-:A:B:C:D:E:F:G:H:I:J:K:L:M:N:O:P:Q:.R:S:T:U:V:W:X:Y:Z:-

7 April 2020

నా ప్రార్థనలన్ని ఆలకించినావు నా స్తుతిహోమములన్ని నీకే అర్పింతుము

నా ప్రార్థనలన్ని ఆలకించినావు
నా స్తుతిహోమములన్ని నీకే అర్పింతుము

నీ శిలువ త్యాగమే నన్ను బంధించెను
నీ బానిసనై యుందును బ్రదుకు దినములన్నియు } 2|| నా ప్రార్థనలన్ని ||

అడిగినంతకంటె అధికముగా చేయు
ఐశ్వర్యవంతుడవు నీవే యేసయ్యా } 2
పరిపూర్ణమైన నీ దైవత్వమంతా
పరిశుద్ధతకే శుభ ఆనవాలు } 2|| నా ప్రార్థనలన్ని ||

ఆపత్కాలములో మొరపెట్టగానే
సమీపమైతివే నా యేసయ్యా } 2
సమీప భాందవ్యములన్నిటికన్నా
మిన్నయైనది నీ స్నేహబంధము } 2|| నా ప్రార్థనలన్ని ||

ఎక్కలేనంత ఎత్తైన కొండపై
ఎక్కించుము నన్ను నా యేసయ్యా } 2
ఆశ్చర్యకరమైన నీ ఆలోచనలు
ఆత్మీయతకే స్థిరపునాదులు } 2|| నా ప్రార్థనలన్ని ||

Join Telegram

Join Telegram
Telugu Christian Lyrics