యం. మోకాళ్ళు నల్లబడటం ముఖ్యం కాదు, హృదయంలోని నలుపు పోవడం ముఖ్యం. చక్కగా ప్రార్థన చేస్తాడు అని మెప్పు రావడం ముఖ్యం కాదు, నీ ప్రార్థన తో దేవుని మనసును కదిలించడం ముఖ్యం. ఆదిలో ఆత్మ నీళ్ళ పై అల్లాడినప్పుడు సృష్టిలో భయంకరమైన అద్భుతములు జలిగినవి. నీ ప్రార్థన సృష్టికర్తయైన దేవుని కదిలించినప్పుడు నీ జీవితంలో అద్భుతములు చూడగలవు. ప్రార్థన రెండు హృదయాల కలయిక.

అవును ప్రియ చదువరి! మనకు ఇష్టమైన పాపమును విడిచిపెట్టి పరిశుద్ధ జీవితంలోనికి వచ్చాము. యేసు ప్రభువు తన కిష్టమైన పరలోకం విడిచి మన కోసం ఈ లోకమునకు వచ్చాడు. ఇదే రెండు హృదయాల కలయిక. మోకాళ్ళు నేలను తాకినప్పుడు, నోటిలోనుండి వచ్చే స్వరం చెవులకు వినిపించినపుడు, ఆహా! అది ఓ వర్ణించలేని అనుభూతి. హృదయం లోకంపై విజయ గర్వంతో నింపబడుతుంది. ప్రార్థన ఒక ఉప్పెన. సాతాను తంత్రములు పోట్టువలె కనిపిస్తుంటాయి ప్రార్థన ఒక శక్తివంతమైన విస్పోటనము. ఆది అపోస్తలుల లోకమును తలక్రిందులు చేయుటకు కారణం వారి పరిశుద్ధ, యదార్ధమైన హృదయంలో నుండి వచ్చిన ఆ ప్రార్థన వలననే సాతాను స్థావరములను ధ్వంసము చేసి సాతాను శక్తులను నిర్జీవపరచారు, అందుకే లోకం తలక్రిందులైంది.
ప్రార్థన లేని జీవితం చచ్చిన శవంతో సమానం. శవమునకు విజయానందం ఉండదు. లూకా 17:37 లో పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలును పోగవును... అనగా, సాతాను శక్తులు, అబద్ద ప్రవక్తలు పోగవుతారు. సత్యమునుండి తొలగించి క్రీస్తునకు విరోధులుగా చేయుటకు.
పరమగీతము 2:10-17 లో దేవుడుreference నీతో మాట్లాడుచున్నాడు. (వ11)ఈ సంవత్సరమునుండి పాపము విడిచి పెడతాను, రేపటినుండి ప్రార్థన చేస్తాను. ఆ పని ఈ పని అని ప్రార్థన వాయిదా వేయకు, దేశమంతా సువార్త ప్రకటించబడుచున్నది. క్రీస్తును దేవునిగా అంగీకరించుటకు అనేకులు ఆయన యొద్దకు తరలి వస్తున్నారు. బలమైన కార్యములు చేయుటకు దేవుని హస్తము చాపబడి యున్నది. ఇంకా చాలా సమయమున్నది అని ఎంత కాలం భ్రమపడతావు, లెమ్ము రమ్ము అని దేవుడుreference పిలుస్తున్నాడు. (వ 13,14) నా రక్తంలో కడగబడిన నీవు సుందరవతివి/సుందరుడవు; నా సన్నిధిలోనికి వచ్చి, నీ ముఖము కనబడనిమ్ము, నీ స్వరము వినబడనిమ్ము. ఎందుకంటే (వ 15) సంఘాలను,కుటుంబాలను చెరుపుచున్న గుంట నక్కలను పట్టుకొని దేవునికి సహాయము చేయుటకు. ప్రస్తుత దినాలలో అపవాది కుటుంబ వ్యవస్తని పాడుచేస్తున్నాడు. కుటుంబాలు విచ్చిన్నమై పోవుచున్నాయి. కుటుంబములో ఒకరితో ఒకరికి సమాధానం లేకుండా ఉన్నారు. కారణం కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, సంఘ సహవాసం లేకపోవుటయే.
దేవుని చేత ప్రేమింపబడుచున్న ప్రియచదువరి! సాకులు చెప్పకుండా ప్రార్థనను రేపటికి వాయిదా వేయకుండా, పైన తెలిపిన ఏడు లక్షణాలను కలిగి, పరిశుద్ధమైన ప్రార్థన కలిగియుండుటకు దేవుడుreference మీకు సహాయము చేయును గాక...!

Join Telegram

Join Telegram
Telugu Christian Lyrics