నీ కోపమువలన మేము క్షీణించుచున్నాము నీ ఉగ్రతనుబట్టి దిగులుపడుచున్నాము.మా దోషములను నీవు నీ యెదుట నుంచుకొని యున్నావు నీ ముఖకాంతిలో మా రహస్యపాపములు కనబడు చున్నవి.
కీర్తనలు 90:7,8
దేవుని కోపం, ఉగ్రత మన మీద నిలిచి ఉండడానికి గల కారణమేమిటి?
👉 మన రహస్య పాపములే.
ఆస్ట్రిచ్ (నిప్పుకోడి, ఉష్ణ పక్షి) అన్ని పక్షులలోకెల్లా పెద్దది. దీని గుడ్డు కూడా పెద్దది. ఇది చాల బలమయినది. దీని కాలితో తన్నితే మన తొడఎముక కూడా విరిగిపోతుంది. ఎడారిలో దీని పరుగును మనము అందుకోలేము.వేటగాళ్ళు మాత్రం దీనిని సులభంగానే పట్టుకుంటారు.
👉ఎట్లా అంటే?
ఇది వేటగాళ్ళను చూచి కొంతదూరం పరుగుపెట్టి, తన తలను ఇసుకలో దూర్చి కాళ్ళు పైకెత్తి ఉంటుంది.
అంటే దీని ఉద్దేశ్యం? దీని తల ఇసుకలో వుండడం వలన దానికేమి కనిపించదు.
👉ఇదేమి అనుకొంటుంది అంటే ? నేనెవరికి కనిపించనని.
అవును!
👉 మన జీవితాలు అట్లానే వున్నాయి. మనము సాగించే చీకటి కార్యాలు, దేవునికి సహితం కనబడవులే అనుకొని, మనలను మనమే మోసం చేసుకొని, మరణానికి అప్పగించు కొంటున్నాము.
👉మన రహస్య పాపములు దేవునికి కనబడకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలి? ఒక్కటే మార్గం.
👉 వాటిని చెయ్యకుండా ఉండాలంతే.
👉 ఆయనకు తెలియకుండా చెయ్యగలుగుతున్నాను అనుకోవడంఅవివేకం.
👉సంఘమును, సమాజమును, కుటుంబమును ,తలిదండ్రులను, స్నేహితులను అందరిని మోసం చెయ్యగలిగినా, దేవుని చేతిలో మాత్రం అడ్డంగా దొరకిపోతావు.
బహిరంగంగా అందరికి తెలిసేటట్లు చేసే అపరాధములు కొందరికి తెలిసినా, రహస్య పాపములుమాత్రం ఎవ్వరికీ తెలియకపోవచ్చు.
కాని మన రహస్య పాపములు ఆయన ముఖకాంతిలో స్పష్టముగా కనిపిస్తాయి.
👉పాపం జోలికి వెళ్ళకుండా మనలను మనము ఎట్లా నియంత్రించుకోగలం? ఒక్కటే మార్గం. మన ప్రతీ కదలికలోను ఆయన్ని ముందు పెట్టుకోగలగడం.
👉 ఆయన మనతో వున్నాడు, ఆయన చూస్తున్నాడు అనే తలంపు మనలను పాపం జోలికిపోకుండా నియంత్రిచగలదు.
అవి మన చూపులు !తలంపులు!
క్రియలు!అవేవైనా కావొచ్చు.
సరిచేసుకుందాం!
పరిశుద్ధ జీవితాన్ని జీవిద్దాం!
దేవుని ఉగ్రత నుండి తప్పించబడదాం!
5⃣ దేవుడు చెయ్యమని చెప్పింది చెయ్యనప్పుడు. చెయ్యవద్దని చెప్పింది చేసినప్పుడు.
యెహోవా మోషేకు ఈలాగున సెలవిచ్చెను....
"ఆ బండతో మాటలాడుము". అది నీళ్లనిచ్చును..........
మోషే తన చెయ్యి యెత్తి రెండుమారులు తన కఱ్ఱతో ఆ "బండను కొట్టగా" నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను.
అప్పుడు యెహోవా మోషే అహరోనులతో మీరు ఇశ్రాయేలీయుల కన్నుల యెదుట నా పరిశుద్ధతను సన్మానించునట్లు నన్ను నమ్ము కొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పెను.
సంఖ్యా 20:7,8,11,12
👉దేవుడు చెప్పినది ఒకటి. మోషే చేసినది మరొకటి.
ముందు ఒకసారి బండను కొట్టాడు. అదిచాలు.మరళా కొట్టాల్సినపనిలేదు.
👉ధర్మశాస్త్రాన్ని తీసుకు వచ్చిన మోషే.
ఆ ధర్మశాస్త్రాన్ని అతిక్రమించాడు.
ధర్మ శాస్త్రం మోషేను కనాను వరకు తీసుకొని వెళ్ళగలిగింది గాని, కనానులో అడుగు పెట్టేలా చెయ్యలేకపోయింది.
అనేక సందర్భాలలో మనిషి యొక్క కోపం దేవుని క్రమాన్ని లెక్క చెయ్యకుండా చేసి, శాపాన్ని తీసుకువస్తుంది.
👉ఇంతకీ మోషే కొట్టిన ఆ బండ ఏమిటి?
👉అది నిర్జీవమైనది కాదు.
సజీవమైనది
ఆ బండ 'క్రీస్తే'
1 కొరింది 10:4
అరణ్యములో ఆ బండ ఒక నదిగామారి సుమారు 30 లక్షల మంది శారీరికదాహాన్ని తీర్చగలిగింది.
అదే బండ కల్వరిగిరిలో తన రక్తాన్నికార్చి, ప్రపంచ మానవాళి ఆత్మీయ దాహాన్ని తీర్చగలిగింది.
👉 నీకు బదులుగా నాకు బదులుగా మరణించింది.
నిన్నూ నన్ను మరణంలోనుండి జీవములోనికి దాటించగలిగింది.
పరమ కనానుకు మార్గం సిద్ధం చేయగలిగింది.
👉 ఇక్కడ దేవునిప్రేమను మనం అర్ధం చేసుకోగలగాలి.
🔹 మోషే బండను కొట్టినా? నీళ్ళిచ్చి వారిని జీవింప చేసాడు.
🔹 అనుక్షణం మనము ఆయన గాయాలు రేపినాగాని, ఆయనను మరళా మరళా సిలువ వేస్తున్నాగాని ఆయన ప్రేమతో మనలను జీవింప చేస్తున్నాడు.
👉అట్లా అని,
ఆయన ప్రేమను చులకనచేస్తే?ఆయన ఉగ్రతను చూడాల్సివస్తుంది.
వద్దు!
సరి చేసుకుందాం.
సాగిపోదాం.
గమ్యం చేరేవరకు.
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
హల్లెలూయ...
మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.
ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!