క్షణమైనా నను విడువని దేవా - నిన్ను విడిచి నే నుండగలనా (2)
ఉండగలనా ....ఆ ...ఆ ...ఆ ... (2) -నువ్వు లేకుండా నే నుండగలనా....
1. కంటిలో చూపువైనావు ... - చెవిలో వినికిడైనావు (2)
శ్వాసలో ....శ్వాసవై ..... (2) - ఉంటున్నావు నడిపించుచున్నావు (2)
నడువగాలనా...ఆ ...ఆ ...ఆ ....నే నడువగలనా ...
నువ్వు లేకుండా నే నడువగలనా (2)
2. ఏటిలో నీటివైనావు ... - నా దాహం తీర్చే ఊటవైనావు (2)
ప్రాణములో ప్రాణమై (2) - ఉంటున్నావు ...బ్రతికి౦చుచున్నావు (2)
బ్రతుక గలనా ...ఆ ...ఆ ...ఆ ... - నే బ్రతుక గలనా ...ఆ ...ఆ ...ఆ ...
నువ్వు లేకుండా నే బ్రతుక గలనా (2)
3. నోటిలో పాటవైనావు -గొంతులో రాగమైనావు (2)
నా మదిలో గానమువై - ఉంటున్నావు పాట - పాడించుచున్నావు
పాడగలనా….పాట పాడగలనా.. - నీవు లేకుండా నే పాడగలనా
4. నిదురలో స్వప్నమైనావు - మధురమైన దర్శనమైనావు (2)
కలనైనా..నిజమైనా… - కన్నుల ఎదుటే నీవుంటున్నావు - మనగలనా…
నే మనగలనా…నివులేకుండా మరచిపోగలనా (2)
5. పాటలో పల్లవి అయినావు - అందమైన రాగమైనావు (2)
మధురమైనా చరణం అయినావు
నా బ్రతుకులో నీవు నిలువువున్నావు (2)
పాడగలనా…. నే పాడగలనా… నీవులేకుండా నే పాడగలనా (2)